డబ్బు నీకు చేదా..
డబ్బు నీకు చేదా..
డబ్బెవరికి చేదు? చెప్పు అన్నాడు వినీత్. నాకు చేదు అన్నాడు క్రాంతి.
చూడూ. నీకు income పెరుగుతుంది. ఇయ్యాల రేపు ఒక్క జాబ్ చేసుకుంటూ ఆ వచ్చే డబ్బులతో నువ్వు EMI కూడా కట్టుకోలేవు అన్నాడు వినీత్.
అందుకని? క్రాంతి ప్రశ్న.
ఏం లేదు. నేను కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నా. బ్యూటీ క్రీములు. సోపులు. ఇలాంటివి. నువ్వూ అవి కొంటున్నావని చెప్పాలి అని తన ప్లాన్ చెప్పాడు వినీత్.
మరి నేను వాడట్లేదు కదా అన్నాడు క్రాంతి.
చూడు. జనంలో నీకు మంచి ఫాలోయింగ్ ఉంది. నువ్వు ఇవి వాడుతున్నావ్ అని చెప్పు. నాకు బిజినెస్ పెరిగిద్ది. నీకూ కమీషన్ ఇస్తా. పైసలే పైసలు అన్నాడు వినీత్.
లే. నేను వాడనప్పుడు గట్లెట్ల చెప్తా. నేను జెప్ప అన్నాడు క్రాంతి.
నీ బుర్ర పని జేస్తలేదు అన్నాడు వినీత్.
