SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

"శ్రీ కృష్ణ మహా భారతం - 49"

"శ్రీ కృష్ణ మహా భారతం - 49"

5 mins
294


"శ్రీ కృష్ణ మహా భారతం - 48" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 49"

అలా అర్జునుడు, సుభద్ర శ్రీ కృష్ణుడు చేత రక్షింపబడ్డ తర్వాత...

వాళ్ళిద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు. తర్వాత కృష్ణుడు తన లీలతో మళ్ళీ ఆ నదిని యథావిథిగా ప్రవహింపచేస్తాడు.

ఈ కృష్ణ లీలలు చూసి అర్జునుడు అమితాశ్చర్యం పొందుతాడు.

ఇక సుభద్ర వెళ్లి "సోదరా కృష్ణా...!"

అంటూ కృష్ణుడి అక్కున చేరగానే, తనని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని,

"సుభద్రా..!

ఏంటి హస్తినాకు వెళ్లి ఇన్నెల్లైనా రాలేదు. మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామన్న సంగతి మరిచిపోయావా..?

మేమింకా వెళ్లి అక్కడే కోడలిగా స్థిరపడ్డావని అనుకుంటున్నాము." అంటూ తనని ఆటపట్టిస్టాడు కృష్ణుడు

(సర్వా లోకాధిపతి కదా..!

చెల్లెలికి అర్జునుడి పై ప్రేమ గురించి ఆయనకి తెలియనిదా ?)

దానికి సుభద్ర సిగ్గు పడుతూ తల వంచుకుంటుంది.

సన్నివేశాన్ని పక్కదారి పట్టిస్తూ...

"అయినా బ్రాత..!

నాకు చాలా భయం వేసింది. కార్యవానుడు ఏమైనా చేస్తాడేమోనని" అని అంటుంది అమాయకంగా...

అయినా మన కృష్ణుడు ఊరుకుంటాడా..?

"అర్జునుడు లాంటి యోధుడు నీకు రక్షకుడిగా ఉండగా..

నీకు భయం ఎందుకు సుభద్రా...!" అంటూ అర్జునుడిని చూస్తూ అంటాడు.

ఇంతలో

"కృష్ణా..!

నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను" అంటూ గట్టిగా గర్జిస్తాడు కాల్యవానుడు.

అర్జునుడు ఒక్కసారిగా కోపంతో అతని పై అస్త్రాన్ని సంధిస్తాడు.

అది నేరుగా వెళ్లి కాల్యవానుడి ఛాతీలో గుచ్చుకుంటుంది. కానీ, కాల్యవానుడుకి ఏమి కాదు. దాన్ని అతడు సులభంగా విరిచేస్తాడు.

ఇంకా కాల్యవానుడు పరిగెత్తుకుంటూ కృష్ణుడి వైపు వస్తుంటాడు.

అప్పుడు అర్జునుడు...

"కృష్ణా..!

కాల్యవానుడు మీ వైపే వస్తున్నాడు" అని అంటాడు కృష్ణుడితో...

దానికి కృష్ణుడు

"అర్జునా ?

కాల్యం అంటే ఏమిటి ?

మృత్యువే కదా !

మరి దాని రాక ఎప్పటికైనా రాక తప్పదు కదా..!

అందుకని, ఇప్పటినుండే దాని గురించి ఆలోచించడం మాని, మన ఆత్మీయులతో ఆప్యాయతగా ఉండడం కన్నా సంతోషం ఏముంటుంది చెప్పు...!" అని అంటూనే,

"మీ మేనత్తగారు కుంతీ ఎలా ఉన్నారు సుభద్ర..!

ఆవిడను కలవాలని చాలా ఆతృతగా ఉంది" అంటూ చాలా శాంతంగా సుభద్రను కుంతీ యొక్క ఉబయకుశలోపరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.

ఇటు అర్జునుడు ఎన్ని అస్త్రాలు సంధించిన కాల్యవానుడు వాటిని తేలిగ్గా ఎదుర్కుంటూ వారిని సమీపిస్తాడు.

దీంతో అర్జునుడు, కృష్ణుడితో

"మీరు మీ అత్తమ్మను కలవాలని అంత ఆతృతగా ఉంటే,

ముందు మీరు మీ శస్త్రాలను సంధించండి వాసుదేవా..!" అంటూ కృష్ణుడిని కోరతాడు.

దానికి కృష్ణుడు

"కాల్యవానుడిని

నీ గాండీవానితోనో లేక నా సుదర్శన చక్రంతోనో అంతమొందించలేము. అతనికి అంతం ఒక తపస్వి యోగాఘ్ని వలన జరుగుతుంది." అని సెలవిస్తాడు

"మరి మనం ఏం చేద్దాం..?" అని అర్జునుడు అడగ్గా...

దానికి కృష్ణుడు..

"పారి పోదాం..!" అంటూ చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు.

ఇక కృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

కాల్యవానుడు కృష్ణుడిని వెంబడిస్తూ...

అతడిని తరుముతూ...

"ఓయీ కృష్ణా ..!

నీ మృత్యువుని వస్తుంటే, నువ్వలా పారిపోతావ్ ఏంటి ?

వచ్చి నాతో తలపడు పిరికిపందా..!

ఓ పశువుల కాపరి..,

నువ్వు నాతో యుద్ధం చేయకుండా పారిపోతే, లోకం దృష్టిలో నువ్వొక అసమర్ధుడిగా మిగిలిపోతావ్ !" అంటూ కృష్ణుడిని దూషిస్తూ, దుర్భాషలాడుతూ రెచగొడతాడు కాల్యవానుడు.

కాల్యవానుడి మాటలకు ఏ మాత్రం సహనం కోల్పోని కృష్ణుడు

"అలాగే నీ మాట ప్రకారమే జరగనివ్వు...!

ఈ లోకం దృష్టిలో నన్నొక అసమర్ధుడిగానే ఉండనివ్వు.

దానికి నీకు నా కృతజ్ఞతలు.

ఒట్టి మాటలు కట్టిపెట్టి, నన్ను పట్టుకో చూద్దాం..!" అంటూ కృష్ణుడు దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళిపోతాడు.

కృష్ణుడిని అనుసరిస్తూనే కాల్యవానుడు కూడా కోపంగా ఆ గుహలోకి వెళ్తాడు.

వాళ్ళను అనుసరిస్తూ...

అర్జునుడు, సుభద్ర కూడా వెళ్తుంటారు..

"మీ సోదరుడు శూరుడు, ధీరుడు" అని చెప్పావ్. తీరా చూస్తే అతడు పారిపోతున్నాడు." అంటూ అర్జునుడు సుభద్రతో అంటాడు.

"ఆయనేదో తప్పకుండా ఇక పెద్ద వ్యూహమే రచించి ఉంటారు" అని సుభద్ర బదులు ఇస్తుంది.

"ధీరులు, శూరుల లక్ష్యం శత్రు సంహారం, అది యుద్ధం చేయడం వలన మాత్రమే కలుగుతుంది." అంటూ అర్జునుడు అనడంతో...

సుభద్ర మళ్ళీ అతడిపై అలకను ప్రదర్శిస్తుంది.

గుహలోకి వెళ్లిన కాల్యవానుడు...

కృష్ణుడిని వెతుకుతూ...

"కృష్ణా రా..!

బయటకి రా..!

ఏ మూలన నక్కావు..!" అంటూ గట్టిగా అరుస్తూ కృష్ణుడిని పిలుస్తూ ఉంటాడు.

అలా వెతుకుతూ ఉండగా...

ఆ గుహలో ఒక మూలన కాషాయ వస్త్రము ధరించి, ఒక జీవి పడుకుని ఉంటుంది.

అతడే కృష్ణుడు అనుకున్న కాల్యవానుడు...

అతడికి వద్దకు వెళ్ళి,

"నీ కోసం ఈ గుహ అంతా వెతుకుతూ ఉంటే, నువ్వు ఈ మూలన నిద్రిస్తున్నావా ?

లే.., లే...," అంటూ నిర్ధాక్ష్యాణ్యంగా అతడిని కాలితో తన్నుతూ లేపుతాడు.

ఇక కాల్యవానుడి ఆకృత్యాలకు లేచిన అతను ముసుగుతీసి కాల్యవానుడిని కోపంతో చూస్తాడు.

అతడు కృష్ణుడు కాదు, ఒక తపస్వి అని తెలుసుకున్న కాల్యవానుడు భయంతో బిక్కు బిక్కు మంటూ చూస్తుండగానే,

ఆ తపస్వి తన కళ్ళ నుండి అగ్నిని సృష్టించి, ఆ అగ్నిలో కాల్యవానుడిని దహించివేస్తాడు. అలా కాల్యవానుడు ఆ తపస్వి చేతిలో అగ్నికి ఆహుతి అవుతాడు. ఆ తపస్వి పేరు మృష్చికింద మహర్షి.

కృష్ణుడి వచ్చి అతడికి(మృష్చికింద మహర్షి) నమస్కరిస్తాడు.

దీంతో మహర్షి..!

"ఎవరితను, నా యోగాగ్నిలో ఏ కారణం లేకుండా ఎందుకు భస్మం అయ్యాడు..?" అని కృష్ణుడిని ప్రశ్నిస్తాడు.

దానికి కృష్ణుడు...

"ఏ కారణం లేకుండానే జగత్ లో ఎదైనా జరుగుతుందా మహర్షి..!

ఒకవేళ మీ యోగాగ్నిలో భస్మం కావడమే వీని తలరాత ఏమో ?

అలాగే వీనిని భస్మం చేయడానికే, ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రాజ్యాన్ని త్యజించి, తపస్సు చేయడానికి ప్రేరిపించి ఉంటాడు.

ఎవరికి తెలుసు..!

కానీ, మీ తపస్సుకి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి..!

మీరిక నిశ్చింతగా మీ తపస్సును పునఃప్రారంభించండి" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఇక బయట అర్జునుడు, సుభద్ర కృష్ణుడి కోసం వేచి చూస్తూ ఉంటారు.

కృష్ణుడు ఆ గుహ నుండి బయటకి రాగానే,

అర్జునుడు అతడికి నమస్కరిస్తాడు.

దీంతో కృష్ణుడు..

"అర్జునా నీ స్థానం నా మనసులో ఉంది..!" అంటూ అతన్ని హత్తుకుంటాడు.

"నేను చెప్పాను కదా అర్జున రాకుమారా...!

మా సోదరులు ఏదో పెద్ద వ్యూహమే రచించారని" అని సుభద్ర అంటుంది.

"ఈ కార్యం ఎలా సాధించారు వాసుదేవా..!" అని అర్జునుడు కృష్ణుడిని అడగ్గా....

కృష్ణుడు...

"సామ్రాట్ మాందతుని పుత్రుడు, సామ్రాట్ మృష్చికుందుని గురించి తెలుసా ..!" అని అర్జునుడిని అడుగుతాడు.

దానికి అర్జునుడు...

"ఆయనే కదా..!

జీవితాంతం యుద్ధం చేసి, సమస్త భూమండలాన్ని జయించి, ఆ తర్వాత రాజ్యాన్ని త్యజించి, విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు."

"అవును అర్జునా...!

లౌకిక జీవితం శ్రమ అని తెలుసుకున్న వాడి జీవితమే అద్బుతం..!

తపస్సు మాత్రమే కేవలం విశ్రాంతినిస్తుంది.

లోకుల్లో అధికులు శ్రమయే సుఖం అని భావించి అలసిపోతుంటారు.

కానీ, విశ్రాంతి గురించి ఎవరూ పట్టించుకోరు.

ఆ గుహలో మృష్చికుంద మహర్షి,

సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారు. కనులు కూడా తెరవలేదు. ఆ తెరవని కనులు ఎంతటి శక్తిని సంతరించుకున్నాయి అంటే,

ఒకసారి ఆ కనులు తెరుచుకుని, అది ఎవరి మీదైన పడితే, వాళ్ళు భస్మం అయిపోతారు.

కాల్యవానుడి అంతం ఆ విధంగానే రాసి ఉంది. నేను కేవలం ఆ ఈశ్వరుడి నిర్ణయాన్ని ఆచరణలో ఉంచాను అంతే!" అంటూ చాలా సౌమ్యంగా వివరిస్తాడు చెప్తాడు.

ఇంకా కృష్ణుడు మాట్లాడుతూ...

"అర్జునా పదా..!

నీతో ద్వారకకు వెళ్లి చాలా విషయాలు మాట్లాడాలి.

నీ వీరత్వం గురించి చాలా విన్నాను. ద్రుపద మహర్షిని మట్టి కరిపించావు అంట..!" అని అనగానే,

"అది మీ సహాయంతోనే సాధ్యపడింది వాసుదేవా..!

మీరు పంపించిన ఆ నాణాలను పోల్చుకుని, అసలు దృపదుడు ఎవరో గుర్తించి, అతడిని సంహరించగలిగాను." అంటూ అర్జునుడు దృపదుడితో చేసిన యుద్ధం గురించి వివరిస్తాడు.

"అద్బుతం అర్జునా..!

నువ్వు...!

ఆ నాణాల నుండి అంతటి గూడార్ధాలను వెతికావా..!" అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు కృష్ణుడు.

"అంటే, మీరు ఆ ఆలోచనతో ఆ నాణాలను నాకు పంపించలేదా?" అని అర్జునుడు కూడా ఆశ్చర్యపోతూ కృష్ణుడిని ప్రశ్నిస్తాడు.

దానికి కృష్ణుడు...

"లేదే..!

నేను ఆ నాణాలను మీ ఐదుగురు సోదరులకు ఉద్దేశించి, మీకు చిహ్నంగా పంపించాను" అని బదులు ఇస్తాడు.

"రాకుమారా..!

మీరు మా సోదరుల మాటలను నమ్మకండి. ఎందుకంటే, ఆయన చెప్పే మాటలకు, చేసే కార్యాలకు పొంతన ఉండదు." అని అంటుంది సుభద్ర.

దానికి కృష్ణుడు...

"సుభద్ర...

చెప్పినవాడి వాస్తవిక అర్థాన్ని, కేవలం తెలివైన వాడు మాత్రమే గ్రహిస్తాడు. విశ్వంలో జరిగే అనర్థాలకు కారణం ఇదే.

కానీ, సుభద్ర ..!

నీకు నీ సోదరుడి గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా ..!

లోకులు ఎవరైనా నీ మాటకు విన్నారంటే, ఈ వసుదేవ కుమారుడు అసత్యాలు పలుకుతున్నాడు అని అంటారు."

అంటూ సాగుతుంది వాళ్ల సరదా సంభాషణ.

అక్కడి నుండి ఇక వాళ్ళందరూ కలిసి ద్వారకకు ప్రయాణమై వెళ్తారు.

                

                           **********

కృష్ణుడు, సుభద్ర లతో పాటు ద్వారకకు చేరుకున్న అర్జునుడు

ఆ నగరాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే, అంత సుందరంగా తీర్చదిద్ధబడి ఉంటుంది ఆ నగరం.

ఆ నగరాన్ని చూస్తూ పరవశించిపోతూన్న అర్జునుడు కృష్ణుడితో

"ఈ నగరాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఇంత గొప్పగా తీర్చిదిధ్దింది మీరే కదా...!" అని అంటాడు

అప్పుడు కృష్ణుడు...

"లేదు అర్జునా...!

ఈ నగరం నేను నిర్మించలేదు. యాదవులు నిర్మించారు. నేను కేవలం వారికి దిశానిర్దేశం చేశాను అంతే !" అని బదులు ఇస్తాడు.

"సమస్త ఆర్య వర్తానికి తెలుసు..!

ద్వారకను మీరే నిర్మించారని, కానీ మీరేం చేయలేదు అని అంటున్నారు." అని అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తాడు.

దానికి కృష్ణుడు...

"నా మాటకు అవాస్తవం కాదు అర్జునా..!

నేను ఏమి చెయ్యను. ఇలా తాను ఏమీ చేయడం లేదని అర్థం చేసుకున్న వాడు, ఒక మహత్తర కార్యం జరగడానికి కారకుడవుతాడు." అంటూ బదులు ఇస్తాడు

వెనుక నుండి సుభద్ర..!

"బ్రాతా...!

ఇక్కడే నిల్చుని మాట్లాడుతున్నారు.

మీరు నగరంలోకి రారా..!" అని ప్రశ్నిస్తుంది.

దాంతో కృష్ణుడు చిరునవ్వుతో...

"నువ్వు అర్జునుడిని నగరంలోనికి తీసుకుని వెళ్ళు..

నాకు అతి ముఖ్యమైన కార్యం ఒకటి ఉంది. నేను మళ్ళీ వెంటనే తిరిగి వస్తాను." అని అంటాడు.

అర్జునుడు సంకోచిస్తూ...

"నేను కూడా మీతొ రావొచ్చా వాసుదేవా..!" అని కృష్ణుడిని అడగ్గా...

"వస్తావా...!

నువ్వు కూడా వస్తె, నీ వల్ల నాకు ఒక పెద్ద సహాయం కలుగుతుంది.

కానీ, గుర్తుంచుకో అర్జునా...!

ఈ కార్యం నీకు చాలా కటినంగా ఉంటుంది. ఇది సాధించడం చాలా క్లిష్టంగా ఉంటుంది" అంటూ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తాడు.

దీంతో అర్జునుడు సందిగ్ధంలో పడతాడు.

"కృష్ణుడు తలపెట్టబోయే ఆ ముఖ్యమైన కార్యం ఏమిటి ?

అర్జునుడికి అది ఎందుకు క్లిష్టమైనది ?

కృష్ణుడు కావాలనే అర్జునుడిని పరీక్షించబోతున్నాడా ?"

లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 50"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract