SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4.4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"మూగ మనసులు-1"

"మూగ మనసులు-1"

2 mins
431


అది Feb 14 , 2015

ఎవరు లేని ఏకాంత ప్రదేశంలో ఒంటరిగానున్న ఒకబ్బాయి... తన కళ్ళల్లో నుండి ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించుకుంటూ ఆకాశం వైపు చూస్తూ, దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు.

కోలాహంతో నిండినింట్లో ఒకమ్మాయి పట్టు బట్టలతో, ఒంటినిండా బంగారు ఆభరణాలతో అందరిమధ్య అయిష్టంగా ముస్తాబవుతుంది...

కానీ, ఆ అయిష్టాన్ని తన ముఖంలో చిరునవ్వుతో బయట పడనివ్వకుండా జాగ్రత్త పడుతుంది...

మీకీపాటికే అర్థమయ్యుంటుంది !

ఆ అబ్బాయి ప్రేమించిన ఈ అమ్మాయి కి మరికాసేపట్లో తనకిష్టం లేని పెళ్లని!!

ఒకప్పుడు,

ప్రేమకి ఆమడ దూరంలో ఉండే ఆ అబ్బాయి!

ప్రేమను అమితంగా ద్వేషించే ఈ అమ్మాయి!!

చివరికి ప్రేమనే ఆ పద్మ వ్యూహంలోనే చిక్కుకుని,

తమ మనసులలో మూగబోయిన ఆ అభిప్రాయాలను ఎలా, ఎవరికి పంచుకోవాలో తెలియక.. తమ హృదయాల్లో ఒకరికొకరు పడే మనోవేదన గురించి మనం తెలుసుకోవాలంటే ....

"మూగ మనసులనే" నా ఈ ప్రేమకథలోకి వెళ్లాల్సిందే!

                        

                                *********

గోదావరి జిల్లాలో ఒక మారుమూల గ్రామమైన అదొక అందమైన ఓ పల్లెటూరు.

పల్లెటూరంటేనే,

పచ్చని చెట్లు,

సెలయేటి గట్లు,

ప్రకృతి పులకరింపులు,

పొరుగింటి పలకరింపులు,

పంటల తళతళలు,

కోయిల కిలకిలలు,

అందుకు.. ఈ ఊరూ మినహాయింపు కాదు.

ఆ పల్లెటూరిలో ...

పద్దతి, బాధ్యత తెలిసిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ పాతికేళ్ల కుర్రాడు..."సతీష్"...

అదే గ్రామానికి చెందిన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన తెలివిగల ఓ ఇరవైరెండెళ్ళ అమ్మాయి... "స్పందన"...

సతీష్ ఎప్పుడూ సమాజంలో ఎదుటివారికి సహాయం చెయ్యాలనే సంకల్పంతో,

అన్యాయాన్ని అణచివేయాలనే ఆశయంతో

వుండేవాడు.

సాంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించే వారంటే మక్కువ.

సతీష్ చిన్న తనంలో తన తండ్రికి ఇచ్చిన మాట కారణంగా ఈ ప్రేమలు, అమ్మాయిలు, ఇతర వ్యసనాలకు ఎప్పుడూ దూరంగా వుండేవాడు.

పైగా ప్రేమ , అమ్మాయిలు అని తిరిగే తన స్నేహితులని ఎప్పుడూ మందలించేవాడు...

తన స్నేహితులతో గడపాలని ఆశ పడే తనకి, ఈ ప్రేమ అనే పిచ్చి లో పడి వాళ్ళు తనకి దూరం అవుతున్నారని మరొక కారణం చేత, అసలే వాటికి దూరంగా వుండే మనవాడు "ప్రేమ" అనే పదాన్నే పూర్తిగా "ద్వేషించడం" మొదలు పెట్టాడు.

ఇక అమ్మాయిలు, ప్రేమ ఊసు ఎత్తితే కస్సున మండిపడేవాడు..

స్పందన విషయానికి వస్తే, బాగా చదివి తన కుటుంబ కీర్తిని పెంచాలనే ఒక జీవితాశయం తనది... అంతే కాకుండా లేనివారికి సహాయ పడడం తనకి వుండే మరొక ప్రత్యేక లక్షణం.

ప్రేమలని తిరిగే తన స్నేహితురాళ్ళ పై మంచి అభిప్రాయం ఉండేది కాదు, అసలు వాళ్ళ జోలికి కూడా వెళ్ళేది కాదు తను.

బహుశా తన ఇంట్లో వాళ్ల అన్యోన్య పెంపకానికి మచ్చ తీసుకురాకూడదనే కారణం చేతనో, ఏమో?

ఎప్పుడూ.. అలాంటి వాటిని తన ఛాయలకు కూడా రానిచ్చేది కాదు.

మందితో మర్యాదగా మెలిగేది...

అందానికే కాదు,

పద్ధతికీ ప్రతిరూపం ఈ కుందనపు బొమ్మ..!

ఇక అమ్మాయిల విషయంలో సతీష్ కి ఎలాంటి అభిప్రాయం వుందో..!!

అబ్బాయిల విషయం లో కూడా స్పందన కి అలాంటి అభిప్రాయమే వుంది.

ఒకరిది ఉత్తర ధృవం, మరొకరిది దక్షిణ ధ్రువం.

చూద్దాం!!!

ఆలోచనలు , అభిప్రాయాలు ఒక్కటే గల

ఈ "విజాతి ధృవాలు" ప్రేమనే అయస్కాంతానికి ఎలా ఆకర్షించపడతాయో...??

పాఠకులకు గమనిక:

నేను రాసిన "తనతో ప్రయాణం" అనే వాస్తవ కథకు ఈ "మూగమనసులు" అనే కల్పిత కథకు అసలు సంబంధమే లేదు. అది మాత్రమే వాస్తవ కథ. అందులో కొన్ని, చిన్న చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని నేను ఈ కథను సృష్టించడం జరిగింది. ఇందులో పాత్రలు, పాత్రల పేర్లు, సన్నివేశాలు, సంఘటనలు అన్నీ కల్పితంగా సృష్టించి, నాకు నేనుగా ఊహించి రాసింది మాత్రమే. పాఠకులు దయచేసి గమనించగలరు.

తనతో ప్రయాణం (7 పార్ట్స్) చదవని వారు ఆసక్తి ఉంటే చదవగలరు.

-సత్య పవన్✍️



Rate this content
Log in

Similar telugu story from Classics