STORYMIRROR

Midhun babu

Fantasy Inspirational Others

4  

Midhun babu

Fantasy Inspirational Others

ఆలోచనా సరళి

ఆలోచనా సరళి

2 mins
349


     శ్రీనివాస్ అనే పేద యువకుడు ఒకసారి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అతను విష్ణుభక్తుడు. అతనికి మార్గమధ్యలో ఒక సాధువు కలిశాడు. 

  

 ఏం నాయనా! ఒంటరిగా అడవిలో ఎక్కడికి వెళుతున్నావు?’ అని ప్రశ్నించాడు సాధువు. ‘పని వెతుక్కోవడానికి పట్నం వెళుతున్నాను స్వామీ! ఇది దగ్గర దారి కదా అని ఇలా వచ్చాను’ అని ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు. 

 

 ఇద్దరూ కలిసి నడక సాగించారు. కొంతదూరం ప్రయాణించాక అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగారు. వాళ్ళకు కొద్దిదూరంలో ఒక నక్క కనిపించింది. దాని కాలికి గాయం కావడంతో నడవలేక కుంటుతోంది. 

 

 ‘ఆ నక్కను చూశారా స్వామీ! పాపం నడవలేకపోతోంది. మనుషులం మనం ఇంత కష్టపడితేగాని పొట్ట నిండడం లేదు. మరి వేటాడలేని ఆ నక్క పొట్ట ఎలా నిండుతుంది’ అన్నాడు శ్రీనివాస్ ఎంతో జాలిగా. 

 

 సాధువు జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కలకలం మొదలైంది. పక్షులు గోలగోల చేస్తూ అటుఇటు ఎగరసాగాయి. ఉడతలు గబగబా చెట్టెక్కాయి. కుందేళ్ళు బొరియల్లోకి పారిపోయాయి. 

 

 ‘ఏదో ప్రమాదంముంచు కొస్తున్నట్టుంది. పద ఈ చెట్టెక్కుదాం’ అని సాధువు చెప్పడంతో శ్రీనివాస్ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ ఒక పెద్ద చెట్టు ఎక్కి గుబురులా దాక్కొని ఉండిపోయారు. ఇంతలో ఒక సింహం తాను వేటాడిన జింకను తెచ్చి అక్కడ తృప్తిగా తిని మిగిలిన దానిని అక్కడే వదలి వెళ్ళిపోయింది. తర్వాత. నక్క బయటకు వచ్చి సింహం వదలిన ఆహారం తినడం మొదలు పెట్టింది.

ఇదంతా చూసిన శ్రీను ఆ సాధువు తో చూసారా స్వామీ, నేను ప్రతిరోజూ a దేవుడిని పుజిస్తాను. నాకు ఎప్పుడు సాయం.చేయలేదు. ఈ నక్కమాత్రం పూజించకపోయినా దానిని కష్టకాలంలో ఆదుకున్నాడు అన్నాడు నిరసనగా.

 సాధువు నవ్వుతూ నీవు అన్నివిధాల సమర్తుడివి. నిస్సాహాయిరాలయిన నక్కతో నీవు నిన్నుపోల్చుకుంటున్నావు

దేవుడు నికు పూర్తి శక్తిని ఇచ్చి సింహంలా కష్టపడి సంపాదించుకొని తినమన్నడు. అంటే నీవు సంపాదించుకొని తిని మిగిలిన దానిలో ఇతరులకు పెట్టామన్నాడు. నీవు ఆవిధంగా చేయకల శక్తి సామర్థ్యాలను. దేవుడు మీకిచ్చాడు ..అంతే కానీ ఇతరులపై నీవు ఆధరపడదానికి నీవు కుంటి నక్కవు కావు అన్నాడు. దాంతో.శ్రీను తన ఆలోచనా పద్దతికి సిగ్గుపడ్డాడు.

నీతి.. మన ఆలోచనలే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

రంగారావు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Fantasy