Meegada Veera bhadra swamy

Horror

3.7  

Meegada Veera bhadra swamy

Horror

మర్రిచెట్టు దెయ్యం

మర్రిచెట్టు దెయ్యం

5 mins
980


"ఆ మర్రిచెట్టు దగ్గరకు రాత్రి పూట ఎప్పుడూ వెళ్లకు ఎంతవరకూ సుమారు వందమందిని బలిగొంది ఆ చెట్టు" అన్నాడు వీర్రాజు

"చే ఊర్కో మర్రి చెట్టు మనుషుల్ని బలిగొనడమేంటి నీ మూఢ నమ్మకం గానీ ...నీకీ మద్య మరీ చాదస్తం ఎక్కువైపోతుంది" అన్నాడు పోతురాజు

"సరే నీ ఇష్టం నేను చెప్పవలిసింది చెప్పాను తరువాత నీ ఇష్టం, కావాలంటే ఈ లిస్ట్ చూడు" ఆ ఊర్లో బెర్రీ బెకం జబ్బుతో గడిచిన పదేళ్లలో చనిపోయిన వారి పేర్లు చెప్పాడు వీర్రాజు.

"ఓర్నీ అదేదో వింత జబ్బు వచ్చి చనిపోయిన వారి పేర్లు చెప్పి అది మర్రి చెట్టు మాయ అని చెబుతావు ఏంటి? నిజంగా అక్కడ ఏమైనా భూత బేతాల పిశాచాలు ఉంటే మనుషులు అక్కడే చనిపోవాలి కదా ఊర్లోకొచ్చి కొన్నాళ్ళు జబ్బుతో బాధపడి చావడం ఏంటి! అందులో మర్రిచెట్టు భూతాలకు కలిసొచ్చిందేమిటి?" వెటకారంగా నవ్వుతూ అన్నాడు పోతురాజు

"అయితే నీ ఖర్మ నీకు ఎంత చెప్పినా వినేటట్లు లేవు నేనైతే అక్కడకి వెళ్లవద్దనే చెబుతాను అన్నాడు" వీర్రాజు

"ఇన్ని చెబుతున్నావు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా! అక్కడకి " అని అడిగాడు పోతురాజు

"వెళ్ళలేదు గానీ వెళ్లిన వారికి మంచి సంగీతం వినిపించి తరువాత దేవకన్యలు లాంటి ఆకారాలు వచ్చి చుట్టుముట్టి మనిషిని కౌగలించుకొని వెళ్లిపోతారట, ఆ కన్యలు తాకినప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్లు వుంటుందట" అని చెప్పాడు వీర్రాజ్

"రాత్రి సరే పగటిపూట కూడా అక్కడికి ఎవ్వరూ వెళ్లడం లేదు అక్కడికి" అని అన్నాడు పోతురాజు

"రాత్రి ఉన్న భూతాలు పగలు కూడా ఉంటాయి అయితే కనిపించకుండా వుంటాయని మనవూరు ప్రజలు భయం అందుకే, సుమారు చెట్టు పరిసరాల్లో పంటలు పండించడానికి రైతులు కూడా వెళ్లడం"అన్నాడు వీర్రాజు

"సరే చూద్దాం ఎప్పటికైనా ఆ లోగుట్టు తెలియక మానదు మన ఊరు వారి భయంపోక మానదు" అని అన్నాడు పోతురాజు

"నువ్వు సుమారు పడేళ్లనుండి ఇక్కడ లేవు దుబాయ్ పోయి వచ్చావు, ఇక్కడ మర్రి చెట్టు భూతాలు హంగామా నీకు తెలీదు ఇక్కడ ఎవ్వడికీ కంటిమీద కునుకు ఉండటం లేదు తెలుసా "అని అన్నాడు వీర్రాజు

"అదేంటి రాత్రి పూట మర్రిచెట్టు దగ్గరకు వెళ్తే కదా భయం, వెళ్లకపోతే ఏమీ లేదుకదా"అని సందేహం వ్యక్తం చేశాడు పోతురాజు.

"అలా కాదు ఊర్లో ఎవరైనా సంతోషంగా, హాయిగా, ఏ బాధా బందీ లేకుండా వున్నా ఆ భూతాలకు గిట్టదు, ఏదోరోజు వచ్చి ఆ కుటుంబ సభ్యల్లో ఎవరినో ఒకర్ని ఎత్తుకుపోయి వాటి ప్రభావం చూపి వదిలేస్తాయి అందుకే అందరూ చీకటైతే చాలు తలుపులు బిగించి కుటుంబమంతా బిక్కుబిక్కుమంటూ ఇంటిలోనే వుంటున్నారు"అని మరో కొత్త వింత చెప్పాడు వీర్రాజు

"అబ్బో ఇది మరీ తమాషాగా ఉంది. ఊర్లో పనులు వ్యవసాయం మానేసి దెయ్యాల భయంతో గడపాల్సి వస్తుంది అన్న మాట"అని అన్నాడు పోతురాజు

"అన్న మాట ఏంటి ఉన్నమాటే"అని అన్నాడు వీర్రాజు

"అయితే నువ్వెక్కడ వుంటున్నావు పండ్రెండేల్ల క్రితమే మీ కుటుంబం మొత్తం మసూచి వచ్చి చనిపోయింది, అప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావని తెలిసింది లేకపోతే నువ్వూ చనిపోయి వుండేవాడివటకదా"అని అడిగాడు పోతురాజు

"అవును అది వేరు అది నిజంగా మసూచి రోగం, ఇప్పుడిది దెయ్యం ఇస్తున్న రోగం" అని అన్నాడు వీర్రాజు

"అయినా కోట్లాదికారివి నువ్వు ఎక్కడికో దూరం పోయి బ్రతకకుండా...ఇక్కడే ఎందుకు దెయ్యాలూ భూతాలూ భయం భయం మద్య వంటరిగా ఉంటావు ...అయినా రాత్రి పూట నువ్వు ఊర్లో ఒంటరిగా తిరుగుతుంటావట ఎందుకు"అని అడిగాడు పోతురాజు

"నేను ఈ ఊరు మేలు కోరేవాడిని, ఊర్లో మర్రిచెట్టు భూతాలు బెడద ఉందని చెప్పి అందరినీ జాగ్రత్త పరచడమే నా బాధ్యత, నాకు ఉన్న ఆస్తిచాలు నా అన్నవారు ఎవరూ లేరు కదా, నేను బ్రతికినా చచ్చినా ఒక్కటే... నేను తెగించాను అందుకే నన్ను ఏ భూతం ఏమీ చెయ్యలేదు"అని అన్నాడు వీర్రాజు

"సరే పొద్దుపోయింది ఇళ్లకు వెలిపోదాం పదా... లేటైతే దెయ్యాలు వస్తాయి"అని ఎక్కువ వ్యంగ్యంగా మాటలాడి వెళ్ళిపోయాడు పోతురాజు.

ఆ రాత్రి చాలా సేపు పోతురాజుకి నిద్రపట్టలేదు. వీర్రాజు చెప్పింది పచ్చి అబద్ధం ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలు భూతాలు అంటూ అనాగరికంగా ఉండటం దేనికి అనుకుంటూ... ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత మర్రిచెట్టు వైపు వెళ్ళాడు పోతురాజు.

చెట్టు క్రిందకు వెళ్ళాడేగాని పోతురాజు గుండె వేగంగా కొట్టుకుంటుంది, భయంతో రోమాలు నిక్కపొడిచాయి. సరిగ్గా అప్పుడే చెట్టు ఆకులు గలగలా రాలాయి, సన్నని సంగీతం వచ్చింది, రాజా రాజా ఏమి కోరిక అంటూ రాగాలతో పాటలు వినిపించాయి, అసలే అమావాస్య కారుచీకటి, భీకరంగా నక్కలు కుక్కలు పక్షులు అరుస్తున్నాయి , పోతురాజు భయంతో ఊర్లోకి పరిగెత్తబోయాడు, అతనికి ఎదురుగా ముగ్గురు ముసుగు ఆడవాళ్లు చిన్న దివిటీలు పట్టుకొని వచ్చి అతన్ని కౌగలించుకున్నారు, వంటినిండా ముళ్ళు గుచ్చుకున్నట్లు అయ్యింది, భయంతో అరిచాడు పోతురాజు. ముసుగు మనుషులు నెమ్మదిగా వెళ్లిపోయారు, పోతూ పోతూ మళ్లీ రేపురా మా బిగి కౌగిలి ఇస్తాములే అన్నాయి. పోతురాజు హడలిపోయి పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి చేరి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, భయంతో వనికిపోతూ దుప్పడి నిండా కప్పుకొని ఆంజనేయ దండకాలు చదువుతూ నిద్రపోయాడు.

రెండో రోజు ఊర్లో కలకలం రేగింది,పోతురాజుకి మర్రి చెట్టు దెయ్యం

పట్టింది, ఇక చనిపోతాడాని, ఆ ఊర్లో నమ్మకం ఏమిటంటే, మర్రిచెట్టు దెయ్యం పట్టిన మనిషిని ఆసుపత్రికి తీసుకొని వెళితేభూత వైద్యుడుకి చూపిస్తే దెయ్యాలు పగబట్టి ఆ ఇంటి వారి మీద విరుచుకు పడతాయని. అందుకే పోతురాజుని ఆసుపత్రికి తీసుకొని పోకుండా...దేవుడి మీద భారం వేసి పోతురాజుని గుమ్మం బయట వేసేసారు ఆ ఇంటివారు. గతంలో ఒకడిని మొండిగా ఆసుపత్రికి తీసుకొని వెళ్తే డాక్టర్ ఈ వ్యాధి బెర్రి బెకం వ్యాధి అని చెప్పాడు, మందులు ఇచ్చాడు, మర్రి చెట్టు కదవిని, ఒంటరిగా ఒక రాత్రి మర్రిచెట్టు వద్దకు వెళ్లి రక్తం కిక్కి చనిపోయాడు అందుకే వైద్యం ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. పోతురాజు మాట పడిపోయింది, శరీరం నిండా పెద్ద పెద్ద దురద కాయలు, మూడు రోజులు తరువాత చనిపోయాడు.


పోతురాజు చనిపోయిన సంగతి, వాళ్ల దూరపు బంధువు సూర్యారావుకి తెలిసింది, అతను ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ చదివాడు, పోతురాజు శరీరంపై ఉన్న బొబ్బర్లు కేవలం ఎక్సపైర్డ్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చాయని గ్రహించాడు, వెంటనే పోలీసులుకు ఫిర్యాదు చేసి గ్రామస్తులను ఒప్పించడానికి ప్రయత్నించి, దెయ్యాలు భూతాలు లేవు ఇందులో ఏదో కుట్ర ఉందని చెప్పి వాళ్లకు భయం పోడానికి అతని మిత్రుడు జిల్లా ఎస్ పి రాయుడు సాయంతో సుమారు వందమంది పోలీసులను ఊర్లో రాత్రి పూట గస్తీ తిరిగే ఏర్పాట్లు చేయించాడు. అయితే గ్రామస్తులు సూర్యారావుకి దండం పెట్టి నువ్వు ఊర్లో మరికొంత అనర్ధాలు తేవద్దు ఊరు విడిచి పొమ్మన్నారు. సూర్యారావు మైండ్ గేమ్ మార్చాడు, దెయ్యాలు ఉంది నిజమే అని ఊర్లో ప్రజలు ముందు ఒప్పుకొని, భద్రత నిమిత్తం పోలీసులు అవసరం అని గ్రామస్తులకు నచ్చజెప్పాడు. పోలీసులు ప్రణాళిక ప్రకారంమే "మర్రిచెట్టు దెయ్యం ఉండటం నిజమే మేము ఊర్లో ఉండి ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా చూసుకుంటాం"అని దండోరా వేయించారు.


వీర్రాజు రెచ్చిపోయాడు, నేరుగా సూర్యారావు వద్దకు వెళ్లి ఇంతవరకూ నేను ఊరిని రక్షిస్తున్నాను, ఈ మద్య చాలా రోజులు నుండి దెయ్యాలు బెడద లేదు పోతురాజు నా మాట వినలేదు అనుభవించాడు. ఇక నువ్వు రచ్చ చెయ్యకుండా వెళ్లిపో అని బ్రతిమిలాడాడు.మర్రిచెట్టు దెయ్యాలు చరిత్ర పూసగుచ్చినట్లు చెప్పాడు.సూర్యారావుకి క్లూ దొరికింది. ఆ రాత్రి అర్ధరాత్రి ఎవ్వరికీ తెలీకుండా వీర్రాజుని అరెస్ట్ చేయించాడు, సడన్ గా మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళాడు ఈ సారి చెట్టు దగ్గర ఎప్పుడూ లేనంత భయంకరమైన అరుపులు కేకలు వచ్చాయి. ఊరు బిక్కుబిక్కుమంటూ మంటూ వణికి పోయింది, ఒక్కసారిగా తుపాకీల మోత వినిపించింది అక్కడ భీకర పోరాటం జరిగింది మర్రి చెట్టు దగ్గర, ఈ తతంగం జరుగుతుండగానే తెల్లారి పోయింది. పోలీసులు ఊర్లోకి పదిమంది ముసుగు మనుషుల్ని ఈడ్చుకొచ్చారు, వాళ్ళు ఆడవాళ్లు వేషంలో వున్న మగవారు, వాళ్ళ తలదగ్గర తుపాకీలు పెట్టి నిజం చెప్పించారు.


అసలు మర్రిచెట్టు దెయ్యాలు లేవని ఇది వీర్రాజు కుట్ర అని ముసుగు మనుషులు చెప్పారు , వీర్రాజుని రంగంలోకి దించారు పోలీసులు. అప్పుడు చెప్పాడు వీర్రాజు. ఆ మర్రిచెట్టు మా పూర్వీకులు నాటారు, ఒకప్పుడు బాగా డబ్బు ఉన్న మేము చెట్టుని ఇలవేల్పుగా నమ్మి మా ఇంట్లో వారికి మసూచి రోగం వచ్చినా వైద్యం చేయించకుండా చెట్టుకు మొక్కాము. మా వాళ్ళు చనిపోయారు. నేను ఒంటరి అయ్యాను. నాకు లేని ఆనందం ఊర్లో ఎవ్వరికీ ఉండకూడదని కిరాయి మనుషుల్ని పెట్టి ఎక్సపైర్డ్ మందులు కలిపి రాత్రి దొరికివారికి ఇంజెక్ట్ చేయంచే వాడిని తరువాత దెయ్యాలు కథ చెప్పి, పోలీసులకు, వైద్యులకు, అధికారులకు, చెప్పనివ్వకుండా సెంటిమెంట్ పెట్టించాను, మూకమ్మడిగా రాత్రి మర్రిచెట్టు వైపు వెళ్లి దెయ్యాలను తరిమివేయాలనుకుంటే ఊరు వల్లకాడు అవుతుందని సిద్ధాంతికి లంచం ఇచ్చి చెప్పించాను, ఒంటరి తనం నాలో తుంటరి కుట్రను తెచ్చింది అని ఊరువారికి చెప్పి మెరుపు వేగంతో ఒక పోలీస్ అధికారి చేతిలోని తుపాకీ లాక్కొని తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరు ఊపిరి పీల్చుకుంది. సూర్యారావుని మెచ్చుకుంది, పోలీసులకు ధన్యవాదాలు చెప్పి ముసుగు మనుషులకు శిక్షించమని కోరి మర్రిచెట్టు కి దండం పెట్టి మర్రిచెట్టు పై పడిన నిందను తొలగించారు


Rate this content
Log in

Similar telugu story from Horror