SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శ్రీ కృష్ణ మహా భారతం - 48"

"శ్రీ కృష్ణ మహా భారతం - 48"

6 mins
242


"శ్రీ కృష్ణ మహా భారతం - 47" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 48"

అర్జునుడు సుభద్ర ఉండే మందిరానికి వస్తాడు ఆమెను కలవడానికి.

పరిచాలుకుల ద్వారా విషయం తెలుసుకున్న సుభద్ర,

తనని కలవడానికి అర్జునుడు వచ్చాడని ఎంతో ఉప్పొంగిపోతుంది.

అతన్ని సరదాగా ఆటపట్టించాలని అనుకుంటుంది. వెంటనే తన మందిరంలోకి ఆహ్వానించకుండా, కాసేపు ఆగి అతన్ని రమ్మనమని ఆ పరిచాలకులకు ఆదేశిస్తుంది.

అలా కాసేపటికి అర్జునుడు సుభద్ర మందిరంలోకి వస్తాడు.

అలా వచ్చిన అర్జునుడు సుభద్రను సమీపిస్తుండడంతో...

సుభద్ర...

"ఆగండి పాండు కుమారా...!

కింద కొంచెం చూసి నడవండి అని అంటుంది."

కింద ఏమున్నయా అని అర్జునుడు కిందకి చూడగా కొన్ని వస్త్రాలు ఆరబెట్టి ఉంటాయి.

దీంతో అర్జునుడు విచిత్రంగా సుభద్ర వైపు చూడగా...

"ఈరోజు నేను ద్వారకకు వెళ్ళిపోతున్నాను. అందుకే నా వస్త్రాలు ఇక్కడ ఆరబెట్టాను. మీరు వాటిని తొక్కకుండా జాగ్రత్తగా రావాలి!" అంటూ చెప్తుంది.

అర్జునుడిని ఆలస్యంగా లోపలికి రమ్మనడానికి కారణం ఇదే !

ఇక అర్జునుడు వాటి మధ్యలో నున్న ఒక్కొక్క చిన్న చిన్న కాలి ప్రదేశం నుండి ఉరుకుతూ ... గెంతుతూ... ప్రయాస పడుతూ వాటిని దాటుతూ వస్తాడు.

అది చూసి పగల బడిన నవ్విన సుభద్ర..!

"మీరు మంచి నాట్యం చేశారే !

నాట్య కారుల వలె !" అతన్ని చమత్కరిస్తుంది.

దీంతో అర్జునుడికి అంతా అర్థమవుతుంది. అంతకముందు సుభద్ర తనని కలవడానికి వచ్చినప్పుడు తాను కూడా సుభద్రను ఇలానే ఆటపట్టిస్తాడు. దానికి ఇది ప్రతీకారంగా భావించి, సుబద్రతో ఇలా అంటాడు.

"ఇలా ప్రతీ కారం తీర్చుకోవడం నీకు మీ సోదరులు కృష్ణుడు నేర్పించాడా ?" అని అడుగుతాడు.

అప్పుడు సుభద్ర మూతి ముడుచుకుని,

"మా అన్నయ్య కృష్ణుడు ఎప్పుడూ ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోడు ! " అని బదులు ఇస్తుంది.

"మరి..!

మీ తల్లిదండ్రులు దేవకీ వసుదేవుడులను మీ మేనమామ కంసుడు అపహరించినప్పుడు, అతన్ని వధించడం ప్రతీకారం కాదా ?" అని అర్జునుడు ప్రశ్నిస్తాడు సుభద్రను.

దానికి సుభద్ర...

"అది ప్రతీకారం కాదు, దానికి మా కృష్ణుడు ఏమంటారు అంటే,

న్యాయమే జగతిని నడిపిస్తోందని..!

అపరాదులకు దండన లభించకపోతే, జగత్ వ్యవహారాలలో సమతుల్యత ఉండదని," అని వివరిస్తుంది

"నాకేం అర్థం కాలేదు..!" అని అర్జునుడు అంటే,

సుభద్ర కూడా చాలా అమాయకంగా మొహం పెట్టుకుని,

"ఏమో నాకు ఏమి అర్ధం కాలేదు. నాకు ఆయన చేసే ఏ పని అర్థమే కాదు..!" అని బదులు ఇస్తుంది.

"కృష్ణుడి కార్యాలన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. కృష్ణ లీలలు ఆలోచింపజేస్తాయి. వాసుదేవుని గురించి మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను నీ దగ్గరకి వచ్చాను." అని అంటూ అర్జునుడు అంతకుముందు ఇచ్చిన నాణాలు కల పెట్టీ (యుద్దానికి వెళ్ళేముందు ఇచ్చిన బహుమతి)ని చూపిస్తూ అడుగుతాడు.

దానికి సుభద్ర విచారంగా...

"మీరు ఆయన గురించి తెలుసుకునేందుకు నా దగ్గరకి వచ్చారా..!" అని అడుగుతుంది.

"సరే, ఒక్క విషయం చెప్పు..!

జరాసంధుని ముందు పరాజయం అంగీకరించి, మీ బ్రాత కృష్ణుడు మధుర నుండి ఎందుకు పారిపోయాడు.

అదే జరాసంధుడు ద్వారక వచ్చినప్పుడు అతన్ని ఓడించాడు. మధుర లోనే ఓడించవచ్చు కదా..!" అని అర్జునుడు అడుగుతాడు.

దానికి సుభద్ర మూతి పెట్టుకుని,

"నాకు తెలీదు !" అని బదులు ఇస్తుంది.

ఇంకా...

"పాండు కుమారా !

మీరు నన్ను తన వివాహానికి ఆహ్వానిస్తారా !

(అర్జునుడి మనసులో ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకునే ఉద్దేశ్యంతో..)" అని అడుగుతుంది.

దానికి అర్జునుడు...

"నా వివాహానికి తొందరేం వచ్చింది,

మా జ్యేష్ఠ బ్రాత యుధిష్ఠిరుడు వివాహం జరగాలి ముందు..

ఆ తర్వాత మా భీముడి వివాహం.

అప్పుడు నా గురించి ఆలోచిస్తాను. అయినా దానికి ఇంకా చాలా సమయం ఉంది లే..!" అని బదులు ఇస్తాడు.

"అన్నట్టు శ్రీ కృష్ణుడు..!" అని అర్జునుడు మళ్ళీ సుభద్రను కదపగా...

వెంటనే సుభద్ర...!

"నాకు తెలీదు..!

వారి గురించి మీరు వారినే అడిగి తెలుసుకోండి, ఆయనని కలిసినప్పుడు..!

మీరిక దయచేయండి !

నేను ప్రయాణానికి సిద్దం కావాలి..!" అని అర్జునుడితో అంటూ...

"దాసి వస్త్రాలు తీసుకో..!" అంటూ పరిచాలకులరాలిని ఆదేశిస్తుంది..

"నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు..?" అని అర్జునుడు ప్రశ్నించగా...

"నాకు తెలీదు ఇక మీరు వెళ్ళండి" అని సుభద్ర వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది ..

అప్పుడే సరిగ్గా ఆమె మందిరానికి కుంతీ వస్తుంది.

సుభద్రతో కుంతీ

"సుభద్రా...

ఇప్పుడే మాకు ఒక వార్త అందింది.

నువ్వు ద్వారకకు వెళ్ళే మార్గ మధ్యలో అసురుడు కాల్యవానుడు తన సేనతో వచ్చి ఉన్నాడు అంట..!

ఆ మార్గంలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదు" అని అనగానే,

అప్పటికే అర్జునుడి వల్ల విచారంగా ఉన్న సుభద్ర...

ఇంకా తన దుఖాన్ని ఆపుకోలేక,

నేరుగా వచ్చి, కుంతీని కౌగిలించుకుని బాధ పడుతుంది.

"ఎందుకు ఇంతలా భయపడుతున్నావ్ సుభద్ర..!

నేను నీ రక్షణ కోసం, నీకు తోడుగా అర్జునుడిని పంపిస్తాను" అంటూ సుభద్ర బాధను అర్థం చేసుకున్న కుంతీ ఆమెకు ధైర్యం చెప్తూ బరోసాను ఇస్తుంది.

ఇక అర్జునుడితో కుంతీ..!

"అర్జునా..!

రేపు నువ్వు సుభద్రకు రక్షణగా ద్వారకా వెళ్ళాలి" అని ఆదేశిస్తుంది.

దానికి అర్జునుడు...

"కానీ, మాతా..!

ఇలాంటి సమయంలో హస్తిన వదిలి వెళ్ళడం, సబబేనా" అని అడుగుతాడు.

అప్పుడు కుంతీ..!

"నువ్వు హస్తిన గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇక్కడ ఇప్పటికే యుధిష్ఠిరునికి పట్టాభిషేకం జరిగింది. దుర్యోధనుడు కూడా చాలా మారిపోయాడు. ఇక ఇక్కడ పరిస్థితుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు..!

కనుక, రేపు ప్రాతః కాలంలో నువ్వు సుభద్రను తీసుకుని ద్వారకకు బయలుదేరు." అని అర్జునుడిని ఆదేశిస్తుంది.

దానికి అర్జునుడు కూడా అంగీకరిస్తాడు.

దీంతో సుభద్ర ఆనందానికి అవధుల్లేవు.

                           **************

అలా అర్జునుడు సుభద్రను తీసుకుని ద్వారకకు బయలుదేరి వెళ్లగా...

మార్గ మధ్యలో విశ్రాంతి కోసం ఆగుతారు.

అప్పుడు సుభద్ర అర్జునునితో...

"పాండు కుమారా..!

కాల్యవానుడు చాలా భయంకరంగా ఉంటాడు అంట,

అతని మొహం పసుపు రంగులో ఉంటుంది అట!

కళ్ళు పెద్దవిగా ఎర్రగా , బలిసిన దేహంతో ఉంటాడు అంట..!

ఒకవేళ అతను కనుక ఇక్కడికి వస్తె," అని అడుగుతుంది.

దానికి అర్జునుడు...

"నేనుండగా అతడు ఇక్కడికి ఎందుకు వస్తాడు.

అయినా మీ సోదరులు చెప్పారా అతని గురించి,

నీకు బలే కథలు చెప్తాడు మీ కృష్ణ అన్నయ్య..!" అంటూ సుభద్రను వేళాకోలంగా మాట్లాడతాడు.

దానికి సుభద్ర నొచ్చుకుని,

"మీరు మా అన్నయ్య నీ అవమానిస్తే ఊరుకోను...

అయినా నాకు మీ సహాయం ఏం అవసరం లేదు.

మేము మా ద్వారకకు మీ రక్షణ అవసరం లేకుండానే వెళ్తాము.

పరిచాలకులారా..!

మనకి వీరి రక్షణ అవసరం లేదు, విశ్రాంతి అవసరం లేదు..!

బయలుదేరండి..!" అంటూ మొండిగా అక్కడి నుండి ఒక్కత్తే వెళ్ళిపోతుంది.

"సుభద్ర..! సుభద్ర..!" అంటూ పిలిచినా

"అక్కడ అసురుడు వుంటే, నువ్వు మళ్ళీ వెనక్కు వస్తావ్..!" అంటూ భయపెట్టినా సుభద్ర వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది.

"మొండి ఘటం...

కొంచెం దూరం వెళ్లి, తానే వెనక్కు వస్తుందిలే" అని అర్జునుడు తనలో తాను అనుకుని తన గాండీవాన్ని సరి చేసుకుంటూ ఉంటాడు.

ఇంతలో...

"అర్జునా ..!

అర్జునా ..!" అంటూ సుభద్ర అరుపులు వినిపిస్తాయి.

ముందు అర్జునుడు, అవి తనను ఆటపట్టించడానికి సుభద్ర ఆడుతున్న పరాచకాలు అనుకుంటాడు.

కానీ, మళ్ళీ సుభద్ర...

"అర్జునా ..!

అర్జునా ...!" అని పిలవడంతో ఈ సారి తన పిలుపుతో పాటు తన గొంతులో నుండి వస్తున్న భయాన్ని కూడా గమనిస్తాడు అర్జునుడు.

వెంటనే, అక్కడి నుండి లేచి

"సుభద్ర...!

సుభద్ర...!!" అని అరుచుకుంటూ ఆమెను వెతుక్కుంటూ వెళతాడు.

అలా వెళ్తున్న అర్జునుడికి ఒక చెట్టు వెనుక నుండి,

సుభద్ర యొక్క పిలుపు వినిపించి ఆగి, అటుగా చూస్తే,

సుభద్ర గొంతుని అరచేతితో పట్టుకొని,

ఆ చెట్టు వెనుక నుండి ఒక రాక్షసుడు వస్తాడు.

చూడ్డానికి అతడు, పసుపు రంగు మొహంలో, ఎర్రటి కళ్ళు కలిగి, బలిసిన దేహంతో అంతకు ముందు సుభద్ర ఏ పోలికలతో కార్యవానుడి గురించి చెప్పిందో..!

అచ్చం అలానే ఉంటాడు అతడు.

"నువ్వు కృష్ణుడివా..?" అని ఆ రాక్షసుడు అర్జునుడిని అడగ్గా

"నీ పాలిట మృత్యువుని..!" అని అర్జునుడు బదులు ఇస్తాడు.

"నువ్వు నిజంగా కృష్ణుడు అయితే చెప్పు, లేకపోతే నీతో యుద్ధం నాకు వ్యర్థం..!

ఎందుకంటే, జరాసంధుడు నాకు చెప్పాడు.

కృష్ణుడి సోదరిని నేను అపహరిస్తే, ఈమెను కాపాడడానికి కృష్ణుడు వస్తాడని..." అని అంటూ సుభద్ర తన ముందు నిల్చోబెట్టి, మెడ పై పదునైన ఆయుధంతో దాడి చేయాబోతుంటే,

అర్జునుడు తన గాండీవాన్ని ఉపయోగించి, అతనిపై అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది మూడు అస్త్రాలుగా విడిపోయి, కార్యవానుడు ఆయుధం సుభద్ర మెడను తాకే లోపు,

అర్జునుడి మూడు అస్త్రాలు సుభద్రను తప్పించుకుని, రెండు కార్యవానుడి ఉదరభాగం, ఇంకొకటి గొంతులో గుచ్చుకుని అతను అంతం అవుతాడు.

ఇక అక్కడి నుండి సుభద్ర వచ్చేస్తుంది.

"నీకేం కాలేదు కదా..!"

అని అర్జునుడు అడిగితే ఆమె ఎందుకో సంకొచిస్తూ తలాడిస్తుంది ఏమీ కాలేదు అన్నట్టు..!

ఎందుకంటే, ఆమెకు తెలుసు కార్యవానుడు అంత సులభంగా అంతమయ్యే రాక్షసుడు కాదని.

ఇక ఆమెను తీసుకుని అర్జునుడు వస్తూ...

ఒకసారి వెనక్కు తిరిగి చూడగా...

అక్కడ తన చేతిలో అంతమైన కార్యవానుడు ఉండడు.

అతడు అప్పటికే, తనకు గుచ్చుకున్న అస్త్రాలను పీకి పడేసి, ఆ గాయాలను తన మంత్ర శక్తితో మాన్పించుకుని అక్కడి నుండి మాయమవుతాడు.

అర్జునుడు చాలా ఆశ్చర్యపోతూ...

పక్కనే ఉన్న సుభద్ర వైపు చూడగా...

అక్కడ నుండి సుభద్ర కూడా మాయమవుతుంది.

అర్జునుడికి ఏం జరుగుతుందో అర్థం కాక, ఖంగు తింటాడు.

ఇంతలో...

మళ్ళీ

"అర్జునా ..!

అర్జునా..!" అంటూ సుభద్ర స్వరంతో అరుపులు వినిపిస్తాయి.

ఇక అర్జునుడు మళ్ళీ సుభద్రను వెతుక్కుంటూ వెళ్తాడు.

సుభద్ర అర్జునితో పాటు...

"బ్రాతా కృష్ణా..!

బ్రాతా కృష్ణా..!

నన్ను ఈ రాక్షసుడి బారి నుండి రక్షించండి !" అంటూ తన అన్న కృష్ణుణ్ణి కూడా ప్రార్ధిస్తుంది.

ఇంతలో కార్యవానుడు...

"రా కృష్ణ..!

బ్రాతా కృష్ణ...!

వచ్చీ నీ సోదరిని రక్షించు...

హ.. హహా... హ్హహ్హ..." అంటూ వెకిలిగా నవ్వుతూ...

సృష్టిలో అతను లేకపోతే, అసలు సృష్టే లేదన్నట్టు అతను భావిస్తున్నాడు.

మీ అన్న ఏమైనా ఈ కార్య వానుడు, జరాసంధుడు కంటే గొప్పవాడని నువ్వు అనుకుంటున్నావా ?

రమ్మను నిన్ను కాపాడమను.." అంటూ సుభద్ర జుట్టు పట్టుకుని విర్రవీగుతూ ఒక నదీ వడ్డున..

అప్పుడే అక్కడికి వచ్చిన అర్జునుడు మళ్ళీ కార్యవానుడి పై విల్లును ఎక్కుపెట్టగా...

అది గమనించిన కార్యవానుడు...

సుభద్రను ఒక్కసారిగా నదిలోకి విసిరేస్తాడు.

కార్యవానుడితో యుద్ధం కన్నా...

సుభద్ర ప్రాణాలను కాపాడటమే ముఖ్యం అనుకున్న అర్జునుడు

సుభద్రను కాపాడడానికి తను కూడా ఆ నదిలోకి దూకుతాడు.

నదీ ప్రవాహం భీకరంగా ఉండడంతో అలా ఇద్దరూ ఆ నదిలో గల్లంతు అవుతారు.

కార్యవానుడు

"ఒరేయ్ పిరికిపంద కృష్ణా..!

ఎక్కడ దాక్కున్నవు రా..!

వచ్చీ నీకు చేతనైతే నీ సోదరిని కాపాడుకో !

నీకు దైర్యం ఉంటే, నాతో యుద్ధం చెయ్యి

రా..!

అల్పుడా..!" అంటూ కృష్ణుడిని రెచ్చగొడతాడు.

ఇంకో పక్క అర్జునుడు, సుభద్ర నదిలో ఊపిరాడక గల్లంతు అవుతారు. చావుతో పోరాటం చేస్తుంటారు.

అప్పుడే సరిగ్గా అక్కడికి వస్తాడు,

" సజ్జనుల సంరక్షణార్థమూ, 

దుష్టజన శిక్షణకూ, 

ధర్మసంస్థాపన కోసం … ”

అతను ఆ నదిపై కాలు మోపగానే ఆ నదిలో నీరంతా రెండుగా చీలిపోయి పక్కకు జరిగి, అర్జునుడు, సుభద్ర నది యొక్క అడుగు భాగానికి చేరుకుని రక్షింప బడతారు.

అతడే శ్రీ కృష్ణుడు.

అంటే, మన ఈ మహా భారతంలో ఆ శ్రీ మహావిష్ణువు అవతారం యొక్క ప్రాతినిధ్యం మొదలైందన్న మాట..!

"శ్రీ కృష్ణ మహానుభావుడు ఆ కార్యవానుడిని ఎలా అంతమొందిస్తాడు...?

సుభద్ర ప్రేమ అర్జునుడికి అర్థమవుతుందా ?

ఈ మహాభారతం అనే అద్భుత కావ్యలో శ్రీ కృష్ణుడి రాకతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనబోతున్నాయి ?"

లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 49"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract