తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

4  

తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

ముగ్గురూ ముగ్గురే (సరదా జానపద

ముగ్గురూ ముగ్గురే (సరదా జానపద

2 mins
272


ముగ్గురూ ముగ్గురే (సరదా జానపద కథ)

డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

*******************************

     ఒక ఊరిలో ఒక చెవిటాయన వుండేటోడు. వాడు ఒకసారి ఒక కుంటి మేకను పట్టుకోని పక్కవూరికి పోతా వున్నాడు. నడిచీ నడి బాగా అలసిపోయినాడు. దాహం కాసాగింది. యాడయినా నీళ్ళు వున్నాయేమోనని వెదుకుతా వుంటే ఒక చెట్టు కింద ఒకడు కూచోని కనబన్నాడు. వానికి గూడా చెవుడే.

మొదటోడు కుంటిమేకతో వాని దగ్గరకు పోయి "అనా... ఈడ తాగడానికి నీళ్ళు యాడ దొరుకుతాయి" అని అడిగినాడు. చెట్టు కింద వున్నోనికి ఆ మాటలు వినబడలేదు. ఎదురుగా వున్న కుంటిమేకను చూసి “దాని కాలు నీవు విరగొట్టినావా" అని అడుగుతున్నాడేమో అనుకోని “లేదు... లేదు... నేను విరగొట్టలేదు, నాకేమీ తెలీదు" అంటూ ఆ మేకని పక్కకి దొబ్బేసినాడు.

అది చూసి వాడు “నీళ్ళు యాడున్నాయి అనడిగితే తెలిస్తే చెప్పాలి. లేదంటే లేదు. అంతేగానీ అనవసరంగా నా మేకను దొబ్బుతావా... వుండు నీవని చెబుతా" అంటా వాన్ని ఠపీమని ఒక్కేటు కొట్టినాడు. దాంతో వాడు కోపంగా “నీ మేక కాళ్ళు నేను విరగొట్టలేదని చెబుతున్నా నన్నే కొడతావా... ఎంత పొగరు నీకు" అంటూ తిరిగి వాన్ని రపరపరప నాలుగు పెరికినాడు. ఇంకేముంది ఇద్దరూ కోపంగా అట్లా జుట్టూ జుట్టూ పట్టుకోని కిందామీదా పడి కొట్టుకున్నారు. కాసేపటికి ఇద్దరూ అలసిపోయి ఎవరన్నా కనబడితే ఎవరిది తప్పో చెప్పమని అడుగుదామనుకున్నారు.

అంతలో ఒకడు అటువైపు కోపంగా బెరబెరా నడుచుకుంటా రావడం కనబడింది. వాడు అంతకుముందే ఇంట్లో పెండ్లాంతో బాగా గొడవపడి ఇంటినీ, పెండ్లాన్నీ వదిలేసి యాడికో పోతా వున్నాడు. వానికి గూడా చెవుడే.

వాన్ని ఆపిన ఇద్దరు చెవిటోళ్ళలో ఒకడు "అయ్యా.... నేను ఈ మేక కాలు విరగొట్టలేదు. అయినా వీడు నేనే విరగ్గాటానని అంటున్నాడు. ఇదేమయినా మంచి పద్ధతేనా" అన్నాడు. అంతలో రెండవ వాడు "అయ్యా... ఈడ యాడయినా నీళ్ళున్నాయా అని అడిగాను. వుంటే వున్నాయనాలి, లేకుంటే లేవనాలి. అంతేగానీ నా మేకను తోసెయ్యొచ్చా... నీవే చెప్పు ఎవరిది తప్పో" అన్నాడు.

అప్పుడు ఆ మూడోవాడు కోపంగా “మీరు వంద చెప్పండి... లక్ష చెప్పండి.... ఇంక నేను నా పెండ్లాంతో కాపురం చేయనంటే చేయను. ఏం చేసుకుంటారో చేసుకోపోండి" అంటూ అక్కన్నించి విసవిసవిస వెళ్ళిపోయినాడు.

*******************************

డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

*******************************

కథ నచ్చితే SHARE చేయండి.



Rate this content
Log in