STORYMIRROR

💞💞 Mythrika

Drama Romance Fantasy

4  

💞💞 Mythrika

Drama Romance Fantasy

ప్రేమ మజిలీ you are my soul

ప్రేమ మజిలీ you are my soul

2 mins
300

ఎంటే బాబు ఎంతసేపు ఆ మెలోడీస్లో ఎం ఉంటుందనీ అవే వింటావ్ అసలు బోర్ కొట్టాదా నీకు ఆ ఒకేలాంటి ప్రేమ పాటలు వినడానికి అంటుంది ఓ అమ్మాయ్....


ఒకేలాంటి ప్రేమ ఒకేలాంటి పాట అని నువ్వనుకుంటున్నావ్....


ఆ పాటలో ఉండే ప్రేమని చూస్తున్నాను నేను....


అవి పాటలు, సినిమాలు నిజ జీవితం కాదు తల్లి....


 జీవితం ఐనా మరోకటి అయినా ఎవరి జీవితం లోకి అయినా అడుగు పెట్టగలిగేది ప్రేమ ఒక్కటే కదా...


నీకు నీ ప్రేమ ఫిలాసఫీ కి ఒక దణ్ణం తల్లి అంటూ చేతులు జోడిస్తుంది ఆ అమ్మాయి....


నువ్వు ప్రేమలో పడితే ఈ పాటల విలువ తెలుస్తుందే నీకు...


 ప్రేమని తెలపడానికి మాటలు కూడా ఉండవు మాట్లాడడానికి రావు కానీ అన్నీ ఎక్స్ ప్రెస్ చేయగలుగుతాం తెలుసా...


ఊరుకుంటే ఈ గాలి ,ఈ ప్రకృతి అన్నీ ప్రేమతోనే నిండి ఉన్నాయి అంటావ్ గాని ప్రేమలో పడిన వాళ్ళు కూడా ఇన్ని మాటలు చెప్పరు గాని రా వెల్దాం అంకుల్ వాళ్ళు చూస్తుంటారు.....


ప్రేమలో పడిన వాళ్లే మాటలు చెప్పాలి అని రాజ్యాంగంలో రాసారా ఏంటి ఏమైన ఎదురుచూసే వాళ్ళు కూడా ఉంటారు గా వారి ప్రేమ కోసం....


తల్లి! తర్వాత ఎదురుచూద్దువు మనం టైం కి ఆఫీస్ కి వెళ్ళకపోతే వేరే ఉద్యోగం కోసం ఎదురు చూడాలి పద...


సరే పద అని నవ్వుతు మరోసారి వచ్చిన గుడిలో దేవుడిని సందర్శించి వెళ్ళారు ఆ ఇద్దరు అమ్మాయిలు....


వారికి కొద్దిగా దూరం లో కూర్చోని వీళ్ళ మాటలు వింటున్న ఇద్దరు అబ్బాయిలలో ఒక అబ్బాయి అలా చూస్తూ ఉండిపోయాడు వెళుతున్న అమ్మాయి వైపు

ఆ అమ్మాయి ఎవరో మరి....


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


2 వారాల తరవాత


ఫోన్ లో గట్టిగ తన చెవి దగ్గర వినిపిస్తున్నా పాట కి ఉలిక్కి లేచి పిచ్చి చూపులు చూస్తు ఉంటాడు రేవంత్...


లేచిన స్నేహితుడు నీ కోపంగా చూస్తు తన గదికి వెళ్లి రెడీ అవుతాడు ఆ అబ్బాయి....


రేయ్ అను పొద్దున్నే ఏంట్రా నీ భాద మంచి నిద్రని చెడగొట్టేసావ్ కల్లోకి కత్రిన వచ్చింది రా లేపేసావు మంచి కల పాడైపోయింది రా అని అన్నాడో లేదో మొహం మీద స్ప్రే బాటిల్ వచ్చింది ముత్తి పగలగొట్టడానికి...



పగిలిన ముత్తి ఊదుకుంటూ పంచె కట్టులో ముద్దుగా పెళ్లి కొడుకు లా ఉన్నా ఫ్రెండ్ ని చూసి రేయ్ అను పొద్దున్నే ఏంట్రా రెడీ అయి కూర్చున్నావు ఎక్కడికి వెళుతున్నాం మన ఆఫీస్ 11 కి కదా అని...


 మళ్ళీ ఏదో తట్టిన వాడిలా ఓ ఈరోజు గుడికి వెళ్ళాలి కదా మరిచిపోయా అని పళ్ళు ఇకిలిస్తూ 5 నిమిషాలు బావ రెడీ అయ్యి వచ్చేస్తా కోపం వద్దు అంటాడు...


ముందు త్వరగా రెడీ అయింది వస్తావా అన్నట్టు టైం చూసుకుంటూ ఉంటాడు అనిరుధ్....


#@@@@@@@@@@@@@@@@@@@@@@@#




Rate this content
Log in

Similar telugu story from Drama