మూడు ముక్కల్ ఆట
మూడు ముక్కల్ ఆట
మూడు ముక్కలాట అనగానే పేకముక్కలే స్పురించినియ్యి నాకు....ఎం రాయాలా?అని తలపట్టుకు కూర్చుంటే....భారతం గుర్తుకు వచ్చింది..
ఆమాట విన్న నా భార్య వసుధ,ఎందుకు?ఎపుడూ చూడు భారత,రామాయణాల్ని ఆడిపోసుకుంటారు!మీరేమన్నా తక్కువా ?అంది
ఏమే!పెళ్లయి హాఫ్ సెంచరీ కి దగ్గరగా వస్తున్నాం...ఎపుడైనా చిన్న ముక్క అనటంగుర్తుందా ?నీకు అడిగేను నేను అనబడే వాసుని...
లేదనుకోండి!అయినా....అంత తలబద్దలు
కొట్టుకోకపోతే,నన్ను అడగొచ్చుగా ?బోలెడన్ని ఆలోచనలు చెబుతాను అంది వసుధ...
ఏది!మచ్చుక్కి ఒకటి వదులు.
అన్నాడు కొంచెం వ్యంగ్యంగా...
టీనే తీసుకోండి !అంది చేతికి అందిస్తూ...
నువ్వు ఎంత సుమతీ దేవి రేంజ్ అయిన,కలిపిన టీ ,కాఫీ అయిపోదు అన్నాడు వాసు...
అబ్బా!నేను అన్నది...టీ విషయమే తీసుకోండి అని...ఈ టీ ఖరీదు 250...దీని పేరు త్రీరోజెస్...మనం ఒక నలభై ఏళ్లుగా దీన్నే వాడుతున్నాం?ఎందుకు?అంది పెద్ద ఎదో కనిపెట్టినట్టు...
ఎందుకు ఏమిటి?వాడే చెప్తాడుగా...రంగు,రుచి,వాసన విసుగ్గా అన్నాడు...
అదే!ఆ విసుగే...వాడికి కోట్ల బిసినెస్ కి కారణం అవుతుంది...
వాడు చెప్పే మూడు ముక్కలకే పడిపోయి,ఇప్పటివరకూ రమారమి ఓ నలభైవేలు ఒక్క టీ కి మాత్రమే తగలేసేమ్...వేస్తూనే ఉన్నాం కూడా...దీన్ని మూడుముక్కలాట అనకూడదా?అంది
ప్రపంచంలో కొత్త విషయం కనిపెట్టినట్టు...
వంటగదిలో మగ్గుతున్న ,భార్య తెలివిని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు...కానీ పురుషాధిక్యత అని ఒకటి ఉంటుంది కదా!అందుకే మళ్ళీ అడిగేడు...ఇంతేనా!ఇంకా ఏమైనా ఉందా? అన్నాడు...
బోలెడన్ని...అసలు మీకో విషయ0 తెలుసా!మూడుముక్కలాటకి అన్ని ఖర్చులతోపాటూ తగలేస్తాం...కానీ మిగతా సంపాదన అంతా బోలెడన్ని మూడుముక్కల కాప్షన్లకి తగలేస్తాం ...
వాసు::అంటే??
మొన్నే బిసినెస్ వీక్లీ లో చదివేను...కస్టమర్ని ఆకర్షించడానికి సింప్లె అండ్ సోర్ గా మూడే పదాలు ఎక్కువ వాడుతారట...కావాలంటే యాడ్లన్ని క్షుణ్ణంగా చూడండి అన్నాడు అందులో....నేను అప్పటినుంచీ అదే పనిలో ఉన్నా...
మూడుముక్కలాట మాయాజాలం కన్నా,మార్కెట్ మాయాజాలం చాలా ప్రమాదమని అర్థమైంది అది చదివాక...మనకి అవసరం ఉన్న, లేకపోయినా...ఎదో రకంగా కొనిపించడమే...మన పొదుపుని వాళ్ళ మదుపుగా మార్చుకోవడమే ఈ కాప్షన్ అనబడే మూడుముక్కల గొప్పదనం....
మొన్న మన అల్లుడికి పది లక్షల కారు కొందామని వెళ్తే ,పద్దెనిమిది అయింది గుర్తుందా!దానికి కారణం మన దగ్గర కొనే శక్తి ఉండడం కాదు....మాటలకి పడిపోయే అలవాటు ఉండడం....మనo ఒక కార్ కొందామంటే,వాడు చూపించిన కార్ గురించి వాడు మూడేముక్కలు చెప్పాడు.
luxurious,brand new,wealthy
రామాయణం కొత్త సంచిక కొంటే...వాడు ఆ పుస్తకం అమ్మడం కోసం వాడిన మూడు ముక్కలు వింటే నవ్విపోతారు
guarantee,promise,limited
అంటే గారంటేగా ఈ పుస్తకం వాల్మీకి రాసింది అని వాడు ప్రామిస్ చేస్తూ లిమిటెడ్ అని అబద్ధం చెప్పి,డబ్బులు ఎంత తెలివిగా లాగేదీ చూడండి...
అదే సరుకు తొందరగా అమ్మేయాలి,స్టాక్ ఉంచకూడదు అని పైనుంచి ఆర్డర్స్ వస్తే...మనకి వేసే మంత్రాలు
hurry,goingfast,second
మనం పైసా పైసా బంగారంలా కూడబెట్టిన సొమ్మును,మాగ్నెట్ లా లాగేసుకుని వాళ్ళ సొరుగుల్లో వేసుకోవడానికి ,అది మనకి అవసరం కాకపోయినా ,ఆశ పుట్టించేలా మరో మూడు ముక్కలు
bestseller,painless,moneyback
కరోనా టైంలో పెళ్లి చీరలకి బ్రాండెడ్ షాప్ కి వెళ్తే,ట్రాన్స్పోర్ట్ మొత్తం బందయిన టైంలో,వాడు మనకోసమే ఎలా తెప్పిస్తాడు?అన్న కనీస ఆలోచనలేకుండా సమర్పయామి అయిన మొత్తం లక్షన్నర ఇంకో మూడుముక్కల కి
unique,rare,authentic
ఇదేముంది?కొంతమంది మోటివేషన్ మాటలు మాట్లాడతారు..మన డబ్బులు క్షవరం చెయ్యడానికి...ఇది లేకపోతే మీకీ నిద్రరాదు,ఆకలి వెయ్యదు,జీవితంలో నెగ్గరు అంటూ...వాటికో మూడు ముక్కలు
amazing,miracle,extraordinary
ఇవన్నీ ,పోనీ... అనుకుంటే,కాటుక భరిణే,,తిలకం సీసా కి కూడా మూడు ముక్కలాట ఆ(వా)డుతారు..
dazzling,ravishing,bulletproof
కాటుక్కి,తిలకానికిబుల్లెట్ ప్రూఫ్ పదం ఎందుకో అర్థం కాకపోయినా,నేను తప్పనిసరిగా కొంటాను..దాని ఖర్చు మీ గెడ్డం గీసుకునే సెట్ కన్నా,అయిదు రెట్లు ఎక్కువ...
భూమి పుట్టినప్పుడు మూడే ముక్కలు సృష్టి,స్థితి,లయ...
ముగ్గురే దేవుళ్ళు బ్రహ్మవిష్ణుమాహేశ్వరులు....దేవుళ్ళతో పాటు అన్ని విషయాలూ వివిధ రూపాలు సంతరించుకున్నా...మూడు ముక్కల్ ఆట మనిషి జీవితాన్ని,లయకారకుడు అవసరం లేకుండానే,అయోమయంలో పడేస్తున్నాయి...జూదాన్నిమించిన జాదూ చేస్తున్నాయి....నిల్వల కొండలు కూలుస్తున్నాయి...బాలన్స్ ని జ్యూసుల్లా స్త్రా వేసుకు పీలుస్తున్నాయి.....
