STORYMIRROR

# Suryakiran #

Inspirational

4  

# Suryakiran #

Inspirational

యోగాలో మగువ !

యోగాలో మగువ !

1 min
755

ఓ మగువా ! నీ సహచర్యంలోనే

మగవానికి జీవితంలో సరసమనే వెలుగు .

అప్పుడే అణువణువునా

ప్రేమరసం సమృద్ధిగా మీలో కలుగు .


మాటామంతీతో మీ మనసులు

సులువుగా ఎప్పటికీ కలియు .

ఆటపాటలతో మరింత దగ్గరౌతారని

అనుభవంలో అందరికీ తెలియు .


వంటావార్పులో ఇల్లాలిగా

నీది ఎల్లవేళలా అందెవేసిన చేయి .

ఇంటిపనులన్నింటిలోనూ

అభిరుచి తొంగిచూస్తుందోయి .


హుషారుగా జీవించాలనేది

మనిషికెప్పుడూ ఒక ఊరించే కోరిక .

బిడ్డల ఆలనపాలనతో

సగం వయసు గడచిపోదా తీరికేలేక !


ఆధునికయుగంలో అన్ని హంగులతో

ఆలుమగలకు సౌఖ్యమే సౌఖ్యము .

యోగాసాధన అందుకే నిత్యము

ఆరోగ్యరక్షణకు అందరికీ ముఖ్యము .



Rate this content
Log in

Similar telugu poem from Inspirational