SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"మూగ మనసులు-8"

"మూగ మనసులు-8"

10 mins
297


మూగ మనసులు-7 కి

కొనసాగింపు,

మూగ మనసులు-8

"అలా తనతో ప్రేమలో పడ్డ నాకు, మా ఇంట్లో వాళ్ళు మా బావతో పెళ్లి ఫిక్స్ చేసి, ఆ ప్రేమకి స్వస్తి పలికారు.

దాంతో, నా మనసులో నిక్షిప్తమైన ఆ మూగ ప్రేమని, తనని మర్చిపోవడానికి చాలానే ట్రై చేశాను.

కానీ,

మరోపక్క తను నా పై పెంచుకున్న ప్రేమ కి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే, తను ఏమైపోతాడోనన్న దిగులు కూడా నాలో పెనవేసుకుంది. పైగా తనది కూడా చాలా సున్నితమైన మనసు కదా!.

నా స్నేహితురాలి ద్వారా...

తను ఆఫీస్ లో ఎలా ఉంటున్నాడొనని అనుక్షణం తన గురించి ఆరా తీస్తూనే ఉన్నాను.

అలా..

నాకొక రోజు తెలిసిన విషయమేమిటంటే, గత పది రోజులు నుండి తను ఆఫీస్ కి రావడం లేదని, బహుశా నాకిలా పెళ్లి ఫిక్సయ్యినట్టు తనకి తెలుసుంటుంది.

ఆ బాధలో ఏమైనా...? తను నిరాశలో ఉండుంటాడేమో?

అంతా నావల్లే కదా!

కానీ, ఇంత జరుగుతున్నా...

ఓ చలనం లేని రాయిలా, నేనేం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. అదే కొంచెం బాధగా ఉంది. అంటూ తన వేదనని వెళ్ళబుచ్చింది" స్పందన.

"నీ చుట్టూ ఇంత జరుగుతుంటే, ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదు, చెప్తే ఏదోకటి చేసేవాళ్ళం గా, అన్నయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళే ఏదొక సొల్యూషన్ వెతికేవారు.

అయినా నువ్వెప్పుడూ ఇలానే చేస్తావ్!" అంటూ సౌజన్య కూడా స్పందనని హత్తుకుని తన వేదనలో భాగమైంది.

కాసేపటికి, ఇద్దరూ ఆ బాధ నుండి బయటకు వచ్చారు.

"ఇలాంటి అవేశపూరిత ఆలోచనలే, ఎక్కడలేని అనర్థాలకు దారి తీస్తాయామొనని సైలెంట్ గా ఉండిపోయాను నేను.

తెలుసు కదా..!

నాన్నగారి గురించి,

ఆయనకి పరువన్నా, ఇచ్చినా మాటన్నా ఎంత పట్టింపో...

ఇప్పుడు ఇలాంటి తప్పులు వల్ల, ఇన్నేళ్ళ ఆయన పెంపకానికి

ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని మాయని మచ్చ తీసుకు రాలేను నేను.

అసలే, అత్తయ్య వాళ్ళకి కూడా అప్పటికే ఆయన మాట ఇచ్చేశారు.

ఇదంతా చెప్తే, ఇవన్నీ అర్ధం చేసుకోవడానికి బదులు, ఆ కోపంలో ఆయనకున్న బలగంతో తనని(సతీష్) కానీ, వాళ్ల ఇంట్లో వాళ్ళని కానీ ఏమైనా చెయ్యొచ్చు లేదా ఆయన తనకి తానుగా ఏమైనా చేసుకోవచ్చు.

ఇంతమందిని బాధ పెట్టే ప్రేమ నాకక్కరలేదనిపిస్తుంది.

ఆయన సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదనిపిస్తుంది.

అయినా... ఇప్పుడు తనే కావాలనుకుంటే, తనతో మాత్రమే హ్యాపీ గా ఉండగలను. అదే తనని వద్దనుకుంటే కొన్ని కుటుంబాలు హ్యాపీ గా ఉంటాయి."

''నువ్వు కూడా నాకు మాటివ్వు సౌజన్య, ఈ విషయం మరేవరికీ చెప్పబోనని" అంటూ సౌజన్య దగ్గర మాట తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది స్పందన.

దానికి సౌజన్య నిరాకరించినా...

స్పందన మాత్రం పట్టుబట్టి మరీ బలవంతంగా తన దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది.

ఇదంతా గుమ్మం వద్దే నిలబడి వింటున్న స్పందన వాళ్ళ అమ్మ కూడా, కూతురి ప్రేమని అర్ధం చేసుకున్నా...

తన భర్తకి ఎదురు చెప్పలేక, నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఒకపక్క బాధ కలుగుతున్నా. మరోపక్క, కన్న వాళ్ళని బాధ పెట్టకూడదనే తన కూతురు పెద్ద మనసుతో తీసుకున్న ఆ నిర్ణయంతో ఓ తల్లిగా తన పెంపకానికి గర్వపడతుంది.

                    ******************

సతీష్ ఉన్న ప్లేస్ కనుక్కుని రఘు ఎలాగోలా తనని చేరుకుంటాడు.

ఒక్కడే ఆలోచిస్తూ.. ఒంటరిగా ఉన్న సతీష్ వెనుక నుండి భుజాలపై చేయ్యేస్తూ,

"ఒరేయ్ సతీష్.. "అని పిలిచాడు రఘు.

దాంతో

"అరేయ్ రఘు!

ఎప్పుడొచ్చావు రా...!!

అంటూ తడిసిన తన కళ్ళు తుడుచుకుంటూ వెనకకి తిరుగుతాడు సతీష్ (పైకి నవ్వుతూ నటిస్తూ)

సతీష్ ను సూటిగా చూస్తున్న రఘు సతీష్ కళ్ళు ఎర్రగా ఉండడం కూడా గమనిస్తాడు.(బహుశా అప్పటివరకూ ఏడవడం వల్ల కాబోలు..)

"ఇక్కడేం చేస్తున్నావ్ రా...? అసలు ఉదయం నుండి కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వవు...?" అంటూ ప్రశ్నిస్తాడు రఘు.

"ఏం లేదు రా ... ఊరికే చిన్న పనిలో ఉండి...." దానికి బదులిచ్చాడు సతీష్..

"ఓహ్... అవునా అయినా నాకు అబద్ధాలు చెప్పడం ఎప్పటినుండి నేర్చుకున్నావ్ రా....?

నువ్వు అసలు ఇన్ని రోజులు జాబ్ కి లీవ్ పెట్టీ ఇక్కడే ఉండడానికి కారణమేమిటి?"

అలా రఘు ఒకదానికొకటి ప్రశ్నలు సంధిస్తుంటే,

దానికి బదులివ్వలేక, సతీష్ తడబడుతూ..

"అది ...అది ...హెల్త్ బాగాలేక.... " సతీష్ మాట పూర్తవ్వకుండానే,

"నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు" అన్నాడు రఘు

సతీష్ సూటిగా కాదు కదా! కనీసం తన తల పైకెత్తి కూడా మాట్లాడలేక నేల చూపులు చూస్తుండిపోయాడు.

"పోనీ నేను చెప్పనా..." అంటూ

తనతో పాటు తీసుకొచ్చిన డైరీ సతీష్ కి చూపించాడు రఘు.

సతీష్ కి విషయం అర్థమైంది.

అంతే అప్పటి వరకూ లో లోపల పడుతున్న వేదన అంత ఒక్కసారిగా పెల్లుబిక్కింది సతీశ్ కి.

రఘు నీ గట్టిగా కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు.

సరిగ్గా అప్పుడే మొదలైన వర్షానికి, తన కన్నీటి ధారలు కూడా అందులో కలిసిపోయాయి.

"అరేయ్ సతీష్... ఉరుకొరా.. ఇన్నాళ్లు ఎంత వేదన అనుభావించావో నాకర్థమవుతుంది.

ఒక్కసారి నా మాట విను రా...

(అంటూ తన భుజాన్ని తడుతూ..)

ఇప్పటికీ మించిపోయింది లేదు...

పద! ఒకసారి రాజేష్ గాడితో నేను మాట్లాడతా...

మా నాన్న గారితో కూడా వాళ్ళ ఫ్యామిలీ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనతో అడిగిద్దాం ఒకసారి."

అని రఘు అనగానే,

సతీష్ దానికి నిరాకరించాడు.

దాంతో రఘు

"అరేయ్..సతీష్ !!

నువ్వు ఎప్పుడూ ఇలానే చేస్తావ్.

నువ్విలా చెప్తే వినవు కానీ, నేనే రాజేష్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తానని రఘు కొంచెం ఎమోషనల్ గా మొబైల్ తీసి రాజేష్ కి కాల్ చేయబోతుండగా,

సతీష్ దానిని అడ్డుకుని ఆ ఫోన్ రఘు చేతుల్లోంచి లాకుంటాడు...

అరేయ్ సతీష్.. మొబైల్ ఇస్తావా లేక ఇప్పుడే వెళ్లి నేను ఆ పెళ్లి ఆపేయనా...

అంటూ రఘు బయలుదేరబోతుంటే,

సతీష్ రఘు నీ అడ్డుకుని, అప్పటివరకూ ఉన్న తన అవేదని కోపంగా మలిచి

"అరేయ్..! ఈ టైంలో ఇదంతా కరెక్ట్ కాదు రా...!

నాకు ఆ ప్రేమని పొందే అర్హత లేదూ రా..!

ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయ్ రా..!

అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తూ, రెండు మోకాళ్ళపై కూలబడి బిగ్గరగా ఏడుస్తాడు."

సతీష్ ని ఎప్పుడూ అలా చూడని రఘు మనసు చలించిపోతుంది. అప్పటికే అక్కడికి ఎవరో వస్తుండడం గమనించిన రఘు, సతీష్ ని ఓదారుస్తూ... అక్కడ నుండి తనని మరొక ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు ...

                         ***************

అక్కడికి వెళ్ళాకా,

ఇద్దరూ చాలా సేపు సైలెంట్ గా ఉంటారు. (అప్పటికే వర్షం కూడా వెలిసిపోతుంది.)

ఈ లోపు రఘు కి రాజేష్ దగ్గర నుండి కాల్ వస్తుంది.

"రఘు ఎక్కడున్నావ్ రా..! ,

మార్నింగ్ నుండి కాల్స్ చేస్తూనే ఉన్నా,

అసలు ఏమైపొయావు,

కాసేపట్లో చెల్లి పెళ్లి పెట్టుకొని, ఇప్పుడెక్కడున్నవ్ అంటూ రాజేష్ అడిగే ప్రశ్నలకి,

"ఏమి లేదు రా, నాకు బాగా కావాల్సిన స్నేహితుడొకడికి ఆక్సిడెంట్ అయ్యింది, అందుకే ఆ కంగారులో ఉన్నా..."

అంటూ అబద్ధం చెప్తాడు రఘు...

"అయ్యో..! ఏమైనా సీరియస్ ఇంజూరీస్ అయ్యాయా..!" అన్న రాజేష్ మరో ప్రశ్నకు బదులిస్తూ..

"హా.. తన మనసుకి, చాలా గట్టి దెబ్బే తగిలింది."

(సతీష్ నీ ఉద్దేశిస్తూ..)

"ఏంటీ ... !" అని ఆశ్చర్యంతో అడిగిన రాజేష్కి

"హా..అదే అదే

తన హార్ట్ దగ్గర గట్టి దెబ్బ తగిలిందని" చెప్పాడు.

"అవునా... ఇప్పుడెలా ఉంది."

ఇప్పుడప్పుడే కోలుకోలేని పరిస్థితని డాక్టర్స్ చెప్తున్నారు... (సతీష్ పరిస్థితిని అధ్ధం పట్టాడు రఘు.)

వాళ్ళ ఇంట్లోవాళ్లకి ఈ విషయం తెలిసిందా...అని రాజేష్ అడగగా..

(వాడి బాధ వాడిదే, ఎవరికి ఏమి చెప్పుకునే రకం కాదు వాడు అని చిన్నగా లోలోపల అనుకుంటూ...)

లేదు... లేదు... కంగారు పడతారని ఇంకా ఎవరికి చెప్పలేదని రఘు అంటాడు

"అయ్యోయో... అవునా!

నువ్ కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నట్టున్నవ్!

సరే రా...అదంతా చూసుకుని,

కొంచెం ముహూర్తం టైం కి రావడానికి ట్రై చేయ్ రా ...

మళ్ళీ నువ్వు లేకపోతే చెల్లి కూడా బాధ పడుతుంది" అని రిక్వెస్ట్ చేసిన రాజేష్ కి

"హా..! సరే రా.." అని బదులిస్తూ..

కాల్ కట్ చేసి సతీష్ వైపు తిరుగుతాడు రఘు.

"చెప్పరా సతీష్...

ఇన్నాళ్లుగా నువ్వే మోసావ్...

నిన్నే నువ్వే మోసం చేసుకుంటున్నావ్...

కనీసం, ఇప్పటికైనా నీ మనసులో దాచుకున్న ఆ మూగ ప్రేమను బయట పెట్టు!

ఈ విషయం నాకు కూడా చెప్పాలనిపించలేదా..

నీ గురించి తప్పుగా అనుకుంటానని, అసలు ఎలా అనుకున్నవ్ రా...

నాకు ముందే చెప్పుంటే, అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకునేవాళ్ళం, మన సౌజన్య కూడా తన ఫ్రెండే, (సౌజన్య ఎవరో కాదు, రఘు చెల్లెలు)

తనతో అయినా అడిగించే వాళ్ళం కదా.." అన్నాడు రఘు.

దానికి సతీష్ బదులిస్తూ...

"అందుకే రా... మీకేవరికి చెప్పంది.

ఇలాంటి తొందరపాటు నిర్ణయాలతో అనవసరంగా ఈ విషయాలలో జోక్యం చేసుకొని , కెరీర్ ని పాడు చేసుకుంటారనే, మీ దగ్గర దాచాను.

"అనవసరం ఏంటి ?

నీకు సంబంధించిన ఏ విషయం అయినా.. నీ స్నేహితుడిగా నాకది అవసరమే"

"అయినా..మేము కాదు రా... ఇలా అతిగా ఆలోచించి, నువ్వే నీ లైఫ్ ని నాశనం చేసుకుంటున్నావూ.

అంది వచ్చిన అవకాశాలు...

అది నువ్వని తెలిసీ చేజారి పోతాయో,

లేక వాటిని నువ్వే చేజార్చుకుంటావో అసలర్థం కాదు.

ఆఖరికి స్వచమైన మనసున్న నువ్వు కూడా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికుడిగా మిగిలిపోతున్నవ్ కదరా! అదే నా బాధ..." ,

తన స్నేహ బంధపు తీపిని తెలుపుతూ... బదులిచ్చాడు రఘు.

సతీష్ చిన్నగా నవ్వుతూ...

"ప్రేమ...!

ప్రేమలో విఫలం...!

భగ్న ప్రేమికుడు...!

ప్రేమ అనేది చాలా గొప్పదే. అందుకే అది దక్కించుకోవాలని రకరకాల ప్రయత్నాలు, నానా తంటాలు పడుతుంటారందరూ..

ఆ క్రమంలో చాలావరకూ, ఫలితాలు ఓడిపోతాయి కానీ, ప్రయత్నాలు కాదు. నా దృష్టిలో ప్రయత్నించని వాడు ఓడిపొయినట్టు, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ గెలిచినట్టే.

దానికి నేనేం అతితుడిని కాను, అందులో నేనొకడిని..

తన కోసం, తన ప్రేమ కోసం నేను కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వచ్చాను. కానీ, ఆ ప్రయత్నం ఫలిస్తుందనుకున్న టైం కి ఎప్పటిలానే విధి నన్ను వెక్కిరించింది.

ఏ రోజైతే తనని మొట్ట మొదటి సారి చూసానో.., ఆరోజే తను నాకు ఇక నా సొత్తు కాదని తెలిసింది(తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని ఆరోజే తెలిసింది). అసలు జరుగుతుందని ముందే తెలుసుంటే, తన రూపాన్ని ఎప్పటికీ చూడాలనుకునే వాడిని కాదు. నా మనసులోనే ఓ గుడి కట్టి ఎప్పటికీ తనని ఓ దేవతలా ఆరాధించేవాడిని. ఇప్పటికైనా అలానే చేస్తా... తన మనసు ఎప్పుడూ నాతోనే వుంటుంది. ఇదంతా ఆ బ్రహ్మ నాతో ఆడే ఆట!

నేనెవరో తనకి తెలీదు.

అసలు తన దృష్టిలో కూడా నాకు చోటు లేదు.

నా అభిప్రాయాన్ని వ్యక్తపరచి తన అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకోవడం లో నాకా అర్హత ఉంది.

కానీ, తన ఇష్టాన్ని తెలుసుకోకుండా తనని ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సమంజసం.

అయినా, అప్పటికే జరగాల్సింది కూడా జరిగిపోయింది. ఈ టైమ్ లో ఇదంతా తప్పనిపిస్తుంది.

మీకేవరికైన చెప్తే, తొందరపాటుతో నాకు మీరు చేయాలనుకునే మేలు తనకి కీడు అవ్వొచ్చు. ఇక ఈ సంగతి, ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా వెళ్ళడైతే, అసలే పరువు ప్రతిష్టలకు విలువలిచ్చి బ్రతికే కుటుంబం ... ,

ఆ కుటుంబం పరిస్థితి, ఆ అమ్మాయి పరిస్థితి

ఆలోచించాను అందుకే ఏమి చెయ్యలేక ఇలా మిగిలిపోయాను.

ఇక తను చెయ్యని తప్పుకి నలుగురిలో అల్లరి పాలు అయ్యే అవకాశమూ లేకపోలేదు.

తనని ప్రేమించిన మనిషిగా తన సంతోషాన్నే నేను కోరుకున్నది. నిజమైన ప్రేమ అందులోనే ఉందనేది నా అభిప్రాయం. అందుకే ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఇంకా తనని ప్రేమిస్తూనే ఉండిపోయాను.

మీ అందరి దృష్టిలో ప్రేమంటే...

ఎలాగైనా సరే ప్రేమించిన మనిషిని పొందడం. అందులో సుఖమే ఉంటుంది.

కానీ, నాకు తెలిసిన ప్రేమంటే, సుఖంతో పాటు సంతోషాన్ని పంచడం. అందులో త్యాగానికి కూడా చోటుంటుంది.

తనని నేనే కాదు నాలాంటి వాల్లెందరో ప్రేమిస్తారు.. కానీ, తన ప్రేమను ఎవరైతే పొందుతారో అదే కదా ముఖ్యం.

తనకిష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి తనని ఒప్పించరు కదా..! ఒక్కసారి ఆలోచించు.!

తను నాకన్నా మంచి స్థితిలో ఉన్న వాళ్ళ బావనే చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది."

అలా అన్న సతీష్ మాటలకి రఘు కి కళ్ళలో నీళ్ళు గిరున్న తిరిగి తనని గట్టిగా హత్తుకొని ,

"నీలాంటి స్నేహితుడు నాకున్నందుకు చాలా గర్వంగా వుంది రా సతీష్ " అంటూ తన స్నేహితుడి ఆ ఆలోచనకు, పెద్ద మనసుకి మెచ్చుకుంటాడు రఘు.

కానీ ఇన్ని చెప్తున్న నీ మనసు, రేపు తను ఎక్కడైనా ఎదురు పడితే తట్టుకోగలదా....?

ఇదంతా బరించగలదా...?

అన్న రఘుకు సతీష్ బదులిస్తూ...

అదొక మాటగా నా నోరు పలకడం తేలికే కానీ, అది తట్టుకునే మనసుకి సర్ధి చెప్పుకోవడం మాత్రం చాలా కష్టం. కానీ,

"ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బ తినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళి పోయారని అలాగే ఉండిపోతే ఎలా?"

అన్న ఆ శ్రీ శ్రీ గారి పంక్తులే చివరికి నాకు తోడుంటూ..నాలో కొంచెం స్ఫూర్తిని నింపుతున్నాయి.

తన ఆలోచనలతో ఇక్కడే ఉంటూ వాటి నుండి బయట పడడం కొంచెం కష్టమే, అందుకే కొన్నాళ్ళు ఈ ఊరికి, వాతావరణానికి దూరంగా ఉందామని నిర్ణయించుకున్నాను. అంటూ సతీష్ చెప్పుకొచ్చాడు.

ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది... ? రఘు ఆశ్చర్యపోతూ అడుగుతాడు.

అంతలోనే మొబైల్ తీసి, తనకి ఫారిన్ లో జాబ్ వచ్చిందని ఒక నెల రోజుల్లో బయలుదేరాలని అంటూ తనకొచ్చిన మెయిల్ చూపిస్తున్న సతీష్ నీ తిడతాడు రఘు...

ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి వేషాలు...

అంత దూరమా..?

నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా..

ఇక్కడ నీకు ఏం తక్కువయిందని, నువ్వు తనకి మాత్రమే దూరంగా ఉండాలని అనుకున్నట్టు లేదు... మీ ఇంటికి, మాకు అందరికీ దూరంగా ఉండాలనుకున్నట్టు ఉంటుంది.

"అది కాదు రా... రఘు..." అని సతీష్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటే,

ఇక చాలే ఆపరా!

ఈ నిర్ణయం తీసుకునే ముందు,

నాకొక్క మాటైనా చెప్పావా..

కనీసం ఇంట్లో వాల్లతోనైనా ఆలోచించావా.. అంటూ కొప్పపడతాడు రఘు.

"లేదు రా వాళ్లకి చెప్పలేదు. చెప్తే ఎలా రియక్ట్ అవుతారోనని భయం తో చెప్పలేదు. మంచి సమయం చూసి చెప్పాలి, వాళ్ళని ఒప్పించే బాధ్యత కూడా నీదేనంటాడు..."సతీష్

"ఎందుకు రా ఇంత చేస్తున్నావ్..!" అన్న రఘు మాటలకి బదులుగా...

"లేదు రా... తను ఒక్కసారి నా ఊహల్లో మెదిలితేనె రోజంతా ఆలోచించే వాడిని, అది కలని నిజం కాదని తెలిసి, నాకు తెలియకుండానే ఒత్తిడిలోకి జారుకునేవాడిని.

ఇప్పుడు తను శాశ్వతంగా దూరం అవుతుంటే, దాన్ని తట్టుకునే శక్తి, నాకు కానీ, నా మనసుకి కానీ లేదు. అందుకే,

ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి" అంటాడు సతీశ్.

అదే బాధతో సతీష్ నీ ఇంటి దగ్గర దించి , రఘు ఆ పెళ్లికి వెళ్తాడు...

స్పందన పెళ్లి పీటలెక్కుతుంది..!

తనకి నచ్చిన సతీష్ తో కాదు, తన కుటుంబం మెచ్చిన వాళ్ళ బావతో..

ఆ పెళ్లి జరిగిన నెల రోజులకు, అనుకున్నట్టు గానే సతీశ్ ఫారిన్ వెళ్ళిపోతాడు....

                       ****************

సరిగ్గా 5 సంత్సరాల తర్వాత సతీష్ తిరిగి ఇంటికి వస్తాడు. రాగానే రఘు ఇంటికి వెళ్తాడు.

"రేయ్ సతీష్..

ఎప్పుడొచ్చావు రా..?

ఎలా ఐపోయావ్...?

ఎన్నాళ్ళయింది రా నిన్ను చూసి...? అంటూ అన్నెళ్ళ తర్వాత వచ్చిన సతీష్ ని ఆప్యాయంగానే పలకరించి లోపలకి తీసుకెళ్తాడు రఘు.

అమ్మా...!

నాన్న... !!

ఎవరొచ్చారో చూడండి,

లక్ష్మి ..!

లక్ష్మి...!

ఎక్కడున్నావ్...?

అంటూ తన భార్యని కూడా పిలుస్తాడు రఘు.

రఘు వాళ్ళ అమ్మ నాన్న కూడా సతీష్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. తర్వాత తన భార్య లక్ష్మి ని పరిచయం చేస్తాడు రఘు.

"అరేయ్ సతీష్... మా పెళ్ళికి మిస్ అయ్యావు కదా... ఇదిగో తినే నా వైఫ్ లక్ష్మి...

లక్ష్మి ...నేను చెప్తుంటాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ అని.

ఒకర్నొకరకి పరిచయం చేస్తాడు రఘు.

ఆ పరిచయాలు అయ్యాకా....

అలా పెరట్లో లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు రఘు, సతీష్...

మాటల్లో మాటగా...

స్పందన ఇప్పుడెలా ఉంది రా...?

వాళ్ళ ఫ్యామిలీ, భర్త ఎలా ఉన్నారు..?

ఇక్కడికి ఎప్పుడైనా వస్తారా...?

ఎక్కడుంది తను అసలు...? అని అడగకనే అడుగుతాడు సతీష్. (ఎంత కాదనుకున్నా ఒకప్పుడు అమితంగా ప్రేమించినమ్మాయి కదా!)

"ఇన్నెల్లైనా నువ్వింకా తనని మర్చిపోలేదా.. రా...!"

"తన జ్ఞాపకాలు ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉన్నాయన్న మాట" అని రఘు అంటుండగా...

ఒక చిన్న పాప .. రఘు దగ్గరకి వచ్చి, అల్లరి చేస్తుంది.

"కారుణ్య...

తప్పమ్మా..!

అలా అల్లరి చేయకూడదు, అంటూ లక్ష్మి వచ్చి, తనని లోపలకి తీసుకుని వెళ్ళిపోతుంది.

ఆ పాపను తదేకంగా చూస్తూ,

ఎవరా పాపా..? అని రఘుని అడుగుతాడు సతీష్...

అది ... అది... అంటూ చెప్పడానికి తడబడతాడు రఘు.

ఆ పాప ఎవరంటే అలా నాన్చుతావేరా...!

ఎవరో చెప్పమంటాడు సతీష్.

తను...."స్పందన" కూతురు బధులిస్తాడు..రఘు

ఆ మాటతో అప్పటికే కాఫీ తాగుతున్న సతీష్ కి ఒక్కసారిగా గొంతులో ఏదో అడ్డపడ్డట్టు పొలమారూతుంది.

"ఏంటి...!" రఘుని ప్రశ్నిస్తాడు సతీష్...

అవును తను స్పందన కూతురే, పేరు కారుణ్య.

నువ్వెల్లిపోయాకా, ఇక్కడ చాలా జరిగాయి రా...!

ఎక్కడో దూరంగా ఉంటున్న నీకు, ఇవన్ని చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నా..

అసలేమైంది! స్పందన ఎక్కడుంది? ఎలా ఉంది..??

సతీష్ కొంచెం కలవరపడుతూ రఘు నీ ఆరాతీస్తాడు.

"స్పందనకి పెళ్లయ్యిన రెండేళ్ల కే, US లో జరిగిన ఒక కార్ ఆక్సిడెంట్ లో తన భర్తతో పాటు... తను కూడా...

(సతీష్ కి ఊపిరి ఆగినంత పనైంది, తన కళ్ళు చెమ్మగిల్లాయి, తన ఒళ్ళు సొమ్మసిల్లింది.)

ఆ తర్వాత కొన్నాళ్ళకి కారుణ్య ఆలనా పాలనా చూస్తున్న వాళ్ల తాతయ్య, అమ్మమ్మ, మావయ్య (రాజేష్) కూడా ఇక్కడే అలాంటి ఓ కార్ ఆక్సిడెంట్ లోనే పోయారు. సరిగ్గా అప్పటికే రాజేష్ కి కూడా పెళ్లి కుదిరింది పాపం.

కారుణ్య ని చేరదీసే వాళ్ళు లేక పాపం అనాధగా మిగిలిపోయింది. తనకి వాళ్ళు లేని లోటు కొంచెమైనా తీర్చగలనేమోనని నా దగ్గరకి తెచ్చుకుని పెంచుకుంటున్న..." అని రఘు చెప్పడంతో...

తను అంతగా ప్రేమించిన స్పందన జీవితం, ఎక్కడో ఒకచోట సంతోషంగానే ఉంటుందనుకున్న సతీష్కి, అల స్పందన జీవితం అర్ధంతరంగా ముగిసిపోవడం, తన కూతురు అనాధగా మిగిలి పోవడం చూసి తట్టుకోలేకపోయాడు. తన దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. రఘు కూడా సతీష్ నీ ఒదార్చలేక, అలానే నిస్సహాయతగా ఉండిపోయాడు.

చివరికి ఆ బాధ నుండి తేరుకున్న సతీశ్,

"కారుణ్య బాధ్యతను ఇక తనే తీసుకుంటానని."

రఘు నీ రిక్వెస్ట్ చేస్తాడు...

కానీ, రఘు దానికి ఒప్పుకోడు..

"నీకు కూడా ఒక లైఫ్ అంటూ ఉంటుంది కదరా.. !!

మళ్ళీ నీ జీవితానికి తను భారమవడం నాకిష్టం లేదని"

రఘు దానికి గల కారణం చెప్తాడు.

హుమ్మ్ .. లైఫ్!

స్పందన ఎక్కడున్నా.. సంతోషంగా ఉండాలని కోరుకున్నాను.. దాన్నే ప్రేమనుకున్న ఓ పిచ్చి వాడిని,

ఇప్పుడసలు తనే లేదు.

పైగా కారుణ్య జీవితం ప్రశ్నార్థకంగా మారింది?

అందుకే, నా జీవితానికి తను భారంలా కాకుండా...

మధురమైన నా ఆ మూగ ప్రేమకి, కారుణ్యని ఓ ప్రతిరూపంగా, ఓ తీపిగుర్తుగా భావిస్తాను.

నేను ప్రేమించిన స్పందన ఎలానో దక్కలేదు. కనీసం, కారుణ్య లోనైనా తనని చూసుకుంటూ..తనకంటే గొప్పగా ప్రేమిస్తాను.

ఓ తల్లిలా, ఓ తండ్రిలా, అంతకుమించిన ఒక మంచి స్నేహితుడిలా ఇక నుండి తన బాగోగులన్నీ నావే. తనకి ఏ లోటూ లేకుండా పెంచుకుంటాను. నాది హామీ.!

సతీష్ భావజాలానికి ముగ్ధుడైన రఘు, సతీష్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని కాదనలేకపోయాడు.

ఇప్పటినుండి సతీష్ కి కారుణ్య...

తన స్వఛ్చమైన ప్రేమకు ఓ తీపి గుర్తు మాత్రమే కాదు, అంతకు మించిన ఓ బాధ్యత.

ఇంతటితో నా ఈ మూగ మనసులు కథ సమాప్తం.

                      ***************

పాఠకులకు విజ్ఞప్తి: "రచయితగా నా ఈ కథ పై వీక్షణ"


ఈ కథ పూర్తిగా కల్పితనైనదే అయినా, ఇందులో ప్రేమ అనే ఓ మధురమైన అనుభూతి పై నాకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఒక వేదిక గా మలచుకున్నాను.


"ప్రేమంటే కలిసి తిరగడం, ఒకరికొకరు అవసరాలు తీర్చుకోవడం, అవి తీరాక ఎవరికివారు మొహాలు చాటేయడం లేదా ఆ ప్రేమని పొందడం కోసం దారుణాలకు ఒడిగట్టడం, అది దక్కకపోతే చివరికి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం లాంటి వాటిని అలవరచుకుని, ఆఖరికి ఆ ప్రేమనే పదాన్నే చులకన చేసిన ఈ కాలపు యువతకు నా ఈ మూగ మనసులు అనే కథ ఓ చెంపపెట్టు లాంటి సందేశం.


నిజమైన ప్రేమ, స్వఛ్చమైన ప్రేమ, నిజాయితీగల ప్రేమ ఇన్ని ప్రేమలుంటాయో లేదో కానీ, నాకు తెలిసిన ప్రేమంటే ప్రేమే.


అది అమ్మ ప్రేమంత స్వఛ్చమైనది, నమ్మకమైనది.


ప్రేమ ఒక ఛాయిస్ మాత్రమే, అందులో ఆప్షన్స్ ఉండవు. ఎవరో ఒకరి మీద మాత్రమే పుడుతుంది.


అది అమరం. దానికి చావు లేదు.


ప్రేమలో స్వార్ధానికి తావు లేదు ఒక్క త్యాగానికి తప్ప.


స్వార్థంతో రెండు శరీరాలు ఒక్కటైతే, ఆ ప్రేమ గెలిచినట్టూ కాదు...


నిస్వార్ధంగా రెండు మనసులు విడిపోతే, ఆ ప్రేమ ఓడినట్టూ కాదు...


తల్లిదండ్రులను ఎదిరించి లేచిపోయే దైర్యం ఉండే ప్రేమకి,

లేక, వాళ్ళని ఒప్పించి పెళ్ళిచేసుకునే సాహసం ఉండే ప్రేమకి,

వాళ్ళ పరిస్థితిని అర్ధం చేసుకుని, దాన్ని త్యాగం చెయ్యాలనే ఆలోచన మాత్రం కరువైంది.


కన్నవారి కలల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం, తమ తమ మనసులలో పరమలించుకున్న ప్రేమను బయట పడనివ్వకుండా... చివరికి ఆ మూగ ప్రేమని త్యాగం చేసిన స్పందన, సతీష్ లాంటి అమర ప్రేమికులందరికి నా ఈ మూగ మనసులు అంకితం.


వయసులో చిన్నవాడినే అయినా...

రచయితగా పెద్దగా అనుభవం లేకపోయినా...

అసలు ప్రేమంటే ఏంటో పెద్దగా అవగాహన లేని ఓ యువకుడిగా నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని, తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ...


ఇన్నిరోజులూ "మూగ మనసులు" అన్ని భాగాలు ఓపికగా చదివిన పాఠకులందరికీ నా ధన్యవాదాలు🙏🙏🙏


రచన: సత్య పవన్✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics