STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

విరహ వేదన

విరహ వేదన

1 min
459

నీతో గడిపిన మధుర క్షణాల జ్ఞాపకాలు 

నా వెనుక ముసురుతున్నాయి...

నీతో గడపబోయే మధుర క్షణాల ఆలోచనలు 

నా కళ్ళముందు తిరుగాడుతున్నాయి...

ఈ రెంటికీ మధ్య చిక్కి 

ఆగిపోయిన కాలంతో యుద్ధం చేస్తున్నాను...

నా పెదాల మీద నీ మధురమైన స్పర్శ అనుభవం తో 

నా శరీరం లో కణ కణాలూ నాట్యం చేస్తున్నాయి... 

నీ మధురమైన సుంగంధాలతో 

నా ముక్కుపుటాలు స్వర్గానికి దారులు వేస్తున్నాయి 

ఈ రెంటికీ మధ్య చిక్కి 

ఆగిపోయిన కాలంతో యుద్ధం చేస్తున్నాను...



Rate this content
Log in

Similar telugu poem from Abstract