యశస్వి రచన

Fantasy

3  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్-5

టైం మెషిన్-5

5 mins
245


"లోపలకి వేగంగా వెళ్లిన కింగ్ అంతా చూస్తాడు.కానీ షెల్ పవర్ ప్యానెల్ కి గాని దాని ఫ్రేమ్ వర్క్ కంట్రోల్ కి గాని ఏమి కాలేదు.అన్నీ చాలా భద్రం గా వున్నాయి.ఒక్క సారిగా ప్రస్తుత కాలంలో వుండే సమీర్ గుర్తు వస్తాడు.అతడు సిక్రే ట్ గా వుంటున్న రూం దగ్గర కి వెళ్లి పాస్ కోడ్ టైప్ చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు"


"బెడ్ మీద వుండవలసిన ప్రస్తుత కాలంలో వున్న సమీర్ వుండడు.మార్ష్ మొబైల్ నంబర్ నుండి ఒక ఫోటో వస్తుంది. వాళ్ళ దగ్గర సమీర్ వుంటాడు"


"అదే విషయం సమీర్ కి కింగ్ చెప్తాడు.ఇప్పుడు నా ప్రాణం ముఖ్యం కాదు కింగ్.మన మిషన్ సక్సెస్ అవ్వాలి సో నువ్వు ఆ విషయం మరచిపో అలాగే సమీర్ తమ్ముడు నీ త్వరగా మన పెర్క్ కి రమ్మని మెసేజ్ పెట్టు.ఈ లోపు నేను నా ఫ్రెండ్ ధర న్ కలసి ఆ టైమ్ మెషిన్ నీ బ్లు ప్రింట్స్ హెల్ప్ తో అసెంబుల్ చేస్తాము.అలాగే మాకు కొంత మంది డిజిటల్ డికోడర్స్ కావాలి.షెల్ నుండి సగం ఎనర్జీ నీ మేము తీసుకునేటప్పుడు, సముద్ర వత్తిడి అధికం షెల్ మీద వుండటం వల్ల షెల్ విరిగి పోవచ్చు సో పెర్క్ చుట్టూ జనం వున్న జనం నీ ఏదైనా సేఫ్ ప్లేస్ కి తీసుకు పో"అంటాడు సమీర్.


Date@19/07/2143

Time@Around 23:09

Place@In perk


(కింగ్ సమీర్ అడిగినవన్నీ రెఢీ చేశాడు: వచ్చిన వాళ్ళతో సమీర్ మీటింగ్) 


"చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంట్రడక్షన్ కి టైమ్ లేదు, నేను మీకు కొన్ని బ్లూ ప్రింట్స్ అలాగే కొన్ని డిస్ మంటిల్ పార్ట్ ఇస్తాను.వాటిని ఆసెంబుల్ చెయ్యాలి. ఏదైనా పార్టీ యొక్క బ్లూప్రింట్ అర్థం కాకపోతే దయచేసి నాకు చెప్పండి. మీరు తప్పుగా అసెంబుల్ చేసి నట్లయితే చాలా ప్రమాదం జరగవచ్చు.ఎంత వేగం గా పూర్తి అయితే అంత వేగం గా పని త్వరగా కంప్లీట్ చెయ్యాలి అని చెప్పాడు సమీర్ వచ్చిన వాళ్ళతో"


"సమీర్ నువ్వు ఎంచేస్తునావో నీకు తెలుసా, నువ్వు టైమ్ లూప్ నుండి ఇక్కాడికి వచ్చావు సో నీకు అంటే నీ బాడీ కి ఏమీ జరిగిన అధి మిగతా టైమ్ పీరియడ్ లో వున్న వాళ్ళ మీద పడుతుంది.అలాగే వాళ్ళకి ఎం జరిగిన నీ మీద పడుతుంది అదీ కాకుండా క్వాంటం" అని ధ రణ్ ఏదో చెపుతూ వుంటే మద్యలో సమీర్ నాకు తెలుసు ఎం జరుగుతుందో మనం ఈ రిస్క్ తీసుకోవాలి తప్పని సరిగా అని అంటాడు సమీర్"


"సమీర్ వాళ్ళ తమ్ముడు బాలు వచ్చాడు"


"సమీర్ తన మెడికల్ టీమ్ నీ పిలిచి, బాలు హార్ట్ కి ఒక పేస్ మేకర్ నీ ఫిక్స్ చేయమని అడిగాడు.అలాగే బాలు కి సంభందించిన మెమరీ నీ ఒక న్యూరో డైవ్ లో సేఫ్ గా స్టార్ చేసి కేవలం అతని బ్రెయిన్ లో మన మిషన్ కి సంభందించిన డిటైల్స్ నీ మాత్రమే వుండే విధంగా గా సేరిబ్రం అండ్ హైపో తాలమస్ రీజియన్ లో ఆపరేషన్ చేయమని చెప్పాడు"


"బాలు కి తన అన్నయ అంటే చాలా ఇష్టం.తన దగ్గర ఎప్పుడు వాళ్ళ అన్నయ ఇచ్చిన ఒక లాకెట్ వుంటుంది.బాలు గతం లోకి వెళితే తన భవిష్యత్తు అనుభవాలు కోల్పోతాను అనే బాధ తో వుండేవాడు"


Date@20/07/2143

Time@Around 07:44

Place@In perk




"దరన్ మిగతా వాళ్ళతో కలసి టైమ్ మెషిన్ నీ త్వరగా ఆసెంబుల్ చెయ్యటానికి ట్రై చేస్తున్నాడు.మరొక పక్క బాలు నీ టైం ట్రావెలింగ్ కి రెఢీ అవుతున్నాడు.మరొక పక్క మార్ష్ తన దగ్గర ప్రస్తుత టైమ్ పీరియడ్ లో వున్న సమీర్ వున్నాడు అతడు ఏ సమయం లో అయినా పె ర్క్ మీద దాడి చెయ్యచ్చు"



Date@20/07/2143

Time@Around 22:00

Place@In perk


"టైమ్ మెషిన్ పూర్తి అయ్యింది. దానికి పాత పవర్ సోర్స్ అయిన రిసర్వయర్ తీసేసి, దానికి ఆల్టర్ నేటివ్ గా షెల్ నుండి పవర్ తీసుకోవాటానికి ఎనర్జీ ఎంప్లిఫైయర్ పెట్టారు.సో అధి షెల్ నుండి తీసుకున్న క్వాంటం ఎనర్జీ నీ ఎంప్లిఫై చేసిన తర్వాత టైమ్ మెషిన్ కి పంపుతుంది.సో టైమ్ మెషిన్ కి కావలసిన ఎనర్జీ కంటే ఎక్కువ వస్తుంది.ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వుండవు.అలాగే మిగిలిన రేసిద్యువల్ ఎనర్జీ నీ ఒక ఇనర్ట్ కెపాసిటర్ లో స్టోర్ చేసి, దాని మనం కావాలి అంటే షెల్ కి వాడుకోవచ్చు.లేకపోతే టైమ్ మెషిన్ నీ రెండో సారి యూస్ చెయ్యటానికి వాడచ్చు అని అంటాడు సమీర్ బాలు తో"


"చూడు బాలు నువ్వు టైమ్ ట్రావెలింగ్ లో వున్నప్పుడు, నువ్వు నీ వంటి మీద ఎటువంటి కండక్టివ్ ఆబ్జెక్టివ్ లు నీ దగ్గర వుండ కూడదు.ఎందుకంటే మేము నీ బాడీ చుట్టూ యాంటీ స్టాటిక్ ఎనర్జీ తో వుండే జెల్ పూస్తారు.సో నీ చుట్టూ వుండే యాంప్లిఫైడ్ క్వాంటం ఎనర్జీ నీ బాడీ కి పాస్ అవదు. ఒకవేళ నువ్వు ఏదైనా కండక్టివ్ ఆబ్జెక్టివ్ లు వుంటే ఆ ఎనర్జీ నీ శరీరం గుండా ప్రవహించి చివరికి ప్రాణం పోతుంది. నీ గుండె వేగం చాలా మెల్లగా వుంటుంది టైమ్ ట్రావెలింగ్ లో చాలా విచిత్రంగా గా వుంటుంది.అధి ప్రమాద కారంగా మారకుండా నీకు పేస్ మేకర్ అమర్చాము.దాని నుండి వచ్చే ప్రి డిట్టర్మైండ్ ఇంపల్స్ నీ గుండె వేగాన్ని అదుపు చేస్తాయి.నువ్వు గతం లోకి వెళ్ళగానే ఆ పేస్ మేకర్ నువ్వు తీసెయ్వచ్చు"


Date@21/07/2143

Time@Around 00:22

Place@In perk Ready to launch Time Machine


"బాలు తన వంటి నిండా జెల్ పోసుకుని టైమ్ మెషిన్ లో కూర్చున్నాడు. ధరణ్ షెల్ కి పవర్ కనెక్టర్ కపుల్ చేసి దాని మరో ఎండ్ టైమ్ మెషిన్ కి కనెక్ట్ చేశాడు.సమీర్ టైమ్ మెషిన్ నీ ఇనిషియట్ చేశాడు. షెల్ నుండి ఎనర్జీ పవర్ కనెక్టర్ ద్వారా పాస్ అయి టైమ్ మెషిన్ చేరింది. టైమ్ మెషిన్ విర్చువల్ స్క్రీన్ డిస్ప్లే వచ్చింది.దానిలో డేట్ అండ్ టైమ్ (12-22-2139) సెట్ చేసి లాక్ చేసి పెట్టాడు.సమీర్ షెల్ నుండి వచ్చే ఎనర్జీ నీ యాంప్లిఫై చేసి టైమ్ మెషిన్ కి పాస్ చేశాడు"


"కాంతి వేగంతో సమానం అయినా క్వాంటం ఫీల్డ్ సర్కిల్స్ క్రియేట్ అయ్యాయి. వాటి వల్ల వచ్చే వైబ్రేషన్స్ అక్కడ వున్న ప్రతీ ఒక వ్యక్తి గుండె ను తాకుతున్నాయి.అలాగే షెల్ నుండి ఎనర్జీ మెల్లగా తీసుకోవటం వల్ల షెల్ మీద భారం అంతగా పడటం లేదు.ఇంకొక కొన్ని క్షణాల్లో వాళ్ళు అనుకున ఎనర్జీ లెవెల్స్ రాగానే టైమ్ పోర్టల్ లోకి బాలుని సెండ్ చెయ్యాలి అనుకున్నాడు యశస్వి"


"కానీ మార్ష్, షెల్ యొక్క ఎనర్జీ మెల్లగా తగట్టం తెలుసుకుని షెల్ మీద దాడి చేశాడు.అంతే ఒక్కసారిగా ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వచ్చేశాయి.అదే టైమ్ లో సమీర్ యశస్వి నీ పోర్టల్ లోకి పంపాడు.ఒక్కసారిగా టైమ్ మెషిన్ నుండి వచ్చే క్వాంటం ఫీల్డ్స్ వ్యానిష్ అయ్యాయి"


"కానీ బాలు అప్పటికే టైమ్ పోర్టల్ లోకి వెళ్ళిపోయాడు.అతని చుట్టూ లొ ఫ్రీక్వెన్సీ క్వాంటం ఫీల్డ్స్ క్రియేట్ అవుతున్నాయి.సమీర్ ఒక్కసారిగా టైమ్ మెషిన్ కి వచ్చే ఎనర్జీ నీ ఆపేశాడు కానీ యంప్లిఫైర్ నీ ఆఫ్ చెయ్యలేదు. ఎనర్జీ నీ ఆ యంప్లిఫైర్ కంటిన్యూ గా ప్రొడ్యూస్ చేస్తుంది చివరికి ఆ ఎనర్జీ మొత్తం కెపాసిటర్ లో స్టోర్ అవుతూ వుంది.ఇక పాయింట్ దగ్గర కెపాసిటర్ ఫుల్ గా ఛార్జ్ అయి ఓవర్ లోడ్ అయి బ్లాస్ట్ అయింది.ఈ లోపు బాలు టైమ్ మెషిన్ నుండి బయటికి రావటానికి ట్రై చేస్తే అతని బాడీ మీద వున్న యాంటీ స్టాటిక్ సూట్ చిరిగిపోయింది.అంతే ఒక్కసారిగా ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కాంతి వేగం తో బాలు శరీరం లోకి ప్రవేశించాయి.ఇది గమనించిన సమీర్ వెంటనే బాలు నీ టైమ్ పోర్టల్ లోకి పంపేశాడు.బాలు ఆక్కడ నుండి.మాయం అయిపోయాడు"


(కొన్ని నిమిషాలకి అందరూ సర్దుకున్నారు.మార్ష్ టీమ్ కి కింగ్ టీమ్ కి మద్య గొడవ జరుగుతుంది)


Date@21/07/2139

Time@Around 12:44

Place@Some where in Somaaliyaa


"బాలు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంటాడు తన ముందు క్యాలెండర్ వుంది దాంట్లో ఇయర్ 2139 జనవరి అని వుంది.చుట్టూ చూస్తాడు ఒక హాస్పిటల్ లో వున్నాడు"


(కొన్ని నిమిషాల తర్వాత ఒక పోలీస్ అలాగే ఒక డాక్టర్ వచ్చారు)


"హెల్లొ మిష్టర్ మీరు ఎవరు, నున్న అర్థరాత్రి మీర్ రోడ్డు మీద ఒక విచిత్రమైన సూట్ వేసుకుని స్పృహ లేకుండా పడి వున్నారు.మీ గురించి చెప్పండి సార్ అంటాడు పోలీస్"


"అప్పుడు బాలు ఇంతకీ నేను ఎవరూ నేను ఎందుకు హాస్పిటల్లో వున్నాను అని తిరిగి వాళ్ళని అడుగుతాడు"


"నిజానికి బాలు తన మిషన్ గురించి మర్చిపోయాడు. ఆ బ్లాస్ట్ లో ఒక్కసారిగా ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కాంతి వేగం తో బాలు శరీరం లోకి ప్రవేశించాయి.అందువల్ల సమీర్ వాళ్లు స్టోర్ చేసిన మిషన్ డిటైల్స్ మర్చిపోయాడు"


"మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కావటానికి ఇంకా నెల రోజుల ఆరు గంటలు వున్నాయి"


To be continued in the next part........



Rate this content
Log in

Similar telugu story from Fantasy