వెన్నెలోచ్చే వేళాయానే
వెన్నెలోచ్చే వేళాయానే
శారద రాత్రి మంచు పూల చల్లదనం లో
పూలకన్యలు చిరు స్నానం చేస్తున్న వేళ
నక్షత్ర బాలలు ఆసక్తి తో భువి పైని వింతలు తిలకిస్తున్న సుందర వేళ
గాలీ పెదవులు పూరేకుల ను ముద్దాడుతున్న వేళ
కునుకు రాని కన్నులను ఉండి ఉండి మెల్లగా తాకి జోకొడుతూ వీస్తున్న పిల్ల తెమ్మెర
సుందరమైన సుమధురమైన ఈ ప్రకృతి లో
ఆకాశపు కప్పు వెండి చందమామతో నిండి
జలతారు వెన్నెలోచ్చే వేళ ఈ మధుర మైన రాతిరి లో
ఎందుకనో ఓ వెలితి మనసును పిండి వేస్తున్నది
అదీ ఎప్పటికీ, ఎన్నటికీ తీరనిది
ఔను.. అమ్మ నా తీరని లోటు, పూరించలేని ఖాళీ
వెన్నెల రాత్రుల్లో, వెన్నేలోచ్చే వేళాయనని
వేడి వేడి అన్నం లోకి అవకాయ, కాచిన నెయ్యి తో
ముద్దలు పెడుతూ, కమ్మని చందమామ కథలు చెబుతూ
అమ్మ నవ్వే వెన్నెలంత చల్లని చిరునవ్వుల దృశ్యం ఇప్పటికీ నా మనసులో చెరిగిపోలేదన్నదియెంత నిజమో
వెన్నెల లోచ్చే వేళకు ఆ వెన్నెల్లో అమ్మను
వెతుక్కోవడం అంతే వ్యాపకంగా మారింది
అంతేనేమో అమ్మ అంటే
మరచిపోని మధురమై వెలకట్టలేని జ్ఞాపకమౌతూ

