వస్తావో
వస్తావో
కడలి అలల వీచు గాలి ఊయలలా.. వస్తావో ..!?
లేత వలపు విసురు వలల తరగలలా.. వస్తావో..!?
స్వచ్చమైన మైత్రి పంచు మేఘమౌతు వర్షించగ..
మౌన మందహాస ఝరుల కిలకిలలా..వస్తావో..?!
నీవొసగిన ధవళ చత్ర ఛాయలోన నేనున్నా..
మరులు కురియు పరిమళాల జలజలలా..వస్తావో..?!
మన యుగాల కలల కథలు తిరగవేస్తు కూర్చున్నా..
అనుభవాల కాంతి శ్వాస మిలమిలలా..వస్తావో..!
ఈ దుస్తులు ఆ టోపీ..నీవిచ్చిన కానుకలే..!
తొలి కలయిక సాక్షియైన గలగలలా..వస్తావో..!?

