Mano Madhanam
Mano Madhanam


*మనో మధనం*
*మీరా* ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ గేటుకి ఇటువైపు నిలబడి ఉంది. చుట్టూ ఎవరెవరో ఒక ఇరవై మంది దాకా ఉన్నారు కాని చాలా మంది మీరాకి తెలియదు, తనకి అవసరం కూడా లేదనుకుంటోంది. మీరా గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది.
ఒక అయిదడుగుల దూరంలో నిలబడి ఉన్న *మను* ని 🧍🏻♂️కన్నార్పకుండా చూస్తూ ఉంది. మనుకి వచ్చినవారు *All the best/ విదేశాలకి వెళుతున్నావు బాగా చదువుకో/ Australia వెళ్ళి మమ్మల్ని మర్చిపోవుగా* అంటూ తలా ఒక స్వీటు ముక్క మను నోట్లో కుక్కతూ ఉన్నారు.
*మను* అంటే మీరాకి ప్రాణం. మనుకి మీరా అంటే ఎంతో ప్రేమ ఆప్యాయత. విదేశాలకి చదువులకి వెళుతున్నాడు మను. మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు అసలు తనకోసం వస్తాడో రాడో కూడా తెలియదు. మీరా మదిలో అన్నీ ప్రశ్నలే!!
అంతమందిలో ఒక్కసారైనా తన వంక చూస్తాడా అన్న ఆశతో మను వంకే చూస్తుంది మీరా. కళ్ళు మళ్ళీ మళ్ళీ నీళ్ళతో నిండి మసకబారుతున్నాయి. తుడుచుకుంటూ అటువైపే చూస్తుంది. చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకుని ఉంది. పక్కనే తన స్నేహితురాలు బ్యూల నిలబడి ఉంది.
ఒక పదినిముషాలు అయ్యాక మను నడుచుకుంటూ మీరా దగ్గరకు వచ్చాడు.
మీరా ఏమి మాట్లాడలేదు, చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ త్వరత్వరగా విప్పి అందులో వాచ్ ⌚తీసి వణుకుతున్న చేతులతో మను చేతికి తొడిగింది. నోటి నిండా స్వీట్లు ఉండటం చేత మాట్లాడలేక పోతూ మీరా కళ్ళలోకి చూస్తూ ఆ స్వీట్లని చేతిలోకి తీసుకోబోయాడు ఇంతలో మీరా తన చేతిని నోటికందించి స్వీటునంతా తన చేతిలోకి తీసుకుంది.
*నువ్వు జాగ్రత్త!! వెళ్ళనా మరి* అన్నాడు, అప్పటికే కళ్ళనిండా ఉన్న నీరు టపటపా ధారగా మారి రాలాయి. సరె అన్నట్లుగా తలూపింది. గుండె మాత్రం మోయలేనంత బరువెక్కుతోంది. ఏదో చెప్పాలి!! ఎంతో చెప్పాలి!! చెప్పలేకపోతుంది. దుఖం గొంతుకి అడ్డం పడుతోంది. మను కళ్ళలోకి చూస్తుంది, ఫ్లైటుకి టైం అవుతోంది.
మీరాకి ఎందుకో అవే తను మనుతో గడిపే అమూల్య ఆఖరు నిమిషాలు ఇంకెప్పుడూ మనుతో అలా ఉండనేమో అనిపిస్తుంది.
ఏదో చెప్పలేని బాధ తనని లోపలినుండే కాల్చేస్తుంది.
మను వాళ్ళందరికీ మీరా తెలుసు. మను వాళ్ళది వరంగల్. మీరా వరంగల్లో హాస్టల్లో ఉండి మాస్టర్స్ చదువుతోంది. మను అప్పటికే ఫైనలియర్ లో ఉన్నాడు. ఒకె కలేజి అవటం చేత ఇష్టపడ్డారు.
కొన్నాళ్ళ ముందే మను తన ఇంట్లో అన్నా వదిన, అమ్మ కుటుంబ సభ్యులు అందరికీ మీరాని తను ఇష్టపడుతున్నాట్టుగా చెప్పాడు.
మీరాని తీసుకెళ్ళి పరిచయం చేసాడు.మనుకి తన ఇష్టాన్ని ఇంట్లో వారు కాదనరని బాగా తెలుసు. అందులోను మీరాని చూసి వాళ్ళు ఎంతో మెచ్చారు.
మనుకి ఎయిర్పోర్ట్లో మీరాని వదిలి పోతున్నందుకు తప్ప ఇంకే బాధాలేదు. కాబట్టే మీరా అంతర్మమధనం అతనికి అర్థం కాలేదు.
ఫ్లైటు అనౌన్సమెంట్ అయింది.
ఇంతలో మీరా తల్లి దండ్రులు ఇద్దరు మీరా ఫ్రెండ్ మను ఫారెన్ వెళ్తున్నాడు కాబట్టి మీరా ఎయిర్పోర్ట్లో ఉందని తెలిసి దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉండటం చేత ఎయిర్పోర్ట్కి మీరాని కలవటం కోసం వచ్టారు. మీరా హాస్టల్లో ఉండటంచేత తల్లితండ్రులకి దూరంగా ఉంటోంది. అందుకే తనని కలవటానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు.
మను వాళ్ళని చూసి వాళ్ళదగ్గరకు వచ్చాడు. మను ఎలాగూ వాళ్ళకి మీరా ఫ్రెండ్గా తెలుసు కాబట్టి పలకరించారు.
పలకరించిగానే మను *ఆంటీ నేను మీరాని ఇష్టపడుతున్నాను వచ్చాక పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను* అన్నాడు. వాళ్ళు అచేతనంగా ఉండిపోయారు.
ఇంతలో ఫ్లైటు టైమ్ అవటంతో హుటాహుటిన వెనక్కి తిరిగి మీరాను చూస్తూ మను లోపలికి వెళ్ళి పోయాడు.
విమానం అలా ఎగిరిపోయింది, మీరా ఆశలు కూడా అలాగే గాలిలో కలిసిపోయాయి......... ఏడు సముద్రాలు ఎప్పటికీ మను మీరాలని దూరంగానే ఉంచాయి.....
***THE END****
సంజు