STORYMIRROR

💞💞 Mythrika

Drama Romance

4  

💞💞 Mythrika

Drama Romance

ప్రేమ

ప్రేమ

1 min
442

అతని రూపం ముగ్ధ మనోహరం 

అతని మాట సుమధుర గీతం 

అతని అల్లరి సుమనోహర కేళి 

అతని నవ్వు పండు వెన్నెల 

ఆమె రూపం చంద్ర బింబము 

ఆమె నయనాలు నక్షత్రాలు

ఆమె నవ్వు విరిసిన కమలము 

ఆమె మోము చెక్కిన శిల్పం 

అతని కోసం ఆరాటపడే మది ఆమెది 

ఆమె కోసం కోట్టుకునే గుండె అతనిది 

ఆమె ప్రేమ అనంతం 

అతని ప్రేమ సముద్రం

అతని చూపు ఆమె సర్వం 

అతని నవ్వు ఆమె ఆయువు 

అతని స్పర్శ ఆమెకు పులకరింత

ఆమె ప్రాణం అతని రూపం 

అతని కోసం జీవించే ప్రాణం ఆమెది

ఆమె ప్రేమ కావాలనుకునే ప్రాణం అతనిది 

పొంగే అలలా ఉండే ఆమె ప్రేమను

అందని సముద్రం లా ఉండే అతని ప్రేమ

ఒకే తీరం చెరుకొంటుందా!!! 


ఈ అతను ఆమె ఎవరో కాదు

 మన రాధా కృష్ణులు 


ఇద్దరి ప్రేమ ఎంతో స్వచ్ఛం కాని దరి చేరని దూరం


 ఎంత వింత కదా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ బాధ తప్పదు 


కానీ ఈ ప్రేమకి ఐనా వారి ప్రేమ నే ఆదర్శంగా తీసుకుంటారు 


ప్రేమ అంటే దగ్గర ఉండి జీవించడమే కాదు దూరం గా ఉండి కూడా వారి సంతోషం కోరుకోవడం 


నాకు తెలిసిందేదో రాసేస తప్పులు ఉంటె క్షమించండి 


మీ 

మైత్రీక


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama