Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

యశస్వి రచన

Horror


3.4  

యశస్వి రచన

Horror


కాటికాపరి

కాటికాపరి

14 mins 1.0K 14 mins 1.0K

"గతంలో జ్ఞాపకాలు పట్టుకుంటే చేతికి బూడిద తప్ప ఏమీ మిగలదు.ఒక్కసారి అగ్నిలో కానీ భూమిలో కానీ నీటిలో గాని కలసిన దేహం తిరిగి రాదు. అప్పటితో ఆ దేహంకి భూమి మీద చెయ్యవలసిన అలాగే చెయ్యాలి అనుకున్న కర్మలు పూర్తి చెయ్యాలి.కానీ అకాల మరణం..... మానవ దేహంలో వున్న ప్రాణిని వూగిసలాటకు గురి చేస్తుంది.అప్పటి వరకు అవధులు పరిమితులు వున్న ప్రాణి........,దేహం నుండి ఒక్కసారిగా బయటకు వచ్చి ఆకలిగా వున్న గ్రద్ద కి ఒక ఊర పిచ్చుక దొరికితే ఎలా అయితే చర్మం చీల్చి గుండెని బయటకు లాగి ఆతృతగా తన ఆకలి తీర్చుకుంటుందొ అలాగే అవధులు లేని ఆ ప్రాణి చేసే కర్మలు కూడా అలానే వుంటాయి"


"కాలంలో కలిసిపోవడంకి అది దేహం కాదు అని..... దేహాని నడిపించే ఒక యంత్రం అసలే కాదు అని అది ఒక బ్రహ్మాండమైన శక్తి అని తెలుసుకునే సమయం వచ్చింది....... అటువంటి ఆ శక్తికి కరువు తీరని కోరికలు, మొహం తీరని వాంఛలు వుంటే అవి వాటి శక్తిని మరింత బలోపేతం చేసి వాటిని సాధించేవరకు మిద్యా దృష్టి తో తన చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస్తూ అవకాశం దొరికితే విజృంభణ కి సిద్దం గా వుంటాయి"


"దేహంలో బంధి గా వున్న ఆ శక్తి కి ఎన్నో బంధాలు వుంటాయి.ఒక్కసారి ఆ ఉక్కిరి బిక్కిరి దేహం నుండి బయటకు వచ్చిందా తనా మనా అనే భేదం లేదు..ఎలా అయితే సర్పాలు తన సొంత జాతిని పట్టుకుని కనికరం లేకుండా ఎముకలు విరిచి, శ్వాస ఆపి ఆరగిస్తాయో అలాగే ఆ శక్తి తన సొంత జాతి అయిన మానవ శరీరం మీద విరుచుకు పడతాయి"


"కాటికి కాళ్లు చాపి కూర్చున్న వయసులో, మనసులోని వెర్రి కోరికల మొహంతో వున్న మానవ శరీరం చాలా ప్రమాదం గా మారుతుంది చావు తర్వాత"


"బలహీనమైన మానవ శరీరం అదే శరీరం నుండి బయటకు వచ్చిన ఆ బలం ముందు తల వంచక తప్పదు.ఒకవేళ ఎదురు వెళ్ళాలి అని సంకల్పించిన ఆ దేహం కి మరణం తప్ప మరొక అవకాశం లేదు"


"సుమారు కొన్ని వందల ఏళ్ళ క్రితం కొంత మంది దేవుళ్ళకి బదులు...తమ పూర్వీకుల ఆత్మలు ను తమ జాతి వునికి కోసం నైవేద్యాలు పెట్టీ...... భయం నిండిన నయనాలు తో పూజించేవారు.రాను రాను కాలంలో ఎన్నో మార్పులు జరిగి వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కొరవడింది.ఎన్నో ఏళ్ల గా ఆకలి గా వున్న ఆత్మలు సమాధిలో సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వున్నాయి"


"అటువంటి ఆ శక్తి పేరే ఆత్మ....అటువంటి ఆత్మ ఉనికి వెతకడం అంటే నీటిలో నిప్పు కోసం, అగ్నిలో బ్రతుకు కోసం, బ్రతుకులో మరణం కోసం వెతికినట్టే"


"ఇపుడు మీరు చడవబోతున ఈ కథ, కాలంలో కలసి పోయిన ఒక గ్రామంలో మొదలు అయింది.ఊరిని కాపాడే శక్తులు కి మరో రూపమే ఆత్మలు.వాటిని శాంతి పరచడం కి ప్రకృతి లో వచ్చే కాలాలో ఎన్నో మేకలను...కోళ్లను.. రక్త తర్పణం చేసి ఆ రక్తంతో ఆ శక్తులను ప్రేరేపించే పొలిమేరల నడుమ కాపలా గా బందించాలి అనుకుంటాము.కానీ అప్పటి వరకు ఎంతో సుప్త అవస్థలో వున్న మిగిలిన ఆత్మలు ఆ రక్తపు చుక్కల వాసనలు తగిలి వెర్రి ఎక్కి ఊగుతూ వుంటాయి.ఆ వెర్రి ఎక్కిన ఆత్మలు ఊలలు వేస్తూ వేడి రక్తపు చుక్కల కోసం వెతుకుతూ వుంటాయి" 


కథ:-


సారయ్య:- ఏరా ఎం మాట్లాడుతున్నావు, మొన్ననే కదా మా అయ్య పెద్ద కార్యం చేసి, రెండు పొట్టెళ్లును తెగ నరికి వాటితో కడుపు నిండా భోజనం పెట్టీ, గొంతులో నింపుకోవడంకి మన గౌడ్ దగ్గర కల్లు ముంతలు తెచ్చి చచ్చిన నాబాబుతో పాటు బ్రతికి వున్న వెధవలును కూడా సంతృప్తి చేసినా ఈ నర దృష్టి తగ్గడం లేదు రా.....నువ్వేమో తగ్గింది తగ్గింది అంటావు?


అంజయ్య:- ఒరేయ్.....పిచ్చి సారయ్య....!! నర దృష్టి కాదురా ఇది....నీ చుట్టూ వున్న ఏ ఒక్క మనిషిలో గాని ఏ ఒక్క వస్తువులో గాని జీవం లేదురా...ఇది తప్పకుండా యంత్రం వేసి మంత్రం చదివిన పనే రా.


సారయ్య:- అంటే ఏమిట్రా తల తిక్క గా మాట్లాడుతున్నావు...ఏదైనా కల్తీ కల్లు తాగావ ఎంటి.


అంజయ్య:- ఇది నెత్తికి ఎక్కిన నిషా వల్ల కాదు చెప్పింది, వున్నట్టు వుండి పసుపు పచ్చగా వుండే మీ కుటుంబం ఎందుకు ఇలా అయిందో.., కారణం చెప్తున్న విను...మన స్మశానంలో మీ బాబు పోయినప్పుడు నువ్వు ఆ ముసలివాడిని ఊరికి ఉత్తరం గా పూడ్చి పెట్టావు వర్షం వస్తుంది అనే కంగారులో.....


"ముసలోడి ఆత్మ అక్కడ నుండి బయటకు పోలేక ఆ సమాధి నుండి వచ్చే గాలిని మలినం చేసి నీ కొంప మీదకి వదిలి నీకు తననీ గుర్తు చేస్తున్నాడు"


సారయ్య:- మరి నేను ఇప్పుడు ఎం చెయ్యాలి రా నాయన...?.....అయినా నీకు ఈ విషయాలు ఎలా తెలుసు రా


అంజయ్య :- నా పని ఏంట్రా...!!


సారయ్య:- కూలి పనులకు పోవడం 


అంజయ్య:- ఇప్పుడు కాదు..మా తాత ముత్తాతలు నుండి మేము చేసే పని ఎంటి


సారయ్య:- కాటి కాపరులు కదా మర్చిపోయాను..!!


అంజయ్య:- హా కాటికాపరులు అంటే శవాలు మీద వున్న బట్టలు, ఇరుక్కు పోయిన నగలు కోసం ఆశ పడే సోమరులు అనుకుంటారు అందరూ.పొలిమేర మంచిగా వుంటేనే ఊరు మొత్తం పచ్చగా వుంటుంది.పొలిమేర లో రంకెలు వేస్తూ గ్రామం వైపు శని సోకిన దృష్టి తో ఆత్మలు విరుచుకు పడకుండా వాటి ప్రయత్నాలు జాగు చెయ్యటమే మా పని"


"కాటి లో ఎన్నో కర్మలు చెయ్యాలి కాపరి.అప్పుడే అతను ఊర్ని కాయగలడు. నిజానికి మేము కాటిలో మీరు ఉంటున్న ఊరినీ కాపాడుతున్నాము"


సారయ్య;- మరి ఇప్పుడు ఎం చెయ్యాలి అంజయ్య.మా నాన్న నీ పుడ్చి పెట్టీ కొన్ని రోజులే కదా అయింది.ఇప్పుడు ఆ సమాధి తవ్వి నాన్ననీ మళ్లీ దిక్కు మార్చి పడుకోపెట్టేస్తే సరిపోతుంది కదా.....?


అంజయ్య:- అది చాలా ప్రమాదం...ఒక్కసారి మనం ఖననం చేసిన దేహంనీ బయటకు తీయకూడదు అని నాన్న అంటూ వుండే వాడు.....అంత పని ఇప్పుడు చేస్తే నీ గతి అదోగతి అవుతుంది జాగ్రత్తా.... ఓ పని చేద్దాము మా నాన్న దగ్గర కి పోయి విషయం చెప్పి ఎం చెయ్యాలో అడుగుదాము.


సారయ్య:- సరే......నడు అయితే ఇప్పుడే కాటికాడికి పోదాము.

(మెల్లగా సూరీడు భయపడి చీకటి లో కలసిపోయాడు- అంజయ్య వాళ్ల నాన్న శాల్మలి.......,బయటకు వెళ్లాడు...అతని కోసం సారయ్య అంజయ్య ఒక సమాధి మండపం లో కూర్చుని ఎదురు చూస్తున్నారు)


సారయ్య :- అరేయ్ అంజయ్య రాత్రి అయింది కదా..!!, మాకు ఇంట్లో వుంటేనే ఏదైనా చప్పుడు అయితేనే భయం గా వుంటుంది.అలాంటిది మీరు ఎప్పుడూ ఈ శవాల మద్య, సమాధుల మధ్య ఎలా వుంటారు రా భయం లేకుండా?


అంజయ్య:- ఇక్కడ మేము ఎప్పుడు మనిషి చావు తర్వాత జరిగే కర్మలను చూస్తూ పెరిగాము.తింటూ ఉంటే పంటి కింద వేపాకు తియగా వున్నట్టు మేము ఇక్కడే వుండడం వల్ల మాకు భయం లేదు అనుకుంటారు.కానీ ఎప్పుడు అయితే కాటి మీద మా పట్టు సడలి మా చేతులతో వణుకు వచ్చింది అని వాటికి తెలిస్తే వాటి క్రూర కౌగిళ్లతో మమ్మల్ని చంపి పిప్పి చేస్తాయి...అందుకే మేము ఎప్పుడు కూడా జంకు వణుకు లేకుండా వుంటాము....వుండాలి కూడా అదుగో నాన్న వస్తున్నాడు.


సారయ్య:- హమ్మయ నా సమస్యకి ఒక పరిష్కారం దొరికేలా వుంది.


అంజయ్య:- ఎక్కడకి వెళ్ళావు నాన్న......... నీ కోసం నేను చాలా సేపు నుండి ఇక్కడ ఎదురు చూస్తున్న, ఇదిగో ఇతని పెరు సారయ్య, నీతో పని వుండి వచ్చాడు.


శాల్మలి :- నేను వూర్లో వున్న గణాల కోసం వెళ్లి, నర దృష్టి లాగిన నిమ్మకాయలను ఇంకా దిగదుడిపిన కొబ్బరి కాయలు తీసుకు వస్తున్న.......సరే గానీ ఇంత రాత్రి వేళ నువ్వు అది మరొక వ్యక్తి కల్సి నన్ను ఎందుకు కలవడం కి వచ్చావు.పూర్వం రోజుల్లో అలానే చేసేవాళ్ళు దిష్టి తీసిన నిమ్మకాయలు కొబ్బరి కాయలు.....కాటి కాపరి కి ఇచ్చి వాళ్ళు ఆ సమస్య నుండి దూరం అయ్యే వాళ్ళు....కానీ ఇప్పుడు వాటిని ఇష్టానుసారం రోడ్ల మీద పడేయడం వల్ల ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ వల్ల వాటిని తాకిన అలాగే దాటిన వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు.


సారయ్య:- మా ఊరి పొలిమేరలో ఉన్న స్మశానంలో మా నాన్న శవాని పెట్టకూడనీ దిశ వైపు పుడ్చిపెట్టాను.అందువల్ల నాన్న అక్కడ నుండి బయట పడలేక నన్ను సహాయం కోరుతున్నాడు......కానీ దాని వల్ల నేను జీవం కోల్పోతున్న....అవును నాకు ఒక అనుమానం మీ పెరు శాల్మలి కదా......అంటే రౌరవాది నరకాలో శాల్మలి అనేది అతి నీచమైన, వెన్ను లో వణుకు పుట్టించే శిక్షలు విధించేది కదా!


అంజయ్య;- అవును రా సారయ్య, శాల్మలి అంటే ఒక నరకం పేరు.....మా తాత కాటికాపరిగా ఉన్నపుడు వీటిని అదుపు చెయ్యడం మరి కష్టంతో కూడుకున్న పని అందుకే తాత, నాన్న పుట్టిన అప్పుడు నాన్న పేరు వింటేనే ప్రేతాలకి వణుకు పుట్టాలి అని గరుడ పురాణం వెతికి మరి శాల్మలి అని పేరు పెట్టాడు......నాన్నకి తాతయ్య పెట్టిన పేరుకి తగ్గట్టు గానే కాటి కాపరి విద్యలో నాణ్యతమైన మంత్రాలు నోట బట్టి ఊరిని జాగ్రత్త గా కాపాడుతున్నాడు.


శాల్మలి :- ఇప్పుడు అదంతా ఎందుకు గాని, నేను ఇప్పుడు మీకు ఎం చెయ్యాలి అది చెప్పండి ముందు.....మీరు వచ్చిన వేళ కూడా అంత మంచిది కాదు......త్వరగా విషయం చెప్పి ఇక్కడ నుండి బయటకు వెళ్ళండి.


అంజయ్య:- అదే నాన్న ఇప్పుడు సారయ్య వాళ్ల నాన్న సమాధి తవ్వి దిశ మార్చాలి అనుకుంటున్నాము.....కానీ మీరు ఒక్కసారి మట్టిలో కలిసిపోతున్న శవాని బయటకు తీయకూడదు అన్నారు కదా అందుకే తీయడం లేదు...దీనికి మరొక మార్గం ఏదైనా చెప్తారు అని వచ్చాము నాన్న


శాల్మలి :- అవును రా ఒక్కసారి పూడ్చి పెట్టిన దేహంకి తన మన అనే భావం అక్కడితోనే పోతుంది..ఒకవేళ అది మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా అది ఒక మిధ్యా భావం మాత్రమే పైగా పెద్ద కర్మ కూడా అయింది అంటే పాటు పున్నామి నరకం సమస్య కూడా పోయింది మీ నాన్న కి ఇప్పుడు ఆ సమాధిలో వుంది మీ నాన్న కాదు.అది వేరే....నువ్వు బయటకు తీయాలి అని చూస్తే చాలా ప్రమాదం.కానీ ఒకే ఒక్క మార్గం వుంది.కానీ దానికి మరికొంత సమయం కోసం వేచి చూడాలి.


అంజయ్య:- ఎన్ని రోజులు నాన్న, 


శాల్మలి:- అది నేనే చెప్తాను...అప్పటి వరకు సారయ్య నువ్వు వెళ్ళి మీ నాన్న శవం నుండి కొంత మట్టి తీసుకుని దాని పసుపులో కలిపి ఇంటి చుట్టూ యంత్రం వెయ్యి...కొన్ని రోజుల పాటు నీకు యే పీడా వుండదు.


సారయ్య:- అదేంటి సమాధి నుండి మట్టి ఇంటికి తీసుకు వెళితే.....ఎలా అది కీడు కాదా శాల్మలి..!!


శాల్మలి :- నిర్యాన నిర్వాణ కర్మలులో పంతులు పట్టించే మంత్రాలు దేహం నుండి ఆత్మ పైకి చేరడం కి మాత్రమే కాదు.....కుటుంబం మీద మొహం వీడని ఆత్మ తిరిగి ఇంటికి చేరకుండా ఆ సమాధి మీద వున్న మట్టికి కొంత శక్తిని అందిస్తాయి...కానీ ఎప్పుడూ అయితే మంత్రోచ్ఛారణ ప్రభావం తగ్గుతుందో అప్పుడు ఆ మన్ను కూడా సాధారణ మట్టి లాగా అవుతుంది....మీ నాన్న పెద్ద కార్యం కొన్ని గంటలు ముందే అయింది కదా ఆ మంత్రాల ప్రభావం ఇంకా వుంటుంది.అందువల్ల నువ్వు ఆ మట్టిని తీసుకుని నేను చెప్పిన విధంగా చెయ్యి..కానీ ఇప్పుడు వెళ్లకు, రేపు వెళ్ళు ఉదయం.

"మీరు వెళ్ళిపొండి.....నేను ఈ నర దృష్టి లాగిన నిమ్మకాయలను ఇంకా దిగదుడిపిన కొబ్బరి కాయలును భూమిలో కప్పెట్టాలీ."


సారయ్య:- చెప్పింది అర్దం అయింది శాల్మలి....నేను రేపే వెళ్తాను..ఇక వుంటాను... పదా అంజయ్య వెళ్దాము.
(సారయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత శాల్మలి తన పని ముగించుకుని, ముంతలో ఉన్న అన్నం తిని పొలిమేరలో అటుఇటూ తిరిగి.....కొద్ది సమయం తర్వాత పడుకున్నాడు.....సారయ్య ఇంకా అంజయ్య ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు)


"సారయ్య మెల్లగా నడుస్తూ ఇంటిలోపలికి వెళ్తున్నాడు...ఒక్కసారిగా ఎవరో తనని భుజం పట్టుకుని వెనక్కి లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు...సారయ్య చూస్తే శాల్మలి వున్నాడు..అదేంటి శాల్మలి మేము ఇప్పుడే కదా నువ్వు చెప్పావు అని వచ్చేశాం...మళ్లీ మా వెనుకే వచ్చావు ఎంటి?.. కల్లుకి కి పైసలు కావాలా లేక బియ్యం ఏమైనా కావాలా?...చెప్పు అని అడిగాడు సారయ్య"


"అప్పుడు శాల్మలి, లేదు నువ్వు నాతో పాటు గడ్డపార తీసుకునిరా....యమగడియలు వస్తున్నాయి అవి మాకు శుభగడియలు...ఇప్పుడు మీ నాన్న సమాధి తవ్వి....ముసలోడి మెడ వంచి ఊరికి మేలు లాంటి కీడు చేద్దాము పదా అంటున్నాడు శాల్మలి"


"ఏమో శాల్మలి ఏమంటునావో నాకేం అర్ధం కావడం లేదు...సరే పదా నేను ఐతే గడ్డపార తీసుకుని వస్తాను అని గడ్డపార తీసుకుని శాల్మలి వెంట నడుస్తూ స్మశానంలోకి వెళ్ళాడు....శాల్మలి ఎదో మంత్రం జపిస్తూ....కానివు సారయ్య నీ భుజంలోని బలంతో ఆ సమాధి పగలగొట్టి మట్టి తీయి అన్నాడు"


"సారయ్య సరే అని, తన బలం అంతా ఉపయోగించి ఒక్క దెబ్బ వేశాడు గడ్డపారతో.....అంతే ఒక్కసారిగా సమాధి బీటలు వారింది....చెడు వాసన వస్తుంది...సారయ్య ముక్కు మూసుకుని మొత్తం తవ్వి చూసాడు....లోపల సారయ్య శవం లేదు....అంతే ఒక్కసారిగా తనకి భయం మొదలు అయింది....శాల్మలి కోసం వెనక్కి తిరిగి చూశాడు అంతే అక్కడ శాల్మలి లేడు...తన తండ్రి కుళ్లిపోయిన దేహంతో తన ముందు ఒక్కసారిగా కనిపించాడు, భయం వేసి ఒక్కసారిగా వెనక్కి జరిగాడు సారయ్య,....తన కాలికి సమాధి శకలం తగిలి వెంటనే సమాధి లోపలపడ్డాడు....తన తండ్రి వచ్చి తన పక్కనే పడుకున్నాడు.. ఆయన ఎం మాట్లాడం లేదు...సారయ్య మాత్రం అరుపులు కేకలు పెడుతూ....శాల్మలి శాల్మలి అంటూ గావు కేకలు పెడుతున్నాడు..అంతే అతని భార్య ఏమైంది అండి అలా అరుస్తున్నారు అంటూ పడుకుని వున్న సారయ్యనీ లేపింది"


"చెమటలు పట్టిన మొహం తుడచుకుంటూ, భయం భయంగా పక్కనే ఉన్న అంజయ్య ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి ఈ రోజుకి నేను నా భార్య పిల్లలు ఇక్కడే పడుకుంటాము అని సారయ్య కుటుంబం మొత్తం అంజయ్య ఇంట్లో పడుకున్నారు.సారయ్య కళ్ళు మూసుకుని పడుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు.తన నాన్న మొహం ఇంకా తన కళ్ళ ముందు అలా కదులుతూనే వుంది"


"తెల్లవారింది, సారయ్య భార్య పిల్లలు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు.కానీ సారయ్యకి సరిగ్గా నిద్ర పట్టలేదు అందుకే ఇంకా మెలకువ రాలేదు. ఉదయం సుమారు పదకుండు అయ్యింది.అంజయ్య సారయ్యని లేపి తనతో పాటు తెచ్చిన కల్లు తాగుదాము అని పొలంలోకి తీసుకువెళ్ళాడు.అక్కడ వాళ్ళు ఇద్దరూ ఒక గంట సేపు తాగి ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు.అప్పుడే శాల్మలి చెప్పిన మాటలు గుర్తు వచ్చి సారయ్య అంజయ్యని తీసుకుని స్మశానంలోకి మిట్ట మధ్యాహ్నం వెళ్ళాడు..ఎండ చాలా తీవ్రంగా వుంది...మత్తు ఎక్కిన శరీరం పైగా ఎండ అవడం వల్ల వాళ్ల కళ్ళు బైర్లు కమ్మాయి...ఎం చేస్తున్నారో తెలియడం లేదు"


"అంతటిలోకి సారయ్య, తన తండ్రి సమాధి చూసాడు.తూలుతూ దాని దగ్గరకు వెళ్ళి....ఏరా నా నాన్నా నీకు ఇంత ఖర్చు పెట్టి కర్మ చేస్తే నువ్వు కొడుకుని అని చూడకుండా నన్ను భయపెడతావా... ఉండు నీ పని చెప్తాను అంటూ....స్మశానం కి పక్కన ఉన్న పొలం గట్టు మీద వున్న పార తీసుకుని సమాధిని తొవ్వడం మొదలు పెట్టాడు...అంజయ్యకి, సారయ్య ఎం చేస్తున్నాడో అర్ధం కావడం లేదు...వద్దు అని చెప్పే స్థితిలో కూడా లేడు"


"సారయ్య, సమాధి తవ్వేసి శవాని బయటకు లాగేసాడు...అప్పటికే అంజయ్య మత్తు వల్ల స్పృహ తప్పి పడిపోయాడు...సారయ్య తన తండ్రి మీద కోపంతో... శవం మీద మట్టి కొడుతూ, చెత్త పోస్తూ, చాలా అసభ్యంగా అవమానిస్తూ తనలో ఉన్న కోపం బయట పెట్టాడు సారయ్య...చివరికి వూగుతూ తూలుతూ ఎదొలాగా శవాని దిక్కు మార్చి పడుకోపెట్టి మట్టి పోసి...పారతో మట్టిని కిందకి అనిచి అనిచి కొడుతూ తన కోపం మెల్లగా తగ్గించుకున్నాడు...కొంచెం సమయం అటూ ఇటూ తిరిగి ఒక్కసారిగా అంజయ్య పక్కన పడ్డాడు...సారయ్య"


"మెల్లగా సూర్యుడికి కాలం అనే గ్రహణం వల్ల వీడ్కోలు పలికి చీకటి అలముకుంది.....ఎవరో అంజయ్యని గట్టిగా పిలుస్తున్నట్టు అనిపించి మెల్లగా కళ్లు తెరిచి చూసాడు....ఎవరో తన ముందు కొరిమి పట్టుకుని తన వైపే ఎరుపు ఎక్కిన కళ్ళతో చూస్తున్నారు అనిపించి....ఒక్కసారిగా మైకం వదిలి పూర్తిగా కళ్ళు తెరిచి చూసాడు....అతని ఎదురుగా శాల్మలి వున్నాడు...నువ్వేంటి నాన్న ఇంట్లోకి వచ్చావు అని కల్లి తుడుచుకుంటూ అడిగాడు."


"శాల్మలి, నేను ఇంట్లోకి రావడం కాదు నువ్వు సారయ్యే ఇంటికి నుండి కాటికి వచ్చారు, ఏమైంది అసలు ఇప్పుడు సమయం రాత్రి అవుతుంది...ఎంత ప్రమాదం ఇక్కడ ఇలా వుంటే, అయినా మీరు ఇక్కడ ఎం చేస్తున్నారు...సారయ్య నేను చెప్పినట్టు మట్టి తీసుకువెళ్ళి తన ఇంటి చుట్టూ వేసుకున్నాడా,...సారయ్యని కూడా లేపూ, ఇద్దరూ లేచి పాకలోకి రండి అన్నాడు"


"అంజయ్యకి తల డిమ్ము గా వుండి, ఎం అర్దం కావడం లేదు, మెల్లగా సారయ్యను లేపి తనతో పాటు పాకలోకి తీసుకువెళ్ళాడు.. ముగ్గురూ కూర్చుని వున్నారు....అయింది అసలు ఇద్దరూ ఈ సమయంలో స్పృహ లేకుండా ఇక్కడ ఎందుకు పడి వున్నారు అని ఆడిగాడు శాల్మలి"


"అప్పుడు సారయ్య...ఏమయ్యా శాల్మలి...!! మా అయ్య శవాన్ని బయటకు తీసి దిక్కు మార్చి పండబెడతాను అంటే అంతలా భయపెట్టావు...నిన్న నేను పొద్దున్న ఒక చుక్క మత్తు వేసుకుని ఒక్కడినే సమాధి తవ్వి దిక్కు మార్చి పడుకోపెట్టి వచ్చాను...నాకేం అయింది ఇప్పుడు ఎం కాలేదు....నీ మాట వింటే నెలల తరబడి నేను ఇలాగే భయపడుతూ బ్రతికే వాడిని....నువ్వు చేయించాలేని పని కల్లు నాతో చేపించింది... అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు"


"శాల్మలికి అనుమానం వచ్చి ఒక్కసారి, పరుగున వెళ్లి చూసాడు....అక్కడి నుండి గట్టిగా అంజయ్యని పిలిచాడు.ఏమైనదో చూడాలి అని వేగంగా ఇద్దరూ వేగంగా శాల్మలి దగ్గరకు వెళ్ళారు....శాల్మలి ఎం మాట్లాడకుండా ఒక సమాధి వైపు చూస్తు ఉన్నాడు.... సారయ్య, అంజయ్య కూడా చూసారు.....ఒక్కసారిగ్గా ముగ్గురికి మతి పోయింది....సారయ్య వాళ్ళ నాన్న సమాధి చెక్కు చెదరకుండా అలానే ఉంది....ఇద్దరికీ తాగిన మత్తు దిగింది...అంతే అసలేం జరిగింది రాత్రి అని ఆలోచన మొదలుపెట్టారు..శాల్మలికి అనుమానం వచ్చి అటూ ఇటూ గమనించి చూడటం మొదలు పెట్టాడు....శాల్మలి చూపు ఒక దగ్గర ఆగింది.....మెల్లగా అంజయ్య వంక చూసి తాను చూస్తున్న దృశ్యాన్ని చూడమని సైగ చేసాడు...అంజయ్య శాల్మలి చూపించిన వైపు చూసి నివ్వెరపొయ్యాడు.ఎందుకంటే.....అక్కడ వేరొక సమాధి తవ్వి ఇప్పుడే పూడ్చినట్టు వుంది. సారయ్య మత్తులో వేరొక సమాధి తవ్వి దిశను మార్చి పడుకోపెట్టాడు. పైగా ఆ సమాధిలో ఉంది ఆ ఊరిలో పిచ్చి పట్టిన ఒక డాక్టర్"


" మెల్లగా అంజయ్య చేతులు వణకడం మొదలు అయ్యాయి... అంతటిలోకి సారయ్య వచ్చాడు.ఏమైనది శాల్మలి నువ్వు అంజయ్య కంగారు పడుతున్నారు అని అడిగాడు.అప్పుడూ అంజయ్య జరిగిన విషయం అంతా చెప్పాడు.ఓస్ దినికేనా ఇంత కంగారు......వాడు పిచ్చి డాక్టర్ అంటున్నారు వాడేం చేస్తాడు చెప్పు శాల్మలి అంటూ సారయ్య నవ్వడం మొదలు పెట్టాడు"


"అప్పుడు శాల్మలి……జ్ఞానం ఉన్న వాడు నవ్వితే ఒక అర్థం ఉంటుంది.జ్ఞానం ఉన్న వాడికి వాడు చెసే పని మీద ఒక పట్టు ఉంటుంది.అలాంటి వాళ్లు చనిపోతేనే వారి ఆత్మలు చాలా వికృతంగా, పైశాచికంగా మన మీద విరుచుకు పడతాయి,...అలాంటిది అసలు ఏం చేస్తున్నాడో తెలియని ఒక పిచ్చి వాడి ఆత్మ యొక్క చేష్టలు ఎలా ఉంటాయో ఆ యముడుకి కూడా తెలియవు...ఒక్కోసారి మతి లేని వాళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోయారు అని వాళ్ళకి తెలియక నిజ జీవితంలో ఎలా ఉంటారో అలానే ఉండటంకి ప్రయత్నం చేసి...నిజ జీవితంలో ఎన్నో ప్రాణాలు బలి తీసుకుంటారు...బ్రతికి ఉన్న పిచ్చి వాడి చేతిలో రాయి ఎంత ప్రమాదమో....దాని కన్నా కొన్ని వేల రెట్లు ప్రమాదం పిచ్చి వాడి ఆత్మ...దాని పిచ్చి ఆనందం కోసం ఏదయినా చేస్తుంది...ఆ పనులు పిచ్చి వాడీకి ఆనందం...మనకి ప్రాణ సంకటం అన్నాడు"


"శాల్మలి చెప్పిన మాటలు సారయ్య వెన్నులో వణుకు పుట్టించాయి...తప్పు మీద తప్పు చేశాను అని భయంతో నోట మాట రావడం లేదు.అంతలోకి శాల్మలి జరిగింది ఎదో జరిగింది నువ్వు నీ నాన్న సమాధి మీద నుండి మట్టి తీసుకుని ఇంటికి వెళ్ళు...ఈ పిచ్చి వాడి సమాధిలో ఆత్మ ఇరుక్కుని ఉందొ నువ్వు చేసిన పనికి స్వేచ్ఛగా రంకెలు వేస్తూ ఊరు మీద పాడిందో నేను అంజనం వేసి కనుక్కుని చెప్తాను....నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు , ప్రకృతికి విరుద్ధమైన ఒక శక్తిని నువ్వు అవమానించావు...శక్తికి పరిమితి ఉంటే పర్లేదు...కానీ ఇక్కడ అలా లేదు....జాగ్రత్త అన్నాడు"


"సారయ్య ఇంటికి తన తండ్రి సమాధి నుండి మట్టి తీసుకుని వేగంగా ఇంటికి వెళ్లి ఇంటి చుట్టూ జల్లి, తన భార్య పిల్లలతో ఒకే గదిలో కూర్చుని ఉన్నారు... శాల్మలి అంజనం వేసి చూసాడు ఆ పిచ్చి వాడి ఆత్మ సమాధి నుండి బయటపడి కొన్ని ఘడియలు అయ్యాయి...శాల్మలికి సారయ్య ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థం అయింది...అంతే వేగంగా సారయ్య చేసిన పనికి ముగింపు ఎలా పలకాలో అని తన తండ్రి ఇచ్చిన కొన్ని పుస్తకాల్లో వెతుకుతూ ఉన్నాడు"


"చీకటి ఆకాశంలో అవధి లేకుండా విచ్చలవిడిగా పరుగులు తీసింది..గ్రామంలో చీకటి అలముకుంది,,,,,కంటి రెప్పలు భారంగా కిందకి పడుతుంటే గుండెలో భయం వాటిని తట్టి తట్టి పైకి లేపుతున్నాయి....కాని సుఖాన్నికి అలవాటు పడిన దేహం కదా కంటిరెప్పల, గుండెచప్పుడు భయాల మధ్య కంటిరెప్పలు గెలిచి మెల్లగా వాటి ధర్మం అవి నిర్వర్తిస్తున్నాయి...సారయ్య కుటుంబం మెల్లగా నిద్రలోకి జారుకుంది.అంజయ్య కుటుంబం కూడా మెల్లగా నిద్ర పోయారు.......వాళ్లకి తెలీదు నిద్రలో ఉన్న సుఖాన్ని వాస్తవంలో నాశనం చెయ్యడంకి మతిలేని శక్తి గతి తప్పి తమ వైపు వస్తుంది అని"


"ఒక పక్క శాల్మలి సారయ్య కుటుంబాన్ని ఎలా కాపాడాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు... తన దగ్గర ఉన్న అన్ని పుస్తకాలు తిరగేస్తున్నాడు"


"ఇంకో పక్క అంజయ్య సారయ్య ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెలుగు కోసం చీకటిలో పడికాపులు కాస్తున్నారు"


"అంజయ్య తన ఇంటి చుట్టూ తన తండ్రి శాల్మలి ఇచ్చిన కొంత భస్మాని నీటిలో కలిపి ఒక రక్ష వేసుకున్నాడు......ఏదయినా జరిగి శాల్మలి చనిపోతే తాను అనగతొక్కిన ప్రేతాలు తన కుటుంబంని ఎం చెయ్యకూడదు అని ముందు జాగ్రత్తగా ఇచ్చాడు అది....ఇప్పుడు ఉపాయోగపడింది"


"సారయ్యకి మెళకువ వచ్చింది.....,ఎవరో ఇంట్లో అటు ఇటు తిరిగుతూ ఉన్న చప్పుడు వస్తుంది.....మంచం మీద నుండీ పైకి లేచి తన కూతురిని తన భార్య పక్కన పడుకోబెట్టి గదిలో నుండి బయటకు వచ్చి గదికి ఘడియ పెట్టి వెనక్కి తిరిగాడు...అకస్మాత్తుగా ఎవరో తన ముందు మాసిన బట్టలతో నిలబడ్డారు....ఒక్కసారిగా సారయ్యకి గుండె జారినట్టు అయ్యింది....వణుకుతూ మెల్లగా సారయ్య అతని దగ్గరకు వెళ్లాడు... ఎవరు నువ్వు అంటూ చాలా దగ్గరకు వెళ్ళాడు....అతను ఏదో చెప్తున్నాడు..అతని శ్వాస చాలా గాఢంగా ఉంది.......అతని చేతి చివరి నుండి రక్తం కారుతూ వుంది.... సారయ్యకి ఎవరో గది తలుపుని కొట్టినట్టు అనిపించే వెనుకకి తిరిగి మళ్ళీ అతని వైపు చూసాడు....అంతే ఒక్కసారిగా ఆ పిచ్చి వాడు అరుస్తూ వచ్చి సారయ్య పీక గట్టిగా కొరికాడు....వేడి రక్తం పిచ్చి వాడి నోటికి సారయ్య మెడ మధ్య నుండు కారుతూ సారయ్య శరీరం అంతా రక్తంతో నిండి పోయింది....సారయ్య గట్టిగా కేకలు పెడుతున్నాడు కళ్ళు మూసుకుని కాపాడండి కాపాడండి అంటూ...సారయ్య కళ్ళు తెరిచి చూశాడు... తన ముందు ఎవరూ లేరు....భయం భయం కంగారుగా మెడ పట్టుకుని చూసుకున్నాడు....మెడ నుండి రక్తం కారుతూ ఉంది"


"కారుతున్న రక్తంని తన భుజం మీద వున్న టవల్తో వత్తి పట్టుకుని, వంట గదిలోకి వెళ్లి కుండ లో ఉన్న నీళ్లు తీసుకుని మెడ మీద పోసుకుని అద్దం ముందు నిలబడి, మెడని చూస్తూ వున్నాడు....గాయం చాలా పెద్దగా ఉంది. మెడ చుట్టు టవల్ గట్టిగా కట్టుకుని గదిలోకి వెళ్లడం కి ప్రయత్నం చేస్తున్నాడు....అంతటిలోకి ఎవరో వెనుక నుండి తన షర్ట్ పట్టుకుని లాగి గోడ కేసి కొట్టారు... స్పృహ కోల్పోయాడు సారయ్య"


"కొన్ని నిమిషాల తర్వాత సారయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు, తన ముందు ఎవరో నిలబడినట్టు, తన నోటికి టవల్ గట్టిగా బిగ్గించి కట్టి ఉంది....కళ్ళు మసక తగ్గింది..... చాలా వికృతంగా ఉన్న పిచ్చి వాడి ఆత్మ తన కళ్ళ ముందు ఉంది...దాని చేతిలో బొంతలు కుట్టే దబ్బలం ఉంది.... ఏదో గోనుకుంటూ మరొక చేతిలో ఉన్న పురుకూసని దాంట్లోకి ఎక్కిస్తోంది..... సారయ్య చూస్తునాడు అని గమనించి అతని వైపు గుర్రుగా చూస్తూ అతని తల పక్కకి వంచి , దబ్బలంతో గట్టిగా గాయం అయిన చోట కుట్టడం మొదలుపెట్టింది...సారయ్యకి పుండు మీద కారం చల్లినట్టు అయింది...అది గట్టిగా పొడుస్తూ అలా కుడుతూ ఉంది... సారయ్య నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉన్నాడు.... కానీ అతని నోటిని కట్టేయడం వల్ల శబ్దం పెద్దగా రావడం లేదు...దబ్బలంతో పొడిచిన ప్రతీసారి కుట్టు నుండి రక్తం కారడం మరీ ఎక్కువ అవుతుంది... గాయం పురుకూస కుట్లుతో మూసుకుపోయింది...మెల్లగా సారయ్య స్పృహ కోల్పోడం మొదలు అవుతుంది..... రక్తం ఎక్కువ కారడం వల్ల"


"శాల్మలికి సారయ్యని కాపాడడం కొసం ఒక ఉపాయం తట్టింది....వెంటనే అంజయ్య ఇంటికి పరుగున వెళ్లి అంజయ్యని సారయ్య ఇంటి చుట్టూ వున్న సారయ్య తండ్రి యొక్క సమాధి మట్టి రక్షని తొలిగించమని చెప్పి మళ్లీ శ్మశానంకి వెళ్ళిపోయాడు....అంజయ్య సైకిల్ వేసుకుని సారయ్య ఇంటికి వేగంగా తొక్కుకుంటు వెళ్తున్నాడు"


"మరొక పక్క సారయ్యాకి మళ్ళీ స్పృహ వచ్చింది... మెల్లగా మెడ పట్టుకుని గది వైపు వెళ్ళాడు....గది తలుపు ఓపెన్ చేసి ఉంది....కంగారుగా లోపలకి వెళ్లి చూసాడు.లోపల తన భార్య నిద్రలో వుంది తన పిల్ల మట్టికి లేదు...తన భార్యని లేపి పిల్ల ఎక్కడుంది అని అడిగితె తెలీదు అని చెపుతూ సారయ్య మెడ నుండి రక్తం చూసి బోరున ఏడవడం మొదలు పెట్టింది.... ఇద్దరూ కలిసి ఇల్లు మొత్తం వెతకడం మొదలు పెట్టారు.....వంట గది నుండి ఏవో శబ్దాలు వస్తున్నాయి....అది గమనించిన సారయ్య వేగంగా నడుస్తూ లోపలకి వెళ్ళాడు.....లోపల నేల మీద కూతురు పడుకుని ఉంది....ఆమె మీద వంట గదిలో వాడే కత్తిపీట,అట్ల పేనం , ఇంకా కొన్ని గాల్లో ఆమె వంట్లో దిగడంకి సిద్ధంగా ఉన్నాయి...ఆమె పక్కనే ఆత్మ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉంది...శబ్దం చెయ్యకుండా మెల్లగా పిల్ల దగ్గరకు వెళ్తున్నాడు..."


"శాల్మలి శ్మశానంలో సారయ్య తండ్రి సమాధి తవ్వి , అతని ఆత్మతో మాట్లాడానికి ప్రయత్నం చేస్తున్నాడు.... శాల్మలి మంత్రాలు ఫలించి సారయ్య తండ్రి ఆత్మ శాల్మలితో మాట్లాడటంకి ఒప్పుకుంది...సారయ్యాని నువ్వు కాపాడితే నీకు నేను ఈ సమాధి నుండీ స్వేచ్చని ప్రసాధిస్తాను అలాగె సారయ్యతో నీకు మళ్లీ శాస్త్రోక్తంగా నీ కర్మ జరిపించి నీకు పున్నామ నరకం నుండి విముక్తి కాలిపిస్తాను.... కానీ నువ్వు ఇంక సారయ్య కుటుంబం మీద వక్ర దుష్టి తో చూడటం మానెయ్యలి....నువ్వు ఆ పిచ్చి పట్టిన ఆత్మని తిరిగి నేను సిద్ధం చేసిన ఈ సమాధిలో పడుకొబెట్టాలి...అప్పుడే నేను నీకు చెప్పినవి అన్నీ చేస్తాను అన్నాడు.....శాల్మలి మాటలకి ఒప్పుకున్న సారయ్య తండ్రి ఆత్మ బయటకు వచ్చి సారయ్య ఇంటి వైపు ఊలలు వేసుకుంటూ వెళ్ళింది.......మరో పక్క అంజయ్య ఇంటి చుట్టూ వున్న రక్షని తొలగించాడు..."


" సారయ్య మెల్లగా తన కూతురి కాళ్లు పట్టుకుని పక్కకి లాగడం ఆత్మ గమనించి, కత్తి పీటని పొట్టలో వేగంగా దింపడంకి ప్రయత్నించింది...... కాని కన్నురెప్ప తేడాలో సారయ్య పిల్లని లాగేసి అక్కడ నుండి బయటకు వచ్చేసాడు...బయటకు వచ్చి అటూ ఇటూ తిరిగి చూసాడు ఎక్కడా సారయ్యాకి తన భార్య కనపడలేదు.... తన కూతుర్ని ఒక బీరువాలో పెట్టి నేను పిలిచేంత వరకు బయటకు రావద్దు అని చెప్పి తన భార్య కోసం వెళ్ళాడు"


"అంతటిలోకి సారయ్య తండ్రి ఆత్మ ఇల్లు చేరింది... అంజయ్య ఇంటి చుట్టూ ఉన్న రక్ష చేరిపేశాడు.. సారయ్య ఆత్మ లోపలకి ప్రవేశించి పిచ్చి ఆత్మ కోసం ఇల్లు మొత్తం అటూ ఇటూ కలయతిరుగుతుంది..... సారయ్య తన తండ్రి ఆత్మ ఇంట్లోకి రావడం గమనించి, అది కూడా తనని చంపడంకి వచ్చిందేమో అనే భయంతో సమాధి మీద మట్టి కొంచెం తన చేతితో పట్టుకుని భార్య కోసం వంటిల్లోకి వెళ్లాడు......"


"శాల్మలి తన శక్తికి మూలం అయిన తన పూర్వీకుల భస్మాని మట్టితో కలిపి ఒక సమాధి తవాడు.....సారయ్య తండ్రి ఆ పిచ్చి ఆత్మని తీసుకువస్తే దీంట్లో బంధించి భూస్థాపితం చెయ్యాలి అని అనుకుంటున్నాడు....."


"సారయ్య వంటిల్లోకి ప్రవేశించాడు...అక్కడ ఆమెను ఆ ఆత్మ కత్తిపీటతో చేతులు కాళ్లు కోసేసి రక్తం కారతుంటే నోరు పెట్టి తాగుతూ ఉంది.....అదే గదిలోకి సారయ్య తండ్రి ఆత్మ కూడా వచ్చింది... సారయ్య తండ్రి ఆత్మ పిచ్చి ఆత్మని జుట్టు పట్టుకుని లాగుతున్నాడు...పిచ్చిది తప్పించుకుని తండ్రి ఆత్మ విరుచుకు పడింది...ఆ రెండింటిని చూసిన సారయ్య భయం మరింత పెరిగింది.... అంతే తన చేతిలో ఉన్న సమాధి మట్టిని ఆ రెండింటి మీద జల్లాడు....ఆ మట్టి సారయ్య తండ్రిది అవ్వడం వల్ల ఆతని శక్తి తగ్గింది.... పిచ్చి ఆత్మ రెట్టింపు శక్తితో తండ్రి ఆత్మని అనగతొక్కుతుంది"


"పిచ్చి ఆత్మ బలాన్ని తట్టుకోలేక ....తండ్రి ఆత్మ బయటకు పారిపోయింది....అంతే పిచ్చి ఆత్మ సారయ్యాని అతని భార్యను ఒక్కసారి గోడకేసి బలంగా కొట్టి ఇద్దరిని లాక్కుని వెళ్తుంది..... బయట నుండి వేగంగా అంజయ్య లోపలకి వచ్చి కొంత మట్టిని ఆత్మ మీద జల్లాడు....అంతే ఆ ఆత్మ అంతా ఒక్కసారిగా మండటం మొదలుపెట్టింది....అది దాని సమాది మీద మట్టి...బయటకు వెళ్ళిన తండ్రి ఆత్మ అంజయ్యని స్మశానం కి వెళ్లి మట్టి తెచ్చి జల్లమని చెప్పింది.....పిచ్చి ఆత్మ కి బలం తగ్గడం వల్ల తండ్రి ఆత్మ పిచ్చి ఆత్మ పీక పట్టుకుని స్మశానం వైపు ఈడ్చుకుని వెలుతుంది.....శాల్మలి తవ్విన సమాధిలో పిచ్చి ఆత్మని పట్టుకుని తండ్రి ఆత్మ దిగింది.... అంతే శాల్మలి రెండు ఆత్మలను భందించాలి అని పూర్వీకుల బూడిద కలిసిన మట్టిని రెండిటి మీద పోసి....అవి అర్తనాధాలు చేస్తుంటే తన జపమాల తెంపి పూసలు కూడా సమాధిలో వేసి వాటిని భూస్థాపితం చేసాడు."


"శాల్మలి తన శక్తులు అన్ని కోల్పోవడం వల్ల...అప్పటి వరకు అదును కోసం.... గోతి కాడ కుక్కలలాగా వేచి చూస్తున్న మిగిలిన ఆత్మలు శాల్మలి మీద విరుచుకుపడి అతని శరీరం ని ముక్కల ముక్కలుగా చేసి అతి దారుణంగా చంపాయి...మెల్లగా తెల్లవారింది"


"కొన్ని రోజుల తరువాత....అంజయ్య సారయ్య ఇద్దరూ శాస్త్రోక్తంగా సారయ్య తండ్రికి అలాగే శాల్మలికి కర్మ ఖాండలు చేసారు........రోజులు మెల్లగా గడిచాయి...నిజం గతంలో కలిసింది....భయం కాలం తెచ్చే ఆనందంలో మరుగున పడింది........

Rate this content
Log in

More telugu story from యశస్వి రచన

Similar telugu story from Horror