STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

వెతకాలి

వెతకాలి

1 min
148


ప్రేమపంచు మనసులకై విశ్వమంత వెతకాలి 

నిస్వార్ధపు మమతకొరకు గతమంతా వెతకాలి 


నవ్వులన్ని నటనమౌతు మొహమాట రూపమౌతు

స్వచ్చమైన పలుకులకై లోకమంత వెతకాలి 


మాసిపోయి మానవతే కనిపించక కరువౌతు

త్యాగమున్నజనాలకై జగమంతా వెతకాలి 


ప్రసవించగ చెట్టునొకటి పుడమికెంత భారమో

విత్తునాటు మట్టికొరకు నేలంతా వెతకాలి 


లెక్కలలో మిక్కిలైన జనులున్నా దేశంలో

మాటాడే చిరునవ్వుకై మనమంతా వెతకాలి 


మారలేదు మగువబతుకు నిలదీస్తే నిందవేస్తు

గెలుపు ఊహలు గాధలెన్నొ చరిత్రంతా వెతకాలి 



Rate this content
Log in

Similar telugu poem from Romance