STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

యదలో లావా

యదలో లావా

1 min
297

ఏదో కొత్తగా ఉంది

యదలో లావా పొంగుతూ ఉంది

ప్రతి దినం కొత్తగా ఉంది

ప్రతి మాసం శ్రావణములా ఉంది


మనసు మరీ చిలిపిగా ఉంది

నవ్వుల్లో ముంచెత్తడం అలవాటుగా మారింది

నీ కౌగిలి కొట్టేయడం లక్ష్యమయ్యింది

నా వయసు నీ చుట్టూ తిరిగి హుషారయ్యింది


వలపు బాణాలు గుప్పించడం 

వర్షంలో తడుస్తూ అందాలు చూపించడం

వాకిట్లో నిల్చుని రోడ్డు మీద వెళ్ళే నిన్ను చూడడం

నాకు నేనే అద్దంలో నిన్నుగా అనుకుని కన్ను కొట్టడం


ఏమిటో ఇదంతా

కొంప తీసి ఇదంతా ప్రేమేనా

నా ఇంటిలో దీపం పెట్టేందుకు నీ ప్రయత్నమేనా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract