యశస్వి రచన

Horror Thriller

3.5  

యశస్వి రచన

Horror Thriller

సైకో

సైకో

6 mins
2.3K


"హత్యలు జరగటం..... వాటిని మనం మరచిపోవడం చాలా కామన్ అయిపోయింది దివ్య"


"మొన్నటి కి మొన్న మన ఇంటికి అదే మన చిన్ను గాడి పుట్టిన రోజు నాడు వచ్చిన నా ఫ్రెండ్ గిరీశం ను ఎవరో చంపేశారు అంటా"


"కానీ అతని దగ్గర వున్న డబ్బులు గాని వస్తువులు గాని తీసుకోలేదు"


"అంతే కాదు ఆ చంపిన వాళ్లు రాజీవ్ శరీరం నుండి ఆని అవయవాలు ను బయటకు తీసి వాటిని ఆ శవం పక్కనే పాడేసి వెళ్లిపోయారు అంటా"


"ఇలా జరుగుతుంటే నాకు అసలు బయటికి వెళ్లాలి అనే ఆలోచన కూడా రావటం లేదు అని తన బాధ, నిజానికి భయం బయటికి చెప్పాడు రాజీవ్"


"చూడండి ముందు మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి అని తన చేతిలో టాబ్లెట్ తన మొగుడు చేతిలో పెట్టింది అతని భార్య కోమలి"


"రాజీవ్ ఒక మాజీ మిలిటరీ డాక్టర్ కానీ చాలా మృదు స్వభావి అలాగే భయస్థుడు కూడా, ఎప్పుడూ సమాజంలో తప్పులను వేలు ఎత్తి చూపాలి అనుకుంటాడు.కానీ తన మృదు స్వభావం వల్ల వేలు కాదు కదా, కనీసం చూపు కూడా ఎత్త లేకుండా పోయాడు రాజీవ్.అతని భార్య కోమలి చిన్న వయసు నుండి రాజీవ్ నీ చూస్తూ పెరిగింది.పెద్దల నిర్ణయం వల్ల పెళ్లి జరిగి ఇలా రాజీవ్ భయం వల్ల దేశాలు పట్టి తిరుగుతున్నారు"


"రాజీవ్ ఎప్పటిలాగే తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు రాజీవ్..బయటకు వెళ్ళాడు కానీ తన మనస్సులో ఎదో భయం ఎప్పుడూ కూడా తనను ఎవరో ఫాలో అవుతున్నారు అని ఒక అనుమానం.ఒకసారి ఒక వ్యక్తిని పట్టుకుని అడిగితే నువ్వేమనా అమ్మాయివా నేను నీ వెంట పడటంకి అని కరుకు సమాధానం చెప్పాడు...అప్పటి నుండి ఎవర్ని ఎం అడకూడదు అనుకుని నిర్ణయించుకున్నాడు రాజీవ్"


"కోమలి ఇంట్లో తన కొడుకుతో రాజీవ్ వచ్చే వరకు పడిగాపులు కాస్తు ఎదురు చూస్తూ వుంటుంది.రాజీవ్ బయటకు వెళ్ళగానే కూరగాయలు కొస్తు వార్తలు చూస్తూ సమయం గడపడం పరిపాటు గా మారింది.ఒక చక్రంలో పడి జీవిస్తున్న ఒక రకమైన ఫీలింగ్ మెల్లగా కోమలి మనసుకి మొదలు అవుతుంది"


"అదే రోజు అర్ద రాత్రి హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణం గా చంపి వాళ్ళ శరీరం లో వున్న అవయవాల ను బయట పాడేసి క్రురం గా చంపేశారు అని ఓకే న్యూస్ అన్ని ఛానెల్స్ లో వస్తుంది.కానీ అక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ మరీ ఏదైనా క్లూ గాని దొరకలేదు అంటా"


"ఆ వార్త చూసిన వెంటనే తన భర్త కి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది కోమలి"


"రాజీవ్ కూడా చాలా త్వరగా పని ముగించుకుని ఇంటికి వచ్చేశాడు.అందరూ కలసి మంచిగా భోజనం చేసి పడుకున్నారు"


"కొంచెం సమయం గడిచిన తర్వాత ఇంట్లో అద్దం పగిలిన శబ్దం వచ్చింది వెంటనే ఇద్దరికీ మెలకువ వచ్చింది.వెళ్లి చూస్తే ఎవరో కిటికీ అద్దం పగలగొట్టి లోపలికి వచ్చినట్లు అనిపిస్తుంది"


"ఒక్కసారిగా గుండెలో భయం వేగం గా పుట్టుకొచ్చింది.తన కొడుకుని తీసుకుని పక్క ఇంటికి వెళ్ళిపొమ్మని రాజీవ్ కోమలికి చెప్పాడు.కోమలి చిన్ను ను తీసుకుని పక్కన వున్న ఇంటికి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసింది"


"రాజీవ్ ఆ దొంగ గురించి ఇల్లు మొత్తం వెతుకుతున్నాడు.కానీ దొంగ జాడ ఎక్కడా కనిపించటం లేదు.తనకు అనుమానం వచ్చి బీరువా ఉన్న గది వైపు వెళ్ళాడు దొంగ బీరువా ను ఓపెన్ చేయటానికి ట్రై చేస్తున్నాడు"


"వెనక నుండి రాజీవ్ మెల్లగా వెళ్లి దొంగ ను కొట్టాలి అనుకున్నాడు.కానీ దొంగ రాజీవ్ ను గమనించి రాజీవ్ను పక్కకు గెంటేసి బయటకు పరుగు తీసాడు.కానీ బయట అపుడే వచ్చిన పోలీసులు వాడిని అరెస్ట్ చేసి జైల్ కి తీసుకు వెళ్ళారు"


"రాజీవ్ నీ కంప్లైంట్ రాసి ఇవ్వటానికి రేపు ఉదయం స్టేషన్ కి రమ్మని చెప్పాడు ఆ పోలీస్.


"తెల్లవారింది కోమలి అండ్ రాజీవ్ కలసి స్టేషన్ కి వెళ్ళారు.కానీ అక్కడ వీళ్ళకి ఒక వింత పరిస్థితి ఎదురు అయింది.ఆ రోజు రాత్రి ఆ దొంగ పోలీస్ నుండి తప్పించుకుని ఆ పోలీస్ ను చంపేసి అతని దగ్గర వున్న గన్ తీసుకుని పారిపోయడని, ఎందుకైనా మంచిది మీరు వూరు వదిలి బయటికి వెళ్ళి తల దాచుకొండి ఎందుకంటే వాడు మిమ్మల్ని చంపటానికి రావచ్చు అని ఉచిత సలహా కూడా ఇచ్చాడు హెడ్ కానిస్టేబుల్."


"అంతే రాజీవ్ గుండెలో మళ్లీ భయం వేగం గా పుట్టుకొచ్చింది. ఏంచేయాలి అని అర్థం కాలేదు వాళ్ళకి అంతే అక్కడ నుండి వెంటనే చిన్ను స్కూల్ దగ్గరకు వెళ్ళి చిన్ను నీ స్కూల్ నుండి తీసుకు వచ్చేసి రేపు ఉదయానికి హైదరాబాద్ టికెట్స్ తీసుకుని దగ్గర వున్న ఒక హోటల్ తల దాచుకున్నారు.కింద వున్న రెస్టారెంట్ లో భోజనం చేసి వెంటనే గదికి వచ్చి లాక్ వేసుకుని పడుకున్నారు"


"దొంగ హడావిడిలో పడి రాజీవ్ తన డైలీ మాత్రలు వేసుకోవడం మరచి పోయాడు.తెల్లవారింది ముగ్గురు నిద్ర లేచారు.రాజీవ్ మొబైల్ లో ఒక మేస్సేజ్ ఉంది.ఓపెన్ చేసి చూడగానే మీ టికెట్స్ కాన్సిల్ అయ్యాయి.అది చూడగానే కోమలి అండ్ రాజీవ్ కి ఒకసారి గా మళ్లీ గుండె లో భయం వేగం పుంజుకుంది.వాళ్ళకి ఏంచేయాలో అర్దం కావట్లేదు.


"అంతటి లోకి కార్టున్స్ చూడంకి చిన్ను టెలివిజన్ ఆన్ చేసాడు. దాంట్లో రాత్రి....ఇంట్లో ఆ దొంగ రాజీవ్ ను చంపటానికి వచ్చి గుర్తు తెలియని వ్యక్తి చేతిలో మరణించినట్టు వార్త వస్తుంది.అలాగే ఇది వరకు జరిగిన హత్యలు జరిగిన విధంగానే అతని అవయవాలు బయటికి తీసి అతని శవం దగ్గర పాడేసి వెళ్ళినట్లు తెలుస్తుంది.


"ఓ పక్క ఆ దొంగ గోల పోయింది అని అనందపడాలో లేకపోతే ఆ హంతకుడు మా ఇంటి వరకూ వచ్చాడు అని బాధ పడాలో రాజీవ్ అండ్ కోమలికి అర్దం కాలేదు"


"ఆరోజు సాయంత్రం వాళ్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి చుట్టూ పోలీస్ వాళ్లు డోంట్ క్రాస్ లైన్స్ వేసి వెళ్ళారు"


"రాజీవ్ లోపలకి వెళ్లి తన టాబ్లెట్ తెచ్చుకుని మళ్లీ హోటల్ కి వెళ్లిపోయారు.తెల్లవారింది మళ్లీ ఏ బ్యాడ్ న్యూస్ వినాలో అని భయం భయం గా నిద్ర లేచారు"


"కానీ ఈసారి ఎలాంటి ఘోరం జరగలేదు.రాజీవ్ స్టేషన్ కి ఫోన్ చేసి మేము ఎప్పటి వరకు బయట వుండాలి. మా ఇల్లు ఎప్పుడు మాకు అప్పాచెప్తారు అని అడిగాడు.కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకొని రోజులు పడుతుంది అని చెప్పి రెండో మాట వినకుండా వెంటనే ఫోన్ పెట్టేసాడు"


"రాజీవ్ హోటల్ నుండే ఆఫీస్ కి వెళ్ళటం స్టార్ట్ చేసాడు.కొన్ని రోజుల గడిచాయి జనాలు కూడా ఆ హత్యలు గురించి మాట్లాడుకోవడం మానేశారు"


"పోలీస్ లు కూడా వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరక్క పోవటం వల్ల అలాగే వాళ్లు ఎవరినీ సస్పెక్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది.నెల రోజులకు గడిచింది ఎటువంటి హత్యా మళ్లీ జరగలేదు.అందరి చాలా ప్రశాంతం గా వున్నారు"


"ఒక రోజు చిన్ను తన ఆడుకొనే వస్తువులు తోపాటు వాళ్ళ నాన్న టాబ్లెట్ బాక్స్ అలాగే ఏటీఎం కార్డ్స్ తీసుకుని స్కూల్ కి వెళ్లిపోయాడు"


"ఆరోజు మధ్యాహ్నo టాబ్లెట్ బాక్స్ తన బ్యాగ్ లో ఏటీఎం కార్డ్స్ ఆండ్ టాబ్లెట్ బాక్స్ లేకపోవటం చూసి చాలా కంగారు గా ఇంటికి వచ్చేశాడు ఆఫీస్ నుండి ఇల్లు మొత్తం లాక్ లో వుంది"


"కానీ లోపల ఎవరో అటు ఇటూ తిరుగుతూ వున్నట్లు రాజీవ్ కి అనిపించింది అంతే కిటికీ అద్దం పగలకొట్టి కిచెన్ లోకి వెళ్లి ఒక కత్తి తీసుకుని గది అంతా వెతుకుతున్నాడు"


"ఇల్లు మొత్తం చాలా సైలెంట్ గా వుంది.ఎవరో తన వెనకాల శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపిస్తుంది.రాజీవ్ మెల్లగా అటువైపూగా కత్తి తీసుకుని వెళ్ళాడు"


"చూస్తే అక్కడ కోమలి వుంది.రాజీవ్ తన దగ్గర వున్న కత్తి తీసుకుని దివ్య నీ చంపటానికి తన వెంట పరుగు తీస్తున్నాడు .కోమలి రాజీవ్ నుండి తపించుకుని ఒక రూం లోపలకి వెళ్ళింది.రాజీవ్ కూడా అదే రూం లోపలకి వెళ్ళాడు.దివ్య డోర్ వెనకాల వుండి రాజీవ్ ను బెడ్ మీద కి తోసేసి ఆ డోర్ క్లోజ్ చేసింది.అంతటి లోకి కోమలి ఫోన్ రింగ్ అయ్యింది"


"అమ్మా రాజీవ్ ను రూం లో భందించావ్ గా నేను మెడిసిన్ తీసుకుని వచ్చెస్తున్నను అని తన మావయ్య సుందరం చెప్పాడు"


"కొన్ని నిమిషాలకి అతను ఇంటికి వచ్చాడు.ఇద్దరు కలసి కొన్ని గంటల తర్వాత ఆ గది లో బంధించిన రాజీవ్ నీ కెమెరా ద్వారా గమనిస్తున్నారు. రాజీవ్ పిచ్చి పట్టిన వాడిలాగా అరుస్తూ, తన ముందు వున్న ప్రతీ వస్తువుని కత్తితో పొడుస్తూ, నేను ఒక డాక్టర్ నేను ఒక డాక్టర్ అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు.కొన్ని గంటల తర్వాత రాజీవ్ నిద్ర పోయాడు అని తెలుసుకుని లోపలకి వెళ్లి తన నోట్లో టాబ్లెట్ వేసి మళ్లీ పడుకోబెట్టారు కోమలి వాళ్ళు"


"తెల్లవారింది రాజీవ్ నిద్ర లేచాడు.తన ముందు కోమలి అలసిపోయిన మొహం పెట్టుకుని కూర్చుని వుంది.అది చూసిన రాజీవ్ ఏమైంది కోమలి అలా వున్నావు అని అడుగుతూ నేను ఆఫీసుకి వెళ్ళాలి, నువ్వు త్వరగా లంచ్ బాక్స్ రెఢీ చెయ్యి అని చెప్పి రెఢీ అవ్వడంకి వాష్ రూంకి వెల్తూ వున్నాడు.


"కోమలి రాజీవ్ నీ ఆపి చిన్న పిల్లవాడిని సదుమాయించినట్టు రాజీవ్ ను ప్రేమ గా గుండె కి హత్తుకుంది"


"నిజానికి ఆ హత్యలు అన్నీ చేసింది రాజీవ్.రాజీవ్ ఒక సైకోటిక్ పేషంట్.తను ప్రతీ ఆరు గంటలు కు ఒక్కసారి ఒక సెడేటివ్ డ్రగ్ వేసుకొకపోతే తన మెదడు నుండి అధిక శాతం స్టిములస్ రిలీజ్ అయ్యి తన మెదడు మీద కంట్రోల్ కోల్పోయి తను ఇంకా డాక్టర్ అనే పర్సెప్షన్ లో వుండి ఎవరైనా దొరికితే వాళ్ళని చంపేసి వాళ్ళ బాడీ నుండి అన్ని అవయవాలు బయటికి తీసి ఆనందిస్తాడు.ఒక వేళ అతడు ఎక్కువ సమయం డ్రగ్ తీసుకోకపోతే ఎక్సెస్ స్టిములస్ వల్ల స్పృహ కోల్పోయి పడిపోతాడు లేకపోతే బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతాడు"


"ఆ దొంగ ని చంపిన రాత్రి ఆ టాబ్లెట్స్ కోసం వెళ్లి కంట్రోల్ తప్పి అతడిని చంపేశాడు.రాజీవ్ శరీరం లో వున్న లోకేటింగ్ చిప్ ద్వారా తాను ఇంటికి రానపుడు కోమలి వాళ్ళ మావయ్య వెళ్ళి ఇంటికి తీసుకు వచ్చేవారు. వాళ్లు అతను తీసుకు వచ్చేముందు అతను స్పృహ కోల్పోయి వుండేవాడు లేకపోతే నిద్ర పోయె వరకు వెయిట్ చేసేవాళ్ళు"


"మిలటరీలో వున్నప్పుడు రాజీవ్, భయం భయంగా ఆపరేట్ చేసేవాడు.అందువల్ల తన చుట్టూ వున మిగతా వాళ్ళు అతని ఫియర్ డాక్టర్ అని ఏడిపించే వాళ్ళు, అప్పుడు ఒకసారి రాజీవ్ తనకు భయం లేదు అని నిరూపించాలి అని అధిక శాతం బ్రెయిన్లో ఉద్వేగం పెంచే డ్రగ్స్నీ తన మెదడులోకి డైరెక్ట్ గా ఇంజక్ట్ చేసుకున్నాడు.అంతే ఒక్కసారిగా బ్రెయిన్ కి అధిక శాతం బ్లడ్ సప్లయ్ పెరిగి, ఎమోషన్స్ ను కంట్రోల్ చేసే అతి సున్నితమైన నరాలు చిట్లి పొయ్యాయి.అప్పటి నుండి రాజీవ్ సెడేటివ్ మెడిసిన్ తీసుకుంటు తన బ్రెయిన్ నీ అదుపు చేసుకుంటూ వచ్చాడు.ఆ తర్వాత జాబ్ మానేసి ఎదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ జీవిస్తూ వున్నాడు..ఇన్ని చేస్తున రాజీవ్ కి తాను ఎం చేసినా ఆ స్థితిలో తనకు గుర్తు వుండవు"


"రాజీవ్ వాళ్ల నాన్న, ఎప్పుడూ కూడా రాజీవ్ వెనుక నీడ లాగా ఫాలో అవుతూ.తాను కంట్రోల్ తప్పుతునాడు అని తెలిస్తే అతని నార్మల్ స్థితికి తీసుకు రావడంకి ట్రై చేస్తాడు.ఒకవేళ కుదరకపోతే రాజీవ్ హత్య చేసిన తర్వాత ఆ శవం మీద ఏరోసాల్ ఆల్కహాల్ స్ప్రే చేస్తాడు, అందువల్ల ఎటువంటి ఆధారాలు దొరకలేదు పోలీసులకి"


"కొన్ని రోజులు గడిచాయి, చిన్నూ మళ్లీ టీవీ ఆన్ చేశాడు.నగర శివారలోని ఒక గుర్తు తెలియని మృత దేహం అని హెడ్ లైన్స్.... అంతటిలోకి కోమలికి ఫోన్ వస్తుంది.ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మావయ్య అని వుంటుంది అంతే...!







Rate this content
Log in

Similar telugu story from Horror