kadem kiran

Others

4  

kadem kiran

Others

నిజంగా వస్తున్నవా

నిజంగా వస్తున్నవా

3 mins
284


అనగనగా ఒక ఊరు

ఆ ఊరిలో లక్ష్మీ తన కొడుకు సుబ్రహ్మణ్యం , కొడలు గాయత్రి మరియు తన మనవళ్ళతో నివసిస్తుంది , లక్ష్మీ భర్త ఈమధ్య కాలంలో తనను విడచి స్వర్గస్తులు అవ్వడంతో , అమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షిణించింది.....


సుబ్రహ్మణ్యం రైల్వే డిపార్ట్ మెంట్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు , ఎప్పటికప్పుడు సుబ్రహ్మణ్యం తన తల్లి ఆరోగ్యం గురించి వారానికి ఒకసారైనా హస్పిటల్ కు తీసుకుపోయి శరీరం చెక్ చెపిస్తుంటాడు , ఇలా ఒకరోజున సుబ్రహ్మణ్యం అర్జంటుగా ఉద్యోగానికి వేళ్ళవలసి వచ్చింది , అప్పుడు తన శ్రీమతితో ఈ సారికి మీ అత్త గారిని నువ్వు హస్పిటల్ కు తీసుకువేళ్ళు అన్నాడు.....


గాయత్రీ సరే అని వాళ్ళ అత్త లక్ష్మీని హస్పిటల్ కు తీసుకుపోతే డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి కరొనా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది, దింతో గాయత్రికి దిమ్మతిరిగిపోయింది , వేంటనే తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది , సుబ్రహ్మణ్యం కూడా షాక్ అయ్యి వేంటనే బయలుదేరి వస్తున్నాను అన్నాడు.....


సుబ్రహ్మణ్యంకు సొంత ఇల్లు అంటూ ఏమి లేదు ఉద్యోగం వలన రైల్వే కొటర్స్ లో ఉంటున్నాడు ,ఈ విషయం తెలిసిన కొటర్స్ లో మీగతా కుటుంబాలు గాయత్రీ తో మీ అత్తగారికి కరొనా తగ్గేవరకూ దయచేసి కొటర్స్ కి రావద్దు అన్నారు , అంతేకాకుండా సుబ్రహ్మణ్యం కొడుకులు ఒకడు ఐదవ తరగతి ,రెండవాడు రెండవ తరగతి చదువుతున్నాడు , బడిలో హెడ్ మాస్టారు కి వాళ్ళ నాయనమ్మకు కరోనా పాజిటివ్ అని తెలిసి బడిలో నుండి భయటకు పంపించేసారు.....


ఈ విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఏం చేయాలి చూట్టాలు కూడా ఏవరు లేరు , పిల్లలను ఎక్కడ ఉంచాలి అంటూ ఆలోచనలో పడ్డాడు , కొంతసేపటికి సుబ్రహ్మణ్యంకు తనకు పిల్లను ఇచ్చిన అత్తగారు గుర్తుకు వచ్చారు , ఫొన్ చేసి మాట్లాడతామా వద్దా అని సందేహిస్తున్నాడూ , ఎందుకంటే లక్ష్మీ తన వియ్యంకుడు, వియ్యపురాలుతో చూట్టరికం కలిసినా అతి కొద్దీ రోజులలోనే కోడలను అదనపు కట్నం కోసం అనేక విధముగా వేదించడం వలన వాళ్ళ ఇరువురి కుటుంబల మధ్య గొడవలు జరిగాయి.....


ఈ గోడవలు జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది , గాయత్రీ తల్లిదండ్రులకు ఇద్దరూ మనవళ్ళు వున్నారని సంగతి కూడా తేలియదు , సుబ్రహ్మణ్యం తన భార్యకు ఫోన్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నేనూ ఎక్కడో ఒకచోట అజస్ట్ అవ్వగలం పిల్లలను ఎలా అసలే హస్పిటల్ లో కరోనా పెషంట్స్ చాలామంది వున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు.....


అప్పుడు గాయత్రీ తన భర్త తో మీరు కొప్పడను అంటే నేను ఒక మాట చేబుతాను అన్నది , ఏంటి చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం , అప్పుడు గాయత్రీ నేనూ పిల్లలను తీసుకుని మా పుట్టింటికి వేళ్తాను అత్తయ్యకు ఆరోగ్యం కుదుట పడినా తరువాత వాస్తాను అన్నది , సుబ్రహ్మణ్యం ఒక్కనిమిషం ఆలోచించి , మీ తల్లిదండ్రులు రానిస్తారా , అయినా హస్పిటల్ లో మీ అత్తగారితో నువ్వు వున్నావుగా ,నీకు కూడా కరోనా వుందేమో , వాళ్ళకు కరోనా అంటించిన పాపం మనకెందుకు అన్నాడు.....


అప్పుడు గాయత్రీ తన భర్త తో నాలో అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు నేనూ బాగానే వున్నాను అన్నది , సుబ్రహ్మణ్యం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే పిల్లలను తీసుకుని వేళ్ళు మీ పుట్టింటికి అన్నాడు , భర్త ఆ మాట అన్నవేంటనే గాయత్రీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలా వున్నారు అంటూ పలకరించింది , కూతురు మాటలు విన్నా తల్లిదండ్రులు ఇన్నాళ్ళకు గుర్తోచ్చమా అంటూ సాగదీసారు , ఇదిగో మీ మనవళ్ళు మాట్లాడతారంటా అంటూ ఫోన్ పిల్లలకు ఇచ్చింది.....


పిల్లలు ఫోన్ తీసుకుని తాతయ్య బాగున్నరా అనడంతో అయనకు వెయ్యి ఎనుగుల బలం వచ్చినంతా అనదం కలిగింది , అమ్మమ్మ బాగున్నవా అంటు పిల్లలు పలకరిస్తుంటే అమె ఏంతో మురిసిపోయింది , వేంటనే గాయత్రీ ఫోన్ తీసుకుని తన తల్లిదండ్రులతో నేను పిలల్లు మన ఇంటికి రావాలని అనుకుంటున్నాం , అప్పుడు వాళ్ళు నవ్వుతూ ఏంటి నిజమేనా నిజంగా వస్తున్నవా మీ అత్తగారు , అల్లుడు గారు వురుకుంటరా నువ్వు వస్తే అన్నారు , అప్పుడు గాయత్రీ వాళ్ళ తల్లిదండ్రులతో మీ అల్లుడుగారే వేళ్ళమన్నారు , మీగతా విషయాలు వచ్చినా తరువాత మాట్లాడుకుంటాం ఇప్పుడే పిల్లలను తీసుకుని బస్టాండ్ కు వచ్చాను మరికొద్ది సేపట్లో మన ఊరిలో ఉంటాను అన్నది.....


Writer


-kadem kiran 


Rate this content
Log in