విలువల - వలువలు
విలువల - వలువలు


సులలిత సంగీత మృదు మధుర గానమే కర్ణముల
ఒత్తిడి నివారణ కు సుఖం
అనారోగ్య , ఒత్తిడి పూరక విసుగు తో దుఃఖం
ఆహ్లాద కరమైన వాతావరణం తో కలిగిన విజయం
ఒత్తిడి , అనారోగ్యాలకు దూరంగా ,
పరోపకార ధర్మముచే అభివృద్ధి చెందే లోకం
అనునయ వచనములచే సన్నిహితుల సహకారమే మోదం
కు విమర్షల వల్ల అధో పాతాళానికి పంపడమే ఘోరాతి ఘోరం
సుఖమును ఎల్లప్పుడూ తలచితివా సమయం వ్యర్థం
కష్ఠ పడే మనస్తత్వం తోచేసే పనులే అనుభవ అర్థం
దుఃఖం నీకు మరీ మరీ సమీపం ; తీవ్ర మధనం తో –
విజయం కడుంగడు దూరం ;
లోకం పోకడల తో నైతిక విలువల నైరాశ్యం ;
మోదం చే ధ్యాన , యోగ వల్ల ఒత్తిడి నివారణోపాయం
ఘోరం ఏమిటంటే వీటిని పాటించలేక పోవడమే,
వీటిని పాటించడమే అభివృద్ధికి సోపానాలు ఎక్కడం .