STORYMIRROR

Dinakar Reddy

Drama Horror Thriller

4  

Dinakar Reddy

Drama Horror Thriller

కళ్లకు కనబడనిది

కళ్లకు కనబడనిది

1 min
502

సురేష్ కి ఏదో అలికిడి వినిపించినట్లయ్యింది. లేచి చూస్తే ఏమీ లేదు. నీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు.


అంతలో ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు. ఏదో కాంతి అతని ఎదురుగా ఉన్నట్టు అనిపించి లేచాడు.


నిద్ర కళ్ళతో అతను బయటికి వచ్చి డాబా మీదకి ఎక్కాడు.


ఒళ్ళు విరుచుకుంటూ చుట్టూ చూశాడు. అతని ఇంటి చుట్టూ ఎగురుతూ కనిపిస్తున్న ఆత్మలు. వాటిలో అవి మాట్లాడుకుంటూ కనిపించాయి. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. 


గట్టిగా గిల్లి చూసుకున్నాడు. కంటికి కనబడనిది కనిపిస్తే ఇంత భయంకరంగా ఉంటుందా అని అనుకున్నాడు.


ఒళ్లంతా చెమటలు పోయడంతో మెట్ల దగ్గరికి వచ్చాడు. కాలు కింద పెట్టగానే అక్కడ నుండి జారి ఆ ఆత్మల వైపు వెళ్లసాగాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama