SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"మూగ మనసులు - 5"

"మూగ మనసులు - 5"

5 mins
421


మూగ మనసులు - 4 కి

కొనసాగింపు

మూగ మనసులు - 5

వాళ్ళమ్మను దారి మళ్లించి ఆతృతగా డైరీ ఓపెన్ చేసి ఆ మిగిలిన కథ చదవడం ప్రారంభించాడు రఘు.

అక్టోబర్ 05, 2014

ఎప్పుడూ లైబ్రరీకంత తొందరగా వెళ్ళని నేను, ఆ రోజింకా లైబ్రరీ ఓపెన్ చేయకుండానే వెళ్లి అక్కడ కూర్చునీ ఎప్పుడెప్పుడు తెరుస్తారాని ఎదురుచూస్తున్నా...

ఇంతలో లైబ్రేరియన్ వచ్చి లైబ్రరీ ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్లి అక్కడ రిజిస్టర్ లో తన పేరు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని వెతికాను.. కానీ కొన్ని నెలలుగా ఆ పేరు తో బుక్స్ తీసుకున్నట్టు కానీ, తను వచ్చినట్టు కానీ ఎక్కడా కనిపించలేదు..

ఇన్ని రోజులుగా రాని అమ్మాయి, ఈ దసరా పండుగకు ఎలా అయినా వచ్చే ఉంటుంది లేనన్న ఆశ నాకు లేకపోలేదు.

ఒకవేళ వస్తె ఏ టైంలో అయినా తను ఇక్కడకి రాకుండా వుండదు లేనని ఒక చిన్న ఆశతో వెళ్లి, అక్కడే ఏదో మొక్కుబడిగా ఒక పుస్తకం తెరిచి కూర్చుని డోర్ వైపు తదేకగా చూస్తూన్నా..

చూస్తుండగానే సాయంకాలం టైమ్ 5 గంటలు కావొస్తోంది. కానీ, అక్కడికి తను కాదు కదా.. అసలు ఆ రోజు నేను తప్ప ఇంకెవరూ రాలేదు.

లైబ్రేరియన్ నా దగ్గరకు వచ్చి, "మీకు బుక్ కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి చదువుకోండి ... లైబ్రరీ మూసేయ్యాలి" అన్నాడు..

"ఏమిటో? ఈ సెల్ ఫోన్ ల కాలంలో కూడా మీలాంటి పుస్తకాల పురుగులు ఇంకా వున్నారు కాబట్టే, మాలంటోల్లకి ఈ ఆదివారాలు కూడా సెలవు లేకుండా పోయిందన్నాడు" వెటకారంగా ఓ చిన్న చిరునవ్వుతో..

లోపల కొంచెం నిరాశ వున్నప్పటి కి అతని మాటకు బదులిస్తూ "చదవడం పూర్తిచేశాను లేండి ఇక ఇంటికి అవసరం లేదు" అని నేను కూడా ఒక చిన్నపాటి నవ్వుతో సమాధానమిచ్చాను.

ఇక అక్కడి నుండి బయటకు వచ్చేయబోతుంటే " హేయ్ స్పందన ఇటు రా!" అనే ఒక పిలుపు నా చెవులను తాకింది..

వెంటనే నా కాళ్ళకు పని చెప్పి ఉన్నపాటుగా బయటకు పరుగుతీసాను..

నా కళ్ళు..

చెవులకు వినిపించిన ఆ పిలుపు యొక్క రూపాన్ని వెతికి కనుగొన్నాయి...

ఓ పెద్దావిడ తన చేతిని ఒక దిక్కుకు చూపిస్తూ "ఎక్కడికి ఇటు రా!! స్పందన" అంటూ పిలుస్తుంది.

ఆతృతతో నా చూపు ఆ చేతిని చూపుతున్న వైపు తిరిగింది..

అక్కడ ఒక చిన్న పాప తప్ప ఇంకెవరూ లేరు.. స్పందన అంటే నేను పరితపిస్తున్న అమ్మాయి కాదు, ఆ చిన్న పాపని అర్థం కావడానికి నాకు చాలా తక్కువ సమయమే పట్టింది.

ఇక చేసేది ఏం లేక నిరుత్సాహంతో ఇంటికి వెనుదిరిగాను.

అదే నిరుత్సాహంతో ఆ రోజు రాత్రికి తిరిగి సిటీకి పయనమయ్యాను.

                         ************

ఇప్పటివరకూ ఎంతో మంది ముందుకొచ్చి తమ తమ అందాలు ఆరబోసినా స్పందించని నా హ్రుదయం, తన రూపమేమిటో తెలియకున్నా స్పందన కోసం అనుక్షణం స్పందిస్తూ ఆరాటపడతుంది.

ఈ క్రమంలోనే తన గురించి నా హృదయపు గోడలపై లిఖించుకున్నాయి కొన్ని ప్రేమ కవితలు.

ఊహకు చేరువవ్వని స్వప్నానివో !!

జ్ఞాపకానికి దూరమయ్యే వాస్తవానివో !!!

కనులకు కనిపించని రూపానివో !!

స్పర్శకు కరువయ్యే ఛాయవో !!!

శ్రవణానికి వినిపించని శృతివో !!

శబ్దాన్ని సృష్టించే ధ్వనివో !!!

సంధ్యావేళ సేదతీర్చని తెన్నెలవో !!

నిశీధివేళ వెదజల్లే వెన్నెలవో !!!

హృదయానికి హత్తుకోని బంధానివో !!

మనసుని భగ్నపరిచే అందానివో !!!

                  ఎవరివో...??

                నీవెవరివో...???"

                            ***************

అక్టోబర్ 22, 2014

ఆ రోజు దీపావళి...

అందరూ పండక్కి ఇంటికెల్లారు. హాస్టల్ రూంలో ఒక్కడినేనున్న నాకు బోర్ కొట్టడంతో ఆ రోజు నేనొక పిల్లల ఆశ్రమాని (orphanage)కి వెళ్ళాను.

వీలున్నప్పుడల్లా ఆశ్రమానికి వెళ్ళడం వల్ల నాకు ఆ పిల్లలంతా సుపరిచితమే.

వాళ్ళతో కబుర్లు చెప్తుంటే వాళ్ళ మాటల్లో ఈ మధ్య కొత్తగా ఎవరో వస్తున్నట్టు గమనించాను.

ఎవరని ఆరా తీశాను.

అందులో ఒక పిల్లాడు...

"ఈ మధ్య పెద్దగా ఎవరూ రావడం లేదు గానీ, మొన్ననే ఒక అక్క తన ఫ్రండ్ తో వచ్చి వెళ్ళింది. తను కూడా నీలాగే చాలా బాగా మాట్లాడిందన్న మా అందరితో...

"తన పేరు..

తన పేరు...""

అని వాడు తన పేరు చెప్పడానికి తడబడుతుంటే..,

"అరేయ్ స్పందనక్క రా...." అని వేరొకడు అందించాడు తన పేరును.

ఆ పేరు వినగానే ,

ప్రతిసారీ ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా...

అని వెంటనే నాతో ఆడుకుంటున్న నా విధిని తిట్టుకున్నాను...

ఇదంతా కావాలనే ఆ బ్రహ్మ దేవుడాడిస్తున్న నాటకం అనుకున్నాను.

నా ఆశ కాకపోతే, ఈ సారి కూడా తను అయ్యిండదలే ..

కానీ, ఇంత మంచి లక్షణమున్న ఆ అమ్మాయిని అభినందించాలనిపించింది.

ఎందుకో అన్ని మంచి లక్షణాలున్న తనకి (నా స్పందనకి),

ఈ మంచి లక్షణం కూడా ఉండకపోదులేనన్న సందేహమూ నాకు లేకపోలేదు.

అనుకున్నదే తడవుగా ...

అరేయ్...

ఆ అమ్మాయికి చేతి మీద పుట్టు మచ్చ ఉందా...?

తన చేతిలో ఏమైనా బుక్ చూసారా...?

అసలు తను ఎలాంటి డ్రెస్ లో వచ్చింది...?

అని నా కలలలో రోజూ మెదులుతున్న అలంకారాలన్నింటిని ప్రశ్నల రూపంలో వాళ్ళ పై కురిపిస్తుంటే,

నా అమాయకత్వానికి వాళ్ళు ఆశ్చర్యపోతూ అదోలా చూసారు నా వంక.

దాన్ని కవర్ చేయడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కాదు.

దానికి వాళ్ళు..

"అవేం మేము పెద్దగా గమనించ లేదన్నా... కానీ, రావడం మాత్రం చుడీదార్ లో వచ్చింది ఆ అక్క తనతో ఇంకొక అమ్మాయి(తన ఫ్రెండ్)ని కూడా తీసుకొచ్చింది." అని అన్నారు.

నేను అడిగిన ప్రశ్నలకి వాల్లిచ్చిన సమాధానంతో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించి టైం అవుతొందని చెప్పి, అక్కడి నుండి వచ్చేశాను.

ఇలా ఎన్ని సార్లు తను ఎదురుపడుతున్నట్టనిపించి మాయమవుతున్నా... ఇంకా తన ఊహలతోనే గడుపుతూ తననే ఆరాదిస్తుండడం, నా స్వచ్ఛమైన ప్రేమకు ఓ గొప్ప నిదర్శనం.

నా కలల రాజ్యంలో తనకై చేసే నిరంతర యుద్ధం

కనిపించేనా తన నయనానికి ??

నా హృదయపు అలజడి తనకై చేసే నిశబ్ధ శబ్ధం

వినిపించేనా తన శ్రవనానికి ??

నా "పవన"పు ప్రవాహంతో తనకై పంపే సు"గంధపు" పరిమళం

చేరేనా తన నాసికానికి ??

నా మనసు లోగిళ్ళలో తనకై చెందే ప్రేమ పదం

పలికేనా తన అధరములు ??

ఇంతలోనే ఈ సంవత్సరం పూర్తి కావస్తోంది.

                              ****************

డిసెంబర్ 31, 2014

నిన్న నైట్ ఆఫీసులో కొంచెం వర్క్ ఉండి, లేట్ గా వస్తున్న నాకు మా హాస్టల్ దగ్గరకి వచ్చేసరికి....

కొంతమంది పిల్లలు చిచ్చి బుడ్డి వెలిగించి వాటితో ఆటలాడుకుంటున్నారు. ఆ చిచ్చిబుడ్డి వెలుగులో ఒకమ్మాయి తెల్లని చుడీదార్ ధరించి, చెంగు చెంగున ఎగురుతూ గంతులేస్తోంది. అచ్చం పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ అను లా... తను వెనుకకి తిరిగి ఉండడం వల్ల తన ఫేస్ కనిపించడం లేదు

మరోపక్క నుండి

"హేయ్ స్పందన ..."

"హేయ్ స్పందన..." అంటూ ఎవరో తనని పిలుస్తున్నారు..(తన ఫ్రెండ్స్ అనుకుంటా)

ఆ పిలుపులు వచ్చే శబ్ధం వైపు తిరిగి, మళ్లీ తనున్న చోటికి చూసే సరికి తను మాయమైంది. అక్కడ ఎవరూ లేరు ..

తన కోసమే అనుక్షణం ఆలోచిస్తూ పరితపిస్తున్న నాకు అదంతా నాకెర్పడిన భ్రమనుకున్నాను.

కానీ, ఈ రోజు పొద్దున అదే ప్లేస్ లో కాల్చేసిన చిచ్చిబుడ్డిలను గమనించిన నేను అది భ్రమ కాదని, కళ్ళెదుట జరిగిన వాస్తవాన్ని గ్రహించలేక భ్రమ గా భావించి, నన్ను వెంటాడుతున్న నా దురదృష్టాన్నీ మరింత దగ్గరగా ఆహ్వానించిన నా అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకున్నాను.

తన పేరు వింటేనే పరవశించి పోయి ఉబ్బితబ్బిబ్బైయ్యే నేను, నాకెదురైన ఆ సంఘటనలనే తన జ్ఞాపకాలుగా నా ఈ డైరీ లో పొందుపరుస్తూ, తనని కలిసే ఆ క్షణం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను.

కంటిపాప కలవరపడెను కనిపించని తన జాడకై 

కర్ణభేరి కట్టిపడెను వినిపించని తన ఊసుకై 

మాటే మూగబోయేను పలకని తన పేరుకై

శ్వాసే స్తంభించేను సృతించని తన సవ్వడికై

గూడు లేని గగనంలో చుక్కలా చేరదీస్తారని !

తోడు లేని భువనంలో అక్కున చేరతారని !

నీడ లేని నడిరేయికి వెన్నెలలా కనిపిస్తారని !

వీడ లేని బంధానికి వెన్నంటే నిలుస్తారని !

ఆశించేను నా హృదయమే !

తన రాకకై తపన పడుతున్న మదితో...

ఆలోచనలో ఆరాధనని అక్షరాలుగా అందిస్తున్నా తనకై..

ప్రేమలో పలకరింపుని పదాలుగా పంపిస్తున్నా తనకై..

వాత్సల్యపు వ్యామోహాన్ని వాక్యాలుగా విస్తరిస్తున్నా తనకై..

రెప్పమాటు రూపాన్ని రచనలుగా రచిస్తున్నా తనకై..

"అపార్థపు" సంగ్రామంలో "ధ్వేషమనే" శత్రువుతో "ఆశనే" ఆయుధం ధరించి తనకై నిరంతరం చేస్తున్న ఈ "ప్రేమ యుద్ధం"లో..

కడవరకూ తనతో పయనించాలనే ఈ కాంక్ష, కలలా మాత్రమే మిగిలి, ఓడి ఒంటరవనా...!

తన కిరణపు కాంతిని నా పవనపు ప్రవాహంతో ప్రసరింప చేస్తూ, గెలిచి తనతో జతకాగలనా...?

                          ************

తర్వాత పేజీ తిప్పబోతున్న రఘు, వెనుక వైపు వాళ్ళమ్మ ఉండడం గమనించి డైరీని మూసివేస్తాడు. కానీ, ఆవిడ అప్పటికే అది చదివానని, మిగిలినది కూడా తెలుసుకోవాలనే ఆత్రుత తనకి కూడా ఉందని, సతీష్ ప్రేమకు తను కూడా మద్దతిస్తున్నట్టే తలూపి మిగతాది కొనసాగించమన్నారు.

సతీష్, స్పందనని అసలు చూసాడా లేదా...

వాళ్ళు కలుసుకున్నారా లేదా...

అసలు తర్వాత ఏమైందని ఇంటరెస్ట్ గా ఆ తర్వాత పేజీ తిప్పబోతున్న రఘు, వాళ్లమ్మ గారితో పాటు మీరు కూడా తెలుసుకోవాలంటే,


"మూగమనసులు - 6"


వరకూ వెయిట్ చెయ్యక తప్పదు మరి...

To be continued in part 6

రచన : సత్య పవన్



Rate this content
Log in

Similar telugu story from Classics