Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

అద్దం ముక్కల

అద్దం ముక్కల

2 mins
12


అద్దం ముక్కల మూసిఉన్న రెప్పలపై ప్రేమలేఖలూ..

చదువుకొనే మనసుంటే ఓ కోయిలా...

మధుమాసమే ఔతుంది అన్నివేళలా....

జేసుదాసు పాట దూరం నుండి అలలు అలలుగా వినిపిస్తోంది. చెవుల్లో అమృతం పోసినట్లు అనిపించింది. బీరువాలోంచి అద్దం బయటకు తీసి తోటలో ఉయ్యాలమీద కూర్చున్నాను. అందరికీ అద్దం ఎవరి మొహం వారికి చూపిస్తుంది, ఈ అద్దం నాకు మాత్రం తనలో రవినే చూపుతుంది, కారణం ఆ ఆద్దం రవి ప్రేమతో ఇచ్చింది. ఈ అద్దాన్ని తీసి నన్ను చూసుకోవాలి అనుకున్నాపుడల్లా నువ్వే కనిపిస్తావు అన్నాడు. కొందరి గతం గమ్మత్తుగా గతుకులు లేకుండా సాఫీగా ఉంటుంది. నా గతంకూడ అంతే.

“మీ పేరు” అతను మొదటగా అడిగిన ప్రశ్న. “అది అంత అవసరమా” సూటిగానే అడిగాను. “అంటే ఏదో మొదలుపెట్టాలి కదా అని అడిగాను” నెమ్మదిగా అన్నాడు. “అంటే పేరుతోనే మొదలుపెట్టాలా! ఊరుతో మొదలుపెట్టకూడదా! చదువుతో మొదలుపెట్టకూడదా!” అడిగాను. “సర్లెంది! ఏదో ఒకటి, మీ మామ్మగారి పేరేమిటండీ! మీ తాతగారు ఎంతవరకూ చదువుకున్నారు!” అడిగాడు. “అబ్బో! ఏమో అనుకున్నాను వ్యంగ్యం బానే ఒలకబోస్తున్నారే!” నవ్వుతూ అన్నాను. కొన్ని పరిచయాలు సంపెంగ పువ్వుల్లా బాగానే ఉంటాయి, సుగంధం పరిమళిస్తాయి. మా పరిచయం చక్కగా ముందుకు సాగే సమయంలో, రవి మంచి ఉద్యోగం వచ్చి అమెరికా ప్రయాణమయ్యాడు. ఫ్లైట్ ఎక్కేముందు ఎయిర్ పోర్టులో “ఇది నీదగ్గర ఉంచు, నన్ను చూడాలనుకున్నప్పుడల్లా ఈ అద్దంలో చూడు, నీబదులు నేను కనిపిస్తాను” అన్నాడు.

తర్వాత చాలాసార్లు నేను అద్దంలో చూశాను, నా బదులు రవి మొహం కనిపించేది. అలా కనిపించడం నా భ్రమ అని తెలుసు, కానీ రవి చేసిన ప్రేమ మాయలో నా బదులుగా అద్దంలో అతనే కనిపించేవాడు.

రెండేళ్ళు రంగులకలలా, గాలికి ఎగిరే మైకా కాగితంలా రెపరెపలాడుతూ ముందుకు సాగిపోయాయి. కృష్ణుని రాకకోసం రాధ ఎదురుచూసినట్లుగా రవి రాకకోసం ఎదురుచూస్తున్నాను.

రవి పంచే ప్రేమకోసం నా హృదయం తపిస్తోంది. మండువేసవిలో చలి చంపేస్తోంది. రవికోసం నాకళ్లు కరువాచిపోయినట్లు ఎదురుతెన్నులు చూస్తున్నాయి.

ఆరోజు డీమార్టులో ఒక ఫారెన్ అమ్మాయి కనిపించింది, ఆమె చేయిపట్టుకుని నడుస్తున్నాడు రవి. నేను నిర్ఘాంతపోయాను. అతను చాలా సాధారణంగా “హలో! బాగున్నావా” అంటూ వెళ్లిపోయాడు. నేను తెరుకునేటప్పటికి చాలా సమయం పట్టింది. అంతా అర్ధమయ్యేటప్పటికి మరికొంత సమయం పట్టింది.

వెంటనే ఇంటికి బయలుదేరాను. బీరువాలో అద్దం బయటకు తీశాను. అందులో అప్పటి వరకూ కనిపించే రవి మొహం బదులు నా మొహం కనిపించింది. అద్దం చేతుల్లోంచి జారి ముక్కలైంది. పగిలిన అన్ని ముక్కల్లో నా మొహమే కనిపించింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Classics