kadem kiran

Comedy Fantasy

4  

kadem kiran

Comedy Fantasy

T.V.S.50

T.V.S.50

2 mins
627


ఏదైనా తేలియకపోతే ఆ విషయం తేలిసేవరకు నిదుర పట్టదు , తేలుసుకోవాలనీ తపన ఆగదు ,ఒకరోజున నా స్నేహితుడు ఒకడు T.V.S.50 బండి నడుపుతూ నా దగ్గరకు వచ్చాడు , కొత్తగా బండి కోన్నాను ,ఇకమీదట రోజు కాలేజీకి బస్సులో వేళ్ళాల్సిన అవసరం లేదు ఎంచక్కా ఇద్దరం కలసి కబుర్లు చెప్పుకుంటూ ఈ బండి మీద కాలేజీకి వేళ్ళచ్చు అన్నాడు..!

సరేలే నువ్వు అంతగా అడిగితే కాదంటనా , రేపటి నుండి నాకు బస్సు చార్జీలు మిగిలినట్లే అనుకున్నా , అంత సీను లేదురా నీకు బండి నడవాలంటే డీజిల్ పోయాలి , నువ్వు రోజు నీ బస్సు చార్జీలు నాకు ఇస్తే ఆ డబ్బులతో బండికి డీజిల్ కొట్టిస్తానూ , అంతేకాకుండా అప్పుడప్పుడు నీకు కూడా నడపడానికి ఇస్తాను బండి అన్నాడు..!


ఆ రోజుల్లో కనీసం సైకిల్ కూడా లేదు నాకు , అవసరానికి ఏవరని అడిగినా కుదరదు పని ఉంది అంటూ ఏదో ఒక సాకు చేప్పేవారు ఆ మరుసటిరోజు బండికి డీజిల్ కోట్టించి ఇద్దరం కాలేజీకి బయలుదేరాం , సరిగ్గా కాలేజీ క్యాంపస్ లో అడుగుపెట్టాము , కాలేజీలో వాటర్ ట్యాంక్ పక్కన పార్కింగ్ స్థలం అక్కడకు వేళ్ళాలంటే రెండు మలుపులు ఉన్నాయి , నా స్నేహితుడు బండి నన్ను పార్కింగ్ చేసి రమ్మన్నాడు..!


చిన్నగా బండి నడుపుకుంటూ పార్కింగ్ స్థలానికి వెళ్తున్న , మధ్యలో నా క్లాస్ మిట్ ఇద్దరూ అమ్మాయిలు నడుచుకుంటూ వేళ్తున్నారు , వాళ్ళ ముందు కొంచెం బిల్డప్ ఇవ్వాలని అనిపించింది , వేంటనే స్టార్ స్పోర్ట్స్ చానల్లో నేనూ ఏప్పుడు చూసే బైక్ రేసింగ్ గుర్తోచ్చింది , ఆ రేసింగ్ లో బైకులను ఒక పక్కకు వంచి నడుపుతారు కానీ వాళ్ళు ఒక్కసారి పడిపోతారు , ఒక్కోసారి కింద పడిపోరు , అలా నాకూ కూడా చేయాలని అనిపించింది..!


వాటర్ ట్యాంక్ దగ్గరకు వేళ్ళే మొదటి మలపులో బండి ఒక పక్కకు వంచి నడపడానికి ప్రయత్నం చేసాను , వేంటనే బండి పల్టీలు కొట్టుకుంటూ రెండో మలపులో వున్న బురదలో పడ్డాను , అనుకున్నది ఒకటి అయినది మరోకటి , ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఈ కథ చదివే వాళ్ళకు చేప్పవలసిన పనిలేదనుకుంటా , అయినా చేప్తానులే నా క్లాస్ మిట్ అమ్మాయిలు అందరూ ఆ సంఘటన చూసి , నా అవతారం చూసి నవ్వారు..!


                22/2/2021

                ౼kadem kiran 



Rate this content
Log in

Similar telugu story from Comedy