Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

శ్రీమతి చిరునవ్వు

శ్రీమతి చిరునవ్వు

1 min
578


శ్రీమతి గారూ. ఓ సారి నవ్వండి. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు తమరి మందహాస వదనమును చూసినచో.. అన్నాడు రాజా.


శ్రీవాణి నవ్వుతూ, ఏమిటి శ్రీవారూ! ఈ మధ్య ఏం చదువుతున్నారు. కవిత్వం పొంగుకొస్తోందే అంది.


శశాంక రేఖను అధరపు అంచుల దాచిన చెలి చెంతనుండ

రసికునకు కవిత్వము రాదటే అన్నాడు రాజా ల్యాప్టాప్ బ్యాగులో పెడుతూ.


శ్రీవాణి చీర కొంగును గాల్లో ఊపుతూ అతడి దగ్గరికి వచ్చి నిలుచుంది.


ఇప్పుడు నవ్వేస్తాను అని నవ్వింది.


ఆహా. తామర తూడులు గాలికి కదులుతూ చేస్తున్న శబ్దం.. అంటూ మొదలు పెట్టాడు రాజా.


మహాప్రభో. సాయంత్రం మీరింటికి వచ్చాక నవ్వుతూ కూర్చుంటాను. ఇప్పుడు మీరు కావ్యాలు వ్రాస్తూ కూర్చుంటే అవతల ఉద్యోగం ఊడుతుంది అంటూ అతణ్ణి బయటికి తోసింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract