విదార హృదయా వర్షమా!
విదార హృదయా వర్షమా!
ఆలోచన హద్దులు దాటేనా...
కన్నీరు కనుల దాటేనా....
మాట జారి?.పెదవి దాటేనా..
ఆ బాధ మనసును తాకినా.... క్షణనా!
హృదయం విరిగి ..అతకని ముక్కలయ్యేను.....
గతి తోచని పరిస్థితి...మంచి మార్గాన్ని చూపించేనే...వర్షపు చిరుజల్లుల కురిసిన
విరిగిన హృదయం అతక పోవచ్చు సుమా!
కానీ అతికిస్తే ఎంతో అందగా మారొచ్చు ......
.సెలయేరులా...
సూర్యుని వేడితో భూగర్భ జలాన్ని ఆవిరి చేసుకొని....
మేఘాలను నిర్మించి చివరికి రెండు మేఘాలు డికొన్నదే....వాటికి బాధ కలిగి....విరిగిపోనీదే...
చి...చిరుజల్లులు వర్షమయి...
మళ్ళీ నేల మీది పడి భూదేవి దాహం తీర్చి....
అన్నపూర్ణ దేవిని ప్రసాదించి .ప్రజల ఆకలిని తీర్చే పచ్చదనం నీ మనకు అందిస్తుంది....
మేఘాలు విరిగి ...
కరిగి చినుకై ...
చిరుజల్లుల... వర్షం అయి... నీరయి...సెలయేరుల....
పారుతూ.....ఆనందని ప్రకృతికి అందిస్తుంది.....
చిరు జల్లులు తాకిడికి ఎంతగా వాడి పోయిన ఆకులు..కొమ్మలు సైతం పచ్చగా మొలకెత్తి చిగురించేను
చివరకి విరిగిన హృదయపు విదారత నీ పోగొట్టి.
మనసుకి ఆహ్లాదకరమైన గుండెలో మంట నీ ఆర్పిన ఆ చల్లని వర్షపు చినుకు కి నా హృదయ కమల స్వాగతం........
