Ambica Lakshmi

Horror Inspirational Thriller

4.7  

Ambica Lakshmi

Horror Inspirational Thriller

క్షమాభిక్ష

క్షమాభిక్ష

2 mins
818


రాత్రి పది అయింది రాహుల్ ఫెరారీ మీద కంగారుగా రోలెక్స్ వాచ్ లో టైమ్ చూసుకుంటూ వంద కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నాడు.నాకు తెలుసు అక్కడ ఏమీ అవ్వదు అని కానీ ఎందుకు కంగారు వస్తుంది. దేవుడి పైన భారం వేసి ముందుకు వెళ్ళాలి కాల్ వచ్చింది లిఫ్ట్ చెయ్యాలి అంటే చేతులు వణుకుతున్నాయి ఏం కాదు లే అని లిఫ్ట్ చేశాడు.

హెల్లొ ....(అది ఒక ప్రైవేట్ నంబర్)

ఏం రాహుల్ ! పాపం ఇంత లేట్ నైట్ ఎక్కడికి వెళ్తున్నావూ నీకు ఏమీ గుర్తుకు రావడం లేదా?

నేను వసుంధర గుర్తుకు వచ్చనా

ఇదే రోజు గత ఏడాది ఏం జరిగిందో గుర్తుతెచ్చుకో

ఎదురుగా పెద్ద పొగ వచ్చింది సడెన్ బ్రేక్ వేశాడు.

నువ్వా????

నేను నీతో పాటు ఆఫీసులో చేరి నీకన్నా బాగా..రానిస్తునాని నా విజయాన్ని నువ్వు ఓర్వలేక .నా తండ్రికి గుండె పోటు అని తప్పుడు సమాచారం అందించి ఇదే రోడ్డు పైన ట్రాక్టర్ పెట్టించి నన్ను దౌర్జన్యంగా చంపించావు అందుకనే నేను నీ దారినే ఎంచుకున్నాను నీ కూతురుకి అసలు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి నిన్ను ఇక్కడికి రప్పించాను. ఇంక నీ జీవితం మీద ఆశలు వదులుకో అని చెప్పి అతను ఉన్న కార్ ను గిర గిర తిప్పి పడేసింది.

అతను చనిపోతూ చనిపోతూ నన్ను క్షమించు అని చెప్పి కళ్ళు మూశాడు.

కాసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిలో ఉన్నాడు.ఎంటి నాకు ఏమీ కాలేదా?నేను బాగానే ఉన్నానా?వసుంధర అతని ముందుకు వచ్చి నేను నిన్ను చంపేయాలని వచ్చాను కానీ నీకు నీ కూతురు మీద ఉన్న ప్రేమ నన్ను కరిగించింది.నువ్వు చేసిన తప్పే నేను చేసినట్టు అయితే నా తండ్రి లా నీ కూతురు నీకోసం ఏడుస్తుంది నీ కుటుంబానికి తీరని లోటు వస్తుంది దానిని ఎవరూ తీర్చలేరు అందుకనే నిన్ను వదిలేసా.

నేను లేకపోవడం వల్లే నువ్వు ఈరోజు ఈ స్థాయికి ఎదిగావు మర్చిపోకు. ఎప్పుడైనా సరే పక్కవాడి విజయాన్ని ఆనందించకపోయిన పరవాలేదు కానీ వారిని చూసి బాధ పడడం లేక వారిని నాశనం చెయ్యాలి అని మాత్రం అనుకోకూడదు అలా చేస్తే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆ తప్పుకి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తారు.


(సమాప్తం)



Rate this content
Log in

Similar telugu story from Horror