Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

అల రోదసీలో..

అల రోదసీలో..

1 min
605


ఏవండోయ్. కాసిన్ని విత్తనాలు కొని పెట్టుకొందురు. మా తమ్ముడు వస్తున్నాడు అంది నీరజ. 


వంశీకి పెళ్ళయినప్పటి నుంచీ చూస్తున్నాడు. తన భార్య నీరజ దూరపు చుట్టరికం వల్ల తమ్ముడయిన ఒకతను నాసా(NASA) లో పని చేస్తున్నాడు. ఎప్పుడు టీవీలో అంతరిక్షం గురించి చూసినా నీరజ అది వాళ్ళ తమ్ముడే చేసినట్లు చెప్పుకుంటూ ఉంటుంది. 


మొన్నటికి మొన్న ఏదో తోకచుక్క కింద పడుతుంటే, మా తమ్ముడు NASA space స్టేషన్లో కూర్చుని ఏదో విసిరేసి ఉంటాడు. అసలు వాడెప్పుడూ అంతే. చిన్నప్పుడు నా టెడ్డీ బేర్ డాబా మీద నుండి విసిరేసే వాడు. ఒట్టి అల్లరి పిల్లాడు అని వీధిలో ఉండే అమ్మలక్కలకి చెప్పింది. వాళ్ళు మూతి ముప్పై వంకర్లు తిప్పారు.


నిన్న పొద్దున్న మార్స్ గ్రహం నుంచి మట్టిని సేకరించారు అని తెలియగానే మా ఆవిడ వంశీకి విత్తనాలు సేకరించమని చెబుతోంది.


వాళ్ళ తమ్ముడు మార్స్ నుంచి మట్టి తేగానే ఈవిడ కుండీల్లో ఆ మట్టి వేసి విత్తనాలు జల్లి వ్యవసాయం చేస్తుందట.


చూస్తుంటే నీరజ కూడా వేరే గ్రహానికి వెళ్ళిపోయేట్టు ఉంది.

ఎలాగైనా నీరజ ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడకుండా ఆపాలి అని వంశీ నిర్ణయించుకున్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract