Sai Krishna Guttikonda

Abstract Drama Inspirational

4  

Sai Krishna Guttikonda

Abstract Drama Inspirational

జీవిత చదరంగంలో పావులు

జీవిత చదరంగంలో పావులు

2 mins
31


సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయిలు చాలా ఊహించుకుంటారు, నేను కూడా అలాగే ఊహించుకున్నాను. జీవితానికి ఓ తోడు దొరికిందని సంబరపడ్డాను, ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి నాతో కలసి ఇంకొకరు నిలబడతారు అనుకున్నాను. ఆశతో ఎదురుచూసిన జీవితమే నాకు ఊహించని ఎదురుదెబ్బ అయ్యింది. అనవసరమైన మాటలు చెప్పడం, సిగరెట్లు తాగడం తప్పించి మరొక పని చేతకాని వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. తన గురించే తాను బాధ్యత తీసుకోవడం తెలియని వ్యక్తి కుటుంబ బాధ్యతలు చూసుకుంటాడు అని ఆశించడం కూడా నా మూర్ఖత్వమే అయ్యింది.

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా పిల్లలకు ఏం అవసరాలు ఉంటాయో చూడాలి అనే కనీస శ్రద్ద కూడా లేదు. డిగ్రీ వరకు చదువుకున్న నేను ఉద్యోగం చేస్తాను అంటే అత్తా, మామల నుండి ఎన్నో ఆంక్షలు. మేము సంపాదించిన డబ్బు ఉంది కదా ఉద్యోగం చేయవలసిన అవసరం ఏం ఉందని అడ్డు చెప్పేవారు. కావలసినంత డబ్బు ఉన్నా కూడా మనసులో ఎప్పుడూ లోటే, నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి లేదని కాదు కనీసం పట్టించుకునే వ్యక్తి కరువయ్యాడు అని. నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు అని గట్టిగ నిర్ణయించుకున్నాను. వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారికి అవసరమైన ప్రతీ పని నేనే చేసేదాన్ని. వారి భవిష్యత్తు కోసమే నా జీవితం అనిపించింది.

మా వారిని కూడా ఒక పిల్లవాడి లాగానే చూసుకోవాలి అని అర్ధం అయ్యింది, అలాగే చూసుకోవడం మొదలుపెట్టాను. ఒకప్పుడు పెళ్లి చేసుకోమని తొందర పెట్టిన వ్యక్తులే, ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోయింది అని జాలి చూపించడం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చిన వ్యక్తులు నా వైపు చూసే చూపులు, సూటిపోటి మాటలు ప్రతీ క్షణం ఒక ముళ్ళై నన్ను గుచ్చుతూనే ఉండేవి. అవి కూడా భరించి నాలోనేనే కుమిలిపోతూ ఇలా అయినా నాకో జీవితం ఉంది నా పిల్లలను మంచిగా చూసుకుంటే చాలు అనుకుంటున్న సమయంలో ఒకసారి మావారు లేని సమయంలో మా మావయ్య నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. నేను తండ్రిలా గౌరవించే ఆయన కోడలిని అని కూడా చూడకుండా కోరిక తీర్చమని అడిగారు. ఆ నిమిషం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది. నా జీవితం మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఆ క్షణం నేను లేకపోతే నా పిల్లలు ఏ దిక్కూ లేనివారు అయిపోతారేమో అని నా భయం. నా పిల్లల కోసమే నేను బ్రతకాలి అని నిర్ణయించుకున్నాను. ఆయన మనసులో విషపు కోరికలు ఇంకా పెరగక ముందే దేవుడు ఆయనని తీసుకెళ్ళాడు. ఆయన చనిపోయిన రోజు నాతో అసభ్యంగా మాట్లాడిన మాటలు గుర్తు రాలేదు, తండ్రి లాంటి వ్యక్తి చనిపోయారు అని కన్నీరే వచ్చింది బయటకు.

ఏది ఏమైనా ఇక నా ముందు ఉన్నది నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడమే అనిపించింది. నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అన్ని అవసరాలను దగ్గర ఉండి చూసుకునేదానిని. అయితే నాకెప్పుడూ ఒకటి అనిపిస్తుంది , మనం ఎప్పుడు మన దగ్గర లేని విషయాన్ని తలచుకుని బాధ పడుతూ ఉంటాము. చాలా మంది భార్యాభర్తలు డబ్బు విషయంలో గొడవ పడుతూ ఉండడం నేను చూసాను. కొంతమందికి మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనిషికంటే డబ్బే ముఖ్యం. కానీ నా పరిస్థితి ఇందుకు భిన్నం.

నా దగ్గర కావలసినంత డబ్బు ఉన్నా కూడా నన్ను అర్ధం చేసుకునే మనిషి అంటూ ఎవరూ లేరే అనే బాధ మాత్రం ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నాకు పెళ్ళి జరిగి ఇప్పటికి 20 సంవత్సరాలు ఇప్పుడు నా జీవితంలో సంతోషం అంటూ ఏదైనా ఉంటే అది మా అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వచ్చి, మా అమ్మాయికి మంచిగా అర్ధం చేసుకోగల వ్యక్తిని చూసి పెళ్ళి చేయడమే. అంతకు మించిన సంతోషం నా జీవితంలో నాకింకేమీ లేదు.



Rate this content
Log in

Similar telugu story from Abstract