యశస్వి రచన

Fantasy

3  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్ -3

టైం మెషిన్ -3

6 mins
359Date@20/06/2143

Time@Around 14:00

Place@Some where in coastal zone


"జియా హాస్పిటల్ లోకేషన్ నీ సెట్ చేసుకుని మ్యాప్ ను ఫాల్లో అవుతూ నడుస్తూ వుంది.జియా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొలది ఆక్సిజన్ స్థాయి క్రమం గా తగ్గుతుంది"


"మాస్టర్ వాళ టీమ్ తో హాస్పిటల్ చేరుకున్నాడు.వాళ్ళ టీమ్ తో హాస్పిటల్ లో వున్న అన్ని ఫ్లోర్ లు వెతుకుతున్నారు ఆక్సిజన్ సిలిండర్లు కోసం.అంతటి లోకి జియా హాస్పిటల్ చేరుకుంది.ఆమె కూడా వెతకటం మొదలు పెట్టింది.జియా విప్లవ కారులను చూసింది.భయం తో ఒక చోట వుండి పోయింది.ఆమె భయం వల్ల ఆక్సిజన్ యుసేజ్ పెరిగి సిలిండర్ లో ఆక్సిజన్ మొత్తం అయిపోయింది. ఆమె మెదడు ఆక్సిజన్ లేకపోవటం వల్ల హైపాక్సియా కండీషన్ కి వెళ్లి స్పృహ కోల్పోయి కింద పడింది.ఆమె తో పాటు ఆక్సిజన్ సిలిండర్ కూడా కింద పడటం వల్ల పెద్ద గా శబ్దం వచ్చింది.అంతే మార్ష్ అండ్ తన టీమ్ జియా వున్న ప్లేస్ కి వచ్చి ఆమెను చూసారు.ఆమె పరిస్థితి అర్దం చేసుకున్న మాస్టర్ ఆమెకు బ్రీతింగ్ లైన్ కి ఒక ఫిల్టర్ నీ అటాచ్ చేసి రేడియేషన్ వున్న వాతావరణం లోకి వదిలాడు.కొన్ని నిమిషాలు తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది"


"మెల్లగా కళ్లు తెరిచింది.విప్లవ కారులు అందరూ చాలా వికృతం గా వుండి తన వైపే చూస్తున్నారు.ఒక్కసారిగా భయం తో తన గన్ గురించి వెతికింది.కానీ అది లేదు.చూస్తే మాస్టర్ చేతిలో వుంది"


"అప్పుడు మాస్టర్ నువ్వు ఎలా ఇక్కడకి వచ్చావు అని అడిగాడు"


"అపుడు జియా మొత్తం విషయం పూస గుచ్చినట్టు చేపింది"


"మాస్టర్ కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది.తన బండి లో వున్న ఫ్యూజన్ ఎనర్జీ డిటెక్టర్ నీ ఆన్ చేసి చూస్తున్నాడు. దగ్గరలో నే ఆ టైమ్ ట్రావెలర్ వున్నాడు కదా అని అడిగాడు మాస్టర్.అవును అంది జియా.నువ్వు ఆ టైమ్ ట్రావెలర్ దగ్గరకు తీసుకు వెళితే నేను మీకు సహాయం చేస్తాను నా దగ్గర ఫ్యూయల్ తో పాటు చాలా ఆక్సిజన్ సిలిండర్లు వున్నాయి.నా వల్ల మీకు మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. నువ్వు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని అంటాడు"


"ఆమె సబ్మెరైన్ నీ కాంటాక్ట్ చేసి సమీర్ కి విషయం చెప్పింది.అప్పుడు సమీర్ మాష్టర్ నీ జియా వంటి మీద వున్న కెమెరా ద్వారా చూసి అతను మనకు హెల్ప్ అవుతాడు తీసుకు రా అని చెప్పి కమ్యూనికేషన్ కట్ చేశాడు"


"జియా అలాగే మాస్టర్ ఇద్దరు కలసి సబ్ మెరైన్ దగ్గరకు వస్తున్నారు. అదే సమయంలో మార్ష్ తన గ్యాంగ్ తో దాడి చేయటానికి వస్తున్నాడు.కానీ మార్ష్ వాళ్ళ దగ్గర మాస్టర్ వుండటం చూసి కొన్ని ఫోటోస్ తీసుకునీ,. వాళ్ళని ఫాల్లో అవ్వటం మానేసి తిరిగి వాళ్లు వుంటున్న స్థావరాల కి వెళ్ళిపోయాడు"


"సబ్ మెరైన్ లో ప్రి ఎంట్రీ ఛాంబర్ ఓపెన్ అయ్యింది ఇద్దరు లోపలికి వచ్చారు.సమీర్ అతని తీక్షణంగా చూసి తన దగ్గర ఉన్న గన్ తీసుకుని మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు.అందరూ ఎం జరుగుతుందో అని ఆశ్చర్యం గా చూస్తున్నారు.సమీర్ అతని దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా హగ్ చేసుకుని హై దరణ్ ఎలా ఉన్నావ్ అని అడిగాడు.అంతే అందరూ షాక్"


(కొన్ని నిమిషాల తర్వాత.సమీర్ అండ్ మాస్టర్ కి మద్య సంభాషణ)


"సమీర్ ఆ టైమ్ లూప్ నుండి నువ్వు ఎలా బయటికి వచ్చావు"


"ఆ టైమ్ లూప్ లో నేను వున్నపుడు మీరు సెట్ చేసిన టైమ్ కంటే ఒక వంద సంవత్సరాలు ముందుకు వెళ్లాను కానీ. ఆ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వల్ల నేను ఆ వంద సంవత్సరాలు ఆ టైమ్ లూప్ లోనే గడిపాను.సో నా బాడీ లో వున్న ఆర్గాన్స్ అన్నీ పరిణితి చెందటం ఆపేసాయి. ఒక్క నా హేర్ తప్ప"


"అంటే నీకు ఇప్పుడు 125 సంవత్సరాల కుర్రాడు అయితే"


"అవును"


"నేను నువ్వు తిరిగి వస్తావు అని నమ్మకం తో ఒక ఫ్యూజన్ ఎనర్జీ డిటెక్టర్ రెఢీ చేసి కొన్ని సెన్సర్స్ నీ మన ల్యాబ్ లో మీ ఇంట్లో ఇలాగ ప్రోపాబిలిటీ వున్న అన్నీ ఏరియాలో మానిటర్ చేస్తున్నాను.కానీ యుద్ధం వల్ల అవి అన్నీ పోయాయి.ఇది ఒక్కటే మిగిలింది.ఒక వారం క్రితం మేము సెక్టార్ గ్రేడ్ సేవెన్ లో ఫ్యూయల్ కోసం వెళ్ళినప్పుడు., నాకు సిగ్నల్ వచ్చింది.బహుశా అది డిటెక్టర్ లో ఏదైనా లోపం వల్ల వచ్చింది ఏమో అని పట్టించుకోలేదు"


"అది నేనే ధరణ్"


"నాకు నువ్వే అని అనుమానం వుండేది. ఎందుకంటే కింద వున్న వాళ్లు మన బేస్ కి వెళ్లి టైమ్ మెషిన్ తేవాలి అని ఎప్పుడు అనుకున్నారో అప్పుడు నా అనుమానం బలపడింది.కానీ నేను కొన్ని సెన్సర్స్ నీ లోపలకి పంపాను.కానీ నాకు మళ్లీ సిగ్నల్స్ రాలేదు"


"ఓహ్ అదా, నాతో పాటు ఇక్కడ వున్న సమీర్ నీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని నేనే ఒక ట్రాన్స్మిటర్ ద్వారా ఫాల్స్ సిగ్నల్స్ క్రియేట్ చేసి నా ఎనర్జీ డిటెక్ట్ కాకుండా జాగ్రత్త పడ్డాను. జస్ట్ నేను ఇప్పుడే ఆ ఫాల్స్ సిగ్నల్స్ నీ ఆపేసాను"


(సమీర్ అండ్ ధరన్ ఇద్దరి మధ్య సంభాషణ ను జియా వాళ్లు తెల మొహాలు వేసి చూస్తున్నారు.వాళ్ళను గమనించిన సమీర్)


"సారీ ఫ్రెండ్స్ నిజానికి ధరణ్ ఒక పి హెచ్ డి హోల్డర్ ఇన్ క్వాంటం ఫ్లూయిడ్ మెకానిక్స్.నాతో పాటే ఇండియాలో టైమ్ మెషిన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశాడు. స్టెబుల్ గా వుండే ఎనర్జీ కోసం నాతో పాటు ఇతను కూడా బాగా కష్టపడ్డాడు.ఇక్కడ వున్న ఇండియా కి చెందిన ఫ్యూయల్ రిజెనరటర్ లో సాంకేతిక సమస్య వచ్చింది.అప్పుడు ఇక్కడికి వచ్చాడు"అని చెప్పాడు సమీర్.


"అంతటి లోకి ధరణ్ వాడుతున్న ఫిల్టర్ బ్లాక్ అయ్యి హైపాక్సియ కండీషన్ లోకి వెళ్లతాడు.వెంటనే కేన్ అండ్ వైట్ అతని బ్లాక్ అయిన ఫిల్టర్ తీసివేసి రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన అతడి బాడీ టిస్యులను ఆర్టిఫీషియల్ టిష్యూ రిజెనారేటర్ ద్వారా కొంత వరకు క్యుర్ చేస్తారు.అతను ఇంకా స్పృహ లేకుండా పడివున్నాడు"


(ఒక గంట తర్వాత)Date@20/06/2143

Time@Around 22:55

Place@Some where ocean


"జియా నే కళ్ళు రెడ్ గా మారాయి ఎంటి అని అడిగాడు కేన్.అప్పుడు బయట జరిగిన విషయం మొత్తం చెప్పి తన దగ్గర ఉన్న ఆ ఫిల్టర్ అతనికి ఇస్తుంది"


(కొన్ని రోజుల ప్రయాణం తర్వాత)Date@03/07/2143

Time@Around 09:05

Place@Some where in ocean Arabian sea


"ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొన్ని గంటలలో మనం ముంబై పోర్ట్ చేరుకోబోతున్నాము.సో మనకి కావాల్సిన అన్నీ వస్తువులు తీసుకుని రెఢీ గా ఉండండి.మనం చాలా త్వరగా వెళ్లి త్వరగా వెనక్కి వచ్చేయాలి.మనం ఎక్కువ సేపు ఇండియా లో వుంటే చాలా ప్రమాదం. కారణం ఇండియా మీద సోవియట్ యూనియన్ అండ్ పాకిస్థాన్ కక్ష కట్టి మరీ వేపరైజెడ్ న్యూక్లియర్ ఆట్టాక్ చేశారు.సో మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ రేడియేషన్ తీవ్రత చాలా ఎక్కువ వుంటుంది.అలాగే ఇక్కడ సర్ఫెస్ వారియర్స్ ఎక్కువ వుండే అవకాశం ఉంది"అని అంటాడు సమీర్.


"సబ్ మెరైన్ తీరం దగ్గరకు వచ్చింది.హై త్రెషోల్డ్ రేడియేషన్ అలారం చూపిస్తుంది. జియా తప్ప అందరూ రెఢీ గా వున్నారు.ముంబై నుండి దక్షిణ నోయిడా కి సుమారు ఒక రోజు పడుతుంది మనం కారు లో వెళితే మనం ముందుగా పోర్ట్ లో వుండే ఎమర్జెన్సీ కాప్టర్ గురించి వెతికి అది లేకపోతే మనం అప్పుడు బై రోడ్డు వెళ్దాం అంటాడు కేన్"


"జియా సబ్మెరైన్ ను డీ ప్రెషర్ చేసి సముద్రం ఉపరితలం మీదకి తీసుకు వచ్చింది.ప్రి ఎక్సైట్ వాల్వ్ ఓపెన్ చేసి ఒక లైఫ్ బోట్ ద్వారా పోర్ట్ కి చేరుకున్నారు. ఎక్కడ చూసినా బాగా స్మోక్ వుంది.మనిషి జాడ ఎక్కడా కనిపించలేదు. వైట్ తన దగ్గర ఉన్న వున్న ప్రోటో టైప్ బయో సెన్సర్స్ నీ రిలీజ్ చేసాడు అవి వాళ్ళకి కొని మీటర్స్ రేడియన్ లో ఎవరైనా ప్రాణాలు తో వుంటే వాళ్లు పీల్చే శ్వాస వేగం ఆధారంగా వాళ్ళని కనిపెట్టి వైట్ దగ్గర వున్న స్క్రీన్ మీద లొకేషన్ చూపిస్తుంది"


"ఎప్పుడూ జనం తో వుండే పోర్ట్ లో ఒక్క మనిషి కూడా లేడు. అంతా చాలా నిశబ్దం గా వుంది.అంతా దుమ్ము ధూళి తో వుంది.ఎటు చూసినా స్మోక్ వుంది.అందుకే అందరూ నైట్ విజన్ కెమెరాలు అండ్ గ్లాసెస్ వాడుతున్నారు.పోర్ట్ మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయ్యారు.పోర్ట్ అంతా బాంబుల దాడి వల్ల చినాభినాం అయింది అస్సలు గుర్తు పట్టే విధంగా గా కూడా లేదు. అక్కడ కాప్టార్ వుండే అవకాశం లేదు అని అందరూ భావిస్తున్నారు"


"అంతటి లోకి వైట్ దగ్గర వున్న స్క్రీన్ మీద పోర్ట్ లో ఎవరో ప్రాణాలతో వున్నట్టు చూపిస్తుంది.అందరూ అప్రమత్తం అయ్యి గన్స్ నీ ట్రిగ్గర్ చేసి ఆ లొకేషన్ వైపు వెళతారు.వాళ్లు ముందుకు వెళ్లే కొలది ఆ సిగ్నల్ స్త్రెంగ్త్ పెరుగుతూ ఉంది.చివరికి ఆ సిగ్నల్ ను కనిపెట్టారు అది పోర్ట్ లో వున్న ఒక కాంటెనర్ నుండి వస్తుంది.సమీర్ డోర్ ఓపెన్ చేస్తూ వున్నాడు మిగతా వాళ్ళు ఎయిమ్ చేసి రెఢీ గా వున్నారు.సమీర్ ఒక్కసారిగా డోర్ గట్టిగా లాగాడు అంతే దాని నుండి గబ్బిలాలు, ఎలుకలు పదుల సంఖ్యలో బయటకి వచ్చాయి.ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు.లోపలికి లైట్ వేసి చూస్తే కంటేనర్ నిండా మనుషుల శవాలు వున్నాయి.అవి ఈ శవాలను పీకునీ తిన్నాయి.ఆ దృశ్యం చూడటానికి చాలా భయం గా వుంది.వెంటనే కంటేనార్ మూసి ముందుకు నడుస్తూ ఉన్నారు"


"వాళ్లకి పోర్ట్ లో వున్న హెడ్ సెక్యూర్టీ రూమ్ కనిపించింది.దాంట్లోకి ప్రవేశించారు.అక్కడ వున్న సిస్టమ్స్ నీ యూ పి యస్ పవర్ తో ఆన్ చేసి, పోర్ట్ నీ మానిటర్ చేసే కెమెరాలాను ఆక్టివేట్ చేసి కాప్టర్ కోసం వెతికారు. నార్కోటిక్ విజిలెన్స్ మానిటరింగ్ రూమ్ కి పక్కన ఒక మినీ కాప్టర్ వుంది.కానీ ప్రతీ మిని కాప్టర్ లో ఒక ఎన్క్రిప్టెడ్ లాక్ వుంటుంది లేకపోతే ఒక బయో స్కానర్ వుంటుంది. అంటే ఏదైనా ఒక లైవ్ ఫామ్ కు సంబంధించిన ఫింగర్ గాని ఐరిస్ గాని అలాగే హార్ట్ రేట్ గాని స్కాన్ చేసి అదరిజేషన్ చేయాలి, అప్పుడు కానీ అది ఆన్ అవదు"


"అందరూ కాప్టర్ దగ్గరకు వెళ్లారు.అక్కడ దాన్ మీద ఫింగర్ స్కానర్ వుంది.సమీర్ కి ఒక ఆలోచన వచ్చింది.వెంటనే కేన్ నీ తీసుకుని ఆ కాంటేనర్ దగ్గరకు వెళ్ళాడు.ఆ శవాల మద్య వున్న పైలట్ శవాన్ని బయటకు లాగాడు.కేన్ ఆ శవాన్ని బయటకు లాగుతుంటే అతడి బాడీ నుండి అవయవాలు వేరు అవుతున్నాయి.అతడి రెండు చేతులని నరికి వాటిని ఫర్మాల్డిహైడ్ లో కొన్ని నిమిషాలు సోక్ చేసి అతని వేళ్ళతో ట్రై చేసారు కాప్టర్ అన్లాక్ అయింది.సమీర్ ధరణ్ అలాగే కేన్ అండ్ వైట్ లోపలకి ఎక్కారు. వైట్ కాప్టర్ నీ డ్రైవ్ చేస్తున్నాడు.మరొక త్రీ హవర్స్ లో డెస్టినేషన్ రీచ్ అవుతారు""Date@03/07/2143

Time@Around 10:30

Place@Some where in surface Antarctica

(Time zone between India and Antarctica is just 30 minute's)


"మార్ష్ తన విప్లవ కారులందరిని ఒక చోట సమావేశ పరిచి మాస్టర్ గ్రౌండెడ్ వాళ్ళతో కలసి పోయాడు.ఆయన మనకు మోసం చేశాడు.తన సొంత లాభం కోసం మనల్ని వదిలేశాడు.ఇదిగో చూడండి అని తను తీసిన ఫోటోని అందరికీ చూపిస్తాడు.ఇప్పుడు మన మన ప్రాణాలు కాపాడుకోవాలి అంటే వాళ మీద దాడి చెయ్యాలి అదీ కూడా మరొక నెల రోజులు తర్వాత వాళ్లు వెనక్కి వచ్చి, కవచం లో వున్న ఎనర్జీ నీ వాడుకుంటే వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ భ్రీచ్ అవుతాయి.అప్పుడు మనం యట్టాక్ చేసి వాళ్ళ ప్లేస్ ను మనం హస్త గతం చేసుకోవాలి.ఈ నెల లోపు మనకు కావలసిన ఆయుధాలు అలాగే ఇంధనం నీ సమకుర్చండి.ఇక నుండీ నేనే మీ మాష్టర్ నీ అని అంటాడు మార్ష్"
"Date@03/07/2143

Time@Around 13:55

Place@Near to Noida Delhi


"మూడు గంటల ప్రయాణం తర్వాత సమీర్ తమ ఫస్ట్ డెస్టినేషన్ అయిన దక్షిణ నోయిడా కి చేరుకున్నారు"To be continued in next parts.....Rate this content
Log in

Similar telugu story from Fantasy