Sanjaatha Chintakunta

Drama Classics Fantasy

4  

Sanjaatha Chintakunta

Drama Classics Fantasy

కమ్మరి కుమార్ - మై ఫస్ట్ క్రష్

కమ్మరి కుమార్ - మై ఫస్ట్ క్రష్

2 mins
11నాయనమ్మ వాళ్ళది గుడ్లనర్వ, తెలంగాణ నాగరకర్నూలు డిస్ట్రిక్ట్ పక్కన పాలెం మండలం లో ఒక చిన్న మారుమూల పల్లెటూరు.


మేము సెలవులకు ప్రతీ సారి మహబూబ్నగర్ నుంచి గుడ్లనర్వకి వెళ్ళేవాళ్ళం. 


తాతయ్య మక్తేదార్ నరసింహా రావు, దేశపాండ్య రంగమ్మ కొడుకు. తాతయ్య ఆ ఊరికి పట్వారీ. 


ఆ ఊర్లో మాదే పెద్ద ఇల్లు తెలంగాణలో భవంతి అంటారు. వరంగల్ నల్లగొండ వైపైతే గడి అంటారు. 


భవంతి దాని చుట్టూ స్థలం కలిసి మా ఇల్లు ఒక ఎకరం దాకా ఉంటుంది. మా ఇంటి గేటు గురించి కొంచెం వివరించాలి, ఎందుకంటే ఈ కథ అక్కడే మొదలవుతుంది. దానితోనే అయిపోతుంది కూడా!


 ఇంటి ముందు పెద్ద గేటు అవతలి వారు ఇవతలికి కనపకుండా రేకుతో చేయబడి పెద్దగా డిజైన్ లేకుండా ఉంటుంది. ఆ గేటుకు మధ్యలో ఒక చిన్న కిటికీ లాంటి తలుపు ఉంటుంది. ఎవరైనా లోపలికి రావాలి అంతే ఆ చిన్న తలుపు దగ్గర నిలబడి అడిగి గేటు తెరిస్తే లోపలికి వచ్చేవారు. 
నాకు అప్పుడు ఆరేడేళ్ళు ఉంటాయి. నాన్న పెద్దకొడుకు అవటం చేత నేనూ అక్కా యెప్పుడూ ఊరెళ్ళినా జీతగాండ్లు, ఊరి వాళ్ళు అందరూ పెద్దయ్య పిల్లలోచిండ్రు అంటూ ఓ సారి ఇంటికొచ్చి పలకరించే వెళ్లే వాళ్ళు.


అయితే, ఓ సారి మేము వెళ్ళినప్పుడు మమల్ని ఆడించటానికి కుమార్ అనే కమ్మరొల్ల పిల్లగాడు(అంటే వడ్రంగి పని చేసే వారు) 

మమ్మల్ని ఆదించటానికి వచ్చేవాడు. 


వాడికి ఒక తొమ్మిది సంవత్సరాలు ఉంటాయేమో! 

వారు ఎర్రగా పిల్లి కళ్ళతో యెప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. నేను వాడు రావటానికి ఎదురు చూసేదాన్ని! 

వాడు మా ఇంటికి వచ్చి ఆ పెద్దగేటు మధ్యలో ఉండే చిన్న గేటు కిటికీ లో గుర్చో బెట్టి గేటును అటూ ఇటూ తిప్పుతూ బస్సు ఆట ఆడించేవాడు. వాడున్నంత సేపు సరదాగా నవ్వుతూనే ఉండేదాన్ని నేను. 


ఆ రోజు కూడా పొద్దున్నే ఒక పదిన్నర టైముకి కమ్మరి కుమార్ వచ్చాడు. నన్ను ఆ గేటు కిటికీలో కుర్చోబెడుతుండగా నా చిటికెన వేలు ఆ కిటికీ తలుపు సందులో ఉండగా వాడు చూసుకోకుండా మూసాడు. అంతే నా వేలు ఒక్కసారిగా బాగానే నలిగింది. దాంతో నేను ఊరూ దద్దరిల్లెలా కెవ్వుమన్నాను.


దాంతో ఇంట్లో నుండి ఇద్దరు బాబాయిలు బయటకి పర్గెత్తుకుని వచ్చారు. నేను వెలు పట్టుకుని ఏడవటం వాడిని చూపించటం జరిగాయి. అప్పటికే వాడు వణుకుతూ నిలబడి ఉన్నాడు. అంతే ఇద్దరు బాబాయిలు " గాడిది కొడకా!! అడ్పియ్యమంటే సస్కోవురా!! " అంటూ వాడిని చంపెంత పని చేసి ఈ సారి వస్తె సుడు కోడ్కా!! అన్నారు. 


అదే చివరి సారి వాడిని చూడటం మళ్ళీ ఆతర్వాత కనపడలే!! 


నాకు నొప్పి తగ్గిన తర్వాత భలే బాధేసింది. 


చాన్నాళ్ళ తర్వాత నేనూ అక్క మహబూబ్నగర్ లో బజారులో వెళుతుండగా వెనక నుంచి సంజమ్మా!! మధమ్మా!! అని ఎవరో పిలిచినట్టు అనిపించి తిరిగి చూస్తే వాడే కమ్మరి కుమార్ దూరం నుంచి మా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడిని చూసి నా మొఖం వెలిగిపోయింది.

దగ్గరకు వచ్చి "మంచిగున్నరా?" అని అడిగాడు. ఏదో పని మీద వాళ్ళ నాన్నతో పాటు వచ్చానని చెప్పాడు. ఎక్కువ సేపు ఆగకుండా పలకరించి వెళ్ళిపోయాడు. 

వాడు నేను చేసిన గొలకి నన్ను అసహ్యించుకుంటాడు అనుకున్నా కానీ వచ్చి పలరించాక హమ్మయ్యా! అనుకున్న. 


నన్ను ఎవరైనా అడిగితే వాడే నా ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ అని చెబుతా!!


Rate this content
Log in