వెన్నెల
వెన్నెల
మాయని నవ్వులు..కురిసే వెన్నెల..!
మనసు తోటలో..తడిసే వెన్నెల..!
ఎప్పుడు మదిలో..నిండెనొ ఏమో..
ఊపిరి దారిగ..విరిసే వెన్నెల..!
కలలకు రెక్కలు..తొడిగెను ప్రేమగ..
మబ్బుల తంత్రుల..మెరిసే వెన్నెల..!
నీడకు తోడుగ..నిప్పై నిండెను..
సిగ్గుల మొగ్గై..మురిసే వెన్నెల..!
కడలులు మించిన..దు:ఖాలెన్నో..
అలల వీణపై..ఎగిసే వెన్నెల..!

