యశస్వి రచన

Fantasy

3.7  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్-8

టైం మెషిన్-8

12 mins
361


Date@22/07/2139

Time@Around 10:00

Place@ ఢిల్లీ


"కొన్ని గంటల ప్రయాణం తర్వాత సమీర్ లియో కెవిన్ హుస్సేన్ ఇంకా మిగతా వాళ్లు అందరూ ఢిల్లీ చేరుకున్నారు.కింగ్ అంటార్కిటికా( భవిష్యత్ లో వున్న పెర్క్ ) కి వెళ్ళిపోయాడు.కానీ వీళ్ళ తో వున్న కాంటాక్ట్ అలానే ఉంది"


"ఢిల్లీ నుండి దక్షిణ నోయిడా కి ఒక చొపర్ లో స్టార్ట్ అయ్యారు.భవిషత్తు నుండి వచ్చిన బాలు కి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలు మెల్లగా అర్ధం అవుతుంది.తన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరినీ నమ్మాలో ఎవరినీ నమ్మకూడదు అనే విషయం తనకు అర్థం కావటం లేదు.కానీ వున్న వాళ్ళలో బాలు కి కొంచెం డాక్టర్ లియోని మాత్రమే నమ్మాలి అనిపిస్తోంది"


"బాలు ఆలోచనల మద్య వాళ్ళ డెస్టినేషన్ కి రీచ్ అయ్యారు.ఆ ఏరియా మొత్తం అంతా హై సెక్యూరిటీ మద్య కట్టు దిట్టం గా వుంది.కింగ్ దగ్గర లియో తీసుకున్న లెవెల్ ఆల్ఫా యాక్సిస్ తీసుకుని వాళ్ళు మెయిన్ గేట్ నుండి లోపలకి వెళ్ళారు"


"టైమ్ మెషిన్ వున్న బ్లాక్ లోకి అందరూ ఎంటర్ అయ్యారు.వాళ్ళని చూస్తున్న అక్కడ స్టాఫ్ చాలా అయోమయం లో వున్నారు.లియో అక్కడ వున్న స్టాఫ్ కి అందరినీ పరిచయం చేసి అసలు విషయం ఎక్స్ప్లెయిన్ చేశాడు.వాళ్ళు సరాసరి అక్కడ నుండి టీమ్ మెషిన్ వున్న ల్యాబ్ కి వెళ్ళారు.దాని పక్కనే ఒక ఫ్యుషన్ రిసర్వయర్ వుంది.దానిలో ఉన్న అన్ స్టేబుల్ గ్యాసెస్ రిసర్వయార్ లోపల ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాయి.అదే ఎనర్జీ నీ వాళ్ళు టైమ్ మెషిన్ కి వాడతారు అని సమీర్ చెప్పాడు"


(వాళ్ళ మద్య సంభాషణ)


(&&&&&&&&భవిషత్తు బాలు ను బాలు అని వర్తమానం లో వున్న బాలు నీ హుస్సేన్ గా రాస్తున్న అండి...దయచేసి అందరూ గమనించ గలరు₹₹₹₹₹₹₹₹)


హుస్సేన్:- చూడు మిస్టర్ లియో నాకు ఒక అనుమానం బాలు భవిషత్తు నుండి ఇప్పుడు మనం వున్న టైమ్ కి ఎందుకు వచ్చాడు.ఒకవేళ వేరే ఏదైనా టైమ్ కి వెళ్ళటానికి ట్రై చేసి సిస్టమ్ ఎర్రర్ వల్ల మన కాలానికి వచ్చి ఇరుకున్ని పోయాడా? లేకపోతే ఏదైనా భవిష్యత్తు లో సమస్య వచ్చి దాని గతం లో సరి చేయటానికి వచ్ఛాడా ? మరి నిజం గా సమస్య ఐతే మనం దాని నీ ఎలా గుర్తించాలి? బాలు కి ఇంకా గతం గుర్తులేదు.....


లియో:- చూడు హుస్సేన్.... ఇప్పుడు మనకి వున్న టెక్నాలజీ తో ఆ విషయం కనిపెట్టడం చాలా కష్టం...సో మన ముందు వున్న అప్షన్స్ రాబోయే కాలం ఐ మీన్ బాలు వచ్చిన భవిష్యత్ లో ఈ టైమ్ మెషిన్ నీ ఉపయోగించారు.అంటే అంతటి ముందు వరకు ఉపయోగించలేదు.దీనికి అర్దం మీరు అటెంప్ట్ చెయ్యాలి అనుకున్న ట్రైల్ లో మీరు ఫెయిల్ అయ్యి వుండచ్చు.సో మనం ముందుగా మీరు ఎక్జిక్యూట్ చెయ్యాలి అనుకున్న ప్లాన్ వివరాలు మాకు ఇస్తే మేము దాని నీ అనలైస్ చేసి ఒక వేళ దానిలో ఏదైనా లూప్ వుంటే మేము దానిని సరి చేస్తాము.


సమీర్:- మిస్టర్ లియో మీరు నన్ను కలసినప్పుడు పెంటగాన్ నుండి బయటకు పంపినప్పుడు నా మెమరీ ను ఎరేస్ చేసి బయటకు పంపాను అన్నారు.కాని అక్కడ నుండి ఇండియా వచ్చినప్పుడు మిస్టర్ బెన్ నన్ను ఇండియాలో ప్రైమరీ స్టేజ్ లో వున్న టైమ్ మెషిన్ ప్రాజెక్ట్ కి రమ్మని పిలిచాడు.ఆ సమయంలో నేను ఎన్నో విధాలుగా ఆలోచించి నేను ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పి ఢిల్లీ కి వెళ్ళే వాడిని.బెన్ ఎప్పుడూ నాకు అసలు ఈ టైమ్ మెషిన్ ఎందుకు కనిపడుతున్నారు అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేవాడు కాదు.చాలా రోజులు నేను ఈ ప్రాజెక్ట్ మీద పని చేయటం వల్ల బాగా వత్తిడి కి గురి అయ్యాను. ఆ సమయంలో నాకు పెంటగాన్ కి సంభందించిన కొన్ని సంఘటనలు గుర్తు వచ్చాయి.ఆ జ్ఞాపకాలు లో బాగం గా ఫ్యూజన్ ఎనర్జీ నాకు గుర్తు వచ్చింది.కాని ఫ్యూజన్ ఎనర్జీ స్టెబుల్ కాదు అని నాకు తెలుసు అందుకే నా ఫ్రెండ్ ధరన్ ను నేను అంటార్కిటికా కి పంపి అక్కడ వున్న ఫ్యూజన్ ఫ్లూయిడ్స్ గురించి తెలుసుకుని రమ్మని చెప్పాను.ఒకవేళ మేము ఫ్యూజన్ ఎనర్జీ నీ టైమ్ మెషిన్ కి ఉపయోగించి ఉంటామా?... లియో


లియో:- అది కూడా అయ్యి వుండచ్చు. కాని ఫ్యూజన్ ఎనర్జీ వాడటం చాలా ప్రమాదం...ఏదైనా ఫ్యూజన్ రియాక్టర్ లో లీక్ అయిన లేకపోతే మనం అనుకున్న ఎనర్జీ లెవెల్స్ రాకపోయినా మనం చాలా రిస్క్ లో పడతాము.ఒకవేళ మీరు ఈ ప్లాన్ యుస్ చేస్తే తప్పకుండా టైమ్ లూప్ లొ టెస్టింగ్ ఆబ్జెక్ట్ ఆర్ లైవ్ ఫాం ఇర్రుకునే ప్రమాదం వుంది.కాని మన వాళ్ళు ఎవరూ కూడా టైమ్ లూప్ లో ఇరుక్కోలేదు కదా? సో మనం ఆ ఫ్యూజన్ ఎనర్జీ నీ వాడుకోవచ్చు....


(సమీర్ టైమ్ లూప్ లొ ఇరుకున్న విషయం వీళ్ళకి తెలియదు ఎందుకంటే.... వాళ్ళు ఫ్యూజన్ ఎనర్జీ తో టైమ్ మెషిన్ యూస్ చేస్తేనే సమీర్ టైమ్ లూప్ లోకి వెళ్ళిపోతాడు)


జోనాథన్:- మరి మీరు ఆ ఫ్యూజన్ ఎనర్జీ నీ రెఢీ చెయ్యండి....దానికి మీకు ఎంత సమయం పడుతుంది. ..


లియో:- దీనిని సొంతం గా రెఢీ చెయ్యాలి అంటే చాలా సమయం పడుతుంది. .కాని మనం పెంటగాన్ లో ఆల్రెడీ దీని మీద వర్క్ చేసి ప్లాన్ రెడీ చేసాము.మనకు కావల్సింది ఆ ప్లాన్..అది నేను పెంటగాన్ నుండి తేపిస్తను... అంత టి లోకి ఇక్కడ మీరు చేయవల్సిన పనులు ఏమైనా వుంటే రెఢీ చెయ్యండి..నేను కొంచెం సమయం బయటకు వెళ్లి వస్తాను....


Date@22/07/2143

Time@Around 10:39

Place@ పేర్క్


సమీర్:- చూడండి.. కింగ్ నేను మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్న మూడవ ప్రపంచ యుద్ధం రావటానికి కారణం మరెవరో కాదు అది.......సమీర్ యే అంటే నేనే.....


కింగ్:- ఎంటి సమీర్ ఇది జోక్స్ వేస్ సమయం కాదు..


దరణ్:-మిస్టర్ కింగ్ మీరు నమ్మినా నమ్మక పోయినా అది నిజం..మూడవ ప్రపంచ యుద్ధం రావటానికి కారణం మరెవరో కాదు అది సమీర్ యే.. 


కింగ్:- (తన పాకెట్ లో వున్న గన్ చెక్ చేసుకుంటూ) మరి ఎందుకు ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఆపటానికి భవిష్యత్తు లో నువ్వు ట్రై చేస్తున్నావు...అసలు నువ్వు ఎలా మూడవ ప్రపంచ యుద్ధం కి కారణం అయ్యావు....

సమీర్- చూడండి మిస్టర్ కింగ్..... సమీర్ సిరియా దేశానికి చెందిన ఒక ముస్లిమ్... సిరియా మీద సోవియట్ యూనియన్ అలాగే యూనైటెడ్ ఫ్రంట్ దేశాలు బాంబుల వర్షం కురిపిస్తె అందరూ వింత గా చూశారు తప్ప....ఒక్కరూ కూడా మా దేశం వైపు చూడలేదు...ఎంతో మంది చిన్నారులు తమ కుటుంబాలు ను కోల్పోయారు.ఎటు చూసినా శవాలు..బాంబుల వర్షం.. కూలిన ఇళ్ళు...రక్తం ఇవన్నీ చూస్తూ కూడా ఐక్య రాజ్య సమితి కూడా ఏమి చేయలేకపోయింది....


"ఒక అగ్ర రాజ్యం...ఛీ పేరుకే అగ్ర రాజ్యం మా దేశం నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ దేశం సహాయం కోరితే కనీసం కన్ను పై కి ఎత్తి కూడా చూడలేదు....ప్రాణాలు మీద ఆశతో సముద్రాల మీద ప్రయాణం చేసిన వాళ్ళు ఆ సముద్రాల లో నే మునిగిపోయారు.. ఎనో చిన్నారు ల శవాలు సముద్ర తీరం కి కొట్టుకుని వస్తె అయ్యో అన్నారే తప్ప సహాయం చేసే నాథుడే కరువు అయ్యాడు...ఎం చెయ్యాలో తెలియని దిక్కు తోచని పరిస్థతిలో నన్ను ఇండియాకి చెందిన ఒక డాక్టర్ కాపాడి నన్ను తన తోపాటు ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇక్కడికి తీసుకు వచ్చాడు


అతనే హుస్సేన్ అదే బాలు వాళ్ళ నాన్న..ఆయన నాకు ప్రేమ ను పంచారు కాని నా ముందు కుప్పకూలి పోయిన నా దేశం నా కుటుంబ తాలూక జ్ఞాపకాలు ను మర్చిపోయారు..ఆ జ్ఞాపకాలు నా వయసు తో పాటు పెరిగాయి... అది ఎలా అయింది అంటే చివరకు...ఒకరి గురించి మరొకరు పట్టించుకోని ఈ ప్రపంచం లో ఈ మనుషులు అందరినీ ఒకేసారి చంపాలి అనుకున్న...అందుకే చదివాను కసి తీరా చదివాను...ఇండియన్ ఆర్మీ లో చేరి ఏదో విధంగా గా నిప్పు రాజెయ్యలి అనుకున్న కానీ నా తండ్రి నన్ను ఒక సైంటిస్ట్ గా చూడాలి అనుకున్నాడు..


"సిరియాలో చనిపోయిన నా తండ్రి కోరిక ఎంటో నాకు తెలియదు కానీ నన్ను ప్రేమ గా పెంచిన నా తండ్రి కోరిక తీర్చాలి అని నేను ఒక సైంటిస్ట్ అయ్యాను...అప్పుడే నాకు పెంటగాన్ లో అఫర్ వచ్చింది...అదే ఫ్యూజన్ ఎనర్జీ....నేను పెంటగాన్ లో చేరిన తర్వాత ఆ ఫ్యూజన్ ఎనర్జీ మీద పూర్తిగా అవగాహన వచ్చి దానిని శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించాలి అనుకున్నాను...


"కానీ పెంటగాన్ లో ఉన్న వాళ్లకి నేను చేస్తున్న చర్యల మీద అనుమానం వచ్చి నన్ను అలాగే నా కుటుంబానికి సంబంధించిన విషయాలను ఆరా తీయడం మొదలు వాళ్ల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో నేను ఒక సిరియన్ దేశానికి చెందిన వాడిని అని తెలిసి, నా మీద అనుమానం వచ్చి... పెంటగాన్ లో నేను చేస్తున్న ప్రతి పనిని వాళ్ళు చాలా భద్రతగా గమనించేవాడు. పెంటగాన్ లో చేరిన కొన్ని రోజుల తరువాత నేను ను ఆ ఫ్యూజన్ ఎనర్జీకి సంబంధించిన ఒక మాస్టర్ ర్ డిజైన్ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్లు నన్ను పట్టుకున్నారు... అప్పుడు అక్కడి నుండి వాళ్ళు నన్ను ఇంటర్ పోల్ కి అప్పగించారు.


"కానీ అదే సమయంలో లో భారత దేశానికి అమెరికా కి మధ్య జరిగిన నా రహస్య ఒప్పందం అమలులోకి వచ్చింది అదే టైం మిషన్... అ టైం మిషన్ రూపొందించడానికి కి ఇండియా కి నా మేధస్సుతో పని పడింది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ బెన్ అనే ఒక అంబాసిడర్ సహాయంతో నన్ను కొన్ని ని రెస్ట్రక్షన్స్ తో ఇండియా కి తీసుకుని వచ్చారు.అలాగే pentagon నుండి నేను బయటకు వస్తున్నప్పుడు వాళ్లు ఆ ఫ్యూజన్ ఎనర్జీకి సంబంధించిన అన్ని విషయాలను నా మెదడులో నుండి తొలగించడానికి ప్రయత్నించారు.


