STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

విరహతాపం!

విరహతాపం!

1 min
397


ఎన్నో అందమైన జ్ఞాపకాలు

పగిలిన ఈ గుండె గోడలకింద శిథిలమౌతున్నాయి


ఎన్నో తీయని కలలు 

మూయని కనురెప్పల వెనుక చెరిగిపోతున్నాయి


ఎన్నో వేల ప్రేమ ఊసులు

అలసిన మనసులో నలిగిపోతున్నాయి


ఎన్నో మరుపురాని మధుర క్షణాలు

హృదయాంధకారంలో కరిగిపోతున్నాయి


జాలి లేని కాలమా...!

ప్రాణమైన నేస్తమా...!!

ఇకనైనా నను నీ దరిచేర్చుకో

ఈ హృదయస్పందన మూగపోకుండా

నిన్నటి జ్ఞాపకాల నీడల నుండి

రేపటి ఆశల వెలుతురు వైపు

అశయాల అడుగులు వేయించు

నేనే లేని నాకోసం మరో కొత్త లోకాన్ని సృష్టించు ప్రియతమా...


శ్రీలత. కె 

హృదయస్పందన


Rate this content
Log in

Similar telugu poem from Romance