మూడు జన్మలు
మూడు జన్మలు
ఎప్పటివో మాంధాత కాలం నాటి మాటలు చెప్పకు అన్నాడు మహిధర్. రాజీవ్ నవ్వాడు.
ఇప్పుడు నేనేం జోక్ చెయ్యలేదే? ఈ పాత పెట్టెలు వదిలేసి కాస్త కాసినో వెళ్లి గేమ్ ఆడదాం అన్నాను. అని తమాయించుకున్నాడు మహిధర్.
కృష్ణా నదీ తీరాన ఒక నిర్జన ప్రదేశంలో వాళ్ళు దేనికోసమో తవ్వుతున్నారు. రాజీవ్ మౌనంగా లేచి నిలబడ్డాడు.
అదిగో వర్షం పడబోతోంది మిత్రమా. నేను త్రేతా యుగంలో పోగొట్టుకున్న పరుసవేది ఇప్పుడే దొరకబోతోంది. ద్వాపర యుగంలో ఎవ్వరికీ చిక్కకుండా ఇక్కడే ఉండిపోయింది.
ఇప్పుడు, ఈ కలియుగంలో మళ్లీ నన్ను చేరబోతోంది అని హిస్టీరిక్ గా అన్నాడు రాజీవ్.
మహిధర్ టార్చ్ లైట్ తీసుకుని రాజీవ్ ముఖం వైపు వేశాడు. రాజీవ్ కళ్ళు ఉగ్రంగా ఉన్నాయి.
పరుసవేది కథ దేవుడెరుగు. బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అని మహిధర్ పరుగు లంఘించాడు.

