టైం మెషిన్ -1
టైం మెషిన్ -1
మూడవ ప్రపంచ యుద్ధం తర్వాతా
"చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి వున్నారు. వాళ్లు కూడా హై రేడియేషన్ నుండి తప్పించుకోవటానికి అంటార్టిక లో సుమారు పదివేల అడుగుల లోతులో న్యూక్లియర్ రేడియేషన్ కి దూరం గా వున్నారు. వాళ్ళ చుట్టూ వున్న ఫోటాన్ కవచం, నీటి కింద వున్న అధిక వత్తిడి నుండి వాళ్లు కట్టుకున్న ప్రపంచాన్ని కాపాడుతుంది.అలాగే భూమి పై ఉన్న వాతావరణం లో వున్న ఆక్సిజన్ విషపూరితం అయింది.భూమిమీద వివిధ దేశాలు ప్రయోగించిన అనేక అణు బాంబుు లు వల్ల భూమి వాతరణంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి.దాదాపు ట్రోపో స్పియర్ వరకు అణు ధార్మికత వుంది.వాటిని పీల్చిన జీవులు అనీ చచ్చి పోయాయి.నిజానికి భూమి మీద ఇప్పుడు పూర్తిగా నేల మీద జీవించే జీవరాశులు లో మనిషి ఒక్కడే మిగిలాడు.అందువల్ల వాళ్ళకి మంచి ఆక్సిజన్ అవసరం అయింది"
"నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ ని వాళ్లు ఉపయోగించుకునే వాళ్ళు.కానీ ఇంకా నీటిలో కరగటానికి పై వాతావరణం లో ఆక్సిజన్ లేదు.అందువల్ల క్రమం గా నీటిలో వుండే ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గుతుంది.దాని వల్ల సముద్రం లో నివసించే అనేక సునితమైన జీవులు చనిపోతున్నాయి.చివరికి విషయం గ్రహించిన మనుషులు సముద్రం లో అధిక సంఖ్యలో ఉన్న పెద్ద పెద్ద జీవరాశులను చంపేసి ఆక్సిజన్ వాడుకునే శాతాని తగ్గించారు.కానీ మరీ కొన్ని రోజులో వున్న ఆక్సిజన్ పోతుంది అలాగే కొన్ని సముద్ర తీరాల వెంబడి రేడియేషన్ ప్రభావం మొదలు అయ్యింది"
"దీనికి శాశ్వత పరిష్కారం కోసం కొంతమంది ఒక బృందం లాగా ఏర్పడి పరిష్కారం కోసం ప్రయత్నస్తున్నారు"
"రేడియేషన్ వున్న భూమి మీద కొంతమంది నివసిస్తున్నారు.వాళ్లు రేడియేషన్ వల్ల వాళ్ళలో చాలా మార్పులు వచ్చి వికృతం గా అయ్యారు.వాళ్ళకి ఆల్రెడీ రేడియేషన్ వుండటం వల్ల వాళ్ళని లోపలికి రానివటం లేదు.కానీ వాళ్ళు ఏదోవిధంగా గా లోపలికి రావాలి అని ప్రయత్నిస్తున్నారు.అందువల్ల ఎప్పుడు వీళ్ళ ఇద్దరి మద్య చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి.భూమి మీద వుండే వాళ్ళని విప్లవకారుల గా ముద్ర వేసి వాళ్ళ చర్యలను వీళ్ళు అనగతోకుతున్నారు.కానీ వాళ్లకి చాలా మంది సానుభూతి పరులు కింద వున్నారు.అందువల్ల వాళ్ళు ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నారు"
Meeting
Date@17/06/2143
Time@Around 14:15
Place@Antarctica Grounded "Photon energy research center-PERC(పెర్క్).
"ఇప్పుడు వున్న పరిస్థితుల్లో మనల్ని మనం అలాగే ప్రపంచం మొత్తనీ కాపాడాలి అంటే మన ముందు వున్న ఒకే ఒక్క దారి టైమ్ ట్రావెలింగ్" అన్నాడు వాంగ్.
(ఒక్కసారిగా సభలో ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్య పడి)
"ఇప్పుడు మనకు ఉన్న సమయంలో టైమ్ మెషిన్ కని పెట్టడం అసాధ్యం అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో అంత పరిజ్ఞానం వున్న వాళ్లు లేరు.అలాగే దానికి కావాల్సిన పవర్ సోర్సెస్ అలాగే పరికరాలు మన దగ్గర లేవు.సో ఇది అసాధ్యం మిష్టర్ వాంగ్" అని రాబర్ట్ అంటాడు.
"అంతటిలోకి వాంగ్ ఫ్రెండ్ సమీర్ లేచి,....
చూడండి ఇప్పుడు మనం కష్టపడి టైమ్ మెషిన్ కనిపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ రెఢీ గా వుంది.ఇండియా న్యూఢిల్లీ లో దక్షిన నోయిడా లో వున్న ఏరియా త్వేంటీ ఫోర్ లో సెక్టార్ ఫార్టీ సెవెన్ లో ఒక బంకర్ లో వుంది.నిజానికి నేను కూడా అక్కడే వర్క్ చేసేవాడిని కానీ నన్ను మా గవర్నమెంట్ ఒక పని మీద ఇక్కడకి పంపింది.అప్పుడే మూడవ ప్రపంచ యుద్ధం మొదలు అయ్యి నేను ఇక్కడ వుండి పోయాను.
ఇప్పుడు మనం చేయవలసిన పని. సముద్ర మార్గం ద్వారా ఇక్కడనుండి ఇండియా వెళ్లి ఆ టైమ్ మెషిన్ వున్న బంకర్ నీ ఇక్కడికి తీసుకురావాలి.మనం దానిని ఉపయోగించి గతంలోకి వెళ్లి ఇక్కడ మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ పరిణామాలు గురించి వాళ్ళకి వివరించాలి.అలాగే మూడవ ప్రపంచ యుద్ధం రావటానికి కారణం ఎవరో కనుకుని వాడిని ఆపాలి.
కానీ మనకి ఒక చిన్న సమస్య వుంది.ఆ టైమ్ మెషిన్ నీ యాక్టివేట్ చెయాలి అంటే మనకు చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. సో మనం ఆ ఎనర్జీ నీ మన చుట్టూ ఉన్న ఫోటాన్ కవచం నుండి తీసుకోవాలి అనుకుంటున్నాను" అంటాడు సమీర్.
(ఒక్కసారిగా అందరూ వద్దు అంటారు.మీటింగ్ హాల్ మొత్తం వద్దు వద్దు అన్న నినాదం తో రచ్చ రచ్చ గా వుంది.అందరూ ఎవరూ ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుకుంటున్నారు)
అప్పుడే కింగ్ లోపలికి వచ్చారు.ఆయన రాకతో మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు.
(నిజానికి కింగ్ అక్కడ సెక్యూరిటీ హెడ్.అని అధికారులు అతనికే వున్నాయి.అతడే విప్లవ కారులు నుండి, సముద్ర జీవాల నుండి ఆ కవచం నీ కాపాడుతున్నాడు.కింగ్ అలాగే సమీర్ మంచి స్నేహితులు.ఆ విషయం బయట ఎవరికి తెలియదు)
"అంటే మిష్టర్ సమీర్ నీకు, మనకి రక్షణ గా వున్న ఫోటన్ ఎనర్జీ నీ ఇస్తే నువ్వు ఈ పరిస్తితి నీ మారుస్తావ్ అంటావ్.కానీ నువ్వు విఫలం అయితే మనం బ్రతికే కొన్ని రోజుల గడువును నువ్వు తగ్గించి వాడివి అవుతావ్.అలాగే ఆ టైమ్ మెషిన్ నీ హ్యాండిల్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు.కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము మిమ్మల్ని నమ్మలేము.వేరే ఏదైనా మార్గం వుంటే ఆలోచించు అంటాడు కింగ్ సమీర్ తో"
"చూడండి ఫ్రెండ్స్ మన చుట్టూ వున్న ఈ కవచం ఎప్పుడు ఆఫ్ అవుతుందో మనకు తెలియదు.అలాగే పైన వున్న వాళ్లు ఎప్పుడు మన మీద యాట్టాక్ చేస్తారో తెలియదు.ఒక పక్క నుండి సముద్రం లో వున్న ఆక్సిజన్ ఖాళీ అవుతుంది.అలాగే సముద్రం లో నీరు కూడా ఆ రేడియేషన్ వల్ల విషపూరితం అవుతుంది.ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఎప్పుడు చస్తమో అన్న భయం తో బ్రతికే బదులు ఒక ఛాన్స్ తీసుకుని ట్రై చేద్దాం. ఒక వేళ విఫలం అయితే రేపు చావల్సిన మనం ఈ రోజే చేస్తాం కానీ ఒక వేళ మనం విజయం సాధిస్తే ఒక మంచి ప్రప
ంచాన్ని చూడ్డచు.కానీ గుర్తు పెట్టుకోండి.ప్రపంచం ఎప్పుడు మనం అనుకున్న విధంగా గా వుండదు"అని చెప్పి సమీర్ తన సీట్లో కూర్చున్నాడు.
(మీటింగ్ లో వున్న వాళ్లు అందరూ ఆలోచనలో పడ్డారు.కింగ్ కూడా ఆలోచనలో పడ్డాడు.కొన్ని నిమిషాల తర్వాత)
"సరే మిష్టర్ సమీర్ నీకు నీ టీమ్ కి మేము కొన్ని ఫోటాన్ ఎనర్జీ లో కొంత భాగం నీ ప్రయోగానికి ఇవ్వటానికి మేము ఒప్పుకుంటునాము.అలాగే నీకు సహాయం గా మా బృందం నుండి కొంత మంది నీ నీకు సహాయం గా ఇండియాకి పంపుతాను.నువ్వు ఈ ప్రయత్నం లో విజయం సాధించాలి అని కోరుకుంటూ ఈ మీటింగ్ నీ ముగిస్తున్నను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కింగ్"
"సమీర్ తన టీమ్ తో ఇండియా కి వెళ్ళటానికి సబ్ మెరైన్ తో పాటు మిగతా వాటిని రెఢీ చేసుకుంటున్నాడు"
Meeting
Date@19/06/2143
Time@Around 20:30
Place@ some where in Antarctica surface
"విప్లవకారులు అందరూ ఒక చోట మీట్ అయ్యారు.దాంట్లో చాలా మంది చావుతో పోరాడుతూ వున్నారు.వాళ్ళ హెడ్ ధరణ్.వీళ్ళు అందరూ ఉపరితలం మీద జీరో పాయింట్ వన్ మైక్రాన్ హెపా ఫిల్టర్ ద్వారా వచ్చే గాలిని పీల్చడం వల్ల రేడియేషన్ ప్రభావం నుండి దాదాపు కొంత శాతం తప్పించుకుంటున్నారు.ఈ ఫిల్టర్స్ గురించి ఉపరితలం మీద వాళ్ళలో వాళ్ళకే గొడవలు జరుగుతాయి.అవి కూడా చాలా తక్కువ వున్నాయి"
"మాస్టర్ ధరణ్ , భూమి కింద వున్న వాళ్లు ఆసియా ఖండం లో వున్న ఇండియాకి వెళ్తున్నారు.అక్కడ వున్న టైమ్ మెషిన్ తీసుకువచ్చి గతంకి వెళ్లి యుద్ధాన్ని ఆపాలి అనుకుంటున్నారు.అలాగే దాని కోసం వాళ్ళ ఫోటాన్ కవచం లో దాదాపు సగం ఎనర్జీ నీ ఉపయోగిస్తారు అంట.ఇది మనకి చాలా సరైన సమయం వాళ్లు వెళ్లే సబ్మెరైన్ నీ మనం దొంగలించి మనం వాళ్ళ స్థావరాలు లోకి వేళ్లచు.లేకపోతే ఆ కవచం లో ఎనర్జీ వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ సెక్యూర్టీ లెవెల్స్ అనీ బ్రీచ్ అవుతాయి.అప్పుడేనా మనం వెళ్ళచు"అంటాడు ఒక మార్ష్.
"చూడండి సోల్జర్స్, మన ఉదేశ్యం వాళ్ళని చంపటం కాదు.మనల్ని మనం కాపాడుకోవటం అంతే గాని ఎదుటి వాళ ప్రాణాలు తీయటం కాదు.ఒక వేళ వాళ్ళ టైమ్ మెషిన్ ప్లాన్ వర్కవుట్ అయితే మనకు కూడా లాభమే కదా యుద్ధం వుండదు.అంతా మారిపోతుంది.సో నేను చెపెంత వరకు ఎవరు కూడా వాలమీద కానీ వాళ స్థావరాల మీద గాని దాడి చేయవద్దు.సరైన సమయం కోసం మనం వేచి చూడాలి అప్పుడే మనకు మంచి ఫలితం వస్తుంది"అంటాడు మాస్టర్ ధరణ్.
కానీ మార్ష్ కి మాస్టర్ ధరణ్ చెప్పిన విషయం నచ్చలేదు.
(ధరణ్ ఒక క్వాంటం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో పి హెచ్ డీ చేసి.ఒక పరిశోధన నిమిత్తం ఇక్కడికి వచ్చి యుద్ధం ప్రభావం వల్ల ప్రభావితం అయిన ఉపరితల ప్రజలను ఒక దగర చేర్చి వాళ నీ కాపాడుతూ వున్నాడు.రేడియేషన్ నుండి తాత్కాలికంగా ఎలా తప్పించుకోవాలి అని వాళ్లకు నేర్పుతున్నాడు.వాళ్ళ ఉపరితలం మీద వున్న చాలా మందం అయిన గోడలు మద్య జీవిస్తున్నారు.)
Date@20/06/2143
Time@Around 03:45
Place@Sameer House
"చూడు వాంగ్ మనం ఎలా అయినా ఈ ప్రయత్నం లో విజయం సాధించి చరిత్రలో నిలవాలి.సబ్ మెరైన్ ఫ్యూయల్, ఆక్సిజన్ సిలిండర్లు, వెపన్స్ నేవిగటిర్స్ ఇలా ఏమేమి కావాలో అన్నీ తీసుకో ఏ ఒకటి మర్చిపోవద్దు.మనతో పాటు కింగ్ వాళ్ళ టీమ్ మెంబెర్స్ వస్తున్నారు గా ఆహారం కొంచెం ఎక్కువ ప్యాక్ చెయ్. నేను వెళ్లి ఇండియాలో ఉన్న ఆ ప్లేస్ కి వెళ్ళటానికి కో ఆర్డినెంట్స్ లాక్ చేసి మనకు దగ్గర దారిని వెతుకుతాను.ఈ రోజు సాయంత్రం మనం సముద్రంలో ఉండాలి"అంటాడు సమీర్.
"వాంగ్ అనీ సిద్ధం చేశాడు.సమీర్ ఒక మార్గాని లాక్ చేసి సబ్మెరైన్ నీ ఆటో పైలట్ మోడ్ లో పెట్టీ లాక్ చేసి వుంచాడు.అంతటి లోకి కింగ్ పంపిన ఏజెంట్స్ వచ్చారు వాళ్ళే టకాషి ఒక స్నిపర్, జియా ఒక ట్రాకర్, మరో ఇద్దరు కేన్ అండ్ వైట్ ఇద్దరు మంచి సముద్ర మార్గం నిపుణులు అలాగే అనేక యుద్ధాలు లో పాల్గొన్న అనుభవం వుంది"
Date@20/06/2143
Time@Around 06:34
Place@ Near to sea in Antarctica surface
"మన సానుభూతిపరులు వాళ్లు ప్రయాణిస్తున్న సబ్మెరైన్ లో ఒక లొకేషన్ ట్రాకర్ నీ వుంచారు.దానికి సంబంధంచిన నావిగేటర్ ఇది.ఇప్పుడు మనకి ఆ సబ్మెరైన్ ఏ మార్గం ద్వారా వెళ్తుంది అని మనకు తెల్సుతుంది.కాబట్టి మనం సరైన సమయం చూసి దాని మీద దాడి చేసి.దాని మన సొంతం చేసుకుని వాళ్ళ ఫోటాన్ కవచం దాటి లోపలకి వెళ్ళచు.కానీ ఈ ప్లాన్ మన మాస్టర్ కి తెలియకుండా ఎక్జిక్యూట్ చేయాలి అని అంటాడు మార్ష్"
"వీళ్ళు అందరూ కలసి స్టార్టింగ్ పాయింట్ కి వెళతారు.కానీ వీళ్ళ దగ్గర అంతగా ఇంధనం లేదు.సో సబ్మెరైన్ స్టార్ట్ అయిన కొన్ని గంటలు లోపే దాని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు మార్ష్"
Date@20/06/2143
Time@Around 08:22
Place@sub marine launching point
"జనం అందరూ ఆ చోటులో గుమ్మి గుడారు.సమీర్ సబ్మెరైన్ నీ అన్ లాక్ చేశాడు.అందరూ తమ తమ కుటుంబం తో కొని నిమిషాలు గడిపి లోపలికి చేరుకున్నారు.సమీర్ వెళ్తూ వెళ్తూ తన తముడుని సిద్ధం గా వుండమని చెప్పి లోపలకి వెళ్ళాడు"
"సబ్మెరైన్ లాంచ్ అయ్యింది.లాక్ చేసిన లొకేషన్ వైపు దూసుకుపోతుంది.దాని ఫాలో అవుతూ మార్ష్ టీమ్ కూడా ఫాలో అవుతుంది"
మిషన్ మొదలు అయ్యింది. దీనికి సమీర్ పెట్టిన పేరు..........
To be continued in next part
( In this part only highlighted the characters and how they behave.Detailed explanation regarding the both grounded and surface people. Main story will come in next parts)