kadem kiran

Horror Tragedy Thriller

2.0  

kadem kiran

Horror Tragedy Thriller

అడవిలో అలజడి

అడవిలో అలజడి

3 mins
587



అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది , ఆ ఊరికి తూర్పు దిక్కున సముద్రం , పడమర దిక్కున ఒక చిన్న అడవి , ఈ రెండిటి మధ్యలో గ్రామం ఉండేది , ఆ గ్రామంలో అందరూ చేపలు పట్టే జాలర్లు మాత్రమే నివసించేవారు , అదివారం వచ్చిందంటే చాలు ఎంతోమంది రామాపురం సముద్ర తీరానికి వచ్చి సమయం గడిపేవారు ,2007 ఫిబ్రవరి 7 వ తారీఖున ఒక సంఘటన అప్పట్లో పెద్ద కలకలం రేగింది..!

T.V.లో ,పెపర్లో ,న్యూస్ చానల్స్ లో ఏక్కడ చూసిన ఈ సంఘటన గురించే మాట్లాడుకునేవారు , ఆరోజు ఆదివారం వంశీ, గౌతమ్, నాగార్జున, విజయ్ ,మహేష్ ,వీళ్ళు ఐదుగురు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందులో వీజయ్ ఒక న్యూస్ చానల్లో పనిచేస్తున్నాడూ , ఈ ఐదుగురు కలసి రామాపురం ఊరు పక్కన వున్న ఒక చిన్న అడవిలో విందు ఏర్పాటు చేసుకున్నారు , ఆ విందులో మధ్యపానం , ధూమపానం , మరియు జూదం ఒక భాగం..!


ఆ అడవిలోకి వేళ్ళాలంటే ఏవరికీ ధైర్యం సరిపోయేది కాదు , ఆ అడవిలోకి వేళ్ళే సాహసం రామాపురం జాలర్లు సైతం చేయరు , , ఈ ఐదుగురు యువకులు ఉదయం 10 గంటల సమయంలో ప్రవేసించారు , వచ్చేటప్పుడు ఒక కారు తెచ్చుకున్నారు , కారులో నుండి ఈ ఐదుగురు వ్యక్తులు దిగి ఏక్కడైన చల్లగా నీడను ఇచ్చే చేట్టు వుందేమో వేతకడం మొదలుపెట్టారు , అలా ఒక పదినిమిషాల తరువాత , మర్రిచెట్టు ,వేపచెట్టు , తాటిచేట్టు , ఒకేచోట పెరిగి ఉండటం చూసి ఆ చెట్ల కింద చల్లని నీడ వుందని గమనించి అందరూ అక్కడ బస చేసారు..!


ఆ చేట్ల కింద వేంట తెచ్చుకున్న పరదా పట్టా పరచి అందరూ దాని పైన అలసిపోయి పడుకున్నారు , అలా కొంత సమయం తరువాత గౌతమ్ మీగతవాళ్ళతో వచ్చిన పని ఏంటి మీరూ చేసే పని ఏంటి లేవండీ లేవండీ బ్యాగ్ లో వున్న మధ్యం సీసాలు భయటకు తీయండి ,అంటూ అందరని ఉత్సాహపరిచాడు , పడుకూన్న అందరూ లేచి డిస్పోస్ గ్లాసులు భయటకు తిసి ఒకరి తరువాత ఒకరు మధ్యం సేవీస్తూ , ధూమపానం చేస్తూ వున్నారు , కొంత సమయం తరువాత స్టఫ్ అయిపోయాయి , వాటర్ కూడా అయిపోయాయి..!


వాటర్ , స్టఫ్ కావాలంటే ఊరిలోకి వేళ్ళాలీ కనీసం కారులో ప్రయాణం చేస్తే 30 నిమిషాలు పడుతుంది , అదే ఆడవి మార్గం ద్వారా వేళ్తే 10 నిమిషాలలో వేళ్ళిపోవచ్చు , అడవి మార్గం ద్వారా వేళ్ళాలంటే నడుచుకుంటూ వేళ్ళాలీ , గౌతమ్ , వంశీ అడవిలో నడుచుకుంటూ వేళ్తున్నారు , సమయం మధ్యాహ్నం 1:20 నిమిషాలు అవుతుంది , అందులోనూ ఏండ తీవ్రంగా ఉంది , గౌతమ్ నీరసం వచ్చి ఒక చేట్టు కింద కూర్చుని ఆయాసపడుతున్నాడు , నేను ఇంకా నడవలేనూ ఒరేయ్ వంశీ నువ్వు వేళ్ళి స్టఫ్ ,వాటర్ తీసుకురా నేనూ ఇక్కడే వుంటాను అన్నాడు ..!


వంశీ సరే అని గౌతమ్ ని అక్కడే వదిలేసి రామాపురం వేళ్ళి కావాలసినవి తీసుకుని తిరిగి అడవి మార్గం ద్వారా నడవడం మొదలుపెట్టాడు , కొంత దూరం వచ్చేసరికి గౌతమ్ వున్న చోటు మరచిపోయాడు వంశీ , అలాగే నడుచుకుంటూ మొదటి సారి అందరూ కూర్చున్న చోటకు వచ్చాడు , వంశీ , కానీ మిగతా ముగ్గురు కూడా ఆ చెట్టు దగ్గర లేరు , ఏంటి ఏవరు కనిపించడంలేదు ఏక్కడకు వేళ్ళిపోయారు , ఒకవేళ కారు దగ్గరకు వేళ్ళరా అనుకోని నడుచుకుంటూ వాహనం దగ్గరకు వేళ్ళాడు వంశీ..!


ఆ వాహనం నుజ్జు నుజ్జు అయ్యి ఏ పార్టుకూ ఆ ఫార్టూ ఉడిపోయి వుంది , ఏంటి ఇది ఏవరు కనిపించడంలేదు , వాహనం పాడైపోయింది , సమ్తింగ్ ఏదో జరిగింది , ఇక్కడ ఒక్క క్షణం వుండకూడదు అనుకోని అక్కడ నుండి తొందరగా నడవడం ప్రారంభించాడు వంశీ, ఆ అడవిని అనుకోని రెండు ఏకరాల్లో వేరుశనగ పంట వేసి ఉంది , ఆ పంట పోలంలోకి వేళ్ళాడు వంశీ , ఏక్కువసేపూ నడవడం వలన వంశీ నీరసం వచ్చి ఆ వేరుశనగ పోలంలో పడిపోయాడు..!


అప్పటి సమయం రాత్రి 7:15 నిమిషాలు అవుతుంది , అంతేకాకుండా ఆరోజు పౌర్ణమి అవ్వడం వలన ఆకాశంలో చంద్రుడు చల్లని వేన్నేల కురిపిస్తున్నాడు , కొంత సమయం తరువాత వంశీ సృహాలోకి వచ్చి చూస్తే ఏదురుగా గౌతమ్ తల లేకుండా మొండెం వరకూ కనిపించింది , వంశీకి భయంతో ఫ్యాంట్ తడిచిపోయింది , కొంచెం ధైర్యం చేసి పరిగేడతామూ అనుకున్నాడూ అక్కడ నుండి , కానీ పక్షవాతం వచ్చినట్లు వంశీ కాళ్ళు భీగుసుకుపోయాయి ఏటూ కదలేకపోతున్నాడు వంశీ..!


హటాత్తుగా వంశీ భుజం మీద ఏవరో చేయ్యి వేసినట్లు అనిపించింది , వంశీ గుండె ఆగిపోయింది , అంతే వంశీ అక్కడికక్కడే మరణించాడు భయంతో , అసలు ఆ అడవిలో ఏం జరిగిందో మీగతా ముగ్గురు ఏమైపోయారో వాహనం ఏలా నుజ్జు నుజ్జు అయ్యిందో ఏవరకీ అర్థం కాలేదు ఇలాంటి సంఘటనలు రామాపురం గ్రామంలో జాలర్ల విషయంలో కూడా జరిగాయని అక్కడ కొందరు పెద్దలు చేప్తూంటారు , ఆ రోజు నుండి ఆ అడవి వైపు కన్నేత్తి కూడా చూడరని అంటుంటారు,మారుతున్న కాలంతో ఆ అడవి అంతరించిపొయింది..!


గమనిక :౼ ఈ కథలోని ప్రదేశాలు మరియు పేర్లు సంఘటనలు కల్పితాలు, ఈ కథను కథగానే చూడాలని మనవి..


Writer

-kadem kiran 


Rate this content
Log in

Similar telugu story from Horror