Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

తప్పిపోయిన తరువాత

తప్పిపోయిన తరువాత

2 mins
263


శృతీ! నువ్వలా తల బాదుకోకు. మొత్తం వెతికావా? ఆకాష్ బయటికి వెళ్ళబోయాడు. 


శృతి ఏడుపుతో ఆ ఇల్లు నిండిపోయింది. ఆడుకుంటూ రెండేళ్ల పాప ఎంత దూరం వెళ్లి ఉంటుంది? మెయిన్ గేట్ దాటుకుని ఎటు వైపు వెళ్లుంటుంది అనుకుంటూ ఆకాష్ పరిగెత్తాడు.


అంతలో పాప కేరింతలు వినిపించాయి. కృష్ణా అంటూ ఆకాష్ పాపను ఎత్తుకున్నాడు. పాపను అక్కడిదాకా ఎత్తుకుని తీసుకు వచ్చిన అమ్మాయికి థాంక్స్ చెబుతూ ఆమెను గమనించాడు.


మాసిన బట్టలు, మెరిసే కళ్ళు ఆ అమ్మాయిని గమనిస్తూ పాప ఎక్కడ దొరికింది అని అడిగాడు.


ఇక్కడే సార్! మీ ఇంటి వెనుకే మట్టిలో ఆడుకుంటూ ఉంది. నేనే మట్టి దులిపి ఎత్తుకుని తీసుకువచ్చాను.


మా బస్తీ రోడ్డు ఎదురుగా రోజూ మీ కారు పోతుంది సార్. అప్పుడు మీ పాపను చూసాను అంటూ ఆ అమ్మాయి 

వెళ్లిపోబోయింది.


అప్పుడే పాప గొంతు విని బయటికి వచ్చిన శృతి ఆ అమ్మాయిని ఆపింది. కృష్ణను ఎత్తుకుని ముద్దాడింది. నీ పేరేంటి బంగారం, ఏం చదువుకున్నావ్ అని ఆ అమ్మాయిని అడిగింది శృతి.


నా పేరు ఉమ అండీ, ఎనిమిదో క్లాస్ వరకూ చదివి మానేశాను అంది.. అంతలోనే తడుముకుని మేడమ్ అంది. 


నా పాపను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. తప్పిపోయిన తరువాత పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించుకుంటేనే గుండె దడ పుడుతుంది. 


నువ్వు చేసిన సాయానికి బదులుగా డబ్బులు ఇచ్చి పంపితే అది ఈ ఒక్కరోజుకే పనికొస్తుంది .. రోజూ మా ఇంటికి వస్తావా.. నేను నీకు ట్యూషన్ చెబుతాను, నువ్వు మళ్లీ పరీక్షలు వ్రాసేలా చేస్తాను అంది శృతి..


కానీ మేడమ్.. అంటూ నసిగింది ఉమ.. 


చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అన్నాడు ఆకాష్.


నాకేదైనా పని కూడా ఇవ్వండి మేడమ్.. పని చేస్తూ చదువుకుంటాను అంది ఉమ..

 

సరే అంది శృతి. ఉమ ఉత్సాహంతో ఎగురుతూ కృష్ణను తడిమి ఇంటికి పరుగెత్తింది.


ఏంటి శృతీ! పని చేయించుకుని చదువు చెప్తావా అన్నాడు ఆకాష్..


అవును. ఆ పనే హోమ్ వర్క్.. తను అనుకున్నట్లు నా పనులు కాదు. తనకు ఉపయోగపడేలా మొక్కల పెంపకం లాంటివి నేర్పుతాను. తనకు ఇష్టమైతే బాగా చదువుతుంది. లేదంటే ఏదో ఒక జీవనోపాధి కల్పిద్దాం అంటూ ఇంటి లోపలికి నడిచింది శృతి..


పాప చప్పట్లు కొట్టింది..ఆకాష్ నవ్వుతూ వారిని అనుసరించాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract