Dinakar Reddy

Abstract Comedy Thriller

3.2  

Dinakar Reddy

Abstract Comedy Thriller

చిత్ర(మైన) ప్రేమ

చిత్ర(మైన) ప్రేమ

1 min
275


ఇది మరీ టూ మచ్ నేహా! రాత్రుళ్లు ఇలా ఎవరైనా రెడీ అవుతారా? పిల్లలు చూస్తే జడుసుకుని ఆరున్నొక్క రాగం అందుకుంటారు అన్నాడు సిద్దార్థ్.


ప్రేమా ప్రేమా అన్నావ్. మరి నాతో పాటు నా అభిరుచులను కూడా ప్రేమించు. ఇలా అమావాస్య రాత్రుల్లో సముద్రం పక్కన తిరిగితే ఎంత బాగుంటుందో. దా. వెళ్దాం అంది నేహ.


అయినా నాదే బుద్ధి తక్కువ. సినిమాలు చూసి వదిలేయాలి కానీ, అందులోని రక్త పిశాచాలూ, డ్రాకులాలను అభిమానించడం ఏమిటో.


పోనీ. అభిమానిస్తే గుండెల్లో పెట్టుకోవాలి. అర్థరాత్రి ఇలా నల్లటి బట్టలు వేసుకుని బీచ్ లో తిరగడం ఏమిటి? నా మొహం. నా శ్రాద్ధం అని లోలోపలే అనుకున్నాడతను.


ఏంటింకా లేట్? అంది నేహ.


ఇదిగో ఈ పళ్లకు క్లిప్ పెట్టుకోవాకంటే కష్టంగా ఉంది. ఈసారికి ఇలానే వచ్చేస్తా అన్నాడతను.


నో. నో బేబీ. మనం vampires లా రెడీ అయితేనే వాళ్ళు లోపలికి రానిస్తారు. అక్కడ బోల్డు మంది మనలానే రెడీ అయ్యి వస్తారు అంటూ అతని పళ్లకు క్లిప్ తగిలించి , ఆ కోర పళ్లకు కొంచెం ఎరుపు పెయింట్ రక్తంలా పూసింది. 


ఇద్దరూ కలిసి vampire diaries ఫెస్టివల్ కి బయలుదేరారు. 


చూడాలి. దారిలో ఏ కుక్కలూ ఎంబడ బడకుండా చూడు దేవుడా అని సిద్దార్థ్ మనసులో దణ్ణం పెట్టుకున్నాడు.



Rate this content
Log in

Similar telugu story from Abstract