STORYMIRROR

💞💞 Mythrika

Drama Tragedy Classics

4  

💞💞 Mythrika

Drama Tragedy Classics

తొలి ప్రేమ

తొలి ప్రేమ

5 mins
449

ప్రేమ ఈ పదం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు కదా.. తల్లి దండ్రులు వారి పిల్లల్ని ప్రేమిస్తారు.

ఒక గురువు తన స్టూడెంట్స్ నీ ప్రేమిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు.


అసలు విషయానికి వస్తే ఇప్పటి రోజుల్లో ప్రేమ అంటే అమ్మాయిల, అబ్బాయిల ప్రేమే కదా.. మరి ఆ ప్రేమికుల అందరి ప్రేమ గెలుస్తుందా?


అంటే కొందరి ప్రేమ నిజం అవ్వక ఓడిపోతుంది, ఇంకొదరివి పెద్దలు ఒప్పుకోక ఓడిపోతుంది.. 


కానీ మన స్టొరీలో ప్రేమికుల ప్రేమ నీ పెద్దలు ఒప్పుకున్నారు.. నిజమైన ప్రేమ కానీ వీళ్ళు విడిపోతారా, కలుస్తారా అన్నది స్టొరీ చదవండి అర్థమవుతుంది.


ఇంక స్టోరీలోకీ వెల్తే...


గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన మన బాపు బొమ్మకి ఏ మాత్రం తీసిపోని వేద..


అలానే ఉద్యోగంలో చేరి అందరితో శబాష్ అనిపించుకుంటున్న.. తెలివైన, చురుకైన మన సిద్ధూ..


ఒకరోజు సిద్దు ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ కి బయల్దేరాడు.. అసలే లేట్ అయ్యింది.. అటు బాస్ చూస్తే సివంగి.. ఎలారా భగవంతుడా అనుకుంటూ బైక్ మీద వెళ్తున్నాడు.


అలా ఫాస్ట్ గా వెళ్తూ సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్ళేసరికి అటు నుండి వస్తున్న ఒక పెద్దాయన్ని గుద్దుతాడు.. వెంటనే బైక్ పక్కన ఆపి..

సారీ అంకుల్ నాదే తప్పు క్షమించండి.. అంటూ ఆయన్ని లేపి ఎక్కడన్నా దెబ్బలు తగిలాయామో అని ఆయన్ని పరిశీలించి.. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అంకుల్ డ్రాప్ చేస్తా అంటాడు..


పర్లేదు లే బాబూ ఇంతకీ నీ పేరు ఏంటీ? జాబ్ లో కొత్తగా జాయిన్ అయ్యవా.. అందుకే ఈ హడావిడా?


నా పేరు సిద్దు అంకుల్.. ఐనా బలే కరెక్ట్ గా చెప్పారు అంకుల్.. హౌ ఇట్ ఈజ్ పాజిబుల్?


బాబూ మేము కూడా ఉరుకులు పరుగుల మీద ఉద్యోగాలు చేసి ఈ వయసుకి వచ్చాము.


అంకుల్ మీ పేరు? ఇంతకీ మీరు ఏమ్ చేసేవారు?


నా పేరు మోహన్ రావు బాబూ.. నేను ఏదో ప్రైవేట్ కంపెనీ లోనే చేసి రిటైర్ అయ్యాను.. రోజూ ఏమ్ తోచక దగ్గర్లోనే పార్క్ ఉంటే వాకింగ్ చేసి వస్తూ ఉంటాను.


సరే అంకుల్ రండి డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్తాను.


దగ్గరే బాబూ నేను వెళ్తాలే.. నువ్వు వెళ్ళు ఆఫీస్ కి.. ఒకరోజు ఫ్రీ ఉంటే సాయంత్రం ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడికి వచ్చి మోహనరావు గారి ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు బాబూ అంటూ నెమ్మదిగా ఇంటికి వెళ్తాడు.


ఆయన వెళ్ళేదాకా అటే చూసి ఆయన వెళ్ళగానే.. వామ్మో ఈ రోజు నా పని ఔట్ అంటూ బైక్ తీసి ఫాస్ట్ గా ఆఫీస్ కి వెళ్లిపోతాడు..


నెక్స్ట్ డే కూడా సేమ్ అదే టైమ్ కి ఆఫీస్ కీ బయల్దేరతాడు.. కరెక్ట్ గా ఆ సిగ్నల్ వచ్చేసరికి సిద్దుకి పెద్దాయన గుర్తొచ్చి బైక్ ఆపి చుట్టూ చూస్తాడు..


కొంచం దూరంలో ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనపడతారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి.. హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు?


బానే ఉన్నా సిద్ధూ పర్లేదే బానే గుర్తున్నా.. అప్పుడు జరిగింది వెంటనే మర్చిపోయే ఈ కాలంలో ఇంకా గుర్తుంచుకున్నావు అంటే..


అంటే ఏంటీ నాన్నా ఇతనేనా నిన్ను నిన్న గుద్దింది.. ఏ మిస్టర్ నీకు అసలు బుద్ది ఉందా? నిన్న అలా గుద్దేసి.. అలా వదిలేసి వెళ్ళిపోయావ్.. మా నాన్నకి ఏమన్నా ఐతే?


అయ్యో అంకులే వద్దు అన్నారండి అందుకే వెళ్ళాను..


ఆయన అతి మంచితనంతో అలానే అంటారు.. మీకు బుద్ది ఉండాలి కదా పెద్దాయన్ని డ్రాప్ చేయాలనీ..


ఇంక ఆగు తల్లీ అతనిది తప్పేం లేదు.. నేనే తొందరగా వస్తుంటే అతనేం చేస్తాడు.. సారీ బాబూ ఇది నా కూతురు వైదేహి.. నేనంటే కొంచం ఎక్కువ ప్రేమ అందుకే ఇలా అరిచేస్తోంది.. ఏమీ అనకోకు బాబూ..


ఏమ్ అనుకోను లెండి అంకుల్ అంటూ వైదేహి వైపు చూస్తాడు.. చూడగానే నచ్చే మోము.. చక్కగా పద్ధతిగా ఉంది... ఇంకేముంది మనసు వినకుండా తన వైపుకి వెళ్ళిపోయింది..


బాబూ ఈ రోజు ఆఫీస్ లేదా అని మోహన రావు గారు అనేసరికి హా ఉంది అంకుల్ వెళ్తున్నా అని వెళ్ళాలని లేకపోయినా బయల్దేరి వెళ్తాడు..


ఆఫీస్ లో, రూమ్ లో ఎక్కడైనా వైదేహే కనపడుతూ ఉండటంతో.. తెల్లవారి వీకెండ్ హాలిడే కూడా అవ్వటంతో చక్కగా రెడీ అయ్యి మళ్ళీ సేమ్ టైమ్ కి సిగ్నల్ దగ్గర ఆగి చుట్టూ చూస్తాడు.. కానీ ఎక్కడా కనపడరు.. అరే ఇల్లు ఇక్కడే ఎక్కడో అన్నారు కదా అని పక్కనే ఫ్రూట్స్ కొని సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి మోహనరావు గారి ఇల్లు ఎక్కడా అని అడుగుదాం అనుకునేసరికి..


పక్కనే వైదేహి నుంచుని.. వచ్చావా ఖచ్చితంగా వస్తావు అని ఎక్ష్పెక్ట్ చేసా అంటూ అతని వైపే చూస్తూ ఉంటుంది.


పక్కనే వైదేహి నీ చూసి కొంచం భయపడినా.. అలా ఏమ్ కాదండి.. అంకుల్ మొన్న రమ్మన్నారు..

సరే అని ఈ రోజు వద్దాం అనిపించి ఇలా వచ్చా అంటూ తడపడుతూ చెప్తాడు.


సరే నమ్మాం లే.. రా ఇంట్లోకి అంటూ తీసుకు వెళ్తుంది.


ఏమోయ్ సిద్ధూ ఈ రోజు చాలా సార్లు అనుకున్నా అయ్యా నిన్ను చూస్తే బావుండు అని.. నా మనసులో అనుకున్నది నీకు తెలిసిందా ఏంటీ వచ్చేసావు..


అలా మోహన రావు గారు అనగానే సిద్ధూ ఒక స్మైల్ ఇచ్చి తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ వైదేహి చేతిలో పెడతాడు.


సరే రావోయ్ ఇటోచ్చి కూర్చో అంటూ పక్కన కూర్చో పెట్టుకుని.. ఇద్దరూ కబుర్లలో పడతారు..


కాసేపటికి వేరే రూమ్ లో ఉన్న తన భార్య దగ్గరికీ తీసుకెళ్లి ఇతను సిద్ధూ ప్రభా.. మంచి అతను అని చెప్తూ ఉంటారు..


ఆవిడ ఉలుకూ పలుకు ఏమ్ లేకుండా అలా చూస్తూ ఉంటారు.


అంకుల్ ఆంటీ కి ఏమయ్యింది?


బ్రెయిన్ క్యాన్సర్ బాబూ ఇంకా ఎక్కువ కాలం బతకదు.. ఇలా దానితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా.. ఉన్నన్ని రోజులూ ఐనా ఇలా దానితో టైమ్ స్పెండ్ చేస్తే అదొక సంతృప్తి..


మరి మంచి హాస్పిటల్ లో చూపించాల్సింది కదా అంకుల్..


ఇప్పటికే చాలా చోట్లకి తిప్పాము.. లాభం లేదు అన్నారు బాబూ.. సరే నువ్వేదో హ్యాపీగా ఉండాలి అని వస్తె ఈ సోది చెప్తూ ఉన్నా రా బాబూ బైటికి వెల్దాం అని బైటికి తీసుకొస్తారు.


అలా సాయంత్రం దాక కబుర్లతో గడిపి ఇంటికి వస్తాడు సిద్ధూ..


ఇంటికి రాగానే లేట్ చేయకుండా.. వైదేహికి ఫోన్ చేసి.. ప్రేమిస్తున్నా అని చెప్తాడు.. దానికి వెంటనే వైదేహి కూడా ఒప్పుకుంటుంది.


కొన్ని రోజులు వాళ్ళు ప్రేమించుకున్నాకా ..వైదేహి నీ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళి అందరికీ పరిచయం చేసి వాళ్ళ ప్రేమ గురించి చెప్తారు.. అక్కడ వాళ్ళని ఒప్పించాక, వైదేహి వాళ్ళింట్లో కూడా వాళ్ళ విషయం చెప్పగానే.. మోహనరావు గారు చాలా ఆనందించి నాకు నిన్ను చూడగానే బాగా నచ్చావయ్యా నేనే అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకో అడగాలి అనిపించలేదు చివరికి మా అమ్మాయినే ప్రేమించా పెళ్ళి చేసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోను.. అంటూ ఆయన కూడా హ్యాపీగా ఒప్పుకుంటారు. వాళ్ళ ఆవిడ ప్రభా గారికి కూడా చెప్తారు.. ఆ విషయం వినగానే ఆవిడ లో చలనం వస్తుంది.. అది గమనించిన వైదేహి.. కొంచం సంతోష పడుతుంది..


సిద్ధూ అందరికీ బాయ్ చెప్పి తన రూమ్ కి వెళ్లిపోతాడు.. మర్నాడు ఆఫీస్ లో ఫుల్ వర్క్ ఉండటంతో వైదేహి తో మాట్లాడటం కుదర్లేదు...


మరుసటి రోజు ఉదయం ఎన్ని సార్లు కాల్ చేసినా వైదేహి కి నాట్ రీచబుల్ అనే వస్తోంది.. ఇంక లాభం లేదని వాళ్ల ఇంటికి బయల్దేరి వెళ్తాడు.. అక్కడికి వెళ్లేసరికి వైదేహి వాళ్ళు ఎక్కడికో ఊరికి వెళ్ళారు మాకు కూడా తెలియదని పక్కింటి వాళ్ళు చెప్పడంతో నిట్టూరుస్తూ వస్తాడు..


ఆ సాయంత్రానికే ఆక్కడ ఉన్న సెల్ టవర్స్ కి ఏదో ప్రాబ్లెమ్ అయ్యి సెల్ ఫోన్ వర్క్ చేయటం మానేశాయి..


పూర్వ కాలంలో సెల్ ఫోన్ లేకుండా ఎలా ఐతే ఉన్నారో అందరిదీ అదే పరిస్థితి..

అలా ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు రోజులు నెలలు అయ్యాయి.. నెలలు సంవత్సరాలు అయ్యాయి.. అలా ఒక రెండు యేళ్ళ దాకా నో ఫోన్స్.. రోజూ సిద్దు వాళ్ళింటికి వెళ్ళడం ఇంకా రాలేదు అని వెనక్కి రావడం.. కానీ ఎక్కడో చిన్న హోప్ వైదేహి వస్తుంది అని..


అలా ఒకరోజు... ఆఫీస్ కి బయల్దేరి ఏదో చిరాకులో ఉండి మళ్ళీ సిగ్నల్ దగ్గర ఆగకుండా వస్తుంటే.. ఎందుకో మనసు పక్కకి చూడు చూడు అని మొరపెడుతుంటే పక్కకి తల తిప్పి చూడగానే ఎదురుగుండా వైదేహి, వాళ్ళ నాన్నగారు అమ్మ గారు సిద్ధుని చూసి నవ్వూతూ ఉంటారు..


సడెన్ గా వాళ్ళని చూసి షాక్ అయ్యి పక్కన బైక్ ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు..


 సిద్దుని తీసుకుని వాళ్ళ ఇంటికీ వెళ్ళి.. ఆ రోజు తను ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ల అమ్మలో వచ్చిన కదలికనీ తండ్రితో చెప్తే వెంటనే డాక్టర్ నీ సంప్రదిస్తే వెంటనే తననీ తీసుకుని ఫారిన్ కు వెళ్ళమంటే.. ఎప్పుడన్నా అవసర పడుతుందేమో అని అన్నీ రెడీగా ఉంచుకోవటం వల్ల లేట్ చేయకుండా ప్రభ గారిని తీసుకుని ఫారిన్ వెళ్లిపోతారు..


సెల్ ఫోన్స్ ఏవి వర్క్ అవ్వక పోవడంతో వీళ్ళు కూడా కాల్ చేసి చెప్పలేకపోయారు.. చివరికి వాళ్ళ అమ్మగారు మొత్తం సెట్ అయ్యాక తీసుకుని ఇంటికి వస్తారు.


వెంటనే సిద్దు వాళ్ళింటికి వెళ్ళి సిద్దు గురించి కనుక్కుని ఇంకా తనకోసం వెయిట్ చేస్తున్నాడని తెలిసి అలా సిగ్నల్ దగ్గర వెయిట్ చేయడానికి వస్తారు.. ఇలా జరిగిన విషయం మొత్తం చెప్పగానే.. వైదేహి నీ హగ్ చేసుకుని తన ప్రేమ నంతా ఏడుపు రూపంలో తెలియ జేస్తాడు..


ఇంకేముంది ఇంక లేట్ చేయకుండా ఇద్దరికి పెళ్ళి చేసి హనీమూన్ కి పంపేసి ఇక్కడ పెద్దవాళ్ళు.. వాళ్ళ చేతిలో మనవడని, మనవరాలిని ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తారు..


వీల్లేమన్నా తక్కువ తిన్నారా తొమ్మిది నెలల్లో ఇద్దరి పిల్లల్ని కని వాళ్ళ చేతిలో పెట్టేస్తారు..


ఇదండీ మరి మన సిద్దు, వైదేహి ల ప్రేమ .. మీ అందరికీ నచ్చింది అనే అనుకుంటున్నా..


నన్నూ నా స్టోరీస్ నీ ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు..


మర్చిపోకుండా కామెంట్ చేస్తారు కదూ..


మీ మైత్రిక..


Rate this content
Log in

Similar telugu story from Drama