SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"మూగ మనసులు-7"

"మూగ మనసులు-7"

7 mins
340


పాఠకులకు విజ్ఞప్తి: టైటిల్ కవర్ పేజీలో టైటిల్ పేరు తప్పుగా ముద్రించబడినది దయచేసి గమనించగలరు.

మూగ మనసులు-6 కి

కొనసాగింపు

మూగ మనసులు-7

అలా సౌజన్య గట్టిగా అడిగేసరికి, అప్పటివరకూ లోలోపల పడుతున్న ఆ మనోవేదనను ఇక ఆపుకోలేకపోయింది స్పందన. 

ఒక్కసారిగా సౌజన్యని హత్తుకుని గట్టిగా ఏడ్చేసింది.

ఎంత కష్టాన్నైన్న ఎదురొడ్డి తట్టుకునే స్పందన ఇప్పుడెందుకు ఇంతలా బాధ పడుతుందో, అసలక్కడ ఏం జరుగుతుందో సౌజన్యకి అర్ధం కావడం లేదు.

"'ఒక అమ్మాయి అప్పగింతలప్పుడు కన్నీరు పెట్టుకుందంటే, దానికి కారణం తన వాళ్ళని విడిచి వెళ్ళలేకనర్థం.

ఆదే అమ్మాయి పెళ్లికి ముందే కన్నీరు కారుస్తుందంటే, దానికి కారణం తనకిష్టం లేని జీవితంలోకి బలవంతంగా వెళ్తున్నాననర్థం. "

ఒక ఆడదానిగా, అంతకు మించిన ఒక మంచి స్నేహితురాలిగా నీ మనసు నాకు తెలుసు...

అసలేమైందొ చెప్పు స్పందన!" అని తన భుజాలపై వాలిన స్పందనని అడిగింది సౌజన్య ఓదారుస్తూనే.

స్పందనకి ఎలా మొదలు పెట్టాలో తెలియక కొన్ని క్షణాలు మౌనంగానే ఉండిపోయింది...

కాసేపటికి మౌనం వీడిన తన మూగ మనసు, జరిగిన గతం గురించి చెప్పుకొచ్చింది.

"ప్రేమ..!

అసలు ఒకప్పుడు ప్రేమంటేనే ఆమడ దూరం పారిపోయేదాన్ని ,

అంతకుమించి అసహ్యించుకునే దాన్ని.

ఇప్పుడు అదే ప్రేమ కావాలనిపిస్తుంది,

ఆ నా ప్రేమను ఇంకా.. ఇంకా... ప్రేమించాలనిపిస్తుంది."

స్పందన అల మాట్లాడడం చూసి ఆశ్చర్య పోయిన సౌజన్య..

ఎప్పుడూ లేనిది అసలు నువ్వెంటే ఇలా మాట్లాడుతున్నావ్...!

సరదాకైనా ప్రేమనే పదాన్ని తెస్తెనే అసలు ఊరుకునేదానివి కాదు, పైగా మమ్మల్ని తిట్టేదానివి.

అసలు నువ్విలా...! (అని పూర్తి చేయబోతున్న సౌజన్య మాటకు అడ్డుపడుతూ...)

అవునూ!, ఒకప్పుడు ప్రేమనే దానికి కరగని నేనొక రాయిని అనుకునే దాన్ని. మేమెప్పుడూ కలుసుకోకపోయినా, కనీసం మాట్లాడకొకపోయినా... తనకి నాపై గల ప్రేమ తెలిశాక

నా రాయి లాంటి మనసు కూడా ఇట్టే కరిగిపోయింది.

తన పద్దతులు, ఆలోచనలు , అభిరుచులు , అలవాట్లన్ని ప్రతిక్షణం తనకు నన్ను దగ్గరి చేశాయి.

తనని చూసింది కొన్ని సార్లే. కానీ, ఎందుకో తెలీదు బాగా దగ్గరయిపోయాను. అసలు తన ప్రేమను ఆశ్వాదిస్తున్నప్పుడు నాకర్ధం కాలేదు, ఇప్పుడు తనకి దూరం అవుతుంటే తెలుస్తుంది. దాని విలువ.

అసలు ఎవరే అతను!, అంటూ స్పందనని గట్టిగా నిలదీసింది సౌజన్య.

తను ... తను... అంటూ తడబడుతూ...

"సతీష్...! "

రఘు అన్నయ్య ఫ్రెండ్ అంటూ చెప్పకనే చెప్పింది స్పందన.

ఏంటి సతీష్ ఆ...

ఆ అబ్బాయి చాలా మంచోడే, నాకు చిన్ననాటి నుండి తెలుసు. ఈ రోజుల్లో తన లాంటి లక్షణాలు కల్గిన అబ్బాయిలు అరుదని. అలాంటి వాడు అన్నయ్యకి ఫ్రెండ్ గా దొరకడం తన అదృష్టమని. అన్నయ్య ఎప్పుడూ తన గురించే చెప్తుంటాడు..

అయినా... !

మీ ఇద్దరికీ ఎక్కడ కుదిరిందే అసలు...

అని స్పందనని సూతనప్రాయంగా అడిగింది సౌజన్య ..

జరిగిన గతాన్ని వివరిస్తుంది స్పందన...

"సరిగ్గా వన్ ఇయర్ బ్యాక్ , ఇదే రోజు ఫిబ్రవరి 14 , 2014.

ఆరోజు గుడిలో మొట్ట మొదటి సారి తనని చూసాను.

అసలప్పటికే ఈ కాలపు అబ్బాయిలన్నా, ఈ ప్రేమలు గీమలన్నా అసహ్యించుకుంటున్న నేను...

ఆ రోజు వాలంటైన్స్ డే అయినా కూడా, అందరిలా పబ్ లకు పార్కలకి కాకుండా తను గుడికి రావడం, ఈ కాలపు అబ్బాయిలా తొందర పడకుండా తనతో పాటే ఉన్న పెద్దవాళ్లతో సహనంగా అలా వరసలో వెచివుండడం చూస్తే, ఈ రోజుల్లో కూడా ఇలాంటివారుంటారా అనిపించింది. ఆ తొలి చూపులోనే, అప్పటివరకూ నాకబ్బయిల మీదున్న అసహ్యం కాస్తా పోయి, మొదటిసారి కొంచెం గౌరవం ఏర్పడింది.

                         ******************

ఆ తర్వాత ఓ రోజు ఊరిలోనున్న లైబ్రరీ కి వెళ్ళాను, ఆ లైబ్రరీ లో బుక్స్ అన్ని దుమ్ము పట్టేసాయి, ఒక్క శ్రీశ్రీ మహా ప్రస్థానం తప్ప. ఈ లైబ్రరీ కి వచ్చేవాళ్ళు చాలా తక్కువని నాకప్పుడే అర్థమైంది. వచ్చే వాళ్ళు కూడా ఆ శ్రీ శ్రీ గారి అభిమానులని, ఆ రిజిస్టర్ బుక్ కూడా అదే చెప్పింది.

కంటిన్యూాస్ గా "సతీష్" అని ఒకటే పేరు తో ఆ రిజిస్టర్ లో కొన్ని రోజులుగా ఆ బుక్ తీసుకెళ్లడం చూస్తుంటే, నాలా ఆ అబ్బాయికి కూడా శ్రీ శ్రీ రచనలు అంటే ఎంతిష్టమో గమనించగలిగాను.

నేను కూడా శ్రీ శ్రీ రచనల కి వీరాభిమానినే కదా మరి!

అలా నేను బుక్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటే, ఆ రోజు గుడిలో చూసినబ్బాయి నాకేదురుయ్యడు (సరిగ్గా తను కూడా లైబ్రరీ లోపలికి వెళ్తున్నాడు) ఆ లైబ్రరీ కి తరుచుగా వచ్చేది ఆ అబ్బాయేనని అప్పుడర్థమైంది..

ఆ రోజు గుడిలో చూసినబ్బాయి, ఈ శ్రీ శ్రీ అభిమాని ఇద్దరూ ఒక్కరేనని కన్ఫర్మ్ చేసుకున్నాను.

                         ******************

హైదరాబాద్ లో ఓ మంచి కంపెనీ లో జాబ్ రావడం తో, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే, అమ్మమ్మ గారింటికి బయలుదేరాను. (సాయంత్రం అక్కడి నుండే హైదరాబద్కి బస్.)

అలా ఆ రోజు ఉదయం బస్ లో వెళ్తుంటే, ఊరి చివర పొలిమేరల్లో తను(గుడిలో చూసినబ్బాయి సతీష్) మళ్ళీ కనిపించాడు. పక్కనే రఘు అన్నయ్య కూడా ఉండడంతో ఇద్దరూ ఫ్రెండ్స్ అని అప్పుడే తెలిసింది.

అప్పటి వరకు తన గురించి ఆలోచించింది లేదు. కానీ, ఎందుకో తనని మిస్ అవుతున్నానే భావం నాలో మొదటిసారి ఏర్పడింది.

కానీ, ఎందుకో మళ్ళీ అనవసరంగా ఆ అబ్బాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాననిపించింది. నా ఆలోచనలు కట్టడి చెయ్యాలని, తనకి దగ్గరగా బస్ చేరువయ్యే సరికి ఆ విండో డోర్ గ్లాస్ కాస్తా క్లోజ్ చేసేసాను.

                         ******************

కొన్ని రోజులు తర్వాత...

ఎప్పుడూ కాల్ చేసినా.. వెంటనే లిఫ్ట్ చేసి, మాట్లాడే అన్నయ్య. ఆ రోజెందుకో ఎన్ని కాల్స్ చేసినా అటెంప్ట్ చేయలేదు.

మరుసటి రోజు కాల్ చేసిన అన్నయ్య, నేను తనపై కోపంగా ఉంటానని తెలిసి, ముందు రోజు కాల్ లిఫ్ట్ చేయకపోవడానికి కారణం చెప్పాడు....

తను ఆ రోజు ఫ్రెండ్స్ తో ఉన్నానని,

"రఘు గాడి ఫ్రెండ్ సతీష్ అని నీకు తెలియకపోవచ్చులే, ఈ రోజు తను హైదరాబాద్ వెళ్తున్నాడంట. జాబ్ కోసం. తనకి అక్కడ ఎవరూ తెలియదట, కల్లా కపటం తెలియని వాడంట, అసలు అలాంటివాడు ఈ రోజుల్లోనే దొరకరంట!

ఇలా చెప్పిందే చెప్పి ఎన్నో, ఎన్నెన్నో గొప్పలు చెప్తుంటే, వింటూ అక్కడే లేట్ అయ్యింది నైట్.

అందుకే రా..!

నీకు తిరిగి కాల్ చేయలేయకపోయాను. అయినా నీకు ఆ రఘు గాడి గురించి తెలుసు కదా పట్టుకుంటే వదలడని.

సారీ రా!"

అంటూ చెప్పాడు..

రఘు అన్నయ్యకి తను బాగా క్లోజ్ అని, అన్నయ్యకి కూడా తను తెలుసని అర్థమవుతుంది. కానీ, ఎంతైనా ఆడపిల్లని కదా! బయట పడి తన గురించి చెప్పలేకపోయాను.

కానీ, అన్నయ్య మాటలతో ఆ అబ్బాయి పై మరింత గౌరవం పెరిగింది.

"అన్నట్టు ఆ అబ్బాయి కూడా మీరుండే ఏరియా కి వస్తున్నాడు అంట. నువ్వూ అక్కడే ఉంటావ్, నీ గురించి చెప్దామని అనుకున్నా.. కానీ, నీ ఇష్టం లేకుండా చెప్తే, నీకు నచ్చదు గా.. మళ్ళీ నన్ను తిడతావ్. అందుకే నేనేం మాట్లాడలేదు." అని చెప్పాడు అన్నయ్య.

సరే అన్నయ్య ! అంటూ ఫోన్ పెట్టేసాను నేను.

తను కూడా ఇక్కడికే వస్తున్నాడని తెలిసిన మరుక్షణం ఎందుకో తెలియని ఉత్సాహం నాలో.

                         ******************

ఆ రోజు నుండి మా ఏరియా లో ఎక్కడైనా తను కనిపిస్తాడేమోనని ఎదురుచూడని క్షణమంటూ లేదు.

చివరికి ఓ రోజు చేతిలో ఫైల్ పట్టుకుని, మా హాస్టల్ ముందు నుండి తను వెళ్ళడం గమనించాను. ఇంకా తను జాబ్ ట్రైల్స్ లోనే ఉన్నట్టు అర్థమవుతుంది.

అలా తనని చూస్తూ, ఆలోచిస్తుండగానే ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు తను. ఎలాగైతే చివరికి తను ఇక్కడే ఉన్నట్టు సూచనలు అందాయి కదా! ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరకడా ఏంటి, అంటూ నిరాశతో కూడిన నా మనసుకు సర్ది చెప్పుకున్నాను.

అదే రోజు సాయంత్రం వేరొక కంపెనీలో HR గా పనిచేస్తున్న నా ఫ్రెండ్ శ్రుతి కాల్ చేసి,

ఆ రోజు వాళ్ళ ఆఫీస్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

ఆ రోజు ఒక అబ్బాయి ఇంటర్వ్యు కి వస్తె, అన్ని రౌండ్లలో తను బాగా పెర్ఫాం చేసినా, రిఫరెన్స్ కి కక్కుర్తిపడి వాళ్ళ బాస్ ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశారని. పాపం ఆ అబ్బాయికి జాబ్ అవసరమని. అతణ్ణి చూస్తే జాలేస్తుందని, ఎదైనా మంచి జాబ్ ఉంటే రిఫర్ చేయమని నన్నడిగింది.

సరేనని , ప్రొఫైల్ పంపించమన్నాను.

తను సెండ్ చేసిన ఆ ప్రొఫైల్ చూసి షాక్ అయ్యాను.

అదేవరిదో కాదు, సతీశ్ ది.

ఎంత యాదృచ్ఛికమో కదా!

పాపం తను ఇక్కడకి వచ్చి, జాబ్ కోసం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడో అర్ధం చేసుకోగలిగాను. వెంటనే మా మేనేజర్ కి చెప్పి, తనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ పంపించాను మా కంపెనీ తరుపు నుండి.

                       ******************

తను ఇంటర్వ్యూ లో అన్ని రౌండ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో, మా మేనేజర్ ఆ ఫైనల్ HR రౌండ్ నాకే అప్పగించారు. కానీ, నాకు అతన్ని ఫేస్ దైర్యం సరిపోలేదు. నాలో అతనంటే ఏర్పడిన బిడియం వల్ల కాబోలు...

నా ప్లేస్ లో తనని ఇంటర్వ్యు చేయడానికి నా స్నేహితురాలిని పంపించాను.

ఎందుకో, అన్ని రౌండ్ లు చాలా కాన్ఫిడెంట్ గా కంప్లీట్ చేసిన తను ఆ ఫైనల్ రౌండ్ లో మాత్రం తడబడ్డట్టు తనని ఇంటర్వ్యు చేసిన నా ఫ్రెండ్ చెప్పింది...

ఎందుకో, ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తున్న టైం లో

తన టేబుల్ పై అతనేదో డైరీ మరచిపోయాడంటూ, నా చేతికి తెచ్చించ్చింది నా ఫ్రెండ్.

ఎదుటివారి డైరీ చదవడం తప్పనిపిస్తున్నా... అందులో తను ఏం రాశారో, అసలు ఈ ఫైనల్ రౌండ్ లో తను ఫెయిల్ అవ్వడానికి గల కారణం, అందులో ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమోనని.. తీసి చదవక తప్పలేదు.

అది ఓపెన్ చేయగానే, నన్ను మొదటిసారి చూసిన ఆ క్షణం గురించి నన్ను వర్ణిస్తూ రాయడం చూసి ఆశ్చర్యపోయాను. నేను తనకి ఎదురైన ప్రతీ క్షణాన్ని, అందులో ఒక్కక్క అక్షరంగా మలిచిన తీరు చూస్తుంటే అతను నన్ను ఎంతగా ఆరాధిస్తున్నాడో, అంతకు మించి ఇంకెంతగా ప్రేమిస్తున్నాడో నాకప్పుడే అర్థమయ్యింది.

ఆ క్షణం నాకవి పుస్తకంలో రాసిన అక్షరాలుగా కనిపించలేదు, తన హృదయపు గోడలపై లిఖించుకున్న ప్రేమ భావలుగా అనిపించాయి. తనపై గౌరవం కాస్తా మరింత ఇష్టంగా, ఆ ఇష్టం అంతకుమించిన ప్రేమ గా క్షణాల్లో మారిపోయాయి. తన రాతలతోనే కాదు, తనతో కూడా ప్రేమలో పడిపోయాను ఆ క్షణం.

ఇంతలో మర్చిపోయిన డైరీ కోసం తను తిరిగి వస్తుండడం గమనించి, ఆ డైరీ ఆఫీస్ బాయ్ కి ఇచ్చి తనకి అందేట్టు చేశాను.

తనకి నేనెవరో తెలియకుండానే, నన్ను అంతలా ప్రేమిస్తున్న ఆ ప్రేమని దగ్గరుండి ఆశ్వాధించాలనుకున్నాను.

అందుకే, చివరికి ఎలాగోలా.. మా HR ఫ్రండ్ అండ్ మా మేనేజర్ ని ఒప్పించి తనకి ఆ జాబ్ వచ్చేట్టు చేశాను. కానీ, తనకి మా హెడ్ ఆఫీస్ లో కాకుండా దగ్గరలో ఉండే బ్రాంచ్ ఆఫీస్ లో ఆ జాబ్ రావడం వల్ల తనని దగ్గరుండి కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ, తను నేను ఇద్దరం ఒకే ఏరియా లో ఉండడం కొంచెం కలిసొచ్చే అంశం అనిపించింది.

                     ******************

తనని డైలీ ఫాలో అయ్యేదాన్ని, తన ఆక్టివిటీస్ అన్ని దగ్గరుండి గమనించేదాన్ని. చిన్నా, పెద్దా.. అయినవాళ్ళు .. కానివాల్లు ఇలా తేడా లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుంటాడని ఆ క్రమంలోనే నేను తన గురించి తెలుసుకోగలిగాను.

దసరా టైంలో తను లీవ్ పెట్టి, ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. .(అందరి అటెండెన్స్ లు చివరికి మా దగ్గరకే కదా వచ్చేది.)

నిజానికి అప్పుడు నేను కూడా ఇంటికి రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల రాలేక పోయాను.

దీపావళికి ముందనుకుంటా, నేను నా ఫ్రెండ్ కలిసి దగ్గర్లోనున్న పిల్లల ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ రిజిస్టర్ లో తన పేరు, అడ్రస్ ని చూశాను. తను కచ్చితంగా సతీషే!

అక్కడికి చాలా తక్కువగా డోనార్స్ వస్తారని, తను మాత్రం రెగ్యులర్ గా వస్తాడని అక్కడుండే ఆ పిల్లల టేక్ కేరర్ నాతో అన్నారు. తను బాగా కలివిడిగా ఉండే మనస్తత్వం కలవాడని ఆ పిల్లల మాటల్లో మరొక్కసారి తనకున్న ఆ మంచి లక్షణాల గురించి తెలిసాయి.

అలా రోజు రోజుకి తనపై నాకు గౌరవం, ఇష్టం, ప్రేమ అన్నీ రెట్టింపవుతూనే ఉన్నాయి.

                        ******************

Dec 31 న

ఆ రోజు రాత్రి మా హాస్టల్ దగ్గర్లో సరదాగా చిన్న పిల్లలతో ఆడుకుంటుండగా, నా ఫ్రెండ్ పిలవడంతో ఒక్కసారిగా పక్కకు తిరిగిన నాకు, సడెన్ గా తను కనిపించాడు. తను నా కోసమే అక్కడుండి, నన్నే చూస్తున్నట్టనిపించింది. తనకి నా మొహం చూపించడానికి కూడా నేను దైర్యం చేయలేక, అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాను.

కానీ, తనని కలిసే ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉండడం ఓ గొప్ప అనుభూతిని రేకెత్తిస్తోంది.

                      ******************

సంక్రాంతి రోజు రాత్రి , ఊరి దేవత గుడి దగ్గర నేను గుడిలో నుండి బయటకు పరిగెడుతుంటే, తను నన్ను చూడడం గమనించాను. అదే మొట్ట మొదటి సారనుకుంటా తను నన్ను చూడడం. చూస్తూ అలానే ఉండిపోయాడు.

అలా చూసిన కొద్దిసేపటికే,

రఘు అన్నయ్య వాళ్ళ దగ్గర తనుండం గమనించాను. తనకి దృష్టి కి ఎలాగైనా దగ్గరవ్వాలని రాజేష్ అన్నయ్య రఘు అన్నయని పిలుస్తున్నట్టు చెప్పాను వాళ్ళ దగ్గరకి వెళ్ళి చెప్పాను. (నిజానికి వెరేవాల్లని పిలవమని చెప్తే, అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను). ఆ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాను.

అలా తనకి కనిపించి, కనపడనట్టు నన్ను అంతగా ప్రేమించిన వ్యక్తిని ఆట పట్టిస్తూ ఉండడం, నాకొక కొత్త అనుభూతిని అంతకు మించిన ప్రేమని పరిచయం చేసింది.

ఆ ఆనందంతోనే అలా ఇంటికి వెళ్ళిన నాకు...

"రావే కోడలు పిల్ల .." అని అత్తయ్య,

"కన్నా.. నీకొక గుడ్ న్యూస్ రా..."

ఇప్పుడే నీకు బావతో పెళ్ళి చేద్దామనుకుంటున్నాం..,

దాని గురించే మాట్లాడుకుంటున్నాం రా" అని అమ్మ, ఎదురొచ్చారు.

ఏరా నీకిష్టమేగా బావతో పెళ్లంటే అని ఒక పక్క అమ్మ అడుగుతుంటే,

అది ఎవరనుకున్నావ్, నా కూతురే, నా మాటని కానీ, నా నిర్ణయాన్ని కానీ ఎప్పుడైనా అది కాధంటుందా...అన్నారు నాన్న!

(నా మనసుకి సంకెళ్లేస్తూ, వాళ్ళు అప్పటికే నిర్ణయం తీసేసుకున్నారనిపించింది.)

ఒక్కసారిగా నా ఆనందం ఆవిరయ్యింది. నేనేం మాట్లాడలేక, అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే..

"ఏరా కన్నా.. నీకిష్టమేగా.." అని అడిగారు నాన్నేందుకో! ఆయన నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని, ఆయన మాటని కాదనలేక,

"మీ ఇష్టం నాన్న..."అని తల దించుకుని, లోపలకి వేగంగా నడక సాగించాను.

"చెప్పానా అది నా మాట కాదనదని ఏమంటావే అమ్మ!"

అని నాయనమ్మతో ఆయన అంటుంటే, దానికి నాయనమ్మ బదులుగా " శుభం...! చూసారా..బావతో పెళ్ళనగానే దాని మొహంలో ఎంత సిగ్గొ!" అని అంది.

బావతో పెళ్లి కాని, ఆ పెళ్లి చేసుకుని ఈ పల్లెటూరు లాంటి వాతావరణం వదిలి ఎక్కడోకి US వెళ్ళాలని కానీ, నాకు ఇష్టం లేకపోయినా... వాళ్ళ సంతోషానికి తలోగ్గక తప్పలేదు.

ఏ రోజైతే నన్ను తను మొట్ట మొదటి సారి చూసాడో

చివరికి అదే రోజే రాత్రికి, ఆ నా మూగ ప్రేమకి ముగింపు పలికారు ఇంట్లోవాళ్లు.

                      ******************

మరి, స్పందన పెళ్లి పీటల వరకూ వెళ్లిందా..?

రఘుతో సతీష్ ఏమన్నాడు..?

అసలు స్పందన సతీష్ కలిసారా...?

ఇవన్నీ తెలుసుకోవాలంటే మూగమనసులు - 8 వరకూ ఆగాలి మరి!

To be continued in part 8

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics