STORYMIRROR

Sanjaatha Chintakunta

Tragedy

5  

Sanjaatha Chintakunta

Tragedy

అబల

అబల

1 min
282

ఈ రోజు ఒక విచిత్రమైన సమస్య నా దగ్గరకొచ్చింది. నా కంటే చిన్నది అయినా నాకు చాలా కాలంగా స్నేహితురాలు. విని చాలా బాధనిపించింది. 

తను ఉద్యోగం చేయటం లేదని భర్త చాలా చులకనగా చూస్తున్నాడు అన్నది. ఒక సంగతి చెప్పి తను ప్రస్తుతానికి  అక్కడ ఉండలేక తల్లి దగ్గరకు వచ్చేసాను అన్నది. 


ఇంట్లో చెట్టుకి పెరిగిన గోరింటాకు నూరుకొని తలకు పెట్టుకంటే భర్త చిరాకు పడుతూ దీనికి మాత్రం బాగా టైముంది why don’t you go out and look for some job you are eating my shit everyday such a parasite are you అన్నాడంట.

ఇంతకు మునుపు కూడా రెండు మూడు సార్లు ఇలా అంటే అత్తగారికి చెప్పగా ఆమె *అందులో తప్పేముందిలేమ్మా మీ మామగారు కూడా నన్ననేవారు ఊరికే ఉండే బదులు వెళ్ళి చింతపండు కొట్టొచ్చు కదా అని సమర్థించిందట. 

 తన కొడుకు అన్నదానికీ తన భర్త అన్నదానికీ ఆమెకి తేడా అనిపించలేదట. 


గతంలో రెండుమూడు సార్లు అన్నా ఈ సారి ఆ మాట అంటూ తింటున్న ఇడ్లీ ఆ అమ్మాయి మీదకి రెండు సార్లు విసిరాడట. అంతే అక్కడ నుంచి ఆ క్షణానికి బయలుదేరి బస్సెక్కి తల్లి దగ్గరకు వచ్చేసింది అమ్మాయి. 

నాకంట నీళ్ళు తిరిగాయి ఏం చెప్పాలో పాలుపోలేదు.

గట్టి సమాధానం నా మనసులో ఉన్నా తొందరపడి చెప్పలేదు.

ఏ రిలేషన్ అయినా మొదట ఉండాల్సింది గౌరవం. ఆ తర్వాతనే ఏ సమస్య అయినా. నేనైతే షీట్ తింటున్నావు అనే మాటకి వాడి గొంతు నులిమేదాన్ని. ఆ సమాధానం చెప్పిన అత్తగారిని “ అయితే మామగారు బతుకున్నన్నాళ్ళు ఆయన షీట్ ఎ తిన్నారా ? “ అని అడిగేదాన్ని .

*మీరైతే ఏం చెప్తారు?? *


Rate this content
Log in

Similar telugu story from Tragedy