కలిసి వచ్చిందా కాలం
కలిసి వచ్చిందా కాలం
అన్నీ వేగంగా జరిగి ఉండవు. జాబ్ మారడం. అమ్మకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అమ్మను బాగా చూసుకోవాలి అనే కల ఎప్పటికీ కలలా మిగిలిపోకుండా ఉండేది.
అవును. చాలా సార్లు అనుకున్నాను ఈ మాట. COVID-19 లేకుంటే అమ్మను ఇంకొన్నాళ్లు బాగా చూసుకోగలిగే వాళ్ళం కదా అని.
అదే లాక్డౌన్ సమయంలో జాబ్ మారాను. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలో అర్థం అయ్యింది.
ఇప్పుడు మంచి ఎక్కువ జరిగిందా చెడు ఎక్కువ జరిగిందా అని సింహావలోకనం చేసుకోవడం సాధ్యం కాదు.
ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదు అని కోరుకునే వాళ్ళమే కదా అందరం.
కాలం కలిసి వచ్చిందో రాలేదో కానీ జ్ఞాపకాల బరువును పెంచేసింది. నాకూ. మీకూ. అందరికీనూ.
