తరతరాలుగా..
తరతరాలుగా..
అయ్యో! ఎందుకు మళ్లీ ఇదే వినాల్సి వస్తోంది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శేఖరం.
ఏంటంకుల్ మీరనేది. మళ్లీ వినడం ఏమిటి? నాకర్థం కాలేదు అన్నాడు చందు.
ఇదిగో ఈ పెట్టెను తెరవాలని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇలాగే మీ నాన్న ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు.
నేను వాడికి చాలా నచ్చజెప్పి చూశాను. దాని మీద ఉన్న ఈజిప్షియన్ అక్షరాలు మృత్యువుని సూచిస్తున్నాయి అని.
మీ తాత గారు కూడా ఈ పెట్టెను తెరవాలని, జాగ్రత్తగా తెరవకపోతే అందులో ఉన్న విలువైన వస్తువేదో పాడవుతుందని చాలా రకాలుగా ప్రయత్నించాడు. అది తెరిచే ప్రయత్నంలో గుండెపోటుతో మరణించాడు.
మీ నాన్న కూడా అలాగే మరణించాడు.
ఇప్పుడు నువ్వు దాని మీద ఆసక్తిని చూపిస్తున్నావు అని చందుని చూస్తూ అన్నాడు శేఖరం.
రేపే దీన్ని సముద్రంలో పారవేయిస్తాను అని శేఖరం తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు చందు మరణ వార్త విన్నాక కానీ అతనికి రాత్రి ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు.

