ఉసురు
ఉసురు
ఇది ప్రచురించడానికి రాసింది కాదు కనుక సాహిత్యం మన్నూ మశానం చూడకండి.
ఉసురు
ఇది ఇప్పుడే రాయాలి! కొన్ని రోజులు తర్వాత ఈ ఉసురు మానిపోతది. లాస్ట్ 6 డేస్ నుంచి గుండెలో కత్తి దిగి అది అక్కడనే ఉంది అనిపిస్తుంది. దాన్ని బయటికి తీసిన లోపలికి గుచ్చినా రెండూ ఇంకా అంతే నొప్పిని ఇస్తాయేమో!
ఈ నాలుగు గోడల మధ్య ఎన్నిసార్లు నేను బ్రేక్ డౌన్ అయ్యానో నాకు ఈ గోడలకే తెలుసు. ప్రాణం పోతున్నట్టనిపిస్తుంది.
ఈ పూట ఈ అక్షరాలు రాస్తుంటే కూడా నా చేతులు వణుకుతున్నయి.
నా లైఫ్ లో ఇట్లాంటి రోజులు వస్తాయి చెప్పుకునే నాథుడు లేక అద్దంలో చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తా అని ఎపుడూ అనుకోలేదు.
ఈరోజు ఆదివారం, నిన్న- ఈరోజు నరకం ప్రత్యక్షంగా కనపడింది.
ఒకటే అనుకుంటున్నా ... ప్రాణం పోయినా నువ్వు నాకు అవసరం అని వాడి దగ్గరకు పోను. గుర్తొచ్చిన ప్రతి సారి... వాడు చీదరించుకున్న ఆడియోస్ విని విని విని .. నాకు నేను "వదిలేసుకో వీడు నీకు లేడు" అని చెప్పుకుని చెప్పుకుని ఒక్కొక్క గంట గడుపుతున్నా.
ఇంకొన్ని రోజులు ఓర్చుకుంటే బయట పడతానేమో. నొప్పి మెల్లిగ తగ్గుతూ వస్తది అని నమ్మకం.
ఒకటి గాదు రెండు గాదు పది సంవత్సరాలు ప్రతి సారి దేవుడు నాతో పరీక్ష తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది.
నా దగ్గరికి ప్రతి సారి వచ్చినట్టే వచ్చి మళ్ళీ అందనంత దూరం పోతుంది.
ఈ విషయంలో ప్రతి సారి నాకు కొత్త కొత్త వడగాల్పులు యెందుకు తగులుతున్నాయి?
నాకూ, నా డెడికేషన్ కు వాల్యూ లేకుండా నన్ను అర్థం చేసుకోక నన్ను ఓర్చుకోక యెందుకు నేను నమ్మిన మనిషి నాకు చుక్కలు చూపిస్తున్నాడో అసలు అర్థం కాలేదు.
నన్ను అనగూడని మాటలు అని మళ్ళీ మళ్ళీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీయాలని నా అనుకున్న మనిషి ఛీత్కారాలు నేను మళ్ళీ మళ్ళీ వినాలని యెందుకు రాసుందో మరి.
దెప్పిపొడవడం గేవ్ మీ ఇమ్మెన్స్ పెయిన్
నాకు బాధ కలిగింది అని చెప్పాలి తప్పకుండా చెప్పాలి!!
యెప్పుడో టైం వస్తది గదా చెప్తా.
మనుషులు వాళ్ళ అవసరాలను బట్టి మారుతుంటారేమో. కానీ వాడు మారడం నాకెందుకు తెలియాలి. మరి నాకెందుకు
మారటం రాలేదు.
ఒకప్పుడు నన్ను కాదని నేను అసలు వాడి జీవితం లో భాగమే కాదని వాడు వద్ధనుకుంటే వీపులో మల్టిపుల్ బ్లెడ్స్ పడ్డట్టు అయింది.
అదే ఇప్పుడు వాడి మాటలకి కత్తులు ఏకంగా గుండెలో దిగిన ఫీలింగ్ ఒస్తుంది
దిస్ ఫెస్ విల్ బి పాస్డ్.బట్ ఈ ఫేస్
దాటిన తర్వాత కూడా ఈ పెయిన్ నేను మర్చిపోవద్దు. ఈ గాయం ఎప్పటికీ నా మైండ్ లో ఉండాలి.
నేను చాలా సార్లు తెలియకుండనే ఫార్గివ్ చేసేస్త ఈ సారి మాత్రం ఇంత గాట్ త్రు ఐన తర్వాత నాకు ఇంత పైన్ ఇచ్చిన మనిషిని లైఫ్ లో ఎప్పటికీ ఫార్గీవ్ చేయొద్దు అని అనుకుంటున్నా.
సొంతవాళ్ళకంటే ఎక్కువ బాధ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు.
పెయిన్ కి రిటర్న్ పెయిన్ ఇవ్వడం నేను కాదు ఇన్నర్ హార్ట్ లో హాట్ ఉండాలి. ఉంటేనే మళ్ళీ అట్లాంటి డేస్ చూడకుండా ఉండే ఛాన్స్ ఉంది.
ఇది రాస్తుంటే పట్టలేనంత దుఃఖం వస్తుంది కానీ రాయాలి. మరకలు మాసిపోకుండ ఉంచుకుంటే మళ్ళీ మరకలు పడవేమో. అప్పుడప్పుడు చదువుకో నీకు బుద్దుంటది.
ఏదో ఒక రోజు నా గోడు తెలుసుకొని కనీసం సారీ ఐన చెప్తడా ??
*చేతులారా ఒక బ్యూటిఫుల్ రిలేషన్ పోగొట్టుకున్నామేమో. ఒకప్పుడు పరిస్థితులు కారణం అయితే ఇప్పుడు మేమే కారణం.*
కొంత మందికి అదృష్టం చేతికి అందించినా కాపాడుకోలేరు కదా!!! నా ఓర్చుకునే శక్తి వాడికి సిగ్గులేనితనంగా సైకోయిజం లాగా కనిపించింది.
నీతో కొన్ని మూమెంట్స్ కోరుకుంటున్నా నీ డే లొ కొన్ని మినిట్స్ కోరుకుంటున్నా అవి మాత్రమే అని చెప్పలేకపోయా నేను. చెప్పాలని ట్రై చేసినా వాడికి అర్థం కాలేదు.
బాధ - ఉసురు - కన్నీరు - సంతోషం - నవ్వు - ఓర్పు - ఓపిక - భరింపు ఇవన్నీ ఉంటేనే గదా అదొక బ్యూటిఫుల్ రిలేషన్ షిప్ అయ్యేది. వీటిల్లో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే అది వెస్ట్
వాట్ సో ఎవర్ అయింది అన్న మాటనే ఎంత హెవీ గా ఉందో..
తొందర తొందరగా రోజులు గడించి ఈ పుండు మానేదెప్పుడో ....
