STORYMIRROR

kadem kiran

Romance Others

4  

kadem kiran

Romance Others

నీ స్పందన కోసం

నీ స్పందన కోసం

1 min
406

నేను facebook వాడే రోజుల్లో వెన్నెల అనే అమ్మాయి పరిచయం అయ్యింది, మొదట్లో చాలా మర్యాద పూర్వకంగా ఒకరినొకరు పలకరించుకునే వాళ్ళం ,తరువాత పోనుపోను మా ఇద్దరి మధ్య మర్యాద తగ్గిపోయి ఒకరి మీద ఒకరం చనువు పెంచుకున్నాం ,బుజ్జి ,బంగారం అని ఇష్టంగా పిలుచుకునే వాళ్ళం ..!

రోజులు గడిచేకొద్దీ మా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది ,ఒకరిని విడచి ఒకరం ఉండలేకపోయే వాళ్ళం , ప్రతిరోజూ ఉదయం మొదలుకొని ,రాత్రి నిద్రపోయే వరకూ ఎప్పుడూ చాటింగ్ లు ,విడియో కాల్స్ చేసుకునే వాళ్ళం ఒకరినొకరం ఫోన్ నంబర్లు మార్చుకున్నాం..!

కొన్ని రోజుల తర్వాత వెన్నెలకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ,అప్పటి నుండి వెన్నెల నాతో సరిగ్గా మాట్లాడేదీ కాదు ,చాలా భాధ అనిపించేది ,ఎంటీ ఈమధ్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అడుగుదామని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చేది , అలా ఎన్ని సార్లు ఫొన్ చేసిన స్విచ్చాఫ్ స్విచ్చాఫ్ అని వచ్చేది..!

Facebook మెసెంజర్ లో ప్రతిరోజూ వెన్నెలతో మాట్లాడాలని విడియో కాల్స్ చేసేవాడిని ,తను స్పందించేది కాదు , ఏన్నో మెసేజ్లు చేసేవాడిని తను స్పందించేది కాదు ,చాలా రోజులు ఈ విషయం గురించి బాధపడ్డాను ,ఒకసారి స్పందించు ప్లీజ్ ప్లీజ్ అని ఎన్ని మేసేజ్లు చేసానో నాకే గుర్తు లేదు..!

కానీ ఏ రోజూకైన తను స్పందిస్తుంది అనుకోని ప్రతిరోజూ మేసేంజర్ తెరచి చూసేవాడిని..!

Writer 

Kadem kiran 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance