వహ్నికా పరిణయం
వహ్నికా పరిణయం
పొద్దున్న టైం 9 అవుతున్నా ఇంకా బద్దకం వదలకుండా బెడ్ మీద దొర్లుతుంది వాహ్నిక అప్పుడే తన ఫోన్ మొగింది" నా చూపే నిన్ను వెతికినది నీ వైపే నను తరిమినది" అంటూ రింగ్ టోన్ తో మై లైఫ్ అని డిస్ప్లే చేస్తూ ఫోన్ లో పాటను ఎంజాయ్ చేస్తూ " నాకేందుకిలా అవుతోంది నా మదినడిగేతే చెప్తోంది "అని పాడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది వాహ్నిక గుడ్ మార్నింగ్ ప్రేమగా వినిపించింది అతని గొంతు.....
గుడ్ మార్నింగ్ అంటూ ప్రేమగా చెప్పింది వాహ్నిక...
ఇంకా లేవలేదా మేడం గారు అని అడిగాడు అతడు లేదు అనీ బద్దకం గా బదులు ఇచ్చింది ఆమె....
హా ఎందుకూ లేస్తుంది రాత్రి అంతా సిరీస్ లు చూస్తుంది పొద్దున్న ఏమో లేట్ గా లేస్తుంది మీకు పెళ్లి ఫిక్స్ అయ్యాక ఒక్క రోజు అయినా నువ్వు ముందు ఫోన్ చేసి అబ్బాయి కి విష్ చేసావా చెప్పు....
పళ్లు బైట పెట్టి నవ్వుతూ లేదు మమ్మీ ఇకనుండి చేస్తా ప్రామిస్ అంటుంది చెయ్యి చాస్తు ఎన్ని సార్లు చేసావ్ ఈ ప్రామిస్ లు అంటూ అడుగుతుంది ఇదంతా ఫోన్ లో నుండి వింటూ నవ్వుతున్నాడు అతడు....
నువ్వు నవ్వకు సూర్య మమ్మీ అలానే అంటుంది అని చెప్తుంది ఊడుకొంటు అవునా సరే నవ్వను అని ఇంకా గట్టిగా నవ్వేస్తాడు సూర్య.....
నువ్వు కూడా నా సూర్య పొండి మీతో మాట్లాడను అని అలిగి కూర్చుంటారు మేడం గారు....
నవ్వుతూనే సారీ వాహి కంట్రోల్ చేసుకోలేకపోయాను క్షమించు అని చెప్తున్నాడు సూర్య....
బుంగ మూతి పెట్టుకోని అలాగే చూస్తుంది వాహ్నిక అబ్బాయి మాట్లాడితే వినిపించడం లేదా సిరీస్ లు చూడమంటే చూస్తావే అని కసురుకొని ఫోన్ తీసుకోని అల్లుడు తో మాట్లాడతారు శ్రీ దేవి గారు వాహి అమ్మ గారు....
హాయ్ అత్తయ్య ఎలా ఉన్నారు వాహి బాగా కోపంగా ఉందా అని అడుగుతాడు హ దాని బొంద లే నీతో మాట్లాడకుండా అది ఉండలేదు లే కానీ నువ్వు జాగ్రత్త బాబు దానితో అంటారు ఇంతలో వాహి నాన్నగారు ఫోన్ తీసుకొని ఏంటి అత్తా అల్లుడు గూడుపుటాని చేస్తున్నారు అని అడుగుతాడు....
అదేం లేదు మావయ్య అత్తయ్య వాహి గురించి చెప్తుంటే వింటున్న హా విను అంతే రియాక్షన్ ఇవ్వకు ఈ ఆడవాళ్లకు కాలితే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు...
నాన్న మీరు కూడా నా అంటుంది వాహి ఏడుపు మొకం తో నిజం చిట్టి తల్లి ఈ విషయం లో నీకు సపోర్ట్ చేయలేను అని అంటారు...
ఇంకా గట్టిగ నవ్వుతూనే ఉంటాడు సూర్య ఆ మాటలు వింటూ వాహి వాళ్ల అమ్మ నాన్నలని పంపించి ఫోన్ తీసుకుని సూర్య అని అరుస్తుంది సారీ వాహి నేను కంట్రోల్ చేసుకోలేకపొయాను అని చెప్తూ ఉంటాడు నవ్వుతూ అతని నవ్వుకి ఆమె కూడా జత కలుపుతుంది ఈ సారి....
కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేసి అతని నవ్వు తలచుకొని నవ్వుకుంటుంది వాహి ...
సూర్య అతని పరిచయం, పెళ్లి అన్నీ గుర్తొస్తుంటే సిగ్గుపడుతుంది ఇంకో వారంలో పెళ్లి మరి...
శ్రీధర్ శ్రీదేవి గారికి ఒక్కగానొక్క కూతురు మన వాహ్నిక
సుధాకర్ సుమ గారికి ఒక్కగానొక్క కొడుకు మన హీరో సూర్య.....
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాహి ని ఫ్రెండ్ పెళ్లి లో చూసి ఇష్టపడుతూ తల్లిదండ్రుల సహాయం తో పెళ్లి ప్రపోజల్ పెడతాడు సూర్య మంచి అబ్బాయి కావటం తో రెండు నేలల ముందే నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారు.....
వాహి కి కూడా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నా పై చదువులు చదవాలని ఉన్నా ఒక్కసారి వైవాహిక జీవితం లోకి అడుగు పెట్టక పూర్తి భార్యగా భర్త ని ప్రేమిస్తూ ఉండాలనీ తన ఆశ లు వదులుకుంది పైగా సూర్య కూడా అందరిలా ప్రేమ అంటూ వెంట పడి విసిగించకుండా నచ్చిన వెంటనే పెళ్లి కోసం అడగడం బాగా నచ్చింది వాహి కి సూర్య తో ప్రేమలో పడిపోయింది....
ఆ రోజు నుండి వారి మధ్య ఎన్నో కబుర్లు ఎన్నో ఇష్టాలను పంచుకున్నారు ఇప్పుడు ఇంకో వారం లో పెళ్లి తన ప్రాణం అయిన సూర్య తో తన పెళ్లి అది తలచుకునే సిగ్గు పడుతోంది వాహ్నిక......
చూస్తుండగానే వారం రోజులు గడిచి ఇంటి పేరు మార్చుకొని అత్తవారింట్లో అడుగు పెట్టింది వాహి...
సూర్య వాహి ఒక్కటే ప్రాణం సరి కొత్త గా ప్రేమించుకుంటూ భవిష్యత్తు ని అందం గా మార్చుకుంటున్నారు....
సూర్య కి బెంగుళూరు ట్రాన్ఫర్ అయ్యి మొదటి సారి ఊరిని విడిచి తన నీడ కోసం తోడుగా వెళ్తుంది వాహి....
అక్కడ 2 బెడ్‌రూమ్ ప్లాట్ తీసుకుని అందులో అందం గా జీవిస్తున్నారు సూర్య వాహి లు....
ఒకరోజు సూర్య ఆఫీస్ లో లంచ్ చేస్తుండగా అతని కొలీగ్ అతని భార్య గురించి ఇంకో అతనికి చెబుతున్నాడు వారికి గొడవ అనుకుంటా అదే చెప్తున్నాడు రోజు ఒకటే గొడవ రా ఆలస్యంగా వస్తున్నావ్ తాగుతున్నావ్ అని ఈ ప్రెషర్ లో తాగకుండా ఎలా ఉంటాడు నువ్వే చెప్పు....
అవేం తేలికుండా దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏదో నాకు మనసే లేనట్టు
అదేంటి బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ కదా
అవును ప్రేమించా చూడగానే నచ్చింది ఇంట్లో ఒప్పించి మరి చేసుకున్నా....
తను రోజు పడే గొడవ తో ఇంట్లోచ్చి వెళ్లిపోతా అంటుంది అది వెళ్లి పోతే మళ్ళీ తీసుకు రాను నేను నన్ను వదిలి వెళ్లిపోతే ఎం పెట్టి పోషించుకుంటుందో పిల్లలను డిగ్రీ కూడా పూర్తి కాలేదు నేను నచ్చింది అనగానే ఒప్పు కొని పెళ్లి చేసుకుంది...
అది నన్ను వదిలి వెళ్ల లేదు వెళ్లినా వాళ్ల ఇంట్లో వాళ్లు ఎన్ని రోజులనీ తిండి పెడతారు జీవితాంతం నా తోనే ఉండాలి నేను ఎలా ఉన్నా అని మగాడు అన్న గర్వం తో మాట్లాడాడు అతను...
ఆ మాటలు సూర్యకి నచ్చలేదు కాని అతనిని ఆలోచించేసాయీ ....
తరవాత రోజు వాహి తో మాట్లాడి కాలేజీ లో సీట్ కోసం మాట్లాడాలి తన భవిష్యత్ అందం గా ఉండాలి అనుకున్నాడు కాని వాహి అందుకు ఒప్పుకోలేదు నేను కాలేజ్ కి వెళితే నిన్ను ఎవరు చూసుకుంటారు నేను పెడితే గాని తినవు నాకు చదువు వద్దు ఏమి వద్దు నువ్వు చాలు అని గొడవ చేసింది.....
అప్పటికే అతని మాటలవల్ల డిస్టర్బ్ అయిన సూర్య తను లేకపోతే వాహి కి గుర్తింపు లేదు అని ఎవరు అనుకోకూడదు అని గట్టిగ నిర్ణయించుకొని అందరి భార్యలలా చదువుకున్న భార్య నా భార్య ని చూడాలనుకుంటున్న సుద్దపప్పు లా కాదు...
ఎంత సేపు వంటిల్లు భర్తే నా దైవం అనే కాదు బయట అందరు ఎలా ఉన్నారో చూసి నేర్చుకో ఎంత సేపు నీ ప్రేమ నీ ప్రాణమే కాదు నేను లేకుండ బ్రతకడం నేర్చుకో ఒకరి జీవితం ,జీతం మీద ఆదారపడటం మానేయ్ అని సీరియస్ గా చెప్పాడు.....
ఆ మాటలు మంచి కోసమే చెప్పినా దెప్పి పొడుస్తునట్టు ఉంది వాహికి అప్పటి వరకు ఇద్దరం ఒక్కటే అనుకుంది హఠాత్తుగా వేరు చేసి మాట్లాడేసరికి ఏడుపు తన్నుకొచ్చింది...
తల దించుకొని అలానే ఉండిపోయింది తన అనుమతి లేకుండానే తర్వాత రోజు కాలేజ్ లో జాయిన్ చేసాడు జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు భర్తలో ఇంత మార్పు సహించలేక పోయింది భార్య ఆ మాటలు మర్చిపోవడానికి చదువు మీద దృష్టి పెట్టింది కానీ భర్త తో మాటలు తగ్గిపోయాయ్.....
""మాట జారితే గొడవ ఎక్కడికో వెళ్తుంది హీరో కూడా స్లో గా తను అర్దం చేసుకునే రీతిలో చెప్పి ఉండొచ్చు కానీ చెప్పలేదు మాట జారాడు ఫలితం ఇద్దరి మధ్య దూరం......."""
సూర్య కూడా తను ప్రేమగా చెప్తే ఎక్కడ చదువు మీద దృష్టి పెట్టాలో అని ఆ దూరాన్ని అలా ఉంచాడు కాని అతని మనసు ఆమె ప్రేమని కోరుకునేది ""అమ్మాయికి కోపం ,ప్రేమ రెండు సంద్రం లా వస్తాయీ వాటిని తట్టుకోవడం చాలా కష్టం"" అనిపించింది సూర్య కి ఎంత ప్రేమించిందో అంతా దూరం పెడుతుంది రాక్షసి అనుకొన్నాడు సూర్య ఆమె ప్రేమ ని విడిచి ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు....
ఒకరోజు రాత్రి వాహి పడుకున్న తర్వాత ఆమె గదికి వెళ్లి కింద కూర్చోని వాహి
"నేను ఏంతప్పు చేసా నాతో మాట్లాడటం లేదు అవును కోపంలో నోరు జారను తిట్టాను అంతమాత్రానా నా చిరునవ్వు నా నుండి లాగేసుకుంటావా తెలుసా వాహి ఎందుకు అలా మాట్లాడానో నా కొలీగ్ అతని భార్య ని తక్కువ చేసి మాట్లాడాడు అతను అన్న చదువు విషయం నన్ను బాధించింది....
నా వరకు నా ప్రేమనీ నీకు చెప్పి పెళ్లి చేసుకున్నాను నీ కలలు గోల్స్ ఏమి తెలుసుకోకుండానే జీవితం ప్రారభించేశాం అతని మాటలు విన్నాక నీ కలలు నాకోసం నేను చంపేసినట్టు అనిపించిది...
నీకు చెప్తే నా మీద ఉన్న ప్రేమతో కొట్టిపడేస్తావు అందుకే లేని కోపాన్ని తెచ్చుకొని చూపించాను నీ ప్రేమ నాకు దూరం అయింది నేను లేకున్నా నువ్వు బ్రతకడం నేర్పించాలనుకున్నాను నన్నె దూరం పెట్టేస్తావు అనుకోలేదు....
నా ప్రేమ వే నువ్వు అయినప్పుడు నిన్ను ఎందుకు దూరం పెడతాను నా మాటలు బాధ అనిపించోచ్చు కానీ నీ గోల్స్ నీ కలలు అన్నీ నీ డైరీలో చూశాను సొంతంగా ఏదైనా చేయాలనుకున్నావ్ అది నా వల్ల దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు....
ఇంకా చెప్పాలంటే రేపటి రోజున నేను లేకపోయిన నువ్వు నీ జీవితాన్ని చక్కదిద్దుకునేలా ఉండాలి అనుకున్నా గొడవలు ఎలా అయినా వస్తాయ్ కొన్ని దూరం పెట్టేవి అయితే, కొన్ని దూరం చేసేవి వాటిలో నీకు తోడు గా ఈ ప్రపంచం, నేను,ఎవరు తోడు రాలేము నీకు నువ్వే ఉంటావ్ నీ తోడు నీ చదువు ఉంటుంది అందుకే అంత ఫోర్స్ చేసాను అరిచాను నేను లేకపోయిన అని అంటుండగానే సూర్య చెంప వాచిపోయేలా కొట్టింది వాహి.....
అమ్మో ఇది లేచే ఉందా అని షాక్ గ చూస్తున్నాడు...
సూర్య ఎన్ని సార్లు అంటావ్ నేను లేకపోతే నేను లేకపోతే అని లేక ఎక్కడికి పోతావ్ ఒకవేళ గొడవ అయిన నేను నిన్ను వదిలేసి వెళ్ళే రకాన్ని కాదు కాకపోతే ఇంతేనా అర్ధం చేసుకుంటుంది అని బాధ అంతే....
నువ్వు అకస్మాత్తుగా అలా వేరు చేసి మాట్లాడే సరికి కోపం కన్నా విడదిసావ్ అని బాధ గా అనిపించిది అందుకే నువ్వు ఎదైతే చేయమన్నవో అది చేసి నీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్న తర్వాత నా పగ నాది నన్ను ఏడిపించినందుకు....
ఇంకోసారి నువ్వు భాద పడి నన్ను బాధపెట్టకు నాకు నీ ప్రేమ కన్నా ఎక్కువ ఏది కాదు అల అని నీ ప్రేమే లోకం కాదు నాకంటూ కొన్ని కలలు ఉన్నాయ్ అవి నేరవేర్చుకుంటా నువ్వు నాకు తోడుగా ఎప్పుడు ఉంటావు నాకు తెలుసు నీ ప్రేమ మాత్రం నాకే కావాలి ఎప్పటికి అని అతని గుండె మీద వాలి పడుకుంది...
చాల థాంక్స్ రా నా లైఫ్ లోకి వచ్చి ఇంత ప్రేమ ని ఇస్తున్నావు అని ఫోర్ హెడ్ పైన ముద్దు పెట్టుకుంటాడు......
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
5 సంవత్సరాలు తర్వాత సూర్య తన కూతురితో ఆడుతు ఉంటాడు హాల్లో....
వంట చేస్తూ ఉంటుంది వాహి
కూతురికి మాటలు నేర్పుతున్న సూర్య దగ్గరకి కోపం గా వచ్చి ఎప్పుడు కూతురితో ఆడటమేనా పెళ్ళానికి సాయం చేయాలని తేలీదా అని గరిటే తో ఒక్కటి వేస్తుంది.....
అబ్బా చంపేసావ్ కదా రాక్షసి వస్తున్నానే నా కూతురు పిలిచింది అందుకే వెళ్ళా అయినా వంట ఆడవాళ్ళ పని మగ వాళ్ళు చేయరాదు అవునా ఉద్యోగం కూడా మగవాళ్ళ పనే కష్ట పడి కోపం తో తిట్టి మరి చదివించావు గా వండి పెట్టు నేను తిని పెడతా అని నవ్వుతుంది వాహి....
అవును గోటి తో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో సూర్య సూర్య అంటూ వేనుకే తిరిగేదానివి ఎప్పుడు గరిట పెట్టి కొడుతున్నావ్ సీఈఓ మేడం.....
నా గుర్తుంపుకి కారణం నువ్వే కదా సూర్య నువ్వే చదివించకపోతే నేను మాములు సూర్య కి భార్య గానే ఉండిపోయేదాన్ని ఇప్పుడు అందరికి ఒక బాస్ నీ సూర్యవాహ్నిక ని నా పేరు ముందు నా విజయం ముందు నువ్వే కదా ఉన్నావ్ అంటుంది ప్రేమగా చూస్తు.....
అది నీ ప్రతిభ వాహి...
నువ్వు గుర్తించినట్లు అందరు గుర్తించరు కదా సూర్య అందుకే నువ్వంటే ప్రాణం...
నాకు కూడా నువ్వు అంటే ప్రాణం పిల్ల అని నవ్వుతాడు సూర్య...
అతని నవ్వును మైమరచి చూస్తోంది వాహ్నిక....
శుభం
అందరికి సూర్య లాంటి భర్త దొరుకుతాడు అని చెప్పను కానీ భార్యా ఇష్టాలను, లక్ష్యాలను తెలుసుకోని భర్తలు ఉండరు కదా...
వీలైతే వారి కలలకు రెక్కలను ఇవ్వండి వారి లక్ష్యాలకు సహకరిచండి అదే చెప్పాలనుకున్నా చెప్పేసా ...
మీ
మైత్రికా