"నేను ఇండియాలో ఉన్న టైం మిషన్ ప్రాజెక్టు లో పనిచేస్తున్నప్పుడు, ఆ ప్రాజెక్టులో భాగమైన అమెరికాకు నా మీద అనుమానం వచ్చి నన్ను మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు పంపాలి అని చూశారు . కానీ కుదరలేదు. ఎందుకంటే అప్పటికే నేను ను టైం మిషన్ కు సంబంధించిన prototype డిజైన్స్ ను రెడీ చేసి ఇ ఇండియన్ గవర్నమెంట్ కి అందజేశాను. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ నన్ను ప్రాజెక్ట్ నుండి తీసివేయడానికి అంగీకరించలేదు. అలా నేను ఆ టైం మిషన్ ప్రాజెక్టులో లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పైకి ఎదిగాను.



"ఇండియన్ గవర్నమెంట్ అనుకున్న సమయానికి కంటే ముందుగా టైం మిషన్ ను రెడీ చేసింది. కానీ నీ దానికి కావలసిన ఎనర్జీని అమెరికా గవర్నమెంట్ సిద్ధం చేయలేక పోయింది. కానీ నీ ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ కి తెలియకుండా ట్రై మిషన్ ని రన్ చేయాలని ట్రై చేసింది. దానికి కావలసిన ఎనర్జీ సోర్సెస్ ని నన్ను రెడీ చేయమని చెప్పింది. అప్పుడే నేను వాళ్లకి ఆ ఫ్యూజన్ ఎనర్జీ గురించి కొన్ని నిమిషాల తో పాటు కొన్ని అబద్దాలు కల్పించి చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ని ఫ్యూజన్ ఎనర్జీ ఉపయోగించే లాగా చేశాను...


" ఫ్యూజన్ ఎనర్జీని రెడీ చేస్తున్న టైం లో లో నేను ను ఈ దేశానికి ఇతర దేశాలు చేసిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకనే యూఎస్ గవర్నమెంట్ కి నేను ఢిల్లీలో జరుగుతున్న టైం మిషన్ ట్రయల్ గురించి ఒక ఒక ట్రాన్స్మిటర్ నుంచి ఒక encrypted మెసేజ్ పంపాను. దానిని డీకోడ్ చేసిన అమెరికన్ గవర్నమెంట్ కి ఇండియన్ గవర్నమెంట్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది.... సో అమెరికన్ గవర్నమెంట్ దీనికి బదులు తీర్చుకోవాలి అనుకుంది. నేను పెంటగాన్ నుండి తీసుకువచ్చిన ఒక శాటిలైట్ కోఆర్డినేటర్స్ ఉపయోగించి ఇండియాకి నార్త్ సైడ్ లో ఉన్న డెక్కన్ ప్లేట్ మీద కొన్ని missiles ను లాంచ్ చేశాను... ఇది ప్రతీకార చర్యగా భావించిన భారతదేశం ఐక్యరాజ్యసమితికి అలాగే తన మిత్రదేశాలకు సమాచారం అందించింది. ఆ టైంలో లో లో ఫైర్ అయిన మిస్సైల్స్ యు ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు అని చెప్పిన ఎవ్వరూ నమ్మలేదు.. ఇదే అదునుగా భావించి అమెరికన్ గవర్నమెంట్ కి బద్ధశత్రువైన కొరియన్ గవర్నమెంట్ ఇండియ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది...



"మిస్సైల్ ను లాంచ్ చేసిన నా లోకేషన్ నీ నీ అమెరికన్ గవర్నమెంట్ కని పెట్టింది. అది ఢిల్లీలో ఉన్న దక్షిణ నోయిడా నుండి అని తెలిసింది. ఇదే విషయం బయట ప్రపంచానికి తెలియజేసింది. ఇండియన్ గవర్నమెంట్ ఏ కావాలి అని ఇలా చేసింది అని ప్రపంచం మొత్తం నమ్మింది. ఒక్కసారిగా ఇండియన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరిగింది... సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను ఫ్యూజన్ ఎనర్జీని రెడీ చేసి టైం మిషన్ ట్రైల్ రన్ కి సిద్ధం అయ్యాము. నేను టైమ్ లుప్ లోకి ఎంటర్ అయ్యే సమయంలో నేను ముందుగా సెట్ లొకేషన్స్ లో కి కి మళ్లీ అదే శాటిలైట్ నుంచి అమెరికన్ గవర్నమెంట్ కి బద్ధ శత్రువులైన కొన్ని దేశాల మీద దాడి చేశాను. దానిలో భాగంగా ఒక మిస్సైల్ దక్షిణ నోయిడాలో పడింది. దాని వల్ల వచ్చిన వైబ్రేషన్స్ వల్ల ఫ్యూజన్ రియాక్టర్స్ పగుళ్లు వచ్చి ఎనర్జీ లెవెల్ తగ్గిపోయాయి. అందువల్ల నేను ఆ టైమ్ లుప్లో ఇరుక్కుని పోయాను. టైం మిషన్ ని అలాగే ఫ్యూజన్ ఎనర్జీ ని కనిపెట్టిన నేను నన్ను పెంచిన తండ్రి కోరిక తీర్చడం అనే ఆనందం తీరింది. నా దేశానికి చేసిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాను లేదో తెలుసుకో లేకుండానే ఇక్కడ చిక్కుకుని పోయాను. అప్పుడే టైం ట్రావెలింగ్ లో లో నేను సుమారు ఒక వంద సంవత్సరాలు ఉండిపోయాను.... ఆ తరువాత నేను టైం లూప్ నుండి తప్పించుకుని ఇప్పుడు మీరు టైం కి వచ్చాను....



కింగ్:- మరి ఇప్పుడెందుకు నువ్వు ప్రపంచాన్ని కాపాడాలి అని చూస్తున్నావు సమీర్...లేకపోతే ఇది కూడా నీ ప్లాన్ లో ఒక భాగమేనా.....


సమీర్:- (తన కంటి నుండి కనీరు కారుతూ ఉంది)...చూడండి కింగ్.. సిరియా లో వున్న ఒంటరితనం నన్ను భయ పెట్టింది.కానీ టైమ్ లూప్ లో వున్న ఒంటరితనం నన్ను భాధ పెట్టింది.అప్పుడే అర్దం అయింది.భయం కంటే బాధ చాలా కష్టం అని. సిరియా తాలుక భయం నాలో లేదూ కానీ ఇండియా లో వున్న నా ఫ్యామిలీ...హుస్సేన్ అమ్మా నాన్న..నా ఫ్రెండ్స్ అందరును మరొక సారి కోల్పోయాను అనే బాధ నన్ను వంద సంవత్సరాలు వెంటాడాయి.ఆ వంద సంవత్సరాలు నా కంటి నుండి వచ్చిన కన్నీరు మొత్తం ఒక సముద్రం తో సమానం.అంతలా ఆ ఒంటరితనం నన్ను బాధ పెట్టింది.నేను లాంచ్ చేసిన మిస్సెల్స్ ఫైర్ అవకూడదు అని కోరుకున్నాను.కానీ బయటకు వచ్చి చూస్తే నేను చేసిన తప్పు ఎంటో నాకు అర్దం అయింది.గతం లో చేసిన తప్పును భవిష్యత్తూ లో సరిదిద్దుకోవాలి అని అనుకున్నాను.కానీ ఇప్పటి వరకు నేను సుమారు వంద సార్లు ట్రై చేశాను.కానీ కుదర్లేదు....


కింగ్:- వంద సార్ల ....నువ్వు ఇప్పుడే కదా వచ్చింది.....


ధరన్:- కింగ్ ....టైమ్ లూప్ లో వున్న సమీర్ ఒకే టైమ్ కి ముందుకు వెనుకకి మాత్రమే వెళ్ళగలరు.ఆ టైమ్ తప్ప మిగతా టైమ్ లోకి వెళ్లలేడు... సో సమీర్ తాను చేసిన ప్రయత్నం లో ఫెయిల్ అయిన ప్రతీ సారి ఆ టైమ్ లూప్ లో వంద సంవత్సరాలు గడిపి మళ్లీ మీరు వుండే కాలానికి వచ్చి తన ప్రయత్నం స్టార్ట్ చేశాడు...కానీ...ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఇప్పటికీ సమీర్ ని మీరు కూడా వంద సార్లు అడిగి వుంటారు.నేను కూడా వంద సార్లు జవాబు చెప్పి వుంటాను... 


కింగ్:- నాకేమీ అర్ధం కావటం లేదు.. ..సమీర్...ఈ షెల్ మహా ఐతే కొన్ని రోజులు....నీటి లో కరిగి వున్న ఆక్సిజన్ మహా ఐతే కొన్ని గంటలు మాత్రమే వుంటాయి...నిన్ను నమ్మాలా వద్దా అనే ఆలోచన నాకు రావటం లేదు.ఎందుకంటే నువ్వే నా చివరి హోప్.... 


సమీర్:- దరన్ నువ్వు త్వరగా మెషిన్ ను రెఢీ చెయ్.....నేను గతం లోకి వెళ్ళాలి.....


కింగ్:- నీకు ఏమైనా పిచ్చి పట్టిందా సమీర్..మనం ఇప్పుడు వున్న పరిస్థితి లో ఆ టైమ్ మెషిన్ ను రెండోసారి ఉపయోగిస్తే కొన్ని గంటలలో పోవాల్సిన ప్రాణాలు ముందే పోతాయి... 


సమీర్:- చూడు కింగ్ సర్ఫేస్ వారియర్స్ ఇప్పుడు మన దగ్గరే వున్నారు.... వాళ్ళ వల్ల ప్రమాదం లేదు..వాళ్ళ దగ్గర వున్న ఆక్సిజన్ అండ్ ఫిల్టర్ ల సహాయం తో మన వాళ్ళు క్షేమంగా వుంటారు......అలాగే నేను ఇప్పుడు షెల్ నుండి ఎనర్జీ ను తీసుకోను..... అంప్లిఫైర్ లో వున ఎనర్జీ నీ వాడతాను.. 


కింగ్:- చూడు సమీర్ నువ్వు టైమ్ లూప్ లోకి వెళ్ళాలి అనుకుంటే ముందుగానే వెళ్లచు కదా.... మరి ముందు హుస్సేన్ నీ ఎందుకు పంపావు...


సమీర్:- కింగ్ టైమ్ ట్రావెలింగ్ మీరు అనుకున్నంత ఈజీ కాదు....మనం అనుకున్న లొకేషన్ కి అనుకున టైమ్ కి ఒక కరెక్ట్ సీక్వెన్స్ కనిపెట్టి అప్పుడు మనం ఒక నిర్ణయం కి రావాలి.నేను ఇప్పటి వరకు వంద సీక్వెన్స్ లు ట్రై చేశాను....వాటికి సంబంధించి డేటా అంతా ఈ పెన్ డ్రైవ్ లో వుంది... ఇప్పటి వరకూ టైమ్ లూప్ లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ టైమ్ లూప్ లోనే చిక్కుకున్నారు.. వాళ అందరును నేను నా కళ్ళారా చూసాను.కానీ ఒక బాలు తప్ప....అతడు గతం మర్చిపోయాడు...


కింగ్:- నీకు ఆ విషయం ఎలా తెలుసు.... 


సమీర్:-బాలు నీ గతం కి పంపే ముందు..నేను అతడి బ్రెయిన్ లో సమీర్ నీ చంపాలి అనే ఒక ప్రైమరీ మెషిన్ సెట్ చేసి పెట్టాను...ఒకవేళ అతను గతం లో సమీర్ నీ చంపి వుంటే భవిషత్తు లో నేను కూడా కనుమరుగు అవుతాను.. సో అది జరగలేదు... 


కింగ్:- బాలు కంటే బలమైన వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ మన దగ్గర వున్న....నువ్వు బాలు నే ఎందుకు పాంపావు....

సమీర్:-బలం కంటే తెలివి చాలా ప్రమాదం.....బాలు నా తమ్ముడు అతడినీ పంపిస్తే తను ఈజీ గా నోయిడా లోకి ప్రవేశించగలడు....అలాగే ఎవరికి తన మీద అనుమానం రాదు...అందుకే నేను ప్రతీ సారి బాలు నీ టైమ్ లూప్ లోకి పంపాను...కింగ్


కింగ్:- ఒకే ఇపుడు మనం ఎం చేయాలి.


ధరన్:- గతం లో వున్న ఎవరికి సమీర్ మీద అనుమానం రాదు.....సో నిజం తెలిసి మనం అక్కడికి వెళ్లి సమీర్ నీ ఆపి ఫ్యూచర్ లో జరిగే విపత్తు గురించి చెప్పి...తన మనసు మార్చాలి లేదా తనని చంపాలి....అప్పుడు సమీర్ శాశ్వతం గా టైమ్ లూప్ నుండి అలాగే ఈ భూమి నుండి కూడా....మనకి వేరే ఆప్షన్ లేదు...సమీర్ ఒక్కడి కే టైమ్ లూప్ లో ఎలా సేఫ్ గా ట్రావెల్ చెయ్యాలి అనే విషయం తెలుసు..అందుకే ఇన్ని ఇంత కష్టపడి ఆ సీక్వెన్స్ కనిపెట్టి తానే వెళ్ళాలి అనుకున్నాడు.. 


Date@25/07/2139

Time@Around 23:53

Place@ ఢిల్లీ


"ఫ్యూజన్ ఎనర్జీ నీ రెఢీ చేశారు.....అందరూ కష్టపడి.. వాళ్ల దగ్గర లియో ఎవరికి తెలియకుండా తీసుకు వచ్చిన డిజైన్ వుండటం వల్ల పని చాలా సులభం అయింది....అందరూ మెల్లగా నిద్ర లోకి జారుకున్నారు)

"సమీర్ నిద్ర లేచి ఒక ట్రాన్స్ మీటర్ ద్వారా ఒక encrypted మెసేజ్ అమెరికన్ గవర్నమెంట్ కి పంపాడు......


Date@24/07/2143

Time@Around 08:00

Place@ పేర్క్


"అంప్లిఫ్యూర్ దగ్గర వున్న కెపాసిటర్ ల నుండి మిగిలి వున ఎనర్జీ నీ సిద్ధం చేసి.....సమీర్ టైమ్ లూప్ లోకి వెళ్ళాడు... తన తో పాటు ఒక ట్రాన్ క్వి లైసర్ కూడా తీసుకు వస్తున్నాడు....తన చుట్టూ సేం ఒక ఆంటీ స్టాటిక్ సూట్ వేసుకుని వునడు.ఒక్కసారిగా వేగంగా ఫోటను వలయాలు క్రియేట్ అయ్యాయి...అందరూ చూస్తూ వుండగానే సమీర్ వానిష్ అయ్యాడు...


Date@26/07/2139

Time@Around 04:44

Place@ ఢిల్లీ


"సమీర్ ఢిల్లీ కి దగ్గర వున్న ఫారెస్ట్ దగ్గరకు టైమ్పోర్ట్ అయ్యాడు...అక్కడ నుండి బయటకు వచ్చి తన సూట్ మార్చుకుని నోయిడా కి ప్రయాణం అయ్యాడు......."


@ల్యాబ్:-


"అందరూ నిద్ర లేచారు....ఫ్రెష్ అప్ అయ్యి అందరూ ఒక చోట అసెంబుల్ అయ్యారు.ఇండియన్ ఆర్మీ జెనరల్ మిస్టర్ చంద్రహస్ వచ్చారు"


జెనరల్:- మనం ఫ్యూజన్ ఎనర్జీ నీ అమెరికాకు తెలియకుండా యుజ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసింది...సో మనం ఎంత త్వరగా వీ ఐతే అంత స్పీడ్ గా దీన్నీ ముగించాలి.కానీ ఎవరూ ఈ మెసేజ్ నీ పంపారు అనే విషయం తెలియటం లేదు....


సమీర్:- సర్ ఎలాగో మన ప్రాజెక్ట్ ఈ రోజుతో పూర్తి అవుతుంది.దీని రేసుల్ట్స్ చూసి అమెరికన్ గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది లే సార్...


జెనరల్:- చూద్దాం ఏం జరుగుతుందో...?


"ఫారెస్ట్ నుండి సమీర్ నోయిడా చేరుకున్నాడు.సెక్టార్ లోకి వెళ్లి ఐరిస్ స్కాన్ తర్వాత లోపలకి వెళ్ళాడు. స్టాఫ్ అందరూ బంకర్ చుట్టూ చేరిపోయారు...మరి కొన్ని గంటలలో ట్రైల్ స్టార్ట్ అవుతుంది"


"సమీర్ తన మిస్సైల్ ను లాంచ్ చేయటానికి ల్యాబ్ నుండి ఒక స్టోర్ రూంకి వచ్చాడు....లోపలి కి వెళ్లి డోర్ క్లోజ్ చేసాడు..వెనక్కి తిరిగి చూశాడు అంతే ఒక్కసారిగా సమీర్ ఆశ్చర్యం భయం తో అలా వుండిపోయాడు.ఎందుకంటే అతని ముందు భవిష్యత్తూ నుండి వచ్చిన సమీర్ వున్నాడు..


@పేర్క్- ఫ్యూచర్


"షెల్ మీద నీటి వత్తిడి బాగా పెరిగి షెల్ బీటలు స్టార్ట్ అయ్యాయి. అది గమనించిన కింగ్ మార్ష్ నీ పిలిచి షిప్స్ లో అందరినీ సర్ఫేస్ మీదకి తీసుకుని వెళ్ళమని చెప్పాడు..జనాన్ని పైకి తీసుకు వెళ్ళటం స్టార్ట్ చేసారు...ముందు వున్న డోమ్ మొత్తం పగిలి నీళ్ళు చాలా వేగంగా వస్తున్నాయి.కానీ అంత వేగంగా జనాని పైకి తీసుకు వెళ్ళటం కుదరటం లేదు......


@ల్యాబ్- గతం


"భవిష్యత్తూ నుండి వచ్చిన సమీర్ ను చూసిన సమీర్...ఓహో టైమ్ మెషిన్ వర్క్ అవుట్ అయిందా...ఐతే నాన్న కల నిజం అయ్యింది.ఇప్పుడు మన కల నిజం చేయాలి రా అంటూ సమీర్ దగ్గరకు వెళతాడు సమీర్……,"


"చూడు సమీర్ ఇక్కడి కి నేను యుద్ధానికి రాలేదు...నీ వల్ల రాబోయే యుద్ధాన్ని ఆపటానికి వచ్చాను.నీ వల్ల కాదు మన వల్ల భవిషత్తు చాలా ఘోరం గా వుంది.... మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత నువ్వు ఆ విషయం తెలుసుకుంవు కానీ అప్పటికే మన చేతుల నుండి అది దాటిపోయింది..అందుకే నేను భవిషత్తు నుండి నేను నిన్ను ఆపటానికి వచ్చాను.ఆపుతను.అవసరం ఐతే నేను నన్ను చంపుకుంటాను....అంటాడు....


సమీర్ (గతం) :- నీకేమైనా పిచ్చా ఇది మన ఇరవై ఏళ్ల కల...ఎన్నో చావులకు ప్రతీకారం.... వారి ఆత్మలకు శాంతి కలగాలని నేను ఈ పని చేస్తున్న ఈ విషయం లో నాకు నేను అడ్డుపడిన నేను కూడా నన్ను చంపు కోవటానికి వెనుక అడుగు వెయ్యను".


సమీర్(భవిషత్తు):- నువు నన్ను చంపితే నువ్వు కూడా చచ్చిపోతావు. ....


సమీర్ (గతం) :- (నవ్వుతూ) గతం లో వచ్చిన మార్పు మాత్రమే భవిషత్తు నీ నిర్ధారిస్తుంది.అంతే గాని భవిషత్తు లో జరిగిన మార్పు గతం నీ మార్చలేదు......


(అంటూ తన దగ్గర వున్న తుపాకీ కి ఒక సైలెన్సర్ పెట్టి సమీర్ ను షూట్ చేస్తాడు.సమీర్ తపించుకుని తిరిగి సమీర్ మీద దాడి చేస్తూ వుంటాడు)


@పేర్క్- ఫ్యూచర్


"షెల్ పూర్తిగా పగిలింది...నీళ్ళు చాలా వేగం గా లోపలకి వస్తున్నాయి.కింగ్ టైమ్ మెషిన్ డిజైన్ తీసుకుని షిప్ లోకి ఎక్కాడు. ...ఇంకా చాలా మంది కిందే వున్నారు...కానీ కింగ్ సమీర్ మీద నమ్మకంతో వాళ్ళు అందరినీ అక్కడే వదిలేసి వీలు అయిన అంత మందిని తీసుకుని సర్ఫేస్ మీదకి వెళ్లారు...


@ల్యాబ్- గతం


"చూడు సమీర్ నువ్వు ఎంత ట్రై చేసిన నువ్వు నన్ను ఆపలేవు.... సో నువ్వు ఇక్కడి నుండి పారిపోయి...దూరం నుండి ఈ ప్రపంచ నాశనం నీ చూసి ఆస్వాదించు.. లేకపోతే నన్ను నేనే చంపుకోవలి ...."


"సమీర్ అలా ఎదో మాట్లాడుతుంటే తన దగ్గర వున్న ఒక ట్రాన్ క్వీ లైసర్ నీ సమీర్ మీదకి షూట్ చేశాడు సమీర్....అంతే స్పృహ కోల్పోయాడు...

కొన్ని గంటల తర్వాత


"సమీర్ కళ్ళు తెరిచి చూసాడు ఒక రూం లో వున్నాడు.....తనకి ఏమి అర్దం కావటం లేదు...టీవీ ఆన్ లోవుంది...ఎవరైనా ఉన్నారేమో అని సమీర్ నడుస్తూ టీవీ దగ్గరకు వెళ్ళాడు..టీవీలో భవిషత్తు నుండి వచ్చిన సమీర్ ఐక్య రాజ్య సమితి లో ప్రసంగం చేస్తున్నాడు....సమీర్ నీ చూడగానే సమీర్ కి జరిగిన విషయం అంతా గుర్తు వచ్చింది....ఆ రోజు సాయంత్రం ఆ రూం లోకి సమీర్ వాళ్ళ నాన్న వచ్చాడు....తన తో పాటు ఒక సిడి తీసుకుని వచ్చాడు...


అప్పుడు వాళ్ళ నాన్న "సమీర్ బెటా నీకు నేను ప్రేమ ను మాత్రమే పంచాను రా కానీ నీ జ్ఞాపకాలు చెరపలేకపోయాను రా అని చెప్పి సమీర్ కి ముద్దు పెట్టీ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు....మళ్లీ ఆ రూం లాక్ అయింది.


(ఆ సిడి నీ సమీర్ ఫ్యూచర్ నుండి తీసుకు వచ్చాడు....దానిలో మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత వున్న పరిస్థితి లు షూట్ చేసుకుని వచ్చాడు... )


"సమీర్ స్పృహ కోల్పోయిన తర్వాత సమీర్... సమీర్ ప్లేస్ లోవెళ్ళి ఇక మీటింగ్ పెట్టీ జరిగిన విషయం జెనరల్ చంద్ర హాస్ కి చెప్తాడు....అంతే ఆయన మిషన్ నీ అబర్ట్ చేస్తాడు.....అలాగే ఈ మూడవ ప్రపంచ యుద్ధ పరిణామాలు అందరికీ తెలియాలి..అప్పుడే అన్నీ దేశాలు జాగ్రత్త పడతాయి...అంటాడు"


"ఐక్య రాజ్య సమితి వేదిక గా అందరికీ జరిగిన విషయం తెలియచేశాడు...సమీర్


(గతం లో వున్న సమీర్ లో మార్పు కోసం ఇంకా అతడిని అదే రూం లో ఉంచారు. భవిషత్తు సమీర్ మళ్లీ పెంటగాన్ లో జాయిన్ అయ్యాడు....)


@పేర్క్- ఫ్యూచర్

---------------

ఇంకా ఏం జరగలేదు....ఇప్పుడే కదా టైమ్ కరెక్ట్ గా వుంది......సో ఫ్యూచర్ చాలా బావుంటుంది.😎😎

ఈ స్టోరీ నీ చాలా ఓపికతో చదివిన అందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏



Rate this content
Log in

Similar telugu story from Fantasy